ఇంక్వైరీ - DR BOKKA SRINIVASA RAO

Inquiry
(క్రైమ్‌ థ్రిల్లర్‌ కథ)
జనన మరణాల మధ్య సాగే పశ్న్రల పరంపరా సుదీర్ఘ పస్థ్రానం ఒక ఎంక్వైరీ.
మనిషి పుట్టడానికి ముందుగానే పార్రంభం అవుతుంది ఎంక్వైరీ.
‘‘అమ్మాయ్‌..! ఎన్నో నెల’’ అంటూ ఎంక్వైరీ...
‘‘ఇంతకీ ఆడనా, మగనా...?’’ అంటూ ఎంక్వైరీ....
‘‘పుట్టాక ఏ స్కూల్లో’’ అంటూ ఎంక్వైరీ...
చదువయ్యాక ఉద్యోగానికి, ఆ తదుపరి పెళ్ళికి ఎంక్వైరీ.
చివరికి అదే మనిషి చనిపోయాడనగానే మళ్ళీ ఎంక్వైరీ.
‘‘ ఇంతకీ మీ ఆచారం ఏంటి..? పూడుస్తారా.. కాలుస్తారా’’ అంటూ ఎంక్వైరీ...
‘‘చిన్న పిల్లలుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి..?ా’’ అంటూ ఎంక్వైరీ...
‘‘పెద్ద పిల్లలైతే ఆస్తి పంపకాలెలా..?ా’’ అంటూ ఎంక్వైరీ.
అందుకే ఎంక్వైరీ లేనిదే మనిషి మనుగడయే లేదన్నది ఎంత నిర్వివాదాంశమో...
దానికి సమానార్థకమైన ఇంక్వైరీ నేర పప్రంచానికి ఎంతో ముఖ్యం అన్నది అంత సర్వజన సమ్మతం.
Iఅనబఱతీవ ఱం ్‌ష్ట్రవ ఎaఱఅ ంశీబశ్రీ టశీతీ aఅవ Iఅఙవర్‌ఱస్త్రa్‌ఱశీఅ.
అటువంటి ఇంక్వైరీ ఎన్ని మలుపులు తిరుగుతుందో...
ఎంత కీలకమైందో తెలిపే పయ్రత్నమే మన ఈ కథ.
మరి ఇంక కథలోకి వెళదామా..??!! అయితే పదండి.
అనుపమ హోటల్‌. నిజామాబాద్‌లోని ఒక 3 స్టార్‌ హోటల్‌. ఆ నగరంలో అదొకటే... ఎప్పుడూ వచ్చి పోయే కస్టమర్లతో రద్దీగా వుండే హోటల్‌. ఎందుకంటే ఆ హోటల్‌లోని సౌకర్యాల కంటే... సెక్యూరిటీకి ఎక్కువ ప్రాముఖ్యత వుంటుంది. అందుకే ఏనాడూ... ఏ పోలీసు మనిషి... ఒక్కసారైనా... ఆ హోటల్‌కి వెళ్లింది లేదు. కానీ ఈ రోజు అటువంటి హోటల్‌ ప్రాంగణం... అన్ని ఫ్లోర్లుతో సహా పోలీసులతో నిండిపోయింది. హోటల్‌ కస్టమర్లకంటే పోలీసులే ఎక్కువ మంది ఉన్నారా అన్నంతగా వుంది. వచ్చిపోయే పోలీసు జీపుల సైరన్‌ మోతలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా కల్లోలంగా మారిపోయింది.
దీనంతటికీ కారణం... రూమ్‌ నెంబర్‌ 55 లో బోసుబాబు అనే వ్యక్తి ఉరివేసుకోవడమే. అతను స్టేట్‌ లేబర్‌ మినిస్టర్‌కి పర్సనల్‌ సెక్రటరీ కావడంతో... అతని ‘ఉరి’... ఆ నగరంలో పెద్ద సంచలనాత్మక వార్తగా మారింది. ఇంక ఛానల్స్‌ సంగతి చెప్పనవసరం లేదు. ఆ బోసుబాబు ఒక సారే చనిపోయాడు. కానీ ఛానల్స్‌వాళ్ళు ప్రతి ఐదు నిముషాలకొకసారి చంపేస్తున్నారు. ఒక మనిషికి మరణం అన్నిసార్లు రావడం అంటే... అది ఛానల్స్‌ వల్లే సాధ్యం అని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి బోసుబాబు ఏ సమస్యలూ లేని ప్రశాంత జీవినం గడుపుతున్నాడు. సమాజంలో హోదా కూడా వుంది. స్టేట్‌ మినిస్టర్‌కి పర్సనల్‌ సెక్రటరీ అంటే అతని జీవితం ఎంత విలాసవంతంగా వుంటుందో ఊహించుకోవచ్చు. అందువల్లనే బోసుది నిజంగానే ఆత్మహత్యనా...? లేక హత్య చేసి ఎవరైనా ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న అనుమానాలు పోలీసులతో సహా అందరికీ ఏర్పడ్డాయి. మొదటగా ఈ బోసుబాబు ‘ఉరి’ సంఘటన విషయం ఒక రూమ్‌బోయ్‌ వల్ల వెలుగు చూసింది.
````
దాదాపు అర్థరాత్రి 2.30 గంటల సమయంలో... రూమ్‌బోయ్‌ ఆయాసంతో పరిగెట్టుకుంటూ మేనేజర్‌ శేఖర్‌ దగ్గరికి ‘సార్‌... సార్‌...’ అని అరుచుకుంటూ వచ్చాడు. శేఖర్‌... వాడి కంగారు చూసి... ‘ఏవైందిరా...?’ అని అడుగుతాడు.
‘అక్కడ రూమ్‌ నెంబర్‌ 55 లో ఫ్యాన్‌కి ఒక వ్యక్తి ఉరేసుకుని వున్నాడు సార్‌’ అన్నాడు రూమ్‌బోయ్‌.
‘మై గాడ్‌. మన హోటల్లోనా..? ఇట్జ్‌ ఫస్ట్‌ టైం ఇన్‌ అవర్‌ హోటల్‌...? పద’ అని శేఖర్‌ బయల్దేరాడు.
రూమ్‌కి వెళ్ళి చూస్తే... రూమ్‌బోయ్‌ చెప్పినట్టు ఫ్యాన్‌కి ఒక శవం వేళ్ళాడుతూ కన్పిస్తోంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా... తన బావ అయిన సి.ఐ ధనుంజయరావుకి ఫోన్‌ చేస్తాడు.
‘ఏంట్రా శేఖర్‌..? ఈ టైంలో ఫోన్‌ చేసావ్‌’ అడిగాడు ధనుంజయరావు.
‘హోటల్‌లో బోసుబాబు అనే వ్యక్తి ఉరి వేసుకున్నాడు బావా’ అన్నాడు.
‘ఏంట్రా నిజమా..? సరే నేను వెంటనే బయల్దేరుతున్నా’ అని ఫోన్‌ కట్‌ చేసి కానిస్టేబుల్‌ సుబ్బారావుని పిలిచాడు. ‘సార్‌...’ అని సెల్యూట్‌ చేసి నిలబడ్డాడు.
‘వెంటనే నువ్వు ఫోరెన్సిక్‌ వాళ్ళకి ఇన్‌ఫామ్‌ చేసి... ఇద్దరు పంచుల్ని తీసుకుని... డైరెక్టుగా క్రైమ్‌ స్పాట్‌ అనుపమ హోటల్‌కి వచ్చెయ్‌’
‘అలాగే సార్‌’
‘ఇంకో ముఖ్య విషయం... ఎవరో సి.బి.ఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీవాత్సవ్‌ అట. ఏదో కేస్‌ ఇంక్వైరీ విషయంలో మన సాయానికి వస్తున్నాట్ట. ఆయన్ని రిసీవ్‌ చేసుకోడానికి వెళ్ళమని... అందుబాటులో వున్న ఎస్‌.ఐ కి నేను చెప్పానని చెప్పు.’
‘అలాగే సార్‌..!’ అని కానిస్టేబుల్‌ వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఛీఫ్‌ మినిస్టర్‌ దగ్గర్నుంచి ధనుంజయరావుకి ఫోన్‌ వచ్చింది.
‘చూడూ..! ఈ విషయం మరీ సీరియస్‌ కాకముందే తొందరగా ముగించు. అసలే ఆ చచ్చినోడు మన ప్రభుత్వంలోని స్టేట్‌ లేబర్‌ మినిస్టర్‌కి పర్సనల్‌ సెక్రటరీ. ఇంక ప్రతిపక్షాల నోళ్ళకి అడ్డూ అదుపూ వుండదు. అర్థమైంది కదా..?’ అని సి.ఎమ్‌ గట్టిగా గద్దించాడు.
‘అలాగే సార్‌... సాధ్యమైనంత తొందరగా ముగిస్తాను సార్‌.’ అని చెప్పేసి... ఓ డజను మంది పోలీసోళ్ళని తీసుకుని... అనుపమ హోటల్‌కి వెళ్ళాడు.
````
రూమ్‌ నెం.55 ముందు కానిస్టేబుల్‌ సుబ్బారావు కునికిపాట్లుతో డ్యూటీ చేస్తుంటాడు. సడెన్‌గా ఉలిక్కిపడి లేస్తాడు. వాచీ చూసుకుంటూ.. ‘మై గాడ్‌..! ఆరున్నర అయిపోయింది. అరే..దాదాపు ఐదున్నర వరకూ మెలకువగానే వున్నానే.. ఇంతలోనే మైకం ఎలా కమ్మేసింది.’ అని అటూ.. యిటూ చూస్తూ... చివరికి కప్పు వైపు చూసి.. అర్థం అయి... అదీ సంగతి శవాల డ్యూటీ మహిమ. హు.. పూర్వజన్మలో కాటి కాడి నక్కలం అయివుంటాం. ఆ ఆశ చావక ఈ జన్మలో శవాల దగ్గర డ్యూటీ చేస్తున్నాం.’ అని అనుకుంటాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చి... ‘అసలు ఏదో కేసు ఎంక్వైరీకని వచ్చిన సి.బి.ఐ. ఇన్‌స్పెక్టర్‌ శ్రీవాత్సవ్‌... ఈ కేస్‌ని హేండోవర్‌ చేసుకుని... దీనిని కూడా ఎంక్వైరీ చేయడమేంటి...?? ఏం అర్థం కావడం లేదు. ఇంత హైలెవెల్‌ ఎంక్వైరీ అంటే.. ఇతను మామూలు మనిషి కాదా. ఇంతకీ ఇది హత్యనా...? లేక ఆత్మహత్యనా.. అబ్బబ్బా.. అంతా గందరగోళంగా వుంది.’ అని బుర్ర గోక్కుంటూ వుంటాడు.
‘ఏవిటయ్యా ఆత్మహత్య ఇంక్వైరీ ఇంకా మొదలుకాకుండానే గందరగోళమా....??!!’ అంటూ సి.బి.ఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీవాత్సవ్‌ వస్తాడు.
‘గుడ్‌మార్నింగ్‌ సార్‌..!’ సెల్యూట్‌ చేసాడు సుబ్బారావు.
‘మరి యింక ఇంక్వైరీ మొదలెడదామా.?’ అంటాడు శ్రీవాత్సవ్‌
‘ఎంక్వైరీనా... ఇంక్వైరీనా సార్‌.’ అని అడుగుతాడు.
‘గుడ్‌ క్వశ్చన్‌. అసలు ఆ రెండిరటి గురించి నీకేం తెలుసు..?’
‘మేమైతే రెండూ ఒకటే అనుకుంటున్నాం సార్‌.’
‘నో.. నో... ఎంక్వైరీ మీన్స్‌ ఆస్కింగ్‌ సమ్‌థింగ్‌. బట్‌ ఇంక్వైరీ మీన్స్‌ ఏ ఫార్మల్‌ ఇన్వెస్టిగేషన్‌. సింపుల్‌గా
చెప్పాలంటే పద్ధతిగా జరిగే పెళ్ళిచూపుల్లాంటిది యింక్వైరీ అయితే, ఆ పధ్థతుల్ని తుంగలో తొక్కే ‘డేటింగ్‌’
లాంటిది ఎంక్వైరీ. అండర్‌స్టాండ్‌..?’ అని గ్రేట్‌గా ఫీలవుతాడు ఇన్‌స్పెక్టర్‌.
‘ఎంక్వైరీ... ఇంక్వైరీ... , ఇంక్వైరీ... ఎంక్వైరీ... ఏమైనా నా జీవితంలో ఈ రోజు ఒక కొత్త విషయం
నేర్చుకున్నాను. థాంక్యూ సార్‌.’ అని సుబ్బారావు అంటాడు.
‘సరే మీ సి.ఐ.గారు నాకిచ్చిన సర్టిఫైడ్‌ కాపీల్ని పరిశీలిద్దాం. ఫస్ట్‌ ఒన్‌ ఈజ్‌ ఏ కాపీ ఆఫ్‌ అబ్జర్వేషన్‌
రిపోర్ట్‌. దాని ప్రకారం...’ అని తన సూట్‌ కేస్‌ నుండి ఒక పేపర్‌ తీసి చదువుతూంటాడు.
నేమ్‌ ఆఫ్‌ డికీజ్డ్‌ : మిస్టర్‌ బోసుబాబు, ఆదిలాబాద్‌.
ప్లేస్‌ ఆఫ్‌ వర్క్‌ : హైదరాబాద్‌
ప్లేస్‌ ఆఫ్‌ అఫెన్స్‌ : రూమ్‌నెం.55, అనుపమ హోటల్‌, నిజామాబాద్‌.
మోడస్‌ ఆపరండీ : సస్పెక్టెడ్‌ స్యూసైడు
టైమ్‌ ఆఫ్‌ అఫెన్స్‌ : రాత్రి 1.50... ... ... అండ్‌ సో... సో...’ అని చదవగానే సుబ్బారావు తనకున్న డౌట్‌ అడుగుతాడు.
‘ఈ చచ్చిపోయిన వ్యక్తి ఉండేది ఆదిలాబాద్‌. ఉద్యోగం హైదరాబాద్‌. పోయింది నిజామాబాద్‌. త్రికోణంలా వుంది సార్‌...!
‘ఏ త్రికోణమైనా, ఎంతటి కుంభకోణమైనా మన దృష్టికోణం ముందు పటాపంచలయ్యి లఘుకోణం కావాల్సిందే.’ అని అంటాడు ఇన్‌స్పెక్టర్‌. అని చెప్పి మిగిలిన మెటీరియల్‌ కూడా తీస్తూ... ‘రిపోర్ట్‌ ప్రకారం మెటీరియల్‌ ఎవిడెన్సెస్‌ యిలా వున్నాయోయ్‌. ఒన్‌ పర్స్‌ విత్‌ ఫైవ్‌ ఎలక్ట్రానిక్‌ కార్డ్స్‌. నెట్‌ క్యాష్‌... నలభై నాలుగు ఐదువందల నోట్లు. అంటే 22,000 రూపాయిలు. ఇంకా... డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌. ఓన్లీ ఒన్‌ డాక్యుమెంట్‌ ఈజ్‌ ఎవయ్‌లబుల్‌. స్యూసెడ్‌ నోట్‌. ఇదొక్కటేనోయ్‌ మన ఇంక్వైరీకి పని పెట్టేది.’ అని చెప్పి... ‘ఈ నోట్‌ చదువుతా విను. దిస్‌ ఈజ్‌ టు క్లారిఫై దట్‌ ఐ హేవ్‌ నో గుడ్‌ రిలేషన్స్‌ విత్‌ మై వైఫ్‌. వుయ్‌ బోత్‌ ఆర్‌ లివింగ్‌ లైక్‌ సౌత్‌ అండ్‌ నార్త్‌ పోల్స్‌ ఇన్‌ ఏ స్మాల్‌ యూనివర్స్‌ కాల్డ్‌ అవర్‌ హౌస్‌. షీ సస్పెక్ట్స్‌ మీ ఇన్‌ ఎవెరీ ఏస్పెక్ట్‌ అండ్‌ క్వారల్స్‌ విత్‌ మి. సో ఓన్లీ ఐ డిక్లేర్‌ వెనెవర్‌ మై బాడీ ఫౌండ్‌ ఇన్‌ ఏ సస్పెక్టెడ్‌ స్టేట్‌... మై వైఫ్‌ ఈజ్‌ సోల్‌లీ రెస్సాన్స్‌బుల్‌ ఫర్‌ మై డెత్‌. సో ఇది ఆత్మహత్య కాదు... హత్య అని చెప్పేలా వుందయ్యా ఈ నోట్‌.’’ అని అంటాడు.
‘సార్‌...! అయితే హత్య అని తేలిపోయిందిగా. ఇంక ఇంక్వైరీ అయిపోయినట్టేనా..?’ అని అడుగుతాడు సుబ్బారావు.
‘అలా కన్‌ఫర్మ్‌ అయితే.. ఇంక్వైరీ అయిపోయిందనుకుంటే,,, కొత్త విషయాలు ఏమైనా వుంటే బయటపడవు కూడా. అవునూ... రూమ్‌బోయ్‌ కలెక్ట్‌ చేసినవేవో నీ దగ్గర వున్నాయటగా. ’ అని వివరిస్తాడు ఇన్‌స్పెక్టర్‌.
‘వుండండి సార్‌. తీసుకొస్తాను.’ సుబ్బారావు పరుగున వెళ్తాడు. శ్రీవాత్సవ్‌ తన దగ్గరున్న మెటీరియల్‌ మరియు డాక్యుమెంట్‌ ఎవిడెన్సెస్‌ చూస్తూ... ఏదో ఆలోచిస్తూ వుంటాడు.
````
అది ఆదిలాబాద్‌లోని బోసుబాబు ఇల్లు. అతని భార్య జ్ఞానేశ్వరీ దేవి. ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ వుంటాడు... ఆమె తమ్ముడు ఆనందం. కొద్దిసేపటికి... జ్ఞానేశ్వరీదేవి ‘ఏరా ఆనందం..! నువ్వెళ్ళిన పని ఏమైందిరా..?’ అని అడుగుతుంది.
‘నువ్వు చెప్పడం.. నేను వెళ్ళడం... పని అవకుండా వుంటుందా..? నిజామాబాద్‌ వెళ్ళాను. బావ అనుపమ హోటల్‌లోనే దిగాడక్కా. నీ అనుమానాలన్నీ నిజమే. నువ్వు నాకు చెప్పిన పని పూర్తి చేసే వచ్చాను. ఇదిగో నీకు అనుమానం వుంటే ఈ ఫోటోలు చూడు.’ అని ఏవో ఫోటోల్ని సెల్‌ఫోన్‌లో చూపిస్తుంటాడు. ఆ ఫోటోలు చూస్తుంటే జ్ఞానేశ్వరీదేవి ముఖంలో రంగులు మారుతూ వుంటాయి.
‘శభాష్‌రా..! నా తమ్ముడివి అనిపించుకున్నావ్‌’ అని తమ్ముడ్ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. తమ్ముడు ఆనందంగా నవ్వుతుంటాడు.
````
‘ఇదిగోండి సార్‌ రూమ్‌బోయ్‌ నాకిచ్చినవి’ అని సుబ్బారావు అనడంతో ఈ లోకంలోకి వస్తాడు శ్రీవాత్సవ్‌. సుబ్బారావు తను తెచ్చినవి శ్రీవాత్సవ్‌కి ఇస్తాడు.
‘రెండు సినిమా టికెట్లు, రెండు ఏ.టీ.ఎమ్‌ రిసీట్స్‌, ఒక స్కూల్‌ ఫీజు రిసీట్‌ సార్‌’ అని వాటిని అందజేస్తాడు సుబ్బారావు. వాటిని తీసుకుంటూ... ‘నాకో డౌట్‌ వుందయ్యా’ అని శ్రీవాత్సవ్‌ అడుగుతాడు.
‘ఏంటి సార్‌..?’
‘ఈ మెటీరియల్‌ బోసుబాబు రూమ్‌లో వున్నంతరాన... వీటితో బోసుబాబుకి సంబంధం వుందన్న గారంటీ ఏవిటి..?’
‘ఇదే ముక్క నేను ఆ రూమ్‌బోయ్‌ని అడిగాను. దానికి వాడు చెప్పిన సమాధానం... బోసుబాబు లిక్కర్‌ కన్‌స్యూమ్‌ చేసాక... రూమ్‌లో స్మెల్లింగ్‌ సెన్సేషన్‌ వుంటుందని... రూమ్‌ క్లీన్‌ చేయమన్నాడట. అలా క్లీన్‌ చేసినపుడు దొరికినవే నాకు ఇచ్చాడు సార్‌’ అని సుబ్బారావు చెప్పాడు.
‘ఓకె. ఓకె. నౌ లెటజ్‌ ఎనాలసిస్‌ దిస్‌ మెటీరియల్‌. ఫస్ట్‌ ఒన్‌ రెండు సినిమా టికెట్లు. అంటే బోసుబాబు ఎవరితోనో సినిమాకి వెళ్ళాడు. ఎవరై వుంటారు..?’ అని ఆలోచిస్తుంటాడు.
సుబ్బారావు అందుకుని... ‘ఒకవేళ పిల్లాడేమో సార్‌. ఆ ఫీజు రిసీట్‌ చూడండి. దానిలో మహేంద్ర, టెన్త్‌క్లాస్‌’ అని రాసి వుంది.’ అంటాడు.
‘వెరీ గుడ్‌ సుబ్బారావు. నువ్వు కూడా ఇంక్వైరీ బాగానే చేస్తున్నావ్‌. కీపిటప్‌’
‘థాంక్యూ సార్‌.’
‘బోసుబాబు వయసు 32, ఈ పిల్లాడు వయసు 15. 32 ` 15 R 17. 17 ఏళ్ళకే బోసుబాబుకి పెళ్ళయ్యే ఛాన్సే లేదు. సో ఆ రెండవ వ్యక్తి ఇతని స్టెఫ్నీ ఏవన్నా అయి వుంటుందా..? ఈ విషయాలు వాడి
భార్య జ్ఞానేశ్వరీదేవి దగ్గర ఇంక్వైరీ చేస్తే తెలియొచ్చేమో..! ఓకె. కమాన్‌ సుబ్బారావు. నెక్స్ట్‌ ఏంటి..?’ అని అడుగుతాడు శ్రీవాత్సవ్‌.
‘రెండు ఏటిఎమ్‌ రిసీట్స్‌ సార్‌’
‘ప్రపంచమంతా డిజిటల్‌ పేమెంట్స్‌ జరుగుతోంటే... క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ ఎందుకు చేసాడు ఈ బోసుబాబు. సరే గానీ. ఆ రిసీట్స్‌ టోటల్‌ ఎమౌంట్‌ ఎంతుంది...?’
‘రెండు కలిపి మొత్తం 50,000 రూపాయిలు సార్‌.’
‘ఫీజు రిసీట్‌ ఎంత..?’
‘28,000 సార్‌.’
‘ఓకె. 50,000 డ్రా చేసి... 28,000 ఫీజు కట్టాడనుకుందాం. ఇంకా 22,000 మిగిలి వుంటాయి.’
‘ఆ 22,000 కేస్‌ ప్రాపర్టీ రిజిస్టర్‌లో ఎంటరయ్యాయిగా సార్‌.’
‘సో ఎటిఎమ్‌ రిసీట్స్‌, ఫీజు రిసీట్‌, మెటిరియల్‌ 22,000 క్యాష్‌. ఇంక తేలాల్సింది... సినిమాకి వెళ్ళిన ఆ రెండో వ్యక్తి ఎవరు...? ఆ పిల్లాడు మహేంద్ర ఎవరు..? తేలాలి. సుబ్బారావ్‌... ఆ పిల్లాడెవరో ఫీజు రిసీట్‌ ప్రకారం... ఆ స్కూలుకెళ్ళి ఆరా తియ్‌.’
‘అలాగే సార్‌’
‘మరొక్క విషయం అటాప్సీ రిపోర్ట్‌ వచ్చిందా..?’
‘లేదు సార్‌. ఇంకా రాలేదు. రాగానే మీకు అందజేస్తాం.’
‘ఇట్జ్‌ ఓకె. అవునూ... మిస్టర్‌ బోసుబాబు ఈ రూమ్‌లో దిగిన టైమ్‌ నుంచి... బాడీని పోస్ట్‌మార్టమ్‌ పంపించేంతవరకూ... సిసిటీవీలో రికార్డ్‌ అయిన వీడియో క్లిప్పింగ్స్‌ని కలెక్ట్‌ చేయమన్నాను. చేసారా..?’
‘చేసాం సార్‌. అవి మేనేజర్‌ దగ్గర వున్నాయి.’
‘గుడ్‌. అయితే ఆ క్లిప్పింగ్స్‌నుంచి ఇంపార్టెంట్‌ అండ్‌ సస్పెక్టెడ్‌ స్నాప్స్‌ని ప్రింట్‌ తీయించి... ఆదిలాబాద్‌కి బయల్దేరదాం పదా’ అని చెప్పిన తర్వాత కానిస్టేబుల్‌ సుబ్బారావు, శ్రీవాత్సవ్‌లు మేనేజర్‌ దగ్గరికి వెళతారు.
````
జ్ఞానేశ్వరీదేవి, ఆనందం లిద్దరూ ఇంటి హాలులో కూర్చుని కాఫీలు తాగుతుండగా... జ్ఞానేశ్వరీదేవికి ఫోన్‌ వస్తుంది. ఫోన్‌ అటెండ్‌ అవగానే అవతలి గొంతు శ్రీవాత్సవ్‌... ‘ఈజ్‌ ఇట్‌ మిసెస్‌ జ్ఞానేశ్వరీదేవి..?’ అని వినబడుతుంది.
‘అవునండీ.’
‘బోసుబాబు కేసు విషయంలో మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. మాకు కోపరేట్‌ చేయాలి. మీ తమ్ముడు ఆనందాన్ని కూడా ఇంటరాగేట్‌ చేయాలి. అరగంటలో వస్తున్నాము.’ అని ప్రతి సమాధానం ఇవ్వకుండానే ఫోన్‌ పెట్టేస్తాడు.
ఫోన్‌ పెట్టేసిన వెంటనే... ఆనందం మీదికి దూసుకు వెళ్ళి... ‘ఒరేయ్‌... నేనేం చెప్పాను...? నువ్వు నిజామాబాద్‌ వెళ్ళి ఏం చేసొచ్చావ్‌రా..? ఎవడో సిబిఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీవాత్సవట. ఫోన్‌ చేసి మనిద్దరినీ రడీగా వుండమన్నాడు. ఏదో ఇంక్వైరీనట.’ అని మాట పూర్తి కాకుండానే... శ్రీవాత్సవ్‌, కానిస్టేబుల్‌ సుబ్బారావులు ‘ఎక్స్‌క్యూజ్‌మి’ అంటూ వస్తారు.
‘రండి సార్‌. కూర్చోండి’ అని జ్ఞానేశ్వరీదేవి కుర్చీలు చూపిస్తుంది.
‘థాంక్యూ. ఇక విషయానికి డైరెక్టుగా వస్తున్నాం. ఈ విషయం మీకు రాత్రే చెప్పడానికి ట్రైం చేసాం. మీ ఫోన్‌ రీచ్‌ కాలేదు. మీరు పబ్‌లో ఉన్నారని మా పోలీసుల ద్వారా తెలిసింది. ఇప్పుడు మేం చెప్పింది విని.. కాస్త తమాయించుకోండి. మీవారు బోసుబాబు ఆత్మహత్య చేసుకున్నారు. వియ్‌ ఆర్‌ సారీ.’ అని చెప్పాల్సింది అప్పచెప్పినట్టు చెప్తేస్తాడు శ్రీవాత్సవ్‌.
‘నో.. నేన్నమ్మను. మా ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదు.‘ అని ఏదో గుర్తుకు వచ్చినట్టుగా... ఆనందం మీదికి దూసుకెళ్ళి... ‘రేయ్‌... చెప్పరా. నిజం చెప్పరా. ఏం చేసావ్‌..? నేను చెప్పింది మానేసి... నీ సొంత నిర్ణయాలు తీసుకుని ఆయన్ని చంపేస్తావ్‌రా. మీ అక్క సౌభాగ్యాన్ని నీ చేతులారా నాశనం చేస్తావ్‌రా’ అని చొక్కా పట్టుకుని గుంజుతూ... చెంపలు మీద కొడుతూ ఏడుస్తుంటుంది.
చొక్కా విడిపించుకుని... ఆనందం... ‘ఏం మాట్లాడుతున్నావక్కా..! నేను బావగార్ని చంపడమేవిటి..?’ అని అమాయకంగా అడుగుతాడు.
దానికి శ్రీవాత్సవ్‌ కల్పించుకుని.. ‘మేమూ అదే అడుగుతున్నాం. నీకు మీ అక్క ఏం చెప్పింది..? నువ్వు మీ బావగార్ని ఎందుకు చంపావో చెప్పు. ఇదిగో సాక్ష్యాలు మా దగ్గర వున్నాయి. నువ్వు తప్పించుకోలేవు.’ అని సుబ్బారావు దగ్గరనుంచి... హోటల్‌ క్లిప్పింగ్స్‌ని తీస్కుని వాడికిస్తాడు.
వాటిని చూడగానే ఆనందం ‘అక్కా..! నేను నిజామాబాద్‌ హోటల్‌కి వెళ్ళినట్టు సాక్ష్యాలే ఇవి. ఇంక మనం దాచలేం.’ అని అంటాడు
జ్ఞానేశ్వరీదేవి కల్పించుకుని... ‘హోటల్‌కెళ్ళినంతరాన మా తమ్ముడు చంపాడని మీరెలా అనగలరు..?’ అని ఇన్‌స్పెక్టర్‌తో అడుగుతుంది.
‘వస్తున్నా మేడమ్‌. మీ దగ్గరికే వస్తున్నా. దీనంతటికీ సూత్రధారి మీరే అని ఋజువు చేయబోతున్నా. మీ తమ్ముడుకి మీరు ఏం చెప్పి పంపారు. అతను ఎందుకు మీవార్ని చంపాడు..? నిజం చెబుతారా లేదా..?’ అని రెట్టిస్తాడు.
‘సార్‌... నేను జరింగిందంతా చెబుతాను సార్‌. బావగారికి తెలియకుండా వెనకాలే నిజామాబాద్‌ వెళ్ళి... ఆయనేం చేస్తున్నారో.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారో.... ఎవరెవరితో తిరుగుతున్నారో... చూసి రమ్మని చెప్పింది. అదే చేసాను. ఫోటోలు కూడా తీసాను. చూడండి.’ అని తన సెల్‌ఫోన్‌లో వున్న ఫోటోలు చూపిస్తాడు.
‘దీన్ని బట్టి మీనుంచి నిజాయితీ కనపడుతోంది. ఇంక దోషి మీ అక్కనే అనిపిస్తోంది. చెప్పండి మేడమ్‌. మీవార్ని మీరెందుకు చంపించారు..? ఈ స్యూసైడ్‌ నోట్‌ మిమ్మల్ని దోషిగా నిరూపిస్తోంది. ఈ చేతివ్రాత బోసుబాబుదేనని ఫోరెన్సిక్‌ వాళ్ళు కూడా నిర్ధారించారు.’ అని ఆ నోట్‌ కాపీని ఇస్తాడు శ్రీవాత్సవ్‌.
ఆ నోట్‌ని తీసుకుని... చదువడం మొదలెట్టి.. ఉన్నట్టుండి నవ్వడం మొదలుపెడుతుంది. పిచ్చెక్కిందేమో అని అందరూ అనుకుంటూండగా... నవ్వు ఆపి... ‘వ్వాట్‌ ఏ రిడిక్యులస్‌ ఇన్‌స్సెక్టర్‌గారూ. ఇట్‌జ్‌ నాట్‌ ఏ స్యూసైడ్‌ నోట్‌. ఓన్లీ ఏ ఫేక్‌ లెటర్‌ సార్‌. ఒక్క క్షణం వుండండి’ అని లోపలికి వెళ్ళి ఒక పుస్తకం తెచ్చి శ్రీవాత్సవ్‌కి ఇస్తుంది.
శ్రీవాత్సవ్‌ ఆ పుస్తకం తీస్కుని చదువుతూ... ‘ నాటిక : హత్య, రచన : జ్ఞానేశ్వరీదేవి’ అని చదవడం ఆపుతాడు.
సుబ్బారావు కల్పించుకుని... ‘బోసుబాబుగారు చేసుకున్నది ఆత్మహత్య. వారి భార్య రాసిన నాటిక ‘హత్య’. చాలా చిత్రంగా వుందండి.’ అని అంటాడు.
వెంటనే ఆనందం అందుకుని... ‘కదా. ఇతివృత్తం చూడండి. ఇంకా విచిత్రంగా వుంటుంది.’ అంటాడు.
శ్రీవాత్సవ్‌ చదవడం మొదలుపెడ్తాడు. ‘ఇతివృత్తం: ఈ నాటిక ఒక హత్యతో ప్రారంభం అవుతుంది. దొరికిన ఆధారాలన్నీ ఆత్మహత్యేనన్నట్టుగా వుంటాయి. కానీ ఇంక్వైరీ చేయగా చేయగా... అది ఆత్మహత్య కాదు హత్యే అని తేలుతుంది.’ అని ఆగి... కానిస్టేబుల్‌ సుబ్బారావు వంక చూస్తాడు.
‘సార్‌. . బోసుబాబు మరణం అచ్చం ఈ నాటికకి నెగెటివ్‌ కాపీలా వుంది. నాటికలో హత్య... రియల్‌ లైఫ్‌లో ఆత్మహత్య. నాటికలో ఆధారాల వల్ల ఆత్మహత్యే అన్పించింది. రియల్‌ లైఫ్‌లో ఆధారాలు హత్య అన్నట్టుగా వున్నాయి. నాటికలో ఆత్మహత్య కాదు హత్య అని తేలింది. కొంప తీసి ఈ బోసుబాబుది ఆత్మహత్య కాదు హత్య అని తేలుతుందేమో సార్‌.’ అని సుబ్బారావు అంటాడు.
శ్రీవాత్సవ్‌ తన ఇంక్వైరీని కంటిన్యూ చేస్తూ... ‘మేడమ్‌...! ఇంతకీ ఈ నోట్‌కి, ఈ నాటికకి వున్న సంబంధం ఏంటి..?’ అని అడుగుతాడు.
‘అది తెలియాలంటే 13 వ పేజీ తీసి చదవండి.’ అని జ్ఞానేశ్వరీదేవి చెబుతుంది.
శ్రీవాత్సవ్‌ చదవడం మొదలుపెడతాడు. ‘నాకు నా భార్యకు సత్సంబంధాలు లేవు. మేమిద్దరం ఈ ఇంటిలో ఉత్తర దక్షిణ ధృవాల్లా బ్రతుకుతున్నాం. ప్రతీ విషయంలోనూ నన్ను అనుమానిస్తూ... నాతో దెబ్బలాడుతుంది. నేనేనాడైనా అనుమానాస్సద పరిస్థితుల్లో మరణిస్తే దానికి పూర్తి బాధ్యత నా భార్యే.’ అని చదివి... తన దగ్గరున్న స్యూసెడ్‌ నోట్‌ చూస్తుంటాడు.
‘సార్‌ ఈ మేటర్‌ మొత్తం మీ దగ్గరున్న ఇంగ్లీష్‌ నోట్‌కి అచ్చం అనువాదంలా వుంది సార్‌.’ అని సుబ్బారావు అంటాడు.
దానికి శ్రీవాత్సవ్‌... ‘యా... యూ ఆర్‌ రైట్‌. మరి ఈ నోట్‌ ఆయన దగ్గర ఎందుకుంది...?’
‘నాటికలో హేండ్‌ ప్రాపర్టీగా స్యూసైడ్‌ నోట్‌ డి.టి.పి. చేయించి యిమ్మని మా అక్క, బావని అడిగింది సార్‌. ఆయనకి తెలుగు రాదు కనుక. ఇంగ్లీష్‌లో రాసుకుని.. ఆఫీస్‌లో తెలుగు డి.టి.పి. చేయించి ఆ కాపీలు నాకిచ్చారు. బహుశా ఆ ఇంగ్లీష్‌ నోట్‌ ఆయన జేబులో వుండిపోయి వుంటుంది సార్‌.’ అని ఆనందం వివరించి చెబుతాడు.
‘ఇదే నిజమయితే... స్యూసైడ్‌ నోట్‌ వెనకున్న పీటముడి విడిపోతుంది. ఇంక తేలాల్సింది మహేంద్ర విషయం’ అని శ్రీవాత్సవ్‌ అంటాడు.
జ్ఞానేశ్వరీదేవి తన తప్పును ఒప్పుకుంటూ... ‘ఆ విషయంలోనే నేను మా వార్ని అనుమానించాను. ఆ పిల్లాడెవడో కనుక్కోమని... నా తమ్ముడు ఆనందాన్ని పంపించాను. ఆ వెతుకులాటలోనే వీడు నిజామాబాద్‌ వెళ్ళాడు. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే.’ అని చెప్పి... ‘ అసలు మా ఆయనకి నిజామాబాద్‌లో ఎవరైనా ఉన్నారా..? ఇంతకీ మహేంద్ర ఎవరు సార్‌.’ అని శ్రీవాత్సవ్‌ని ఆందోళనగా అడుగుతుంది.
‘మహేంద్ర కాదు. మహేంద్రసింగ్‌.’ అంటాడు శ్రీవాత్సవ్‌. ‘మహేంద్ర సింగా...?’ అని ఆశ్చర్యపోతారు.
‘ఎస్‌. మీవారి బాల్య స్నేహితుడు రణబీర్‌సింగ్‌ మిలటరీలో కల్నల్‌ రాంక్‌ ఆఫీసర్‌. మహేంద్రసింగ్‌ చిన్నపుడే తల్లి చనిపోవడంతో అమ్మమ్మగారింట్లో నిజామాబాద్‌లోనే చదువుతున్నాడు. కార్గిల్‌ యుద్ధంలో తండ్రిని కూడా కోల్పోయాడు మహేంద్రసింగ్‌. ఆ పిల్లాడి బాగోగులు చూడ్డానికే బోసుబాబు నిజామాబాద్‌ వెళ్తుండేవాడు. కానీ మీ ఆయన్ను ఈ విషయంలో అనవసరంగా అనుమానించారు’ అని హితబోధ చేస్తాడు. జ్ఞానేశ్వరీ దేవి చేసిన తప్పుని తెలుసుకుని.. దానికి పాయ్రశ్చిత్తంగా ఆ కురాడ్రి ఆలనాపాలనా చూసే అవకాశం తమకి యిమ్మంటారు. దానికి శ్రీవాత్సవ్‌ అంగీకరించి.. కానిస్టేబుల్ని తీసుకుని వెళ్ళిపోతాడు
````
పోలీస్‌ స్టేషన్‌లో తనకు కేటాయించిన రూమ్‌లో కూర్చుని... బోసుబాబుది ఆత్మహత్యేనని... హత్య కాదని ఇంక్వైరీ పొస్రీడిరగ్స్‌ని ముగిస్తాడు శ్రీవాత్సవ్‌. అప్పుడే వచ్చిన సుబ్బారావుని సాదరంగా కూర్చోమంటాడు. సుబ్బారాదు కూర్చుని... ‘సార్‌..! బోసుబాబుది హత్య కాకపోతే... అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు’ అని సుబ్బారావు అడుగుతాడు.
‘అది అడిగే ముందు... అసలు బోసుబాబు ఆత్మహత్య చేసుకున్న వెంటనే... మీ పోలీసులు డీల్‌ చేయాల్సిన కేసులోకి నేనెందుకు ఎంటర్‌ అయ్యానని అడిగి వుండాల్సింది.’
‘అవును నిజమే సార్‌. మీ సిబిఐ వాళ్ళు ఎంటర్‌ అవుతున్నారంటే... మా పోలీసు డిపార్ట్‌మెంటు చాలా ఫీలయిపోతుంది. అలాంటిది... ఇలా ఆత్మహత్య సంఘటన జరగ్గానే అలా మీరెందుకు ఎంటర్‌ అయ్యారు.?
‘బోసుబాబు బ్రతికున్నపుడే ఎనిమిది నెలల క్రితమే నా ఇంక్వైరీ మొదలెట్టాను. బోసుబాబు సూతధ్రారిగా... వేలాదిమంది నిరుద్యోగుల్ని మాయా కంపెనీలతో మోసం చేసిన కోట్ల కుంభకోణం బయటపడిరది. అది సాక్ష్యాధారాలతో సహా రుజువయ్యి... నిజామాబాద్‌లో ఉన్నాడని చేయడానికి నిజామాబాద్‌ వచ్చేసరికి బోసుబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆల్‌రెడీ బోసుబాబు కేసు నేనే డీల్‌ చేస్తుండటంతో...’ అని మాట పూర్తవనీయకుండానే.. సుబ్బారావు అందుకుని... ‘ఆ ఆత్మహత్య కేసుని కూడా మీకే వదిలేసింది. మొత్తానికి ఎంక్వైరీ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను సార్‌.’ అని సుబ్బారావు అని శుభాకాంక్షలు తెలిపి... ‘ఇంక నాకు రిలీవ్‌ లెటర్‌ ఇచ్చేయండి సార్‌’ అని అంటాడు.
శ్రీవాత్సవ్‌ ఓ నవ్వు నవ్వి... ‘‘లేదు. లేదు. స్కాం ఇంక్వైరీ పూర్తి అయింది. ఆత్మహత్య ఇంక్వైరీ పూర్తి అయింది. కానీ యింకో ఇంక్వైరీ పూర్తి కాలేదంటాడు.’ కానిస్టేబుల్‌ ఆశ్చర్యపోతాడు. ‘అటాప్సీ రిపోర్ట్‌’ కూడా ఆత్మహత్యే అని నిర్ధారించినప్పటికీ... మరో కొత్త సమస్య సృష్టించిందని ఇన్‌స్పెక్టర్‌ శ్రీవాత్సవ్‌ చెప్తాడు. ఆ సమస్య ఏవిటని కానిస్టేబుల్‌ అడగ్గా..... ‘ఆత్మహత్య’ కు దాదాపు రెండు నెలల ముందునుంచే బోసుబాబు స్లో పాయిజన్‌ వాడుతున్నట్లు రిపోర్ట్‌ సారాంశంమని చెప్తాడు.
ఆ స్లోపాయిజన్‌ తనే వాడాడా...?
లేక ఎవరైనా తనపై పయ్రోగం చేసారా అన్నది తేల్చాలి
కాబట్టి ఇంక్వైరీ మళ్ళీ మొదలౌతోందని చెప్పగానే... కానిస్టేబుల్‌ నోరెళ్ళబెడతాడు.
````

మరిన్ని కథలు

Telisivachhina tappu
తెలిసివచ్చిన తప్పు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vruddhapyam varama? sapama?
వృద్ధాప్యం వరమా ? శాపమా?
- మద్దూరి నరసింహమూర్తి
Adigite cheptaa
అడిగితే చెప్తా
- కొడవంటి ఉషా కుమారి
Evaru takkuva kaadu
ఎవరూ తక్కువ కాదు!
- రాము కోలా దెందుకూరు
Sahajeevanam
సహజీవనం
- ప్రభావతి పూసపాటి
Amalina prema
అమలిన ప్రేమ
- పోరండ్ల సుధాకర్
Day care
డే కేర్
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు