ఆశా -పేరాశా . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Aasha Peraasha

జివితేష్ ,విహన్ మంచిమిత్రులు .కాలేజి చదువులు చదువు ముగిసిన అనంతరం ఇరువురు కలసి ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నారు,ఇంతలో వారితో కలసి చదివిన మిత్రురాలి వివాహం రావడంతో ఏదైనా బహుమతి ఇద్దామని మిత్రులు కలసి ఊరంతా తిరిగినా వారికి ఏ అంగడిలోనూ నచ్చినవిధంగా వస్తువు దొరకలేదు. దూరంగా ఉన్ననగరానికి వెళ్ళి వారికి నచ్చిన బహుమతిని కొనుగోలు చేసారు. అనంతరం పక్కనే ఉన్న హొటల్లో భోజనం చేస్తుండగా " జీవి మనం బహుమతి పేరున మనఊరిలో ఇటువంటి వస్తువుల అంగడి ప్రారంభిస్తే ఎలా ఉంటుంది " అన్నాడు విహన్ .

" మన ఊరికి చుట్టుపక్కల దగ్గరగా చాలా గ్రామాలు ఉన్నయి మనలా అందరూ ఇలా ఇంతదూరం వచ్చి బహుమతులు కొనలేరు

వీటితోపాటు పిల్లల ఆటవస్తులు కలిపి అమ్మితే బాగుంటుంది " అన్నాడు జివితేష్ .

ఊరు చేరి న అనంతరం కొద్ది రోజుల్లో నాలుగురోడ్ల కలిసే ప్రాంతంలో అంగడి అద్దెకు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు .కాలేజిలో పరిచయమైన అందరిని అంగడి ప్రారంభానికి ఆహ్వానించడంతోపాటు ,స్ధానికి కేబుల్ టీ.విలో ప్రకటన ఇవ్వడంతో వ్యాపారం బాగా సాగింది.

తొలినాళ్ళలో ఒకరు అంగడిలో ఉంటే మరొకరు ముంబాయి, కలకత్తా,ధిల్లి, చెన్నయ్ వంటి నగరాలకు వెళ్ళి తమకు కావలసిన వస్తువు కొనుగోలు చెసేవారు. కాలక్రమంలో ఆన్ లైన్ ద్వారా కొనుగోలు ప్రారంభించి వ్యాపారం అభివృధ్ధి చేసారు మిత్రులు ఇరువురు .

ఒకరోజు ఇంట్లో భోజనం వడ్డిస్తున్న విహన్ అమ్మగారు " నాయనా మనదగ్గర చాలాధన ఉంది ఊమ్మడిగా మీరు నడిపే అంగడిలో ఇంత లాభాలు వస్తున్నాయి కదా దాన్ని మనమే ఎందుకు సొంతంగా నిర్వహించుకోకూడదు? " అన్నది.

"నిజమే నీకు ఎంత ధనం కావాలో తీసుకో మనేమే సొంత వ్యాపారం చేద్దాం జివితేష్ ఆషాపు తీసుకున్నా సరే లేదంటే తనవాటా ధనం తీసుకుని వెళ్ళినా సరే "అన్నాడు విహన్ తండ్రి.

వారి మాటలకు ఎదురు చెప్పలేని విహన్ జివితేష్ వద్ద ఈవిషయం ప్రస్తావించాడు ,తొలుత నివ్వెరపోయిన జివితేష్ వారంలోపే విహన్ కు ఇవ్వవలసిన ధనం ఇచ్చి పంపాడు.

వెంటనే ఆపరిసరాల్లోనే మరో అంగడిలో అదేవ్యాపారం ప్రారంభించాడు విహన్ .

రెండునెలలోపే వ్యాపారం గిట్టబాటు కావడం కష్టమైనది. అంగడి అద్దె,పనివాళ్ళ జీతాలు ,కరెంటుబిల్లు తలకుమించిన భారం అయ్యాయి ,మరుసటినెలలో అంగడిమూసివేసాడు విహన్ ,మరుదినమే తన అంగడికూడా మూసివేసాడు జివితేష్ .

ఒకరోజుమిత్రులు ఇద్దరూ పార్కులో సాయంత్రవేళ కలుసుకున్నారు.

" జివితేష్ నన్ను క్షమించరా చెప్పుడు మాటలు చేటు అని తెలియక తప్పుగా ప్రవర్తించి నీకు ఇబ్బంది కలిగించాను మనం చిన్నతనంలో బంగారు బాతుగుడ్డు కథలో ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేదట అత్యాశపరుడైన ఆబాతు యజమాని బాతు పొట్టలో ఎన్ని బంగారు గుడ్లు ఉనన్నాయో అని బాతును చంపి దాని పొట్టకోసి చూసాడట దానిలో ఆరోజు పెట్టవలసిన గుడ్డు మాత్రమే ఉందట తన దురాశకు చింతించిడట బాతు యజమాని అలా ఉంది ఇప్పుడు నాపరిస్ధాతి నీస్నేహం నాకుకావాలి " అన్నాడు విహన్ .

" విహన్ ప్రతి తల్లి,తండ్రి తమబిడ్డ ఎదుగదలను ఆశిస్తారు అదిసహజం అందులో ఎటువంటిడ తప్పులేదు,ఆశ మనిషిని ముందుకు నడిపిస్తే పేరాశ మనిషిని అంధుడిని చేస్తుంది చేజారిన ధనాన్ని ,కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి కాలక్రమంలో పొందవచ్చు కానీ కోల్పోయిన స్నేహాన్ని తిరిగి పొందడం అసాధ్యం.ఎవరికి చెప్పుకోలేని విషయాలు స్నేహితునితో మాత్రమే పంచుకోగలం అసలు స్నేహనికి రంగురూపం ఉంటే మల్లెకన్నా తెల్లగా,మంచుకన్నా చల్లగా ,తేనె కన్నా తీయగా ఉంటుంది " అన్నాడు జివితేష్ .

తేలికపడిన మనసులుతో మిత్రులు ఇరువురు భుజాలపై చేతులు వేసుకుని పార్కు వెలుపలకు నడవసాగారు.

మరిన్ని కథలు

Bheemarao Tindi
భీమారావు తిండి
- మద్దూరి నరసింహమూర్తి
Aashrayam
ఆశ్రయం
- సి.హెచ్.ప్రతాప్
Parivartana
పరివర్తన
- డా.సి.యస్.జి.కృష్ణమాచార్యులు
Repati bhrama
రేపటి భ్రమ
- సి.హెచ్.ప్రతాప్
Arishadvargalu
అరిషడ్వర్గాలు
- సి.హెచ్.ప్రతాప్
Anumounam
అను"మౌ"నం
- దేవరకొండ ఫణి శ్యామ్