
“సూరీడు!ఎలా ఉన్నావురా!”అంటూ గుమ్మంలోకి అడుగు పెట్టింది బెనారస్ బామ్మ. “ఆమ్మో! ఈవిడ వచ్చింది ఏమిటి!” గతుక్కుమంది చిట్టి.చేతిలోబ్యాగులేదుకనుకతొందరగావెళ్ళిపోతుందేమోలే! మనసులోనే అనుకుంది చిట్టి.మంచినీళ్లు తేవడానికి చిట్టి లోపలికి వెళ్లడంతో, “ ఏం బాగా ఉండడమో బామ్మ! రాను రాను ఎదురింటివాళ్ళతోపోటీఎక్కువఅవుతోందనుకో!మొన్నటికి మొన్న ఎదురింటావిడ వేసుకున్న చెప్పులు కన్నా ఎత్తు ఎక్కువ ఉన్నవి వేసుకుంది. ఇక నడవలేక నానా ఇబ్బందీను!నిన్ననైతే ఆవిడ పెట్టుకున్నా హారం కన్నా పెద్దది కావాలని పేచీ!నేనెక్కడతేగలనిప్పుడు! ఇప్పుడు అదీ అలక!” “ అర్థం అయింది లే!నేను చూసుకుంటా!” “ ఒసేయ్ చిట్టి! టిఫిన్ రెడీ చేసావా!” “ లేదు బామ్మ! మా ఇద్దరికే ఉంది! మీకు మళ్ళీ చెయ్యాలి!” “మళ్ళీ ఎందుకు చేయడం! దండగ!ఉప్మా అయితే ఉందిగా!ఆ జీడిపప్పు అందుకో!అదిగో ఆ వేరుశనగ గుళ్ళు!ఇంకా నెయ్యి!” గుప్పెడుజీడిపప్పు, గుప్పెడు వేరుశనగపప్పు, నెయ్యివేసి వేయించి, ఉప్మాలో కలిపేసింది.మరి కాస్త నెయ్యి పోసి, “ ఇకముగ్గురికి పెట్టు!” అంటూ ఆర్డర్ వేసింది బామ్మ.’ వామ్మో!నెల రోజులకు సరిపడా జీడిపప్పు! ఒక్క నిమిషంలో అవగొట్టింది!’అనిమనసులో తిట్టుకుంటూ, పైకి నవ్వుతూ అష్టావధానం చేసింది చిట్టి. ఇక ఇలా లాభం లేదనిమర్నాడు, “మీ మటుక్కి మీరు ఏదో ఒకటి తినెయ్యండి! నాకు ఒంట్లో బాగులేదు!”అనింది చిట్టి. “నువ్వు చెప్పాలిటమ్మ!చిన్న పనుంది నీ ఫోన్ ఇలా ఇవ్వు!”అంటూ లాక్కుంది బామ్మ. “మూడు రకాల టిఫిన్స్ ఆర్డర్ పెట్టాను. ఎవరికి కావాల్సినవివాళ్ళు తినండి”అందిఉదారంగా. ‘నా డబ్బులుబాబోయ్!’చిట్టిమనసుబాధగామూలిగింది. “ఒరేయ్!సూరీడు!వచ్చే హడావిడి లో బట్టల బేగ్ తేవడం మర్చిపోయాను. అయినాఏం కాదులే!ఫోన్ ఉందిగా!”అంటూ రెండు బెనారస్ చీరలు నాలుగు కట్టుబడి చీరలు ఆర్డర్ పెట్టింది. “ఒసేయ్ చిట్టి! తువ్వాళ్ళుఉన్నాయా! లేకపోతే ఆర్డర్ పెట్టుకోనా! అనడంతో, “ ఉన్నాయి!ఉన్నాయి!” కంగారుగా అంది చిట్టి. ఇప్పుడు బెనారస్ బామ్మని ఎలా పంపించాలా అని అనే ఆలోచనతోనే రోజులు గడిచి పోతున్నాయి. ఎదురింటి వాళ్ల గురించి పట్టించుకునే సమయం ఉండడం లేదు. “ఒరేయ్! సూరీడు!సారంగదరియా పాట పెట్టరా! దాని కుడి భుజం మీద కడవ …”అంటూ పాడుతోంది డాన్స్ చేస్తోంది! “ ఏమిటి బామ్మ! ఏమిటి ఇంత హుషారు!” “ ఇంకా ఏమిటి?అంటావ్ ఏంటి రా!ఎదురింటి ఏసురత్నం వేలు విడిచిన మేనత్త పెనిమిటిమొగుడికి అక్క!ఆవిడ వచ్చింది. యేసు రత్నంఇంతజరీఉన్న,అంత పెద్ద పట్టు చీర కొనింది.దానికి జరీఅంతా వెండి జరీ అట! మనకి వాళ్లతో పోటీ కదా! నాక్కూడా అలాంటిదే కావాలి! అదీబంగారు జరీతో!”చిట్టి తల పట్టుకుంది. “ఇంకా యేసు రత్నాన్ని సాధించిపోస్తోందట కూడా!”మొహం నిండా నవ్వు తో అందిబామ్మ!” “ బామ్మా!వాళ్ళ తో మనకెందుకు పోటీ! మనం ఎలా ఉంటామో అలాగే ఉందాం! అందరం కలిసి ఏ అన్న వరమో వెడదాం సంతోషంగా ఉందాం!” అంది చిట్టి. సూరీడుఆనందానికి అంతులేదు. “ బామ్మ! ఇందాక పెనిమిటి మొగుడు అన్నావు!” “ ఫ్లోలో అలా వచ్చింది మనకి జెండర్ తో సంబంధం లేదు. చిరునవ్వుతో కన్ను గీటిందిబామ్మ.