అమరావతి అరణ్యంలో నీటికొరత ఏర్పడటంతో అడవిలోని జంతువులన్ని నీటిజాడ వెదుకుతూ అడవి ఎగువున ఉన్న కృష్ణానది తీరానికి బయలు దేరాయి. ఎండవేడికి జంతువులన్ని పెద్దమర్రిచెట్టు నీడనచేరి విశ్రాంతి తీసుకోసాగాయి.
" మిత్రులారా మనకు ఇప్పుడు అనుభవశాలి,పెద్దవాడు అయిన ఏనుగు తాత కథ చెప్పవలసిందిగా మీఅందరితరుపున నేను కోరుతున్నాను "అని ఓడ్రపెట్టాడు గాడిద.
" సరే నేను చెప్పే ఈకథలో వచ్చే చిక్కు ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలి ... కళింగ రాజ్యంలో జయంతుడు,విజయుడు,గుణకీర్తి , సుమంతుడు అనే నలుగురు బాల్య మిత్రులు విడిపోయి విద్యాభ్యసించి చాలా ఏళ్ళ అనంతరం ధరణికోట రాజ్య అడవిలోఓచోట కలుసుకున్నారు,రాత్రి కాబోతున్నందున చితిమంట ఏర్పాటీ చేసుకుని ,రాత్రి సమయాన్ని నాలుగుభాగాలు చేసుకుని కృరముృగాలు తమని తాకకుండా కావలికాయాలి అనినిర్ణయించుకున్నారు,
మొదట జయంతుడు తన వంతుగా కావలికాస్తూ ,సమీపంలో నేలపైపడి ఉన్న ఎండుచెట్టిను తను నేర్చిన విద్యతో చక్కని రూపం కలిగిన స్త్రీగా మలచి,విజయుని కాపలా ఉంచి తను నిద్రపోయాడు.
జయంతుడు చెక్కిన విగ్రహనికి విజయుడు అందమైన వస్త్రాలు ధరింపజేసి, గుణకీర్తిని కావలి ఉంచి తను నిద్రపోయాడు.
అక్కడఉన్న విగ్రహన్ని చూసిన గుణకీర్తి ఆవిగ్రాహనికి అద్బుతిమైన నగలు ధరింపజేసి,కావలికి సుమంతుని నిద్రలేపి తను నిద్రిపోయాడు.
సుమంతుడు అక్కడ ఉన్నఅపురూప లావణ్య వతి ఆయిన విగ్రహన్నిచూసి దానికి తను నేర్చిన విద్యద్వారా ప్రాణంపోసాడు,
తెల్లవారింది.
ఆసౌందర్యరాశిని వివాహం చేసుకోవడానికి ఆనలుగురు వాదులాడుకోసాగారు ఆమెను వివాహం ఎవరు చేసుకోవడం న్యాయమో మురు చెప్పండి "అన్నాడు ఏనుగుతాత.
" ఆసౌందర్యరాసిని నలుగురు మిత్రులా సమిష్టిగా సృష్టించారు వారిలో ఆమెను వివాహం చేసుకోవడానికి ఎవరికి అర్హత ఉన్నదో నేను తెలియజేయజేస్తాను రూపాన్ని ఇచ్చిన జయంతుడు,ప్రాణంపోసిన సుమంతుడు ఆమెకు తండ్రి సమానులే "అన్నాడు గుర్రం.
" అందమైన ఆయువతికి అద్బుతమైన నగలు అమర్చిన గుణకీర్తి ఆమెకు సోదర సమానుడు "అన్నాడు నక్క.
" ఓరి తిక్కల మొహల్లారా మీతెలివి తెల్లవారినట్లే ఉంది ,ఐనా నాలాంటి మేధావి ఉండగా మీకెందుకు దిగులు నేనే ముందు చెపుదామనుకున్నా,ఐనా మీలో ఎందరికి తెలివితేటలు ఉన్నాయో చూద్దామని ఇప్పటిదాకా మౌనంగా ఉన్నాను ,వస్త్రాలు ఇచ్చి ఆమెకు రక్షణ కలిగించిన జయంతుడు అమెను వివాహం ఆడటం న్యాయం "అన్నాడు కోతి.
" తిక్కలోడు తిరునాళ్ళకుపోతే కొండ ఏక్క దిగ సరిపోయిందంట , అలాఉంది నీతీర్పు చివరకు మిగిలినవాడు జయంతుడు కాబట్టి చెప్పగలిగావు బడాయి కోతిబావ "అన్నది రామచిలుక.
ఫక్కున నవ్విన జంతువులన్ని నీటిని వెదుకుతూ ముందుకు దారితీసాయి.

