
భువనగిరి రాజ్యానికి చంద్రగిరి,అమరగిరి అనే రాజ్యాలు ఇరుగు పొరుగున ఉండేవి. భువనగిరి రాజ్యంలోని రైతులు తమ పంటకు న్యాయమైన ధర గిట్టుబాటు కావడంలేదని రాజు గుణశేఖరునికి ఎన్ని సార్లు చెప్పుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది ,దళారి వ్యాపారులంతా ఒకటై రైతును ఇబ్బంది పెట్టసాగారు. ఈవిషయపైన భువనగిరి రైతులు ఊరికి ఇద్దరు వంతున రాజధానిలో సమావేశమై తమదేశ దళారులతోపాటు ,రాజుగారికి తెలిసివచ్చేలా సమిష్టిగా ఓననిర్ణయం తీసుకున్నారు.
పంటలు చేతికి రావడంతో భువనగిరి రైతులు తమధాన్యాన్ని , కందులు,మినుములు,పెసలు వంటి వాటిని చంద్రగిరి, అమరగిరి రాజ్యాలకు యడ్ల బండ్లపై తీసుకువెళ్ళి గిట్టుబాటు ధరకు అమ్ముకున్నారు.
భువనగిరిలో సమయానికి ధాన్యం అందుబాటీలోనికిరాకపోవడంతో రెట్టింపుధరకు తమవద్ద మిగులు ఉన్న ధాన్యాన్నిఅమ్ముకోసాగారు వ్యాపారులు.
భువనగిరి ప్రజలు తమకష్టాలను రాజుగారికి విన్నవించారు. ఆ విషయం విచారణ జరుపగా దళారి వ్యాపారుల విషయం వెలుగుచూసింది. ఇంతకాలం వ్యాపారులు పన్నులు చెల్లిస్తున్నారని అనుకున్నారు అనుకున్నాడేకాని వారివలన రైతులకు ఇబ్బంది కలుగుతుందని ఊహించలేకపోయాడు. వెంటనే భువనగిరి రాజ్యం లోని రైతు ప్రతినిధులను సమావేశపరచి ' మీకుజరుగుతున్న అన్యాయాన్ని గుర్తించాను మీరు పండించిన పంట ఇరుగు పొరుగు రాజ్యాలలో అమ్మడం వలన మన దేశ ప్రజలకు ఈబ్బంది కలగడంతో నాతప్పేమిటో తెలుసుకున్నాను ఇకపైన ఇటువంటి తప్పిదం జరగదని నేను మీకు హమి ఇస్తున్నాను నేటినుండి మీరు మీపంటలను బహిరంగంగా సొంతంగా గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చు దళారి వ్యవస్ధను రద్దు చేస్తున్నాం, మీసమీప పట్టణ,నగరాలలో మీరు తెచ్చినవి అమ్ముకోవడానికి రైతు కేంద్రాలు నిర్మిస్తాము, అలాగే కూలిపనిచేసుకునే అన్నిరంగాలవారికి తగిన ప్రతిఫలం అందే ఏర్పాట్లు చేస్తాం,చేతివృత్తులవారికి కావలసిన సదుపాయాలు కలిగిస్తాం 'అన్నాడు.
రైతులంతా ఆనందంగా రాజుగారికి ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళారు.