భారత ఖండంలో ఎన్నో రాజ్యాలు గలవు వాటిల్లో గిరిధరము ,శక్తిపురము ఇవి రెండూ చాలా చిన్న రాజ్యాలు. కానీ ధర్మ పరిరక్షణ ,దైవభక్తి, నిరంతర సేవా కార్యక్రమాలు ఈ రెండు రాజ్యాల్లో ఎంతో విశేషంగా జరుగుతూ ఉండేది .గిరిధరాన్ని పరిపాలించే రాజు గజేంద్రుడు శక్తి పురమును సింహబలుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు ఈ రెండు రాజ్యాలకు నారాయణ ముని కుల గురువు. ఈ రెండు రాజ్యములలో గిరి ధర ములో శివార్చన శివ పూజ ఎంతో విశేషంగా జరిగేవి శక్తిపురంలో విష్ణువు అర్చన నారాయణుని పూజలు ఎంతో ఘనంగా జరిగేవి.
ప్రస్తుతం పరిపాలిస్తున్న రాజుల పూర్వీకుల మధ్య శివకేశవుల్లో ఎవరు గొప్ప అనే వివాదం చెలరేగింది ఆ వివాదం యుద్ధానికి దారి తీసింది .ఈ యుద్ధ నివారణకు నారాయణ ముని శివకేశవుల అభేదతత్వాన్ని ఇరు రాజులకు తెలియజేశారు. హరిహరులు వేరు కారు ఇరువురు ఒక్కరే అనే విషయం తెలుసుకున్న రాజులు ఇరువురు ఎంతో సంతోషించారు తమ యుద్ధాన్ని నివారించిన నారాయణ ముని ని తమ రెండు రాజ్యాలకు కుల గురువుగా ఉండాలని అభ్యర్థించారు వారి అభ్యర్థన మన్నించి ఆ రోజు నుంచి నారాయణమునే ఈ రెండు రాజ్యాలకు కుల గురువుగా వ్యవహరిస్తున్నారు.
హరిహరులు ఒకటే అన్న విషయం తెలుసుకున్న రాజులు ఇరువురు శక్తి పురం లో ఉండే నారాయణని విగ్రహాన్ని గిరిధరంలో గిరిధరంలో ఉండే శివలింగాన్ని శక్తి పురంలో లో ప్రతిష్టించి శివ కేశవులు అభేద తత్వాన్ని చాటారు. అటు పిమ్మట ఇరు రాజ్యాలలో శివకేశువుల అర్చన విశేషంగా జరిగేది తమ పూర్వీకులు సాంప్రదాయాన్ని అనుసరిస్తూ కుల గురువు సూచనలతో మరింత విశేషంగా శివకేశవుల అర్చనలు జరుపుతున్నారు గజేంద్రుడు ,సింహబలుడు. శివ కేశవులు అభేదాన్ని పాటిస్తూ అర్చనలు జరిగే చోట ఏ విధమైన సమస్యలు ఉండవు అంతా శుభమే జరుగుతుంది.
నిత్య శివ కేశవులఅర్చనలు, తమ రాజ్య పరిపాలనలో ఇరువురు రాజులు జనరంజకంగా పరిపాలిస్తూ ఇదంతా శివ కేశవుల అనుగ్రహం అని భావించేవారు. శివ కేశవులు అనుగ్రహంతో వారికి ఎన్నో దివ్య అస్త్ర శాస్త్రాలు కూడా లభించాయి. ఎంతో నిష్టతో పూజిస్తున్న ఈ ఇరువురి రాజులను సాక్షాత్తు ఆ హరిహరులే వీరి భక్తిని పరీక్షించదలిచారు . ఆ పరీక్షలో భాగంగా విష్ణు మాయతో ఒక అందమైన స్త్రీ సృష్టించబడింది ఆ స్త్రీకి గుణవతి అని నామకరణము చేసి ఇరువురు రాజుల వద్దకు వెళ్లి పరీక్షించమని ఆదేశించారు. హరిహరుల ఆదేశానుసారం గుణవతి ఇరువురు రాజులను పరీక్షించదలచి వచ్చింది. ఒకరోజు ఇరువురు రాజులు కలిసి అడవిలో క్రూర మృగాలను వేటాడుటకు వెళ్లారు వేటాడి అలసిన వారికి బాగా దాహం వేసింది చుట్టుపక్కల నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయా అని చూడ సాగారు .ఆ సమయంలో గుణవతి కుండ నిండా నీళ్లు తీసుకుని వెళుతూ వారికి కనిపించింది.
ఆ సుందరిని ఆపిన రాజులు ముందు తమ గురించి చెప్పి ఆ తరువాత. సుందరి నీ పేరేమి ఈ అడవిలో ఎక్కడ ఉంటున్నావు ఈ చుట్టుపక్కల నీళ్లు ఎక్కడైనా లభిస్తాయి అని అడిగారు. ఇరువురు రాజుల ప్రశ్నలకు సమాధానంగా తన పేరు గుణవతి అని తాను ఒక దేవలోక కన్యనని భూలోక అందాలు తిలకించటానికి ఇక్కడికి వచ్చానని ఇక్కడ కొంత దూరంలో ఒక చిన్న ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నానని ఇక్కడ సమీపంలోని ఒక మంచి నీటి చెరువు ఉందని ఐనా మీరు మహారాజులు గనక మీకు నా వద్ద ఉన్న నీళ్లు ఇస్తానని ఇచ్చింది .ఆ నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకున్న రాజులు ఎంతో సంతోషించి గుణవతికి ధన్యవాదాలు తెలిపారు .
గుణవతి చూపు ,మాట ఇరువురు రాజులను ఆకర్షించింది. ఇరువురు రాజులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు అయినా వారి మనసులో గుణవతి జ్ఞాపకాలే మెదల సాగాయి. గుణవతిని చూడాలని కాంక్షతో ఒకనాడు గజేంద్రుడు ఇంతకుముందు ఎక్కడ కలుసుకున్నారోఅక్కడకు వెళ్లి చుట్టుపక్కల వెతకగా ఒక చిన్న ఆశ్రమంలో గుణవతి గజేంద్రునికి కనిపించింది గుణవతిని చూసి గజేంద్రుడు గుణవతి తో నిన్ను నేను పెళ్లి చేసుకోవాలని అని అనుకుంటున్నాను అన్నాడు ఆ మాట విన్న గుణవతి సంతోషించింది అయితే ఒక షరతు మీద మాత్రమే అంగీకరిస్తాను అంది శక్తిపురాన్ని జయించి అలాగే విష్ణు పూజ మానేయాలని ఈ షరతు అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని గజేంద్రునితో అంది వెనకాముందు ఆలోచించకుండా గుణవతికి మాటిచ్చాడు .
మర్నాడు సింహబలుడు గుణవతి ఉండే ప్రాంతాన్ని తెలుసుకుని కనిపెట్టి వచ్చాడు గజేంద్రుడు చెప్పినట్టుగానే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. గజేంద్రునికి చెప్పినట్టుగానే సింహబలునికి కూడా గిరిధరాన్ని జయించి శివ పూజ మానివేస్తే పెళ్లి చేసుకుంటానని అంది. గుణ వతి వ్యామోహంలో సింహబలుడు కూడా గజేంద్రుని వలే మాటిచ్చాడు. ఇరువురు రాజులు ఇలా గుణవతికి మాటిచ్చి శివ కేశవులు పూజ మానేశారు. శివ కేశవుల మధ్య భేదాన్ని పాటించ సాగారు .గుణవతికి ఇచ్చిన మాట ప్రకారం యుద్దానికి సన్నద్ధమయ్యారు ఈ విషయాలన్నీ నారాయణమునికి తెలిసినా హరిహరుల పరీక్ష అని గుర్తించి వారిని నివారించే ప్రయత్నం చేయలేదు. గుణవతి వ్యామోహంలో శివ కేశవుల పూజ మానేసి రెండు రాజ్యాలు యుద్ధానికి తలపడ్డాయి యుద్ధం భీకరంగా ఐదు రోజులు సాగింది .అపార సేనా నష్టం జరిగింది చివరి రోజు సింహబలుడిని సంహరించాలని శివబాణాన్ని గజేంద్రుని సంహరించాలని సింహబలుడు విష్ణువు బాణాన్ని ప్రయోగించారు రెండు బాణాలు ఢీకొని యుద్ధ రంగంలో ఒక అపూర్వ కాంతి గోచరించింది. ఆ కాంతి పుంజం మధ్య ఒకపక్క హరి మరోపక్క హరుడు కలిసిన దివ్య రూపం ఇరువురు రాజులకు దర్శనమిచ్చింది. హరిహర మూర్తిని చూసి భక్త్యావేశంతో ఇరువురు రాజులు స్తుతించారు. వారి ప్రార్థన ఆలకించిన హరిహరులు వారిని అనుగ్రహించారు.
సింహబలుడు కి గజేంద్రునికి దివ్య ఉపదేశం చేశారు మేము ఇరువురు ఒక్కరమే మా మధ్య భేదాన్ని పాటించరాదు ఎంతో కాలంగా మా అర్చనలు చేసిన మిమ్ముల్ని పరీక్షించదలిచే.గుణవతిని సృష్టించాము మీరు గుణవతి మాయలో చిక్కి మమ్మల్ని పూజించటం మానేసి ఇరువురు యుద్ధానికి దిగారు. మమ్మల్ని పూజించిన చోట సుఖశాంతులు లభిస్తాయి మా పరీక్ష అని గ్రహించక మీరు ఇలా ప్రవర్తించారు ఇలా ఇంకెప్పుడూ చేయకండి అని హెచ్చరించి మరణించిన సైన్యాన్ని తిరిగి బ్రతికించారు .హరిహర మూర్తిగా సాక్షాత్కరించిన శివ కేశవులను భక్తితో స్తుతించారు తమ రాజ్యాలలో ఈ రూపంలో వెలసి పూజలు అందుకోమని అర్థించారు తాము చేసిన తప్పు ను క్షమించమని వేడుకున్నారు. రాజులు ఇరువురిని శివకేశవులు క్ష మించారు వారి కోరికను మన్నించి ఇరు రాజ్యాల మధ్యలో హరిహర మూర్తిగా వెలిశారు ఆ మూర్తికి ఇరువురు రాజులు ఆలయాన్ని నిర్మించారు .ఎంతో భక్తి భావంతో ,శ్రద్ధతో ఆ హరిహర మూర్తిని పూజించారు. హరిహరల కృపాకటాక్షంతో ఇరువురు రాజులకు చక్కని భార్యలు లభించారు పుత్రులు జన్మించారు రెండు రాజ్యాలు సకల సంపదలతో భోగభాగ్యాలతో వర్ధిల్లింది. భక్తి పరీక్షలో మొదట ఓడిన తన భక్తులను భగవంతుడే మళ్లీ హితోపదేశం చేసి మంచి మార్గంలో నడిపించి గెలిపించాడు.

