అమ్మ! అమ్మ! అంటు పరిగెత్తుకొని వెళ్లి వంటగది లొ ఉన్న చంద్రమ్మ ని కౌగాలించుకుంది స్రవంతి, “ఏమైందే! అని అచ్చర్యంగా అడిగింది చంద్రమ్మ. “అమ్మ నాకు టీచర్ గా ఉద్యోగం వచ్చింది” అంటు చేతిలో ఉన్న ఫోన్లో మెరిట్ లిస్ట్ లొ వచ్చిన తన పేరుని చూపించింది స్రవంతి.. చంద్రమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి కూతురుని చుసి మురిసిపోయింది ఎం మాట్లాడాలో కూడా చంద్రమ్మ కి అర్ధం కాలేదు, పక్కనే ఉన్న సెల్ఫ్ లొ పంచదార డబ్బా తీసుకోని ఎంత తియ్యని వార్త చెప్పావ్ అమ్మ అంటు స్రవంతి కి కొంచం పంచదార నోటిలో వేసింది. హడావిడి గా వంటింట్లో నుండి బయటకి వస్తు… “రమ్య.. సుజాత…మీనాక్షి పిన్ని అందరు రండి మన స్రవంతి కి ఉద్యోగం వచ్చింది అంటు పెద్దగా కేకలు వేసింది చంద్రమ్మ.. ఇరుగు పొరుగు వాళ్ళు అందరు వచ్చి మంచి వార్త చెప్పావ్ చంద్రమ్మ.. స్రవంతి మీ కష్టాలు తీర్చింది దేవుడు నిన్ను ఎన్ని కష్టాలు పెట్టాడు, మంచి వాళ్ళకు ఎప్పుడు మంచే జరుగుతుంది అని అందరు స్రవంతి కి పొగిడే సరికి చంద్రమ్మ ఆనందానికి అవధులు లేవు…చూస్తుండగానే ఊరులో ఆ నోటా ఈ నోటా ఆ మాట చేరి ఊరుమొత్తం స్రవంతికి ఉద్యోగం వచ్చింది అని తెలిసింది… ప్రెసిడెంట్ గారి మనిషి ఒకరు వచ్చి పెద్దమనుషులు స్రవంతి కి సన్మాన సభ ఏర్పాటు చేశారు రేపు ఉదయం రాములవారి గుడికి మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్తాడు…. ఆరోజు రాత్రి భోజనాలు అయ్యాక స్రవంతి చంద్రమ్మ పడుకున్నారు, స్రవంతి కి ఉద్యోగం రావడం,రేపు గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన సన్మానం, చంద్రమ్మ ని నిద్రప్పటినియ్యడం లేదు.. టైమ్ చూసేసరికి అర్ధరాత్రి కావొస్తుంది…. చంద్రమ్మకి బుడి బుడి అడుగులు వేస్తూ ఇంట్లో తిరుగుతున్నా స్రవంతి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయ్, చుస్తుండగానే నా స్రవంతి ఎంత గొప్ప స్థాయికి చేరిందని…పాత జ్ఞాపకాలని నెమరువెసుకుంటూ ఉంది చంద్రమ్మ కూతురు ని పెంచడానికి తాను పడిన కష్టాలు బంధువుల సూటి పోటీ మాటలు చంద్రమ్మ కి ఇప్పటికి చెవిలో మారుమొగుతూనేవున్నాయ్ …… చంద్రమ్మ ఒక రైతు కూతురు, చంద్రమ్మది చాలా పెద్ద కుటుంబం పిన్నిలు బాబాయ్ లు, అత్తమామలు, అక్కలు చెల్లెల్లు, ఇలా ఇంటి నిండా జనంతో రోజు పండగ లా ఉండేది, చంద్రమ్మకి అక్క చెల్లి అంటు ఎవరు లేరు ఒక్కటే కూతురు కాని తన పిన్ని బాబాయ్ పిల్లల వల్ల ఎప్పుడు తాను ఒంటరి అని అనిపించలేదు. చంద్రమ్మ కి 7 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న జబ్బు చేసి చనిపోయాడు,కుటుంబం ముక్కలు అయ్యింది, చంద్రమ్మ వాళ్ళని వాళ్ళ బాబాయ్ పిన్ని అత్తమమాలు కలిపి ఇంట్లో నుండి వెళ్లగొట్టారు ,చంద్రమ్మ కి చదువు అంటే ప్రాణం,చంద్రమ్మ తండ్రి చనిపోయాక వాళ్ళ అమ్మ కూలి పనికి పోయేది, చంద్రమ్మ పదోతరగతి లొ వాళ్ళ స్కూల్ లొ అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి మంచి కాలేజీ లొ చేరి చదువుకుందాం అనుకునే లోపు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని చుసుకునే తన తల్లి ఆక్సిడెంట్ లొ మరణించింది. పెద్దమనుషులు మాట ప్రకారం ఇష్టం లేకుండానే చంద్రమ్మ ని పెంచడానికి వాళ్ళ బాబాయ్ ఒప్పుకున్నాడు, చంద్రమ్మ చదువు ఆగిపోయింది, ఇంట్లో పనులు చేసి బయట పొలం పనికి పోయేది, ఇంట్లోవాళ్ళ సూటి పోటీ మాటలు పడేది, ఒకసారి చంద్రమ్మ స్కూల్ మాస్టర్ చంద్రమ్మని చదివిస్తా అని ముందుకు వచ్చిన ఇంట్లో వాళ్ళు చదవనివ్వలేదు. చుస్తున్నడగానే చంద్రమ్మ పెళ్లిడు కి వచ్చింది,చంద్రమ్మ కి తనకంటే వయసులో 20 సంవత్సరాలు పెద్ద ఉన్న అతనితో పెళ్లిచేశారు,స్రవంతి 6 నెలలు కడుపుతో ఉన్నప్పుడు చంద్రమ్మ భర్త చనిపోయాడు, చంద్రమ్మ జీవితం అంధకారం అయ్యింది, పుట్టింటివాళ్ళు ఇంట్లో కి రానివ్వలేదు, చంద్రమ్మ ని చేసుకోడం వాళ్ళే తమ కొడుకు చనిపోయాడని నష్టాజాతకూరాలని అత్తింతి వాళ్ళు కూడా చేరానివ్వలేదు, చనిపోదాం అని అనుకుంది కాని కడుపులో ఉన్న బిడ్డ కోసం బతికింది, స్రవంతి కడుపులో ఉన్నప్పుడు కూడా చంద్రమ్మ పనికిపోయేది, పెరడు లొ ఆకుకూరలు పెంచి ఉదయం ఊరుమొత్తం తిరిగి అమ్మేది, తర్వాత పొలం పనికి పోయేది అలా కష్టపడి స్రవంతి ని చదివించింది. స్రవంతి తెలివైన అమ్మాయి బాగా చదివేది, మంచి మార్కులు తెచ్చుకొని ఫ్రీ సీట్ సంపాదించింది రాత్రి పగలు పుస్తకాలే ప్రపంచంగా బతికింది..ఒక వైపు తల్లికి పనుల్లో సాయం చేస్తూ ఇంకో పక్క చదువుకునేది, ఇరుగు పొరుగు వారికీ ట్యూషన్ లు చెప్తూ తల్లికి ఆసరాగా ఉండేది, చదువు మీద ఇష్టంతో మొదటి ప్రయత్నం లోనే ఉద్యోగం సంపాదించింది….. చంద్రమ్మ కి తన జీవితం మొత్తం ఒక్కసారి కళ్ళముందు కదలడింది కూతురు ని చుస్తూ నిద్రలోకి జారుకుంది, మరుసటి రోజు ఉదయం ఊరు పెద్దలు అందరు “స్రవంతి”కి సన్మానం జరిపించారు ఒక్కొక్కరు గా మాట్లాడుతూ స్రవంతి కి అభినందనలు తెలియజేస్తున్నారు, ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ స్రవంతి మనందరికి ఆదర్శం తన విజయం గురించి ఒక రెండు మాటలు ఆడాలిసింది గా ఆహ్వానించారు…… స్రవంతి మాట్లాడుతూ నేనూ ఈరోజు ఇక్కడ ఉన్న అంటే మా అమ్మే కారణం, మా అమ్మకి చదువు అంటే ప్రాణం కాని తనకు చదువుకోడం కుదరలేదు, మా కుటుంబ పరిస్థితి అంత అంత మాత్రమే అయినా నన్ను కష్టపడి నన్ను చదివించింది, “మీరు కొట్టె ప్రతి చప్పట్లు మీరు తెలిపే ప్రతి అభినందనలు అన్ని మా అమ్మకె సొంతం” నేను టీచర్ గా పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఆర్థికంగా కాని కుటుంబ పరిస్థితి ల వాళ్ళ కాని చదువు మధ్యలో ఆపేసిన మా అమ్మ లాంటి వాళ్ళకు ఆసరాగా ఉంటా అని చెప్పింది స్రవంతి. ఆ మాటలకు అక్కడ ఉన్న వారందరూ లేచి చప్పట్లు కొట్టారు తాను చదవలేక పోయిన తన కూతురిని చదివించనని, తన కూతురు మాట ఇచ్చినట్లుగా తనలాంటి ఒక్కరిని చదివించిన చాలు అంటు ఎంతో సంతృప్తి గా మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది చంద్రమ్మ. *************************

