సుట్టకోసం - మోహరావు మంత్రిప్రగడ

Sutta kosam

ఒరే రావుడు ఎక్కడున్నావు ఓపాలిఇలారార," " వత్తన్న ఏంఅయింది" అడిగాడు రావుడు. ఏంఅయింది అంటు వచ్చాడు రావుడు, "ఏంంలేదురా నాసుట్టకిందడిపోయినాది కాంత తీసివ్వరా" అడిగాడు రంగయ్య. "ఓరి నాన్నఇదేంటి నువ్వు కుర్చిలో కూకడున్నావు, సుట్ట నీకాళ్ళ కాడుంది వంగుంటే అందుతాది, దానికోసం పన్లొఉన్న నన్ను పిలుత్తవ అన్నాడు రావుడు కోపంగా రావుడు. "ఏంట్ర నేను నీకు బాబుని నాకెటి ఎదురు సమాదానం సెప్పీతున్నావు కోపంగా అరిచాడు రంగయ్య. ఈసారి రావుడు కొచం నవ్వి ఒరి నాయన నువ్వు కూకున్న కుర్చీలో బల్లిపడింది గబుక్కున లేచి సూడు" అన్నాడు. రంగయ్య కంగారుగ లేచి కుర్చీ చూసి "ఎదిరా బల్లి" అన్నాడు. "కుర్చికిందకాని పోయిందేమో సూడు" అన్నాడు రావుడు. రంగయ్య వంగి కుర్చీ క్రద చూసి "ఏది ఇక్కడ కూడా లేదు" అన్నాడు. ఓరి నాయన నీవ్వు వంగావుకదా నీసేతికాడ సుట్టంది సూడు తీసుకో అన్నాడు" రంగడు నవ్వుతు. "ఆరినాకొడక ఏంనాటకం ఆడవురా లెగకుండా పొద్దున్నకాడి నించి ఇలాగెఉన్నాను, ఇప్పుడు నన్నులేపావా ఒరే నేను నీబాబునిరా నిన్ను ఎంతో గారంగా పెంచిపెద్దసేత్తె నువ్వు ఇలా నాటకంఆడతావా, మీఅమ్మ నువ్వు కలసి నన్ను సంపెద్దం అనుకొంటన్నారా" కోపంగా అరిచాడు రంగయ్య. "ఓరిబాబు నీవ్వు లెగిసి తిరుగుతుంటె పది కాలాలపాటు మాకళ్ళముందుంటావు, లేదనుకో పొటోకి దండె అని భయమేమసే నీకుమంచి సేయిలనే సెపతన్నాం, నీకన్నా పెద్దోడు లా కనకరాజు సూడు ఎలా సెకసెకా తిరుగుతు న్నాడు ఆయననీకులా సుట్టలు కాల్చడు అయనా ఒకె సోట కుకునుండిపోడు, వంగుని కాలుకాడున్న సుట్ట కూడా నీకెవరేనా తీసియ్యాల, ఇలాగైతె ఓనెలలోనే మంచం ఎక్కేత్తావు" అన్నాడు రావుడు. "ఏంట్రా బెదిత్తన్నావా" గట్టీగా అడిగాడు రంగయ్య. "ఏంట్రా ఆడిమీదిరుసుకు పడతనావు" అడిగాడు అప్పుడే ఇంట్లోకొచ్చిన బాలయ్య. "సూడరా ఈ సన్నాసి నన్నాట పట్టింతనాడు, ఒక నెలలొ మంచానాపడతానంట" అన్నాడు రంంగయ్య కోపంగా. "అసలేటయినాది" అడిగాడు బాలయ్య. "సెప్పు మావకి అన్నాడు రావుడు. "అలాగే సెపుతాను" అని జరిగిందంతా చెప్పాడు రంగయ్య."ఓరినీ ఆడు సెప్పిందాట్లో తప్పెం ఉందిరా ఆడు నీబాగుకోసమే నీమీదున్న పేమతో సెప్పాడు దానికింత ఎగురతన్నావా" గట్టిగానే అడిగాడు బాలయ్య. "అదికాదురా" అని ఏదో అనబోయాడు రంగయ్య. "ఏదికాదు ఆడుసెప్పీనట్టు లా కనకరాజు మనకంటే పెద్దోడు, ఆడు సిలకలా తిరుగతనాడు నేను సలాకిగానే తిరగతన్నా, నీవ్వెమొ లాకుర్చి సుట్ట తప్ప ఏంలేదు, రెపుకాడనించి నాతోరా కాంచెపు తీరుగుదాం" అన్నాడు బాలయ్య. "ఓరి బాబు నాను నడవలేనురా నాకాళ్ళు నెప్పిసేత్తాయి" అన్నాడు రంగయ్య. "అయతే అలాగె ఏడు ఒరేయివుడు నాతోరారా పనున్నాది" అని రావుడ్ని తీసుకొని వెళ్ళిపోయాడు బాలయ్య. రంంగయ్య సుట్టఅంటించి మళ్ళా కుర్చీలో కూర్చున్నాడు. బాలయ్య దగ్గరనించి రావుడు ఇంట్లొకొచ్చాడు, మరనాడు "ఒరే రావుడు సుట్టలు అయిపోయియిరా ఆడు రాలేదా ఈయిల" అడిగాడుంగయ్య. "లేదు ఇంక రాడంట గవర్నమెంటోళ్ళు పోగాకు కొట్లన్నీ ముయించేసారంట ఇంక రానని చెప్పాడంట" అన్నాడు రాముడు. "మరిఎలాగరా బాబ పొద్దుకాలనించి నోరు లాగేత్తందిరా" అరచాడు రంగడు. "నేనేటి సేత్తాను నువ్వే ఏదో పడు" అన్నాడు రావుడు. ఇంతలో బాలయ్య వచ్చాడు" ఏరోయి ఏటి మీనాయన నోరు కాలీగుంది" అని అడిగాడు. "ఏంట్ర ఎటకారం ఆడతనావా పొగాకు కొట్లన్నీ గవరమెంటోళ్ళు మూసేరంటకదా తెల్దా" కొపంగా అడిగాడు రంగయ్య. "ఒటిరా ననాకెట్ట తెలుత్తాది నానేవన నీకులా రైలింజల్ల పొగొదులుతుంటానా" అంతే స్వరంలో అడిగాడుబాలయ్య. రంగడు మెత్తబడ్డాడు "అదికాదురా మరి నాకు సుట్టలు ఎలాదొరుకుతాయిరా" అని బేలగా అడిగాడు. "సరే నెను వాకబు సేత్తలే నీవ్వు వల్లకుండు"అన్నాడు బాలయ్య. మరనాడు బాలయ్క వచ్చి "ఒరే రంగా ఉదయంగుడి కాడకెల్దాం ఎవడో ఒకాయన వచ్చి సుట్టలుకట్టఇత్తనాడంట అనిసెప్పాడు. రంగడికి నిద్దరట్టలేదు తెల్లారకుండ లేచి కూచున్నాడు. బాలయ్య ఇంటికి దిరితీసాడు, రంగయ్యని చూసి బాలయ్య "ఒరె ఇంత పెందరకడే వచ్చెవేంద్రా" అడిగాడు. "అదేరా లాగుడికాడ ఎవడొసుట్టలిత్తన్నాడని సెప్పినావు కందరా" అన్నాడు. "మరే నడు ఎల్దాం" అని దారితీసాడు బాలయ్య. ఇద్దరు రెండు కిలోమీటర్లు నడిచి గుడి దగ్గరకొచ్చారు. అక్కడున్న షాపతన్ని కలిసి చుట్టలు ఇచ్చె ఆయన వచ్చాడ , అడిగారు. "నేదు బాబు లాయన రెపొత్తాడంట" అని చెప్పాడా షాపాతను. "ఓర్ని లింత దూరం వచ్చినాక తుస్సు మనిపించిడేంట్రా, సరే నడు రేపు వద్దం" అని ఇంటికి దారీ తీసారిద్దరు. ఆమరునాడు కూడా ఇద్దరు పొద్దున్నే వచ్చారు. ఆరోజు అదే జవాబొచ్చింది. పట్టువదలని విక్రమార్కుల్లా ఇద్దరు రోజు వస్తున్నారు కాని ఆచుట్టలిచ్చెఆయన రావటంలేదు. "ఒరే వారంరోజుల నుండి తిరగతన్నాం ఆయన రాటల్లెదేంట్రా" అడిగాడు రంగయ్య. "ఏమొరా రెపుకాడనించి మానేద్దాం" అన్నాడు బాలయ్య. ఇద్దరు ఇంటికొచ్చేసారు. ఆమరనాడు రంగడు లేచి మామూలుగా బాలయ్య ఇంటకి నడచాడు. "ఏరా ఈయిల యెల్లద్దనుకొన్నాం కదరా మళ్ళా వచ్చావేంటి" అని అడిగాడు బాలయ్య. "ఒరే వారంకాడనించిఅలవాటైయింది కదరా ఇంట్లొ కూకో బుద్దెయ్యలేదురా సుట్టల సంగతి మరసేపోయిను, గుడికాడదాకా నడిచి వద్దాం నడు" అన్నాడు రంగయ్య."సరే నడు" అని దారితీసాడు బాలయ్య. అలా నడుస్తున్న రంగయ్యతో "ఒరే రంంగా ఎంట్రా మళ్ళ ఇలామారావు" అని అడిగాడు. "ఒరే బాలా ఆలా నడత్తుంటే మంచి చలాకీగఉందిరా, ఉషారుగ ఉందిరా అన్నాడు రంగయ్య "ఒరే సుట్ట ఏదిరా" అని అడిగాడుబాలయ్య. "ఏంటి సుట్ట నేనా సుట్ట కాల్చడం నువ్వు చూసావా" అని అడిగాడు రంగయ్య. "ఓరినీ బలే పిరాయించావురా ప్లేటు" అన్నాడు ఆనందంగ రంగయ్య.

మరిన్ని కథలు

Oka maata oka jeevitham
ఒక మాట... ఒక జీవితం
- డా:సి.హెచ్.ప్రతాప్
Inti donga
ఇంటిదొంగ
- నయన కస్తూరి
Muniki sayapadda janthuvulu
మునికి సాయపడ్డ జంతువులు
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Prayatnam thone falitham
ప్రయత్నంతోనే ఫలితం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Saadhana
సాధన
- డా:సి.హెచ్.ప్రతాప్
Nammaka droham
నమ్మకద్రోహం
- డా:సి.హెచ్.ప్రతాప్