kalanijamayega - ప్రభావతి పూసపాటి

kala nijamayega

"అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి" రాఖీ పండగ సందర్భంగా FM రేడియో లో అన్న చెల్లెళ్ళ అనుబంధం పాటలు వస్తున్నాయి.
"అమ్మ వింటుంది కొంచెం ఛానల్ మార్చరా "అరిచినట్టు అన్నాడు శ్రీకర్. "అన్న! నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్య ఫలం" ఇంకో ఛానల్ లో ను ఇవే పాటలు వస్తున్నట్టు ఉన్నాయి,ఏమిటో ఈ రేడియో RJ లు కూడా అన్నాచెల్లెళ్లు అందరు సినిమాలో చూపిస్తున్నంత అనుబంధం తో వుంటారు అన్నట్టు ఈ పాటలు వీళ్ళు "కొంచెం విసుపుతో ఛానల్ మారుస్తూ అన్నాడు శ్రీధర్.
"నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మో,తొడ బుట్టిన ఋణం తీర్చు కొంటానే చెల్లెమ్మ " ఇంక ఛానల్ మార్చిన ఉపయోగం లేదురా ,ఈ రోజంతా ఇలాంటి పాటలే వినాలి రేడియో ఆపేసి " అన్నదమ్ముల ,అక్క చెల్లెళ్ళ అనుబంధం అనేది చిన్నతనం లోనేరా పెద్దఅయ్యాక అవియేమి కనపడవు,మనం ఎంత మంది ఇళ్లల్లో చూడటం లేదు మాట పట్టింపులని, ఆస్తుల కోసమని తోడబుట్టిన వాళ్ళు కోర్టు ల చుట్టూ తిరగడం " శ్రీకర్ పక్కన కూర్చుంటూ అన్నాడు.
ఎవరి గురించో ఎందుకయ్యా ?మన ఇంటిలోనే వున్నారు కదా ,అత్తయ్యగారు,వాళ్ళ అన్నగారు ఇద్దరు కలసి మాట్లాడుకొని దాదాపు 12యేళ్లు గడిచాయి కదా "గొంతు తగ్గించి కాఫీ ఇస్తూ అంది వదిన సౌజన్య.
అవును అక్క !ఎప్పుడు బాబాయ్ గారి గురించి వినటమే కానీ ఇప్పటివరకు చూడలేదు ,రేపు అత్తయ్యగారి 60 పుట్టినరోజు కదా ,ఈసారైనా వస్తే బాగుంటుంది ."సరుకుల లిస్ట్ సరిచూస్తూ పక్కన వచ్చి కూర్చుంటూ అంది చిన్న కోడలు సౌందర్య .
మీ అందరికి ఆశ్చర్యం ,సంతోషం కలిగే విషయం ఒకటి చెప్పనా ! రేపు అమ్మ కి ఇచ్చే పెద్ద బహుమతి ఏమిటో తెలుసా ,నేను మావయ్య దగ్గరికి వెళ్లి తప్పకుండ రేపు ఇంటికి రావాలని పిలిచాను ,వస్తాను అని అన్నాడు "శ్రీకర్ గొంతు కాస్త ధృడంగా వినపడింది.
నిజామారా! మావయ్య ని కలిసావా? ఎలా వున్నాడు? ఏమి అన్నాడు?చెప్పరా?అతృతతో చెయ్యి పట్టి ఊపేస్తూ అన్నాడు శ్రీధర్.
అబ్బా ఎంత మంచి వార్తా చెప్పారు.ఇప్పటికైనా వాళ్లిద్దరూ కలిస్తే చూడాలని ఎంత ఆశ గా ఉందొ "కళ్ళని తుడుచుకొంటూ అంది సౌజన్య.
నిజమా బావగారు రేపు అత్తయ్యగారి ని వాళ్ళ అన్నయ్య తో కలిసి చూడబోతున్నామా ? నేను ఇప్పుడే ఈ వార్త మావయ్యగారి కి చెప్పి వస్తాను ,సంతోషం తో లేవబోయింది సౌందర్య .
అప్పుడే చెప్పవద్దు సౌందర్య, నిన్న నన్ను చూసి మొదట మావయ్య కూడా బిత్తర పోయాడు,మనిషి బాగా కుంగినట్టు కనపడ్డాడు,ముసలి ఛాయలు బాగా కనపడుతున్నాయి,కొంచెం తేరుకొని నన్ను దగ్గరికి తీసుకొన్నాడు,మన అందరి క్షేమ సమాచారాలు అడిగాడు, మావయ్య కళ్ళల్లో కొంచెం పశ్చాత్తాపం భావన అనిపించింది నాకు,నేను పిలిచిన వెంటనే వస్తానురా తప్పక వస్తాను అంటూ కన్నులు తుడుచు కొన్నాడు,నన్ను వదలలేక విడిచినట్టు గేట్ వరకు వచ్చి మరీ సాగనంపాడు ,నాకు తప్పక వస్తాడు అని అనిపిస్తోంది.కానీ ....గొంతు భారం అవటం తో చెప్పటం ఆపి సర్దుకొని కూర్చున్నాడు.
అసలు ఏమి జరిగింది వాళ్ళ ఇద్దరి మధ్య అంతగా రాకపోకలు ఆగి పోవటానికి ?కుతూహలం ఆపుకోలేక అడిగింది సౌందర్య.
సరేలే ! అసలు ఏమి జరిగిందో తెలియక మేము ఇన్నాళ్లు తల బద్దలు కొట్టుకొంటున్నాము ,శ్రీకర్ పెళ్ళిలో అంతా తానె అన్నట్టు పెళ్లి పనులు చేసిన మావయ్య ఉన్నట్టు ఉండి అమ్మ నాన్నతో మాట్లాడటం మాని వేసాడు ,రాకపోకలు తగ్గిపోయాయి ,ఎదురు పడిన పలకరించటం కూడా మానేసాడు,అమ్మ నాన్న ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.ఆఖరికి వాళ్ళ ఇంటి శుభ కార్యాలకి కూడా పిలవ లేదు. రేపు వస్తాడు అంటే ఏమో నాకైతే నమ్మకం ....నాన్న గది లోకి రావటం తో చెప్పటం ఆపేసాడు శ్రీధర్ .
ఎరా !రేపటికి అన్ని ఏర్పాట్లు అయి నట్టేనా ?అందరిని పిలిచినట్టేగా ..మీ అమ్మ ఏమి చేస్తోంది ,మందు వేసుకుందా లేదా? వరలక్ష్మి ఎక్కడ అంటూ ఉత్తరీయం తో చమట తుడుచుకొంటూ లోపల అమ్మ దగ్గరికి వెళ్లారు రామనాధం గారు.
"ఇక్కడే వున్నాను ,పిల్లల మాటలు వింటున్నాను ,మందు మాకు అన్ని అయ్యాయి,మీరు కూడా కొంచెం విశ్రాంతి తీసుకోండి ,రేపు వ్రతం జరిగినంత సేపు కూర్చోవాలి "అని పక్కకి వత్తిగిల్లి పడుకొంది.
పడుకొంది గాని మనసు పిల్లల మాటలిని పదే పదే గుర్తు చేస్తోంది,నిజమా శ్రీకర్ అన్నయ్యని కలిసి పిలవడానికి వెళ్ళాడా?...రేపు వస్తాడా ?నా పిచ్చి గాని ఎన్ని ఏళ్ళు రాని వాడు రేపు వస్తాడా ? వచ్చే వాడైతే పిలుపు కోసం చూస్తాడా?ఈ రోజే రావలికదా ?ఎన్ని రాఖీ పండగలు వెళ్లిపోయాయి , ఎన్ని ఏళ్ళు వస్తాడు వస్తాడు అని తను ఎదురు చూసింది.
కన్నుల వెంట నీరు తెలియ కుండానే చెంపల మీదుగా జారీ దిండు తడిసి పోతోంది.
అమ్మ నాన్నలకి పెళ్లి అయ్యి చాలా ఏళ్ళు గడిచాక ,ఎన్నో దేముళ్ళకి మొక్కితే గాని అన్నయ్య నేను పుట్టలేదు, నాగులచవితి నాడు పుట్టాడని వాడికి నాగేంద్ర అని ,శ్రావణ మాసం లో పుట్టానని నాకు వరలక్ష్మి అని పేర్లు పెట్టారు. చిన్నతనం ఎలా గడిచిందో అంత గుర్తు లేదు.నాకు కొంత వూహ తెలిసేనాటికి వాడు చదువులకని హాస్టల్ కి వెళ్లి పోయాడు.సెలవులకి వచ్చినప్పుడు వాడితో చనువుగా ఉంటే అమ్మ వాళ్ళు వయసు వస్తోంది అలా అబ్బాయిల మీద పడకూడదు ,దూరంగా వుండు అని పక్కనే కూర్చో నిచ్చే వారు కాదు
వాడి చదువు అయ్యే నాటికి నాకు పెళ్లి చేసేసారు.నాకు వాడికి కలిసి అనుబంధం బలపడే సందర్భాలే లేవు.
తర్వాత నా పిల్లలు నా సంసారం లో, నేను వాడి సంసారం లో వాడు తెలియ కుండానే రోజులు గడిచిపోయాయి . కొన్ని ఏళ్ళు రాఖీ పండగ తర్వాత నా పుట్టిన రోజు కావటం తో వచ్చి రాఖీ కట్టించుకొని ,పసుపు కుంకుమ ఇచ్చి వెళ్ళేవాడు,కొన్నాళ్ళకి రావటం తగ్గిపోయింది ,మరీ కొన్నాళ్ళకి మాటలాడటం తగ్గిపోయింది ,ఇప్పుడు బంధుత్వమే పోయింది .నాకు అన్నయ్య ఆత్మీయత ఎలా ఉంటుందో,వాడు ప్రేమగా పలకరిస్తే ఎలా ఉంటుందో ,ఆ అనుబంధం ఎంత మాధుర్యం గా ఉంటుందో ఎప్పుడు సినిమాలలోనూ ,ఎప్పుడైనా కొన్ని అన్నాచెల్లెళ్ల మధ్య చూడటం తప్ప పర్సనల్ గ ఎప్పుడు అనుభవించలేదు.ఈ జన్మ కి అది తీరని కోరిక గానే ఉండి పోయింది ...ఇన్నాళ్లకు మళ్ళి వాడిని చూసే అవకాశం కలిగింది.ఈ సారి వాడికి నా మనసులోని అన్ని భావనలు చెప్పేయాలి ,మేము కూడా అందరిలాగే మంచి అనుబంధం వున్న అన్నాచెల్లెళ్లుగా మిగిలిన జీవితం అంతా బతకాలి. అనుకొంటూ నిద్రపోయింది.
**********
" అత్తయ్యగారు లేవండి!మీ అన్నయ్యగారు వదిన గారు వాళ్ళు వచ్చేసారు ,చుట్టాలు అందరు వస్తున్నారు ,లేచి తయారు అవ్వండి పూజకి మేము అన్ని సిద్హం చేస్తున్నాము "కోడళ్ళు ఇద్దరు వచ్చి లేపుతున్నారు.కొడుకులు ఇద్దరు అతిధి మర్యాదలు దగ్గరుండి చూస్తున్నారు.మావారు పట్టు పంచి లో కొత్త పెళ్లి కొడుకులా మురిసి పోతున్నారు.
అమ్మ చెల్లెమ్మ ,ఈ చీర కట్టుకో, వదినగారు ఈ కొత్త గాజులు హారం వేసుకోండి .అన్న వదిన దగ్గరుండి మరీ ముస్తాబు చేస్తున్నారు.పూజ అంతా ఘనంగా జరుగు తోంది అందరు బంధువులు వచ్చారు ,నిండు నూరేళ్లు చల్లగా వుండండి అని అన్నావదినలు దీవిస్తున్నారు.అక్షంతలు పూల జల్లులా పడి వళ్ళు పులకరిస్తోంది.అన్నయ్య పక్కన నిలబడి చెయ్యి పట్టుకొని మరీ కొసరి కొసరి తినిపిస్తున్నాడు. అన్నయ్య కి చెప్పాల్సినవి అన్ని చెప్పేసాను."అమ్మ ప్రతి రాఖీ పండగకి తప్పక వచ్చి నిన్ను దీవించి వెళతాను "అని చేతిలో చెయ్యివేసి మరీ మరీ చెప్పాడు,చాలు ఈ జన్మకి ఇది చాలు.
ఏమిటి చేతిలో చెయ్యి వేసి మరీ కలవరిస్తున్నావు "తన మీద వేసిన చేతిని ఆప్యాయంగా నిమురుతూ నిద్ర లేపారు రామనాధాంగారు.
ఓహ్ ! ఇది కల ,ఎంత బాగుంది ఇది నెరవేరే రోజు ఈ రోజే నెమో అనుకొంటూ సంతోషం గా భర్త ఎద పై తలవాల్చింది.
**************
"మావయ్య తొందరగా రండి ,ఎంత పిలిచినా అత్తయ్య లేవటం లేదు "గట్టిగా అరిచింది సౌజన్య .అందరు చేస్తున్న పనులు వదిలేసి అక్కడికి చేరారు.రామనాథం గారు స్థాణువై నిలబడిపోయారు.
కొత్తచీర గాజులు తీసుకొని చెల్లెలిని మనస్ఫూర్తిగా దీవించాలని నాగేంద్ర అప్పుడే గేట్ తీసుకొని వచ్చాడు.నిర్జీవంగా పడి వున్న వరలక్ష్మి ని చూసి షాక్ తగిలిన వాడిలా కూలపడిపోయాడు .
అందరు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు."ఇంత తొందరగా అమ్మని దేముడు తీసుకొని వెళ్ళిపోతాడు అని అనుకోలేదు మావయ్య"పిల్లలు మావయ్య ని అక్కున చేర్చుకొని విలపిస్తున్నారు.
అవునురా ,మీ అందరికన్నా దౌర్భాగ్యుడిని నేను రా ...మమతాను రాగాల విలువ తెలియక చేజేతులా చెల్లిని పొట్టన పెట్టు కొన్నానురా ,బావ తప్పు తెలుసుకొని మిమ్మలిద్దరిని మన్నించమని అడిగి ఇంటికి తీసుకొని వెళదామని వచ్చాను.ఈ జన్మ లో తోడబుట్టిన వాడిగా ఏమి ధర్మం నెరవేర్చలేక పోయాను ,మరు జన్మలో నైనా మళ్ళీ దానికే అన్నగా పుట్టి ఋణం తీర్చు కొంటాను బావ ,ఋణం తీర్చు కొంటాను ....
ఏమిటి ఈ కలవరింతలు,నిద్ర లెండి మహానుభావా...అక్కడ మీ చెల్లెలు మనం ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటుంది ,త్వరగా బయలుదేరాలి అంటూ లేపింది నాగేంద్ర భార్య సుమతి.
హమ్మయ్య ఇది కల అన్న మాట , ఎంత పీడకల ,భగవంతుడా బంధాలు అనుబంధాల విలువ తెలిసేలా కలలో కనులు తెరిపించేలా చేసావు ,చెల్లిని బావని తీసుకొని నీ దర్శనానికి వస్తాను అని మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొని చెల్లిని, బావగారిని కలవడానికి సంసిద్దుడు అయ్యాడు నాగేంద్ర .
విధి చేతిలో అందరు కీలు బొమ్మలమే కదా....అన్నచెల్లెళ్ళ కలలో ఎవరిదీ నిజమయ్యిందో కాలమే నిర్ణయించాలి అని ఆశిస్తూ....
మీ రచయిత

మరిన్ని కథలు

Sahaayam
సహాయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Toli Ekadashi
తొలి ఏకాదశి
- కొడవంటి ఉషా కుమారి
Mudi padina bandham
ముడిపడిన బంధం
- అనిసా తబస్సుమ్ sk (Anisa Tabbasum sk)
Nalupu
నలుపు
- వేముల శ్రీమాన్
Vanta gadi lo veerudi katha
వంట గదిలో వీరుడు కథ
- రాము కోలా దెందుకూరు
Avadhulu daatina abhimanam
అవధులు దాటిన అభిమానం
- మద్దూరి నరసింహమూర్తి,
Maarina jeevitham
మారిన జీవితం
- Prabhavathi pusapati