దొంగ దొంగ పట్టుకోండి అంటూ. రాజీవ్ ను పదిమంది వెంబడిస్తున్నారు. ముసుగు వేసుకుని ఉన్న రాజీవ్ వెంబడిస్తున్న వారికి కనపడలేదు తాను దొంగతనం చేసిన పరుసు నుంచి డబ్బులు తీసుకుని ఆ పరుసు అక్కడే పారేశాడు . వెంబడిస్తూ వచ్చిన వారికి డబ్బులు లేని పరుసు దొరికింది. రాజీవ్ దొంగలించిన డబ్బుతో అనాధలకు బట్టలు కొనిపెట్టాడు .డబ్బున్న వారి వద్ద దొంగతనం చేస్తూ దొంగలించిన డబ్బుతో అనాధలకు పేదవారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాడు 80 కి పైగా దొంగతనాలు చేశాడు. ఒక డబ్బున్న అమ్మాయి దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టేయబోయి తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు .అమ్మాయి వివరాలు తెలుసుకున్నాడు. అమ్మాయి పేరు రమ్య పెద్ద వ్యాపారవేత్త కూతురు రమ్యకు పేదలకు అనాధలకు సేవ చేయటం ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఇష్టం రాజీవ్ చేసే సేవను చూసి రమ్య రాజీవును ప్రేమిస్తుంది. కూతురి ఇష్టం కాదనలేక రాజీవ్ తోనే పెళ్లి జరిపించాడు రమ్య తండ్రి. కొంతకాలం ఆనందంగానే సాగింది. నిరుపేద అయిన రాజీవ్ కు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అని రమ్యకు అనుమానం కలిగిన ఏదో ఒకటి చెప్పి దాటవేసేవాడు రాజీవ్. రాజీవ్ ప్రవర్తన పై రమ్యకు కలిగిన అనుమానం నిజమైంది. ఒకరోజు బజారులో ఓ కోటీశ్వరుడి పరుసు కొట్టేస్తూ కనిపించాడు .రాజీవ్ ను వెంబడిస్తున్న వారికి చిక్కడు దొరకడు కానీ దొంగలించిన పరుసు దొరుకుతుంది అందులో డబ్బు ఉండదు . ఆ డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తాడు రాజీవ్ ప్రవర్తన పూర్తిగా తెలుసుకున్న రమ్య తాను మోసపోయానని గ్రహించి ఎంతగానో బాధపడింది. తన భర్తను మార్చుకోవాలని నిర్ణయించుకుంది .ఒకరోజు నేరుగా రాజీవును నిలదీసింది. అందుకు సమాధానంగా తన చిన్నతనంలో జరిగిన సంఘటన చెప్పాడు. జమీందారీ సంస్థానంలో నా తండ్రి ఉద్యోగి . తన చెల్లి పెళ్లి ఖర్చులకోసం తాను పనిచేసే జమీందారు గారి వద్ద తాత ముత్తాతల నుంచి వస్తున్న పొలాన్ని తాకట్టు పెట్టాడు మా అత్త పెళ్లిని ఘనంగా జరిపించాడు మా నాన్న . దురాశపరుడైన జమిందార్ నా తండ్రి తాకట్టు పెట్టిన పొలంతోపాటు వడ్డీ కింద ఇంటిని మొత్తాన్ని జప్తు చేసుకున్నాడు జమీందారును నిలదీసి ప్రశ్నించినందుకు నా తల్లిని తండ్రిని చంపించాడు. అన్నీ ఉన్నా అనాధను చేసినందుకు జమీందారు పై ఎంతో కోపాన్ని పెంచుకున్నాను. అలాగే ఇలాంటి ఎన్నో సంఘటనలు విన్న నేను డబ్బున్న వారిపై ద్వేషాన్ని పెంచుకొని ఇలా దొంగతనాలు చేస్తూ పేదలను పోషిస్తున్నానని తన గతాన్ని మొత్తం రమ్యకు చెప్పాడు. ఎక్కడో కొన్ని సంఘటనలకి మొత్తం డబ్బున్న వారందరినీ దోషిగా చేస్తావా రాజీవ్ అని రమ్య ప్రశ్నించింది .రాజీవ్ వద్ద సమాధానం లేదు . చదువు లేని నేను ఇదొక్కటే మార్గం అని ఎంచుకున్నాను నన్నేం చేయమంటావ్ అంటాడు రాజీవ్. దొంగ తనం తప్పని కష్టపడి సంపాదించి పేదలకు దానం చేయడంలో ఉండే సంతోషం మరి ఎందులోనూ లేదని తన భర్తకు రమ్య చెప్పింది. తాను చేసే వ్యాపారంలో సహాయం గా ఉండమని అడుగుతుంది అందుకు ఒప్పుకున్న రాజీవ్ రమ్య చేసే వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటూ రమ్య సహకారంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ వరకు చదువుకుని . రమ్య ప్రారంభించిన వ్యాపారాన్ని తానే నిర్వహించసాగాడు. ఎంతో ఆదాయాన్ని అందుకున్న రాజీవ్ రమ్యతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు పేద విద్యార్థులను చదివిస్తూ పేదవారికి వైద్యం చేయించాడు నాడు తన భార్య కష్టపడి సంపాదించిన డబ్బుతో చేసే సేవ ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్న మాట నిజమని గ్రహించాడు. కానీ ఇప్పుడు రాజీవ్ కి ఒక చిన్న బాధ. తాను చేసిన దొంగతనాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుని ఎంతో మదనపడ్డాడు బిజినెస్ ఫైల్ కనిపించక ఒకరోజు ఇల్లంత వెతుకుతున్న రాజీవ్ కి తన పాత డైరీ దొరికింది ఆ డైరీలో ఏ ఏ రోజు ఎన్ని దొంగతనాలు ఎంత మొత్తం దొంగలించానో రాసుకున్నాడు దొంగలించిన పరుసులు ఆధారంగా కొందరు పేర్లు కూడా లభించాయి. ఆ పేర్లు వివరాల ఆధారంగా వారిని వెతికి వారి ఇళ్లకు వెళ్లి నాడు మీ వద్ద దొంగతనం చేశానని అందుకు క్షమించమని తాను దొంగలించిన సొమ్మును తిరిగి ఇచ్చి .తన జీవితంలో జరిగిన విశేషాలను వారికి వివరించాడు. అందుకు ఆనందించిన వారు ఎందరో దొంగల్ని చూశాం గానీ నీలాంటి మంచి దొంగను చూడలేదని ప్రశంసించారు. అందుకు రాజీవ్ ఎంతగానో ఆనందించి దొంగను మంచి దొంగగా మార్చిన తన భార్యని ఎంతగానో మెచ్చుకున్నాడు . ఈ మంచి దొంగ మంచి భర్తగా గొప్ప వ్యాపారవేత్తగా రాణించాడు..

