ఓపెన్ హార్ట్ సర్జరీ అనగానే కమలిని గుర్తొ స్తోంది.తనని మోసం చేసానేమోననే ఆలోచన దహిస్తోంది.ఈ నలభై ఏళ్ళలో తనని మర్చిపోయింది లేదు.కానీ ఇప్పుడు అనుక్షణం తనే గుర్తుకొస్తోంది. నా ఆలోచనలని గమనించిన మా ఆవిడ పదే పదే చెప్తోంది తన సంఙ్నలతో ‘ఆందోళన పడకండి.డా.సునంత్ గారికి మంచి పేరుంది. ఆయన చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తారట. అన్నింటికీ మించి ఆయన గురించి రివ్యూలు చాలా బాగున్నాయి.’ అవునన్నట్టు తలూపా ను.నిజానికి నేను దేని గురించి ఆలోచిస్తు న్నానో తెలిస్తే ఇంతకాలం ఈ విషయం చెప్ప నందుకు కోపం తెచ్చుకుంటుందా? అసహ్యిం చుకుంటుందా?పిల్లలు ఏమనుకుంటారు? నాకు ఆపరేషన్ అనగానే అమ్మాయీ,అల్లు డూ,కొడుకూ,కోడలు కూడా వచ్చేసారు పిల్లల తో. నిజానికి నాకు ఆపరేషన్ గురించి దిగులు లేదు. డా. సునంత్ చాలా కాలం నించీ హాస్పి టల్ నిర్వహిస్తున్నాడు.ఆపరేషన్ కోసం అక్క డ చేరిస్తే విజయవంతం అయిందనే వార్త వినే వరకే బంధువులు అక్కడ వుండచ్చు.ఆ తరు వాత ఎవరైనా విజిటింగ్ సమయంలో వస్తే చా లు.రోగి బాగోగులన్నీ సిబ్బందే చూసుకుంటారు సమయా న్ననుసరించి.రోగికి ఇబ్బంది అనిపిస్తే పక్కనే కా లింగ్ బెల్ వుంటుంది.అది నొక్కితే క్షణాలలో నర్సు లు వచ్చి చూస్తారు. అవసరమైతే డాక్టర్ ని పిలు స్తారు. $ $ $ కమలిని నాకు టైపు సెంటర్ లో కలిసింది.అ క్కడే నేను టైపు నేర్చుకున్నాక ఉదయం షార్ట్ హాండు నేర్చుకునేందుకు వెళ్ళేవాడిని. ఆయన సాయంత్రం కాసేపు వచ్చి సెంటర్ చూడమనే వాడు. అలా సా యంత్రం ఐదు నుంచీ ఏడు దా కా వుండే వాడిని. అదుగో ఆ టైములో సాయంత్రం ఆరు నుంచీ ఏడుకి వచ్చేది.తనకీ అందరిలాగానే నేర్పేవాడిని. కానీ మొదటి రోజే ఆ అమ్మాయిని చూసి ఆకర్షిం చబడ్డా.తెల్లగా వుండేది.లంగా,వోణీ,రెండు జడలు, దోసగింజ బొట్టు, ఎక్కువ మేకప్ లేకుండా చాలా సాదాగా వుండేది. మా మధ్య ఒకరంటే ఒకరికి ఆకర్షణ కలిగిందని మా చూపుల వల్ల అర్థం చేసుకున్నాం.ఓ రోజు క్లాసు అవగానే బయటికి వెళ్ళేటప్పుడు నేనూ వస్తానని క ళ్ళతోనే చెప్పా.మా మాస్టర్ కి చెప్పి బయటికి వచ్చా ను.తను బయట వుంది. అప్పుడు నా గురించి చెప్పి, తనంటే ఇష్టమనీ, ఉద్యోగం రాగానే పెళ్ళి చేసుకుందామనీ చెప్పా.తన కళ్ళల్లో చిన్న కలవరం కనపడింది. నాకు తెలుసు తను డిగ్రీ చివరి సంవత్సరమని. కొంత దూరం నడిచాక తను నెమ్మదిగా అంది ‘ఆ విషయం పెద్దవాళ్ళు నిర్ణయించాలి కదా.’ ‘వాళ్ళైనా మన ఇష్టం లేకుండా చెయ్యరుగా. నెమ్మదిగా ఆలోచించి చెప్పు.’ $$$ ఆ తరువాత నాలుగు రోజులు రాలేదు. మా నేసిందేమోననుకున్నా.ఐదో రోజు వచ్చింది.నవ్వు తూ నా వంక చూడటంతో అర్థమైంది. ఆ రోజు చెప్పిం ది ‘ మొన్న అలా అనగానే భయం వేసింది.ఆలోచిస్తే బాగుందనిపించింది.’ ఆ రోజు నుంచీ ఓ ఆరు నెలలు నాకు ఉద్యో గం వ చ్చే వరకు రోజూ కలిసే తిరిగాం. ‘హైదరాబాదులో సెక్రటేరియట్ లో ఉద్యోగం వచ్చిం ది. సరిగ్గా ఏడాది తరువాత వస్తా.అప్పుడు మన పె ళ్ళి గురించి మాట్లాడుకుందాం.’ అని వెళ్ళిపోయా. $$$ హాస్పిటల్ లో చేరా.రకరకాల టెస్టులు చేసా రు. సా యంత్రం డా.సునంత్ చెప్పారు. ‘టెస్టులన్నీ బాగు న్నాయి.మీ ఆపరేషన్ రేపు ఉదయం ఎనిమిదికి చేద్దాం.పేరుకి ఓపెన్ హార్ట్ సర్జరీ. నిజానికి భయప డాలిసిందేం లేదు.ఇంత వరకు ఈ హాస్పిటల్ లో ఫెయిల్యూర్ లేదు.మీరు దాని గురించి మర్చిపోం డి.ఈ పూట మిమ్మల్ని జనర ల్ వార్డులో వుంచుతా ను.ఆపరేషన్ అయ్యాక రూముకి మారుస్తాను.ఈ పూ ట నించే డబ్బు లు ఎక్కువ ఎందుకని.జనరల్ వార్డులో కూడా ఏ సి వుంటుంది.శుభ్రతగా వుంటుం ది.మీరెవరూ ఆయనతో వుండవలసిన అవసరం లే దు. రేపు రావచ్చు.’ మరునాడు ఆపరేషన్ ధియేటరులోకి తీసుకు వె ళ్ళారు.అక్కడికి వెళ్ళటం వరకే నాకు తెలుసు మత్తు మందు ఇచ్చేటప్పుడు ఏవో అడిగారు.నే నేం చెప్పా నో తెలియదు.వాళ్ళు నవ్వుకుంటూ ఆపరేషన్ చె య్యటం తెలుస్తోంది.మధ్య మధ్యలో రావుగారు అం టూ నాతో మాట్లాడుతున్నా రు.నేనేదో చెప్తున్నాను. కాసేపటి తరువాత నన్ను రూములోకి మార్చారు. సాయంత్రానికి స్పృహ వచ్చింది. మా వాళ్ళు అక్కడే వున్నారు.బాగానే వుంది అని సంతోషించారు.నర్సు వచ్చి, హార్టు బీట్,ప ల్సు చెక్ చేసి నార్మల్గా వుందని ఓ టాబ్లెట్ ఇచ్చి వెళ్ళింది. $$$ అనుకున్నట్టే ఏడాది తరువాత ఇంటికి వ చ్చా కమలిని విషయం చెప్పి పెళ్ళిచేసుకోవాలని. అమ్మ చెప్పింది ‘ అత్తయ్య కూతురు లక్ష్మిని నీకి చ్చి పెళ్ళి చేయాలనుకున్నాం.ఎందుకంటే అది వు త్తరం రాసింది.దానికి మాటలు రాకపోయినా ఇంట రు దాకా చదివింది. తొంభై మార్కు లు తెచ్చుకుంది. అత్తయ్య,మామయ్య చనిపోయాక వాళ్ళ పెదనాన్న గారు,బాబాయి దగ్గిర వుంటోంది.పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు కానీ ఎవరూ ముందుకు రావటం లే దు.మూగ తనం ఓ కారణమైతే,కట్నకానుకలు పె ద్దగా ఇ వ్వటానికి వాళ్ళు ఇష్టపడకపోవటం ఇంకో కారణం.ఇదిగో అది రాసిన వుత్తరం చదువు.’ ఆ వుత్తరం కార్డు మీద రాసింది.గాభరాగా రాయ టం వల్ల అక్షరాలు కుదురుగా లేవు.దాని సారాంశం – ఆమెని వాళ్ళు ఇంకా చదివించాలనుకోవటం లే దు.పైగా ఇంటి పనులూ,బయటి పనులూ తననే చే యమంటున్నారు.’మామయ్యా నన్ను నువ్వు తీ సుకెళ్ళి చదివించు.నా బతుకు నేను బతుకుతాను. నీ మేలు మర్చిపోలేను.’ మా మామయ్య పొలంలో పాము కరిచి అక్క డే చనిపోయారు.ఆ కబురు విని మా అత్తయ్య ఇంట్లోనే ప్రాణాలు విడిచింది.అప్పటికి లక్ష్మికి ఆరేళ్ళు. అప్ప టి నించీ పెదనాన్న,బాబాయిల ద గ్గిర వుంది.తనకి అక్కయ్యలు వున్నా రు.కానీ ఆదుకోలేరేమో మరి. లక్ష్మి పరిస్థితి జాలేస్తుంది.కానీ కమలిని విష యం? ‘నేను కమలినిని ప్రేమించాను.ఈ ఊరే.లక్ష్మిని చే సుకుంటే ఆ అమ్మాయిని మోసం చేసిన ట్టు కదా.’ అన్నాను మా నాన్నగారితో. మా నాన్నగారు చెప్పారు ‘ మామూలు పరిస్థి తులలో నీ ఇష్టాన్ని కాదనే వాళ్ళం కాదు.కానీ ల క్ష్మిని చేసుకోకపోతే తనని తీసుకొచ్చి చదువు చె ప్పించచ్చు.కానీ తన బంధువులందరికీ మనం వి రోధులం ఔతాము. నువ్వు కాదంటే అదే చేయాలి. నాకింకా ఐదేళ్ళు సర్వీసు వుంది కనుక ఇబ్బందేం లేదు.ఐతే లక్ష్మిని నువ్వు చేసుకుంటే దాని జీవితం బాగుంటుంది.నీ ఇష్టం.కమలినికి ఏ అవకరంలేదు కనుక తనకి పెళ్ళి కావటం కష్టం కాదు.’ సాయంత్రం కమలినిని కలవటానికి బయలు దేరాను.రకరకాల ఆలోచనలు. ‘ఐతే మీ వాళ్ళు చెప్పినట్టు తననే పెళ్ళి చేసు కుం టావా.మరి నా సంగతేంటి.’ ఉలిక్కిపడి చూ స్తే అది నా ఊహ.ఓహ్. మళ్ళీ నడుస్తున్నాను ‘లక్ష్మినే చేసుకోండి. ఆమె పరిస్థితి తలుచుకుంటే జాలి కలుగుతోం ది.నాకేం ఫ రవాలేదు.నేను ఉద్యోగం చేస్తాను. పెళ్ళీ చేసుకుంటా ను.నా గురించి ఆలోచించకండి.’ మళ్ళీ నా ఊహే! నాకు కమలినిని కలవాలనిపించలేదు. ఎదురు గా పార్కులోకి వెళ్ళి కూచున్నా.రకరకాల ఆలోచన లు.నేను లక్ష్మిని చేసుకుంటానంటే తను బాధపడు తుంది.తన నిర్ణయం ఎలా వుంటుందో.కలవకపోతే మోసం చేసాననుకుంటుంది.బహుశా నా మీద అ సహ్యంతో తను పెళ్ళి కూడా చేసుకోవచ్చు. రెండు రోజులనించీ ఇవే ఆలోచనలతో అన్యమన స్కంగా వుండటం గమనించిన అమ్మ చె ప్పింది. ‘నువ్వు ఎవరిని చేసుకున్నా మాకు ఇష్టమే.పోనీ కమలినినే చేసుకో.నాన్నగారు వెళ్ళి మాట్లాడు తా రు.’ అప్పటికే ఒక నిర్ణయా నికి వచ్చాను. ‘లేద మ్మా, లక్ష్మినే చేసుకుంటాను.తనని చదివిస్తాను.’ $$$ ఆపరేషన్ అయ్యాక ఐదు రోజులకి నన్ను డిశ్ఛార్జ్ చేసారు.నాకు ఏ ఇబ్బందీ లేదు.నెలకోసారి ఓ మూ డు నెలలు రమ్మన్నారు చెకప్ కి. లక్ష్మితో నా పెళ్ళి అయిపోయింది.కాపురానికొచ్చా క నేను తనని బాగానే చూసుకున్నాను.ని జానికి తను నన్ను అంతకన్నా బాగా చూసు కునేది. గమ్మత్తుగా ఆరునెలలో తనతో సంఙ్నలతో మా ట్లాడటం వచ్చేసింది.నేనే నేర్చుకున్నా సరదాగా. ఇతరులు మాట్లాడితే తనకి అర్థం ఔతుంది కనుక ఆ ఆవసరం లేదు.నా సరదా అంతే. కాపురానికొచ్చినప్పటినించే కాలేజీలో చేర్పిం చాను. పోస్టు గ్రాడ్యేషనే కాక నా ప్రోద్బలంతో,వా ళ్ళ ప్రొ ఫెసర్ సలహాతో పి హె డీ కూడా చేసిం ది. ఏడేళ్ళలో అమ్మాయి,అబ్బాయి పుట్టారు. కాలక్ర మంలో వాళ్ళ చదువులూ,పెళ్ళిళ్ళూ,పురు ళ్ళూ అన్నీ చక్కగా జరిగిపోయాయి. ఇద్దరి గురించీ దిగులు పడాల్సిందేం లేదు. నేను సర్వీసులో వుండగానే ప్రభుత్వం హకీం పేటలో ఇ చ్చిన రెవెన్యూ కాలనీలో ఇల్లు కట్టు కున్నాను. నాకు వచ్చే పెన్షన్ చాలా ఎక్కువ.అందువల్ల ఆర్థిక ఇబ్బందులు లేవు.రిటైర్మెంటు అవగానే హెల్త్ ఇ న్సూరెన్సు తీసుకున్నాను.అందువల్ల ఈ ఆపరేషన్ కి ఖర్చు కూడా చాలా వరకు ఇన్సూరెన్సు కంపెనీ యే భరించింది. $$$ ఓ రోజు మా చిన్నాన్నగారి అబ్బాయి సుధాక ర్ ఫోన్ చేసాడు.అతను రీజనల్ మేనేజర్ గా ఆర్టీసీలో పనిచేస్తున్నాడు.ప్రస్తుతం విజయవాడలో చేస్తు న్నాడు. ‘కమలినిట. నీ గురించి అడిగారు.నువ్వు బాగా తెలుసన్నారు.నీ చిరునామా అడిగారు. చెప్పాను. ఫోన్ నెంబరు కూడా ఇచ్చాను.నేను విజయవాడ నెహ్రూ బస్ స్టే షనులో ప్రయాణీకులతో మాట్లాడు తున్నాను. సర్వీసులు ఎలా వున్నాయో అభిప్రా య సేకరణ చేస్తున్నప్పుడు ఆవిడ బందరు పాయిం ట్లో వున్నారు.వాళ్ళ ఆయన కూడా డివిజనల్ మేనేజరుగా చేస్తున్నారుట. త్వరలో రీజనల్ మేనే జరు ప్రమోషన్ వస్తుందట.తను తన పేరెంట్సు దగ్గరికి బందరు వెళుతున్నార ట.’ నాకు చిరు కంపం కలిగింది శరీరంలో. తను నా అడ్రెస్,ఫోన్ నెంబరు తీసుకుందంటే ఎప్పు డో ఫోన్ చేయవచ్చు.తనతో మాట్లాడితే ఇంత కాలం రహ స్యంగా వుంచిన నా ప్రేమ గురించి తెలిసిపోతుంది. ఒకవేళ హఠాత్తుగా వస్తే !! ఆ సందర్భం రాకుండా చూడమని వేడుకున్నా దే వుణ్ణి.అదే మొదటిసారి నేను దేవుణ్ణి కోరటం! అంత వరకూ నాకు ఎప్పుడూ ఏదీ స మస్యగా అనిపించ లేదు మరి. $$$ ఆ రోజు మథ్యాన్నం భోజనాలయ్యాక కూచుని మాట్లాడుకుంటున్నాం.నిజానికి పడుకుంటాను ఆ సమయంలో. పడుకునే ముందు మథ్యాన్నం,రాత్రి కూడా కనీసం పది పేజీలన్నా చదువుతా.మనవలు ఏవో అడుగుతుంటే చెప్తు న్నాను.మా ఆవిడ పడుకోమన్నా వాళ్ళతో మాట్లాడుతున్నా.నాకది ఇష్టం. అంతలో మా ఇంటి ముందు రెండు పెద్ద కార్లు ఆగాయి.ఎవరైవుంటారో అనుకుంటుంటే మా అ బ్బాయి బైటికి వెళ్ళాడు.నాకు కనిపిస్తోంది. ‘రావు గారిల్లిదేనా’ అని ఎవరో అడుగుతు న్నా రు.మా అబ్బాయి వాళ్ళని లోపలికి తీసుకొస్తు న్నాడు. అలా ముందొచ్చే కమలిని గుర్తు పట్టా ను.వయసు వల్ల కొంచెం ఒళ్ళు వ చ్చింది కానీ తనలో కళ తగ్గలేదు. నేను లేచి నుంచున్నాను.తన వెనకాల అతను భర్తేమో,ఆ వెనక ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడవాళ్ళు,ముగ్గురు చిన్నపిల్లలు వున్నారు. మొత్తం కుటుంబంతో వచ్చేసిందని ఆశ్ఛర్యపోతు న్నా. లోపలికి వస్తూనే ‘గుర్తుపట్టారా.నేను కమ లినిని.ఈయన మా ఆయన. ఆర్టీసీలో సీనియర్ మేనేజర్.ఇదిగో ఇతను నా పెద్ద కొడుకు,అతను రెండోవాడు.వీళ్ళిద్దరూ నా కోడళ్ళు.వీ ళ్ళు మన వళ్ళు.’ అని పరిచయం చేసింది.మా వాళ్ళం దరూ నమస్కారం చేస్తూ కుర్చీలు చూ పించారు కూచు నేందుకు. నేనూ మా వాళ్ళని పరిచయం చేసాను. తను మా తమ్ముణ్ణి యాదృఛ్ఛికంగా కలవడం అతని దగ్గర నా చిరునామా తీసుకోడం చెప్పింది. ఈలోగా మా కోడలు,అమ్మాయి టీ,బిస్కెట్లు తెచ్చారు.అవి తీసుకుంటూ వారితో మాట్లాడుతు న్నా. నాకు లోపల భయంగా వుంది ఎప్పుడు బాం బు పేలుతుందో అని. హఠాత్తుగా పేలనే పేలింది.’నేను,రావుగారు ప్రేమించుకున్నాం.పెళ్ళి కూడా చేసుకోవాలను కున్నాం.కానీ ఎందువల్లో అవలేదు.ఈ విషయం మా వారికి కూడా తెలుసు.‘ అంది మా ఆవిడ వంక చూస్తూ.నాకు గుండె దడదడలాడింది విస్ఫోటనం జరుగుతుందేమోనని. మా పిల్లలు కోడలు,అల్లుడు ముఖాలలో ఆశ్ఛ ర్యం కనపడుతోంది.మా ఆవిడ సంఙ్నలతో చెప్పిం ది నవ్వుతూ తనకూ తెలుసని.నాకు ఆశ్ఛర్యం వే సింది.తనకెలా తెలుసు?! మా అమ్మ చెప్పిం దా.ఇన్నేళ్ళలో ఎప్పుడూ తను నన్ను ఈ విష యం గురించి అడగలేదే! కాసేపు కూచున్నాక వాళ్ళు వెళ్ళిపోయారు. నే ను కమలినికి చెప్పలేదు ఎందువల్ల మా పెళ్ళి జర గలేదో.అలా చెప్తే లక్ష్మి తనని జాలితో పెళ్ళి చేసుకు న్నాననుకుంటుందేమోనని. $$$ రాత్రి పడక గదిలో అడిగాను నా ప్రేమ విష యం ఎలా తెలుసని.ఆమె నవ్వుతూ చెప్పిం ది.’అత్తయ్య పెళ్ళికి ముందు ఇదంతా చెప్పారు.నాకు ఇష్టమై తేనే పెళ్ళి చేస్తామన్నారు.లేకపోతే వేరే మంచి సంబంధం చూస్తామన్నారు.నాకు ఇష్టమే అని చెప్పా.కమలిని నాకు కూడా తెలుసనుకోవాలని ఇప్పుడు చెప్పా.’ తనే చెప్పింది మళ్ళీ ‘ఆమెని ప్రేమించినా నన్ను ఇన్నాళ్ళూ ఎంతో బాగా చూసుకున్నారు ఆమెతో పెళ్ళెందుకు కాలేదో నేను ఊహించగలను.’ నాకు ఆశ్ఛర్యమనిపించింది ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా తను ఆ విషయం నా దగ్గర తేనందుకు. నేను ఒక్కసారి ఆమెని దగ్గిరకి తీసుకుని గట్టిగా కౌగిలించుకుని ‘థేంక్యూ వెరీ మచ్’ అన్నాను.@

