విద్యాధనం - చలసాని పునీత్ సాయి

Vidya dhanam

ఒకేసారి రెండు పీహెచ్డీలు చేసి రెండు ప్రఖ్యాతి యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ లు పొందుతున్న సోమేశ్ ను ఘనంగా సన్మానించారు ప్రముఖులు. ఆ సన్మాన సభలో తన జీవిత విశేషాలు పంచుకోసాగాడు సోమేశ్. తన తండ్రి గారైన పరమేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటూ తన గతాన్ని చెప్పసాగాడు . అది 1980వ దశకం ఆంధ్రదేశంలో పరమేశ్వరరావు గారు అంటే తెలియని వారు చాలా అరుదు సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తాతల కాలం నుండి వస్తున్న వ్యవసాయ భూమిని అమ్మి ఆ డబ్బుతో వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో నే అతిపెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు పరమేశ్వరరావు. పరమేశ్వరరావు భార్య తులసి. పరమేశ్వర రావు తులసి దంపతులకు పెళ్లి ఐన చాలా కాలానికి లేక లేక కలిగిన సంతానం సోమేశ్. లేక లేక కలిగిన పుత్రుడు కావడంతో సోమేశ్ ను గారాబంగా పెంచసాగారు పరమేశ్వర రావు తులసి. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టే వంశోద్ధారకుడు అని మురిసిపోయేవాడు పరమేశ్వర రావు. సోమేశ్ కు మొదటి నుంచి చదువు అంటే ఆసక్తి ఉండేది కాదు. వ్యాపారంలో తలమునకలయ్యే పరమేశ్వరరావు అంతగా సోమేశ్ చదువు గురించి పట్టించుకునే వాడు కాదు. తులసి కూడా వాడే తెలుసుకుంటాడు లే అని సోమేశ్ చదువు గురించి పెద్దగా పట్టించుకునేది కాదు. కొంతకాలం గడిచింది ఆ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షలలో సోమేశ్ అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయ్యాడు. వ్యాపారం ఒత్తిడి వల్ల తన కొడుకు చదవను పట్టించుకోలేదని బాధపడ్డ పరమేశ్వరరావు. పదో తరగతి ఫెయిల్ ఐన తన కొడుకుని మందలించాడు. నాకీ చదువులు అబ్బవు మనకు కూర్చుని తిన్న తరగని ఆస్తి ఉంది ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. వాటిని చూసుకుంటే సరిపోతుందిగా ఇంక ఈ చదువు ఎందుకని తండ్రిని ప్రశ్నించాడు సోమేశ్. చదువు విలువ గురించి ఎంత చెబుదాం అని పరమేశ్వరరావు తులసి ప్రయత్నించిన సోమేశ్ వినిపించుకునేవాడు కాదు. ఎంతో గారాబంగా పెంచుకున్న కొడుకు కావడంతో చదువు రాని తన కొడుకును పరమేశ్వర రావు తన వ్యాపారాలకు వారసుడిగా ప్రకటించాడు. తండ్రి మార్గదర్శకంలో వ్యాపారం చేసేవాడు సోమేశ్ మంచి లాభాలు కూడా పొందాడు. ఇలా కొంతకాలం గడిచింది ఒకానొక రోజు రోడ్డు ప్రమాదంలో పరమేశ్వరరావు తులసి మరణించారు. పరమేశ్వర రావు మరణం తర్వాత పూర్తిగా వ్యాపార బాధ్యతలు స్వీకరించాడు సోమేశ్. ఇప్పుడు సోమేశ్ కు వ్యాపారం కొత్తగా ఉంది. ఎలా చేయాలో చెప్పే తండ్రి లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు సోమేశ్. వ్యాపారం ఎలా నిర్వహించాలో తెలియక తండ్రి స్థాపించిన వ్యాపార సంస్థలు మూతపడ్డాయి . తండ్రి సంపాదించిన ఆస్తులు అన్ని అమ్ముకోవాల్సి వచ్చింది సోమేశ్ కు. ఉంటానికి ఇల్లు లేక దగ్గరలో ఉన్న ఓ గుడిలో తలదాచుకున్నాడు. తాను ఆ గుడిలో ఉంటూ ఏదో చిన్న పని చేసుకుంటున్నా సమయంలో ఆ గుడిలో పురాణ ప్రవచనం జరుగుతుంది. ఆ ప్రవచనం చెప్పే ప్రవచనకర్త చదువు యొక్క గొప్పతనాన్ని చదువు వల్ల కలిగే లాభాలను విద్యా వైభవాన్ని ఎంతో గొప్పగా చెప్పాడు. ఆ మాటలు సోమేశ్ ను ఆకర్షించాయి. నాడు తన తల్లిదండ్రులు ఎంత చెప్పినా చదువును నిర్లక్ష్యం చేశానని ఎంతో బాధపడ్డాడు. ఆ ప్రవచనం పూర్తయిన తర్వాత నేరుగా ఆ ప్రవచన కర్త దగ్గరికి వెళ్లి తన గురించి మొత్తం చెప్పాడు ఇప్పుడు నేను చదువుకోవాలి అనుకుంటున్నాను చదువుకోవచ్చా చెప్పండి అయ్యా అని ప్రశ్నించాడు సోమేశ్. నిరభ్యంతరంగా చదువుకి వయసుకి సంబంధం లేదని చేసిన తప్పు తెలుసుకున్నావు గనక ఇప్పుడైనా మంచిగా చదువుకోమని ప్రవచనకర్త సోమేశ్ కు చెప్పాడు. ఆ మాట ఎంతో సంతోషాన్ని కలిగించింది సోమేశ్ కు ఎంతో కష్టపడి చదువుకుంటూ తన చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన తండ్రి గారి జ్ఞాపకార్థం ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు ఆ వ్యాపారంలో అందివచ్చే లాభాలతో చదువుకోవాలని ఉన్న చదువుకు దూరమై ఎన్నో సమస్యల వల్ల ఇబ్బంది పడే వారిని చదివించసాగాడు. ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకోవాలని నిత్య విద్యార్థి లాగా ఉండాలని ఒకేసారి తెలుగు సాహిత్య వైభవం పై ఒక పీహెచ్డీ. ప్రకృతి వనరులపై మరో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ లు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నానని. ధనం( డబ్బే గొప్ప) అని అనుకునేవాడిని. అన్నింటికన్నా గొప్ప ధనం విద్యాధనం అని తెలుసుకున్నానని తన ప్రసంగాన్ని పూర్తి చేశాడు సోమేశ్. తన జీవిత ప్రసంగాన్ని విన్న అందరూ కరతాల ధ్వనులు చేశారు. సభ ముగిసింది. రెండు యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ లు అందుకున్నాడు సోమేశ్. డాక్టర్ సోమేశ్ ప్రొఫెసర్ సోమేశ్ గా మారి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు.

మరిన్ని కథలు

Dayyaala Meda
దయ్యాల మేడ
- డా:సి.హెచ్.ప్రతాప్
Chivari chitram
చివరి చిత్రం
- డా:సి.హెచ్.ప్రతాప్
Idi ekkadi nyayam
ఇది ఎక్కడి న్యాయం
- ప్రభావతి పూసపాటి
Maa Inti TV (feelgood story)
మా ఇంటి టి.వి (feelgood story)
- అనిసా తబస్సుమ్ sk
Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)