
అనగనగా సిరిమల్లె పురం అనే ఒక ఊరు ఉండేది. అ ఊరు పచ్చదనానికి మారుపేరు వంటిది .ఆ ఊరు చెరువుల నీటి గలగల సంకేతం .ఆ ఊర్లో మంచి మనుషులకు కొదవలేదు .ఆ ఊర్లో ఎప్పుడూ పంట పచ్చదనం నీటి గల గలలు ఉంటాయి. ఆ ఊర్లో నివసించే వీరయ్య అల్లుడు శివయ్య ఆ ఊరు నుంచి పట్టణం కి బయలుదేరాల్సి వచ్చింది. శివయ్యకు ఏమాత్రం ఊరిని విడిచి వెళ్లడం ఇష్టం లేదు వీరయ్యకు కూడా శివయ్య వెళ్ళడం ఇష్టం లేదు కానీ వెళ్లాలి కాబట్టి అతనికి ధైర్యం చెప్పి పంపిస్తాడు. శివయ్య పట్టణంలోకి రాగానే అరవింద్ అనే వ్యక్తి అతన్ని తన బండిలో తీసుకెళ్తాడు .ఆ పట్టణంలో ఉండే కొన్ని అందమైన ప్రదేశాలను చూసి వాటితో పోలిస్తే తన ఊరు గొప్పది కాదు అని మనసులో ఒక చిన్న అభిప్రాయం శివయ్యకు ఏర్పడుతుంది. దానిని చూసి ఇంత పెద్ద అందమైన భవనంలో నాకు ఉద్యోగం దొరికినందుకు నేను ఎంత అదృష్టం చేసుకొని ఉంటాను అని అనుకున్నాడు శివయ్యకు అక్కడ భోజనం పెట్టారు తను పల్లెటూరు నుంచి వచ్చాడు కాబట్టి తను ఎప్పుడూ అన్నం కూరగాయలు బియ్యం పిండితో చేసే వంటలు తిన్నాడు కానీ అతనికి టౌన్ లో కొత్త రకం పదార్థాలు వడ్డించారు అవి మొదటిసారి తినడం వల్ల శివయ్యకు అవి ఎంతో బాగా నచ్చాయి. శివయ్య ఊర్లో అవి తినడం వృధా అని ఇది ఎంతో రుచిగా ఉన్నాయని తన ఊరి వంటలు తక్కువ చేసేసాడు. శివయ్య కొన్నాళ్ళకు పల్లెటూరు అంటే దేనికి పనికిరాదు అని పట్టణం మాత్రమే గొప్ప అనే అభిప్రాయానికి వచ్చాడు. శివయ్యకు పట్టణంలో స్వచ్ఛమైన నీరు, గాలి ,తిండి దొరకదని మర్చిపోయాడు ఒకసారి వీరయ్య తన అల్లుడు శివయ్య ను చూడడానికి పట్టణం వచ్చాడు కానీ వీరయ్యకు పట్టణంలో ఉండే గాలి నచ్చలేదు ఎందుకంటే అది కాలుష్యం అయింది అని వీరయ్యకు తెలుసు కాబట్టి .వీరయ్యకు మంచి రుచికరమైన భోజనం పెట్టించాడు శివయ్య కానీ ఆ భోజనం వీరయ్యకు నచ్చలేదు అందువల్ల వీరయ్య భోజనం కూడా చేయలేదు .నీళ్లు తాగాడు కానీ ఆ నీరు తన ఊరు నీరు అంత రుచిగా లేవు. వీరయ్యకు అక్కడ ఉండటం అస్సలు నచ్చలేదు అందువల్ల వీరయ్య ఊరికి బయలుదేరాడు. శివయ్య ని కూడా వీరయ్యతో పాటు బయలుదేరమన్నాడు తిరిగి ఊరికి వెళ్లడం ఆ భోజనం తినడం ఆ పల్లెటూరు చూడడం అస్సలు ఇష్టం లేదు. వీరయ్య ,శివయ్య ఊరికి వచ్చారు శివయ్య ఊరు వాళ్ళు అందరూ అందరికీ వచ్చి రాగానే పట్టణం గురించి గొప్పగా చెబుతున్నాడు. అక్కడ పెద్ద పెద్ద భవనాలు ఉంటాయని అక్కడ మనలా చిరిగిన బట్టలు వేసుకోరు అని వారు వివిధ రకమైన బట్టలు కట్టుకుంటారని మనలా ఎలాంటి భోజనం అయినా తినరు వాళ్లంతా ఖరీదైన రుచికరమైన భోజనం తింటారని మనలా ఇలా అస్సలు మాట్లాడుకోరు అక్కడ ఎవరి పని వారు చేసుకుంటారు అని చెప్పాడు. ఇదంతా విన్న వీరయ్య కోపం తెచ్చుకొని శివయ్య తో ఇలా అన్నాడు .మన పల్లెటూరు పట్నం కంటే ఎంతో గొప్పది వారు మనలా భోజనం చేయరా రుచికరమైన భోజనం చేస్తారా. వారు తిని ఆహారం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో వారు మర్చిపోయి తెలియక తింటున్నారు .మనం తినే బియ్యం కూరగాయలో ఎంతో ఆరోగ్యం ఉంటుంది వాళ్ళు ఇల్లులు ఎంత పెద్దవి కట్టుకున్న బంధాలను అంత గొప్పగా ఉంచుకోలేరు .మన పల్లెలోని చెట్లు వీధులు వారికి ఆహ్వానం ఇస్తాయి. వారు ఎలాంటి వారైనా ముందు వారికి ఇంత భోజనం పెట్టి వారి ఆకలిని తీరుస్తాం. తర్వాత వారు ఏ కారణంగా వచ్చారో తెలుసుకుంటాం కానీ పట్నంలో వారి ఇల్లు గుమ్మం కూడా మనకు ఆహ్వానం చెప్పవు. వాళ్ళు స్వార్థంగా ఆలోచించి కనీసం వచ్చిన వారికి మర్యాదలు కూడా చేయరు .ఎదుటి వ్యక్తి ఆకలిని కూడా పట్టించుకోరు. వాళ్లు వారి వాహనాల ద్వారా గాలిని కాలుష్యం చేయడమే కాక నీటిని కూడా మురికి చేస్తున్నారు .అలాంటి ప్రదేశాల్లో ఉండి మనం ఆ గాలిని ,నీటిని తాగి పిలిస్తే మన ఆరోగ్యం కచ్చితంగా పాడు అవుతుంది. చెట్లు అంతరించిపోతాయి .మనం మంచి చెడు గురించి మన బాధలను నలుగురికి చెప్తూ మాట్లాడుకుంటాం కానీ వాళ్ళు వారి స్వార్థం వల్ల ఎవరితో మాట్లాడారు. మన పల్లెల్లో గాలి, నీరు అన్ని స్వచ్ఛమైనవి అని వీరయ్య అన్నాడు. అది విన్న తర్వాత శివయ్యకు పల్లెటూరి మీద మళ్ళీ ఒక అభిప్రాయం ఏర్పడింది. పల్లెటూరు అమ్మ అయితే పట్టణం బిడ్డ వంటిది. అటువంటి పల్లెటూరిని ఎప్పుడు తక్కువ చేయకూడదు .బిడ్డ కష్టంలో ఉంటే అమ్మ మాత్రమే ఆదుకుంటుంది. అలాగే బిడ్డ వంటి పట్నం ఎన్ని కష్టాల్లో ఉన్నా అమ్మ వంటి పల్లె తన బిడ్డను ఆదుకుంటుంది కాపాడుతుంది. మనమందరం పల్లె నుంచి వచ్చాం ఆ పల్లెను మర్చిపోయి పట్నం మీద మోజు పెంచుకుంటే ఎలా! ఎంత పట్నంలో జీవిస్తున్నా మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతే ఎలా! ఎప్పుడు పల్లెటూరిని తక్కువ చేయొద్దు పట్టణాలు పల్లెటూరికి పట్టుకొమ్మలు వంటివి. #కొమ్మ ఎంత గొప్పదైన చెట్టు లేకపోతే కొమ్మ ఎక్కడిది.