"అమ్మ! స్రవంతి తెల్లవారి నుండి పచ్చి మంచి నీళ్లు అయినా ముట్టుకోలేదు.. వచ్చి తినమ్మా" అంటూ బతిమిలాడింది సావిత్రి… “ఆకలి లేదమ్మా నన్ను కాసేపు ఇలా ఒంటరిగా వదిలేయ్” అంటూ బదులిచ్చింది స్రవంతి. “ఆకలి ఏం వేస్తుందె జీవితం ఒక ప్రశ్న గా మారక కాసేపు బిడ్డను ఒంటరిగా వదిలేయ్” అంటూ కళ్ళలో నీళ్లు తిప్పుతూనే చెప్పాడు రాఘవయ్య…… “అలా ఎలా వదిలేస్తాం అయ్యో బిడ్డ ఏం కావాలి, మంచి ఉద్యోగం, సొంత ఆస్తులు ఉన్నాయి బిడ్డ బతుకు బాగుంటుంది అని ఉన్న పొలం, ఇల్లు అమ్మి మరి బిడ్డ పెళ్లిచేసం.. పెళ్ళి అయ్యి ఆరు నెలలు కూడా కాలే, బిడ్డ బతుకు బుగ్గిపాలు చేసాడు ఆ నీచుడు…కళ్ళు తుడుచుకుంటూ అంది సావిత్రి. ఏం చేసేదే అంత మన కర్మ, తలకు మించిన భారం వొద్దని స్థాయి కి తగ్గ సంబంధం చుసుకోమని అందరు చెప్పిన విని చావలేదు “బతుకు బాగుంటుందనే ఆలోచించం తప్ప బిడ్డ బతుకే ప్రశ్న అవుతుంది” అని అనుకున్నామా ఏ జన్మ లో నేను చేసిన పాపమో బిడ్డ కి తగిలింది అంటూ తల కొట్టు కున్నాడు రాఘవయ్య….. స్రవంతి ఒక మంచి అమ్మాయి, ఆటపాటలలో, చదువు లో ఇలా ఎందులో చుసిన ముందుతుంది, ఒక్కగానా ఒక్క బిడ్డ కావడం వల్ల స్రవంతి కి ఏ లోటు లేకుండా పెంచారు సావిత్రి,రాఘవయ్యలు. బీటెక్ దాక చదివింది, ఊర్లోనే ఒక బ్యాంకు లో ఉద్యోగం చేస్తూ, ఖాళీ సమయాల్లో అమ్మానాన్న లకు పొలం పనులు ఇంటి పనులలో సాయం చేసేది, చక్కనైన రూపం,పెద్దలంటే గౌరవం, అందిరిని కలుపుకునే గుణం కావడం చేత ఎన్నో సంబంధాలు వచ్చేవి కానీ ఏది రాఘవయ్యకి సంతృప్తిగా అనిపించలేదు..ఎప్పుడు సంబంధాలు దూరపు చుట్టం ఒకతను “ఒక సంబంధం ఉందని అబ్బాయి పేరు “సూర్య” అని తనకు తెలిసిన వాళ్ళు తెచ్చారని.. కాకపోతే కట్నం ఎక్కువని, తలకి మించిన భారం వద్దని మనం ఇంకో సంబంధం చుసుకుందామని, పైగా వాళ్ళు ఇక్కడివాళ్ళు కాదని” ముందుమాటగానే చెప్పాడు. కానీ అబ్బాయికి మంచి ఉద్యోగం లక్షల్లో జీతం సొంత ఇల్లు, పైగా అబ్బాయి ఒడ్డు ఎత్తు పొడవు, తెల్లగా అందంగా ఉన్నాడు, ఇడు జోడు బాగుంటుంది అని, బిడ్డకి అందరిలో గౌరవం ఉంటుంది అని ఆ సంబంధమే కావాలని పట్టుపట్టాడు. రాఘవయ్య ఎం చేసిన కూతురు మంచికోసమే అని సావిత్రి కూడ మారుమాట ఆడలేదు, తల్లితండ్రుల ఇష్టమే తన ఇష్టంగా స్రవంతి కూడా మీ ఇష్టమే అని చెప్పేసింది. మాట మంచి అన్ని అయిపోయవి, రాఘవయ్య తన పొలం, ఇల్లు అమ్మి తెలిసిన వాళ్ళదగ్గర అప్పు చేసి సూర్య కి కట్నం ఇచ్చాడు, తెలిసిన వాళ్ళందరిని పెళ్ళికి పిలిచి అంగరంగ వైభవంగా స్రవంతి పెళ్లిచేసాడు,పెళ్ళి అయ్యాక స్రవంతి సూర్యతో పాటు బెంగళూరు వెళ్ళిపోయింది.చుట్టూ పక్క గ్రామాలలో రాఘవయ్య కూతురికి జరిపిన పెళ్ళి గురించే చాలా కాలం మాట్లాడకున్నారు. కోటి ఆశలతో కొత్త జీవితంలోకి స్రవంతి అడుగు పెట్టింది, సూర్య స్రవంతి ని చాలా ప్రేమగా చిన్న పిల్లల చూసుకునేవాడు, తల్లితండ్రులకు సూర్య గురించి చెప్తూ స్రవంతి మురిసిపోయేది, కూతురుని అల్లుడు బాగా చుసుకుంటున్నాడు అని సావిత్రి, రాఘవయ్యలు బంధువులు అందరికి చెప్తూ గర్వపడేవాళ్ళు.కాని ఆ సంతోషం స్రవంతి కి ఎక్కువ కాలం మిగలలేదు, సూర్య స్రవంతి ని దూరం పెట్టడం మొదలుపెట్టాడు, సరిగా పట్టించుకోడం లేదు, ఇంటికి ఒకొక్కసారి వారం రోజులు అయినా కూడా వచ్చేవాడు కాదు ఊరు కాని ఊరులో ఎవరు తెలియని దగ్గర స్రవంతి ఒంటరిగా ఫీల్ అయ్యేది, “ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పితే కంగారు పడతారని వర్క్ టెన్షన్ వల్ల సూర్య ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అంత సర్దుకుంటుందని” స్రవంతి తనకు తను సర్దిచెప్పుకునేది. ఒక రోజు స్రవంతి క్లాసుమేట్ దివ్య కాల్ చేసి “స్రవంతి బెంగళూరులో ఉంటున్నావ్ అంట, నేను కూడ ఇక్కడే సెటిల్ అయ్యో, కుదిరితే రావే మనం కలుద్దాం కలిసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందే, కాలేజ్ అయ్యాక కనీసం కలిసింది లేదు”అంటూ చెప్పింది.. “నిజమే నాకు నిన్ను కలవాలి అనే ఉంది కానీ నాకు ఇక్కడ ఎం తెలీదే నేను వచ్చి ఆరు నెలలు అవుతుంది బయటికి వెళ్ళింది లేదు” అంటూ బదులిచ్చింది స్రవంతి…. “సరే నువ్వు అడ్రస్ చెప్పు నేనే వస్తా” అని దివ్య. స్రవంతి ఇంటికి వచ్చింది దివ్య.. ఒంటరిగా ఉండి ఎం తోచక ఉంటున్న స్రవంతి దివ్య రాక కొంచం ఊరట కలిగింది. ఇద్దరు కాలేజ్ డేస్ గుర్తు తెచ్చుకొని, ఒకరిని ఒకరు ఆటపాట్టిస్తు గడిపారు.. ఇంతలో దివ్య “ని పెళ్లికి ఎలానో రాలేదు కనీసం మీ హస్బెండ్ ని అయినా పరిచయం చేస్తావా అని అడిగింది. “అతను వర్క్ బిజీ లో ఉన్నాడు ఇంట్లో లేరు” అంటూ దివ్య వెనక పక్కన గోడమీద ఉన్న సూర్య ఫోటో ని చూపెట్టింది…దివ్య ఆ ఫోటో ని చుడగానే “ఇతను మీ హస్బెండ్ ఏంటి తను రేఖ వాళ్ళ హస్బెండ్ మా పక్క ఫ్లాట్లో ఉంటారు” అని ఆశ్చర్యంగా అడిగింది.. ఆ మాటలకు స్రవంతి గుండె ఆగిన పని అయ్యింది, “నువ్వు ఎవరినో చూసి పొరపాడినట్లు ఉన్నావ్ ఇతను నా భర్త” అని అయోమయం గా చెప్పింది స్రవంతి. లేదు స్రవంతి వీళ్ళు మా పక్క ఫ్లాట్ లో ఉంటారు వాళ్ళ కి పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది అంటూ “రేఖకి ఫోన్ చేసి ఒకసారి మీ ఫ్యామిలీ ఫోటో పెట్టావా” అని అడిగింది. రేఖ పంపిన ఫోటో చుడగానే స్రవంతి గుండె పగిలింది తను మోసపోయానని అర్ధమయ్యింది, ఒక్క క్షణం స్రవంతికి ఎం అర్ధం కాలేదు,సూర్య ఎందుకు దూరం గా ఉంటున్నాడో అర్ధమయ్యింది. “నాకే ఎందుకు ఇలా అయ్యింది, నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చెయ్యలేదే”అంటూ దివ్యని పట్టుకొని ఏడ్చింది, స్రవంతి ని అలా చూసేసరికి దివ్య కి ఎం చెప్పాలో తెలియలేదు, మనం రేఖ ని కలిసి ఈ విషయం చెప్పాలి అంటూ స్రవంతి కి చెప్పింది. స్రవంతి దుఃఖన్ని దిగమింగుకొని తన లాగే రేఖకి కూడా అన్యాయం జరిగింది అని, దివ్య తో కలిసి రేఖ ఇంటికి బయలుదేరింది దివ్య స్రవంతి ఇద్దరు రేఖ ఇంటికి వెళ్లారు, అక్కడ సూర్య రేఖ తో కలిసి దిగిన ఫోటో లు చూసేసరికి స్రవంతి కళ్ళలో నీళ్లు తిరిగాయి…స్రవంతిని అలా చూసేసరికి… ఇక ఆలస్యం చెయ్యకూడదని, “రేఖ నీకో విషయం చెప్పాలి తిను నా ఫ్రెండ్ స్రవంతి, ఈ మధ్యనే పెళ్ళి అయ్యింది కాకపోతే…మీ హస్బెండ్ సూర్య గా పేరుమార్చుకొని తినని పెళ్ళి చేసుకున్నాడు” అంటూ స్రవంతి పెళ్ళి ఫోటో లను చూపించింది…. వాటిని చూసేసరికి రేఖ కి ఎం అర్ధం కాలేదు తను ఉండగా ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లిచేసుకుంటాడని.. ఒక్కసారిగా నెల కూలింది.. రేఖ ని చూస్తా స్రవంతి కూడా బాధను దయలేకపోయింది గట్టిగ ఏడవడం మొదలుపెట్టింది.. దివ్య ఇద్దరిని ఓదార్చుతు “జరిగిన దానిని ఎవరు మార్చలేము, జరగబోయేదాని గురించి ఆలోచించండి,రేఖ నీకు తనకి పెళ్ళి అయ్యి 3 ఏళ్ళు అవుతుంది,అయినా తను సూర్య అనే పేరుతో స్రవంతి ని నమ్మించి మోసం చేసాడు అతనికి చట్టప్రకారం శిక్ష పడాలి”అని అంది… నీకు తెలిసిందేగా అతను ఎప్పుడు వస్తాడో అన్నది తెలియదు ఒక్కోసారి నెలలు తరబడి ఇంటికి రాకుండా ఉంటారు, 3 నెలలు అవుతుంది ఇంటికి వచ్చి అని ఏడుస్తూ చెప్పింది రేఖ.. “ఉంటే స్రవంతి దగ్గర ఉండాలి లేదా ని దగ్గర ఉండాలి ని దగ్గర కూడా లేదంటే తనకి ఇంకో భార్య ఉంది ఉంటుందా” అని అనుమానం గా అన్నది దివ్య. ఆ మాటలకూ స్రవంతి, రేఖ మూగబోయారు, దివ్య అనుమానం కూడా నిజమేనేమో అని తమ దుఃఖన్ని దిగమింగుకొని తమల ఇంకో ఆడది మోసపోకూడదు అని పోలీస్ కంప్లీట్ ఇద్దాం అని నిర్ణయించుకున్నారు….ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ్మ పెళ్ళి ఫొటోలు, పెళ్ళి కార్డులు, వీడియోలు అన్ని సాక్షాలు కింద పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ కి అప్పగించారు. “భారతదేశ చట్టాల ప్రకారం... మొదటి భార్య బ్రతికి ఉండగా, ఆమెకు విడాకులు ఇవ్వకుండా భర్త రెండో పెళ్లి చేసుకోవడం తీవ్రమైన నేరం (దీనిని ద్విభార్యాత్వం/Bigamy అంటారు).అని BNS) సెక్షన్ 82 ప్రకారం ఎస్.ఐ కేసు ఫైల్ చేసి స్రవంతి, రేఖ లకు న్యాయం జరిగేలా చేస్తామని మాట ఇచ్చాడు.. కొన్ని రోజుల తరువాత సూర్య ఆచూకీ పోలీసులకి తెలిసింది,పోలీస్ ల ఇన్వెస్టిగేషన్లో సూర్య కి 5పెళ్లిళ్లు అయినట్లు డబ్బుకోసం తను నిరంతరం పెళ్లిళ్లు చేసుకుంటున్నాట్లు,ఇప్పుడు ఇంకో పెళ్ళికి సిద్దమైనట్లు తెలిసింది, వెంటనే స్రవంతి మరియు రేఖ కి పోలీస్ స్టేషన్ కి రమ్మని ఫోన్ వచ్చింది. స్రవంతి, రేఖ, దివ్య ముగ్గురు కలిసి స్టేషన్ కి వెళ్లారు, అక్కడ ఇంకో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎస్.ఐ వాళ్ళను చూపిస్తూ “వీళ్ళని కూడా మీ హస్బెండ్ నమ్మించి మోసం చేసాడు తనకి ఐదు పెళ్లిళ్లు అయ్యవీ ఇప్పుడు ఆరో పెళ్ళికి సిద్ధమవుతున్నాడు” రేపే తన పెళ్ళి అని మనం వెళ్లి ఆపాలి అని ఎస్.ఐ వాళ్ళతో చెప్పి వాళ్ళని తీసుకోని పెళ్లిమండపం దగ్గరికి వెళ్ళాడు, అక్కడ పెళ్ళి జరగకుండా చేసి అక్కడ వాళ్లందరికీ ఇతనికి ఆల్రెడీ ఐదు పెళ్లిళ్లు అయ్యవీ అని సాక్షలను చూపించి సూర్య ని అరెస్ట్ చేశారు.. స్రవంతి వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయింది,తను మోసపోయాను అని జరిగింది అంత రాఘవయ్య,సావిత్రి లకు చెప్పింది, ఎంతో ఆశతో పెళ్ళి చేసిన తమ బిడ్డ భవిష్యత్తు ప్రశ్నర్ధకం అయినందుకు గుండెలు భాదుకున్నారు, ఆ రాత్రి చాలా భారంగా గడిచింది వాళ్ళకు… సూర్యుడు ఉదయించిన బిడ్డ జీవితం చీకట్లోనే ఉందన్న వాళ్ళ ఆవేదన వర్ణించాలేనిది…స్రవంతి తన దుఃఖన్ని దిగమింగుకొని సావిత్రి, రాఘవయ్య ల దగ్గరికి వెళ్లి “అమ్మ, నాన్న ఇప్పుడు ఎం అయ్యింది, నా జీవితం పోయిన నాలా ఇంకో అమ్మాయి జీవితం అవ్వకుండా ఆపగలిగా, నాకు మీరు ఉన్నారు, మళ్ళీ నా జీవితం మొదలుపెడతా, గాయమైన గతాన్ని ఎదురుకొని నిలబడే శక్తి నాకు ఉంది.. మీరేం కంగారు పడకండి” అంటూ కళ్ళు తుడుచుకుంటూ వంటింటిలోకి పోయి వంట పనులు చెయ్యడం మొదలుపెట్టింది… కూతురు దైర్యం చూసి గర్వపడాలో లేదా తన చేసిన తప్పు వల్ల తన చేతులారా బిడ్డ జీవితం పాడుచేసా అని బాధ పడాలో రాఘవయ్య కి అర్ధం కాలేదు, కానీ నా బాధ ఇంకో తండ్రి పడకుండా ఆ నీచుడుకి శిక్ష పడింది అనుకుంటూ తనకు తను దైర్యం చెప్పుకుంటూ పొలం కి బయలుదేరాడు

