సహజీవనం - ప్రభావతి పూసపాటి

Sahajeevanam

"మీ అభిప్రాయం ఇదేనా నాన్న ?నేను చెప్పింది వినరా" ...కొంచెం అసహనం గాను ,తన మాట వినటం లేదని కించిత్ కోపం తోనూ అడిగాడు శిరీష్ .

"ఈ సారి నీ మాట వినేది లేదురా అబ్బాయి ,నేను విశ్వం కి మాట ఇచ్చాను , నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకొన్న లేకపోయినా నా నిర్ణయం మారదురా" కొంచెం గట్టిగానే చెప్పారు రాజశేఖర్ గారు .

"అది కాదు మావయ్యగారు మేము మీకు గ్రీన్ కార్డు అప్లై చేద్దాము అనుకొంటున్నాము,మీరు కూడా మాతో కలిసి అక్కడే ఉండ వచ్చు కదా ,మీరైనా చెప్పండి అత్తయ్య"అంటూ చనువుగా చెయ్యి జరిపి సోఫా అంచు మీద కూర్చుంటూ అంది పెద్ద కోడలు సౌమ్య,

" ఏంటి వదిన గ్రీన్ కార్డు అంటున్నావు ?అమ్మవాళ్ళు మాతో పాటు భూతల స్వర్గం లాంటి న్యూజిలాండ్ లో తమ శేష జీవనం గడపాలని నేను అనుకొంటుంటె"అన్నాడు మురళి తల తుడుచుకొంటూ బయటికి వస్తూ

"ఏంటి అంతా దేని గురించి మాట్లాడుకొంటున్నారు ?"మేడ మీద బట్టలు తీసుకొని కిందకి వచ్చిన వర్ష కుతూహలం గా అడిగింది.

" మీ మావగారు రిటైర్ అయ్యి దాదాపు పది ఏళ్ళు అయ్యాయి కదా ,ఇన్నాళ్లు పిల్లలు మనమలు అంటూ ఇరు దేశాలు తెగ తిరిగాము కదా,ఇప్పుడు ఇక్కడ స్థిరపడి మిగిలిన జీవితం కాలేక్షేపం చేద్దామనుకొంటున్నాము" .అదేంటి అత్తయ్య పెద్ద వయసులో మీరు ఇద్దరు ఎలా ఉండగలరు ?రుక్మిణి మాటలకి అడ్డువస్తు అడిగింది సౌమ్య'

" కరెక్ట్ సౌమ్య నువ్వు అన్నది.పెద్ద వయసులో ఇద్దరు ఎలా వుంటారు అన్న సమస్య ఇప్పుడు కేవలం మా ఇద్దరిదే కాదు దాదాపు మా తరం అందరిదీను,అందుకే మా తరం వాళ్ళే ఈ పరిస్థితి కి ఒక పరిష్కారం కూడా చూసుకోవాలి " కాళ్ళ దగ్గర ఆడుకొంటున్న మనవడిని ఒళ్ళో కుర్చోపెట్టుకొంటూ చాల నిదానంగాను ,ధృడంగాఅన్నారు కృష్ణారావు గారు .

"అంటె మీరు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ ఆప్షన్ సరి అయినదని అంటారా మావయ్య?"వర్ష మాటకిఅడ్డు వస్తూ "అందులో తప్పేమి ఉందమ్మా ?అది ఒక ఆప్షన్ .లేదా సొంతంగా వంట పని ,ఇంటి పని చేసుకోలేనప్పుడు కేర్ టెకెర్స్ ని పెట్టుకొని కాలం వెళ్ళదీయడం ఇంకో ఆప్షన్, ప్రస్తుతం పదిమంది లో ఎనిమిది మంది ఇలాగే వుంటున్నారు. .

మా పెళ్లి, ఐన కొత్తల్లో చైల్డ్ కేర్ సెంటర్స్ వచ్చినప్పుడు సమాజం లో కొంత వ్యతిరేకత వచ్చింది,అప్పటి సమయం లో ఆడవాళ్లు జాబ్ చేస్తే కానీ కంఫర్ట్ జీవితం గడపలేని పరిస్థితి.కొంత మందికి పేరెంట్స్ హెల్ప్ ఉండేది ,లేని వాళ్ళు డేకేర్ లో పిల్లలిని దింపారు, కొన్నాళ్ళకి అది పార్ట్ అఫ్ సొసైటీ అయిపోయింది, మా పిల్లలు అలా పెరిగిన వారే .

ఇప్పటి కాలం ప్రకారం మోస్ట్ అఫ్ యంగ్ స్టర్స్ విదేశాల్లో స్థిరపడుతున్నారు ,దానికి తగట్టుగా సమాజంలో మార్పులు వస్తాయి ,ఇంతకు ముందు ఓల్డ్ ఏజ్ హోమ్ లో తల్లి తండ్రులని ఉంచడం అంటే అది ఒక సామజిక నేరం లా చిత్రిక రించారు. ఇప్పుడు అవసరానికి వాటినే పేరు మర్చి కొంత ఆధునికత జోడించి రిటైర్డ్ హొమెస్ అని ,NRI హొమెస్ అని అంటున్నారు .

"నాన్న మీరు మా గురించి ఆలోచించటం లేదు ,మగ పిల్లలు కాబట్టి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకొన్నారు,అదే మీకు ఆడ పిల్లలు ఉంటె ఇలా జరిగేది కాదు అని అందరు మమ్మలిని తప్పుగా అనుకొంటారు"అన్నాడు శిరీష్ కొంచెం నిష్టురంగా .

" భలే వాడివే ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లితండ్రుల పరిస్థితి కూడా ఇంతే ,పిల్లలు అడా లేదా మగ అనే దానితో సంబంధం లేదు,అలా ఐతే విశ్వం కి ఇద్దరు ఆడపిల్లలే,కామన్ సమస్య ముసలితనం,ఒంటరితనం."

ఇప్పుడు సమస్య ఏంటి అన్నయ్య ?మనకి చుట్టాలలో చెడ్డ పేరు వస్తుందని అనా,లేకఅమ్మ వాళ్ళు మనతో ఉండటం లేదనా?కొంచెం వాతావరణం తేలిక చేస్తూ

నవ్వుతు అన్నాడు మురళి.

"రిటైర్డ్ హొమెస్ అంటె మనమే ఒక లగ్జరీ హోమ్ చూసి జాయిన్ చేసేవాళ్ళము ,కానీ నాన్న ఇంకో ఆల్టర్నేట్ చెపుతున్నారు ,దీని ని సహజీవనం అంటున్నారు,అమ్మ కూడా సమర్థిస్తోంది ,మీరే చెప్పండి నాన్న" అంటూ కొడుకుని తీసుకొని గదిలోకి వెళ్ళాడు.

ఇప్పుడు ఇది కొత్తగా అనిపిస్తుంది ,కొన్నాళ్ళు కొంత మంది పాటిస్తే అదే పాత పడిపోతుంది.మా నాన్న కాలం లో ఇంట్లో నాలుగు కానీ అంత కంటే ఎక్కువ గాని పిల్లలు ఉండేవారు , ,మీరు కూడా విని వుంటారు ఉమ్మడి కుటుంబాలు అని,పైగా అందరు కలిసి ఉండేవారు,అందుకు ఒంటరితనం అన్న పదం వినపడేది కాదు,ఇప్పుడు మా స్నేహితులు నలుగురికి ఒకే రకమైన పరిస్థితి వచ్చింది.

మాకు తగినంత బంధు బలగం లేదు ,సడన్ గా ఏదయినా ఇబ్బంది వస్తే ఆదుకొనే మనుషులు లేరు ,ఏదయినా జరిగాక విచారించే కన్నా ముందుగా తగిన వీలు ఏర్పరుచు కొంటె ఉత్తమం అని పించి మా నలుగురు స్నేహితులం కలిసి ఒకే ఇంట్లో ఉండ దలుచు కొన్నాము. మాకు కూడా అడఁజూస్ట్ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది,

" నాన్న అది అనుకున్నంత తేలిక కాదేమో కదా!వేరువేరు కట్టుబాట్లు ఆచారాలు" అది కూడా అలోచించాము రా మురళి ,నాలుగు గిన్నెలు వున్నప్పుడే కదా చప్పుడు వస్తుంది,ఐన అందరం జీవితంలో మూడు వంతుల అనుభవించిన వాళ్ళమే,పైగా ఆర్ధికంగా ఇబ్బందులు లేని వాళ్ళము "

బాగుంది మావయ్యగారు అర్ధ బలం ,అంగ బలం అన్నారు పెద్దలు .సో మీకు అర్ధ బలం వుంది కాబట్టి అంగబలం సమకూర్చు కొంటునారన్న మాట,భలే ఐడియా ల వుంది "చప్పట్లు కొడుతూ తన సపోర్ట్ తెలియ చేసింది వర్ష.

" నిన్ననే విశ్వం అంకుల్ 5 బెడ్ రూమ్స్ వున్న పెద్ద ఇల్లు తీసుకొన్నారు .పిల్లలు అందరు కూడా వస్తూ వుంటారు కదా అందుకు పైన కూడా పెద్ద గదులు వేయిస్తున్నారు ,రాఘవ చెన్నై నుండి ,హర్ష నోయిడా నుండి పై వారం వస్తున్నారు."కావాల్సిన ఏర్పాట్లు అన్ని జరిగిపోతున్నాయి కొంచెం గొంతు పొడారి పోతుండగా మంచినీళ్లు తాగుతూ చెప్పింది రుక్మిణి .

" పోనిలెండి అత్తయ్య !మీ అబ్బాయి కి కొంచెం బాధ అనిపించినా ,మీరందరు కలిసి వుంటారు,ఒకరికి ఒకరు తోడుగా అనిపిస్తారు,ముఖ్యం గా ఒంటరితనం అనే కోరలకి చిక్కరు.దూరం గా వున్న మా పిల్లలందరికీ మీ మీద ఇంక బెంగ ఉండదు. మలివయసులో ఒక పెద్ద కుటుంబం లా కలిసి సహజీవనం చెయ్యాలన్న మీ ఆలోచన నాకు కూడా బాగా నచ్చింది ,ఇంకెందుకు ఆలస్యం మేమందరం ఉండగానే కొత్త ఇల్లు సర్ది పెడతాం .పద మురళి కొంచెం మీ అన్నయ్య ని ప్రసన్నం చేద్దాం."అంటూ అందరిని లేవదీసింది.

ఈనాటి సహజీవనం అనే జీవన విధానానికి ఒకప్పటి వుమ్మడి కుటుంబాలే ఆదర్శం ,సమాజం ఈ విధం గా కూడా మారుతుందేమో అని ఆశిస్తూ

మరిన్ని కథలు

Amalina prema
అమలిన ప్రేమ
- పోరండ్ల సుధాకర్
Day care
డే కేర్
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Dhaniyalu raju heart story
ధనియాలు రాజు హార్ట్ స్టొరీ
- కలం పేరు: బామాశ్రీ రచయిత పేరు: మామిడిశెట్టి బాలాజీ
Rushabhudu Dwividudu
బుషబుడు - ద్వివిధుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Karu chouka
కారుచౌక
- కర్లపాలెం హనుమంతరావు
Palletooru ammavodi
పల్లెటూరు అమ్మఒడి
- లక్ష్మీ కుమారి.సి
Annapoorna nilayam
"అన్నపూర్ణ నిలయం"
- ప్రభావతి పూసపాటి
Stita pragna
స్థి త ప్రజ్ఞ
- - బోగా పురుషోత్తం, తుంబూరు.