అమ్మాయి లెచిపోతే... - రంగనాధ్ సుదర్శనం

if bride went out...

అమ్మాయి లేచిపోతే....

లక్ష్మీ... త్వరగా తెమలండి అవతల నిశ్చితార్ధానికి టైం అవుతుంది అని హడావిడి పెడుతున్నాడు సుధాకర్. అబ్బబ్బ బ్బ...మీరు కాస్తా ఓపిక పట్టండి, అన్ని సవ్యంగానే జరుగుతాయి. ఇదిగో ఇలా మీరు పెట్టే కంగారు వల్లే  ఇంకాస్త ఆలస్యం అయ్యేట్టుంది అని లక్ష్మీ విసుగ్గా అంటూ "సరే గాని మీరు వెళ్లి ఆ ఫంక్టన్ హాల్ దగ్గర పనులు చూసుకోండి ఒక్క అర్ధగంటలో అమ్మాయిని తీసుకొని మేమంతా అక్కడికి వస్తాము అంది. సరే..కానివ్వండి ఆలస్యం కావాలి అప్పుడు చెప్తా ఒక్కొక్కరి సంగతి" అంటూ కోపంగా వెళ్లి పోయాడు సుధాకర్. " అమ్మా! వీణక్కను త్వరగా రెడీ చేయండమ్మా..తెలుసుగా మీ నాన్న గారి సంగతి, అసలే కోపిష్టిమనిషి.. ఆలస్యమైందా ఇల్లు పీకి పందిరేస్తారు," అంటూ తొందర పెట్టింది లక్ష్మి. మొత్తానికి అనుకున్న సమయానికి చాలా వైభవంగా అంగరంగ వైభవంగా స్నేహ-సంజయ్ ల నిశ్చితార్థం జరిగింది.
అబ్బాయిని వారి కుటుంబాన్ని చూసి సుధాకర్ లక్ష్మి లతో పాటు వచ్చిన బందువులంతా  చాలా సంతోష పడ్డారు..
అంత శ్రీమంతులైనా ఎంత అణకువ గల కుటుంబం..ముఖ్యాఒగా అబ్బాయి, అంతటి ఆస్తి పాస్తులకు ఏకైక వారసుడైనా ఏమాత్రం డాబు-దర్పం లేకుండా సాదా సీదా గా అందరితో కలిసి పోతున్నాడు అనుకున్నారఒతా.
తల్లి తండ్రులు కూడా ఎంత మంచి వారు..నిశ్చితార్ధానికి  వచ్చిన మా చుట్టాలందరికి బట్టలు పెట్టి ఖరీదైన రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు.
అబ్బాయి వాళ్ళమ్మ  స్నేహకు నిశ్చితార్ధంలోనే పది తులాల బంగారు కాసుల పేరు మెడలో వేసింది.
పెళ్లికి మరో యాభై తులాల ఆభరణాలు చేయిఒచి వేస్తానని చెప్పింది.
అందరు అంత మంచి సంబంధం కుదిరినందుకు స్నేహ అదృష్టాన్ని పలురకాలుగా చెప్పుకున్నారు.
అబ్బాయి వాళ్ళ కోరిక ప్రకారం ఒక నెల రోజుల్లో ముహూర్థాన్ని ఖరారు చేశారు.
సుధాకర్ కూడా ముందుగానే అమ్మాయికి ఇస్తానన్న కట్నం డబ్బులన్ని వారికి ఇచ్చి వేసాడు.
పెళ్లి ఏర్పాట్లలో రెండు కుటుంబాల వారు తలమునకలయ్యారు.
లక్ష్మీ ..సుధాకర్ లు స్నేహకు అవసరమైన అన్ని వస్తువులు బట్టలు స్నేహ ఇష్ట ప్రకారం కొని పెట్టారు.
చెల్లెలు  వీణను తోడుగా తీసుకొని  స్నేహ తనకు ఇష్టమైన..పెళ్లి వస్తువులన్నీ షాపింగ్ చేసింది.
ప్రతి రోజు స్నేహ-సంజయ్ లు గంటల తరబడి ఫోన్ లో వీడియో కాల్స్ మాట్లాడుకునేవారు..లక్ష్మీ సుదాకర్.. వీణలతో కూడా సంజయ్ ఆప్యాయఒగా మాట్లాడేవాడు.
సంజయ్ ...స్నేహా లు  అలా...అన్యోన్యఒగా మాట్లాడుకోవడం చూసి లక్ష్మీ సుధాకర్ లు ఎంతో సంతోశించే వారు.
సంజయ్ ఒక లక్ష రూపాయలు ప్రత్యేకంగా స్నేహ అక్కౌంట్లో వేసి తన కిష్టమైనవి కొనుక్కోమన్నాడు.
అంత చాలా ఆనందంగా  ఉన్నారు.
ఆ రోజు అంతా సంతోషఒగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించి పడుకున్నారు.
కానీ వారి జీవితాలకు  ఆరాత్రి కాళరాత్రి అవుతుందని...వారి సంతోషాలకు ముగింపు పలుకుతుందని ఎవరూ వూహించలేకపోయారు.
అందరూ నిద్రిస్తున్న సమయంలో తనకు అవసరమైన వస్తువులు సర్దుకొని స్నేహ ఇంట్లోనుండి వెళ్ళిపోయింది.
తెల్లవారి లేచి చూసిన కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు.
జరిగినది తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
సుధాకర్ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు.. లక్ష్మీ గుండెలవిసేలా ఏడుస్తుంది.

స్నేహ స్నేహితల ద్వారా తెలిసిన  విషయం ఏమిటంటే  స్నేహ తన క్లాస్ మేట్ సుమన్ తో కలిసి  వెళ్ళిపోయిందిని నిర్ధారణ అయ్యింది.
సుధాకర్ సుమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళు కూడా ఈ విషయం తమకు తెలియదని, ఇది తమకు ఏమాత్రం అంగీకారం కాదని, సుమన్ కు తన చెల్లెలి కూతురును ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నామని..సుమన్ ను ఇక ఈ ఇంటి గడప కూడా తొక్కనివ్వమని తీవ్ర స్వరంతో చెప్పాడు సుమన్ తండ్రి.
ఈ లోగా పోలీస్  స్టేషన్ నుండి సుధాకర్ కు ఫోన్ కాల్ వచ్చింది..స్నేహ సుమన్ లు రిజిస్టర్ వివాహం చేసుకున్నారని..ఇరువురు మేజర్లు కాబట్టి వారికి మీ వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగించినా చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని ఏదైనా ఉంటే స్టేషన్ కు వచ్చి మాట్లాడమని చెప్పారు.
సుధాకర్, లక్ష్మీ... వీణ మరికొందరు బంధువులు కలిసి స్టేషన్ కు వెళ్లారు.
పోలీసులు స్నేహ సుమన్ లకు మీ వల్ల ఎలాంటి హాని ఉండదని లిఖిత పూర్వకంగా.. వ్రాసి ఇవ్వమని సుధాకర్ ను కోరారు.
అలాగే రాసిస్తాను కానీ ...ఒక్కసారి మా అమ్మాయితో మాట్లాడే అవకాశం ఇప్పించాలని ఇన్స్పెక్టర్ ను కోరాడు సుధాకర్.
పోలీసులు స్నేహ..సుమన్ లను స్టేషన్ కు పిలిపించారు..ఇద్దరు వారి స్నేహితులతో కలిసి చాలా ధైర్యంగా  స్టేషన్ కు వచ్చారు.
తల్లి తండ్రులను చూసి చూడనట్లు స్టేషన్ లోకి వెళుతున్న స్నేహలో, ఎంతో అపురూపంగా కని పెంచిన తల్లిదండ్రులను..మోసం చేశాననే భావన కానీ..వారికి తలవంపులు తెచ్చాననే పశ్చాతాపం కానీ విసుమంతైనా కనిపించ లేదు.
స్నేహను చూడగానే లక్ష్మి బిడ్డను దగ్గరికి తీసుకొని బోరుమని విలపించింది.
ఎందుకు చేశావమ్మా.. ఇలా ఒక్క మాటైన చెప్పకుండా ఎంత పని చేశావమ్మా అని తల బాదుకుంటూ ఏడ్చింది.
"అమ్మా..ఇప్పుడేమైంది..మీకు కావాలిసింది నా సంతోషమే కదా..నేనిప్పుడు  సంతోషంగానే వున్నాను కదా, మరెందుకు ఈ ఏడుపులు.. పెడబొబ్బలు" అంది నిర్లక్షంగా.
"నన్ను సుమన్ చాలా బాగా చూసుకుంటున్నాడు నాకే ఇబ్బంది లేదు మీరు అనవసరంగా రాద్ధాంతం చేయకండి అంది," చాలా కూల్ గా.
"అక్కా.. ప్లీజ్...వద్దక్కా అమ్మా..నానా చాలా బాధ పడుతున్నారక్కా.. వచ్చేయక్కా ఇంటికి పోదాం" అంటూ ఏడుస్తూ...అక్కను బ్రతిమిలాడింది వీణ.
కానీ స్నేహ కోపంగా..వీణను చూస్తూ.. "ఆపుతావా నీ సోది...ఓవర్ యాక్షన్ చేయకు" అంటూ..గట్టిగా మందలించింది.
సుధాకర్ స్నేహను దగ్గరకు తీసుకొని ఎందుకు నానా ఇలా చేసావు మన పరువేం కావాలను కున్నావురా....మన కుటుంబం గురించి చెల్లె భవిష్యత్ గురించి ఆలోచించావా, దాని బ్రతుకేం కావాలనుకన్నావురా..,
సంజయ్ ఫోన్ చేసి మాటి మాటికి నీ గురించి అడుగుతున్నాడు..ఏమని చెప్పమంటావురా...అసలిక్కడిదాక ఎందుకు తీసుకొచ్చావు..ముందే చెప్పొచ్చుగా నానా.." అంటూ దీనంగా అడుగుతూ..ఏడ్చాడు.
"నానా..చెల్లికి మీరున్నారుగా..నా మంచే మీరు కోరుకుంటే..ఇక ఆపేయ్యండి ఇవన్నీ..కావాలంటే సంజయ్ కు ఫోన్ చేసి నేనే చెపుతాను..నేను బాగానే వున్నాను కదా..సుమన్ నన్ను బాగా చూసుకుంటాడు
ఆ నమ్మకం నాకుంది, మీరు నా విషయంలో నిశ్చింతగా ఉండండి" అని చెప్పింది.
"లేదు ..నానా.. మేము నీ మంచి కోసమే కదా చెప్పేది..సుమన్ కు ఏ ఉద్యోగం లేదమ్మా..నిన్నెలా పోషిస్తాడు చెప్పు..జీవితమంటే తెలియనిదానివమ్మా...అనుభవంతో చెబుతున్నాను. వద్దమ్మా.. జరిగింది ఒక పీడకలగా మరచి పో అమ్మా..పదిమందిలో నేను తలెత్తుకోలేక పోతున్నానమ్మా.."అంటూ ఏడ్చాడు.
"నానా అయితే మీ పరువు కోసం, చెల్లెలి భవిష్యత్ కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా..అంటే మీకు నా కన్నా..మీ పరువు ప్రతిష్టాలే ముఖ్యమా"..అంటూ..వితండ వాదం చేసింది స్నేహ.
బంధువులు కూడా స్నేహకు అనేక విధాలా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
"అమ్మా..సుమన్ నువ్వనుకున్నంత మంచివాడు కాదమ్మ  డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లున్నాయి, గతంలో ఒకసారి వేరే  అమ్మయితో అఫైర్స్ ఉన్నాయని గొడవలు కూడా అయ్యాయి" అని నచ్చచెప్పారు.
కానీ..."ఇవన్నీ మీరు  మమ్మల్ని విడదీయటానికి చెపుతున్నారని నాకు తెలుసు.....మీరెన్ని చెప్పినా నేను నమ్మను..గాక నమ్మను, నాకు సుమన్ అంటే ప్రాణం" అంది స్నేహ సుమన్ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ...
స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చాడు.. "చూడమ్మా....నేను చాలా కేసులు చూసాను ఇప్పుడున్నట్లు ఉండదు ఆరు నెలలలో అంతా తారుమారవుతుంది..మళ్ళీ నువ్వు దిక్కు లేని దానిలా ఇదే స్టేషన్లో నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు.. నీ మెడలో కనీసం బంగారు గొలుసు వేయగలిగాడా వాడు, ఈ పసుపు తాడు తప్ప జీవితంలో నీకింకేది మిగలదు. అదే మీ అమ్మ నానలైతే నీ పెళ్లి ఇలాగే చేసేవారా...నిన్నిలాగే ఉంచే వారా..రేపు నీకు కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళతావు, రేపు నువ్వు గర్భవతివైతే ఎవరు చూసుకుంటారు..చెప్పు, అమ్మ ప్రేమ నీకెక్కడ దొరుకుతుంది...చెప్పు. కనీసం నీ అత్త మామల ఆదరణ కూడా నీకు దక్కలేదు..వాళ్ళు కూడా  నిన్ను ఇంట్లోకి  రావద్దంటున్నారు..రేపు ఎక్కడి కెళతావు, బంగారంలాంటి జీవితాన్ని బజారుపాలు చేసుకోకమ్మా...వాడికేంటమ్మా నిన్ను నడి బజార్లో వదిలేసి వెళ్లిపోతాడు అని నచ్చచెప్పాడు.
అరేయ్..ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావురా..ఏం చేద్దామని పెళ్లి చేసుకున్నావురా...మీ అయ్యా అవ్వను కూడా ఒప్పిఒచుకోలేక పోయావు, ఎలా బ్రతుకుతార్రా..ఇప్పటికైనా వదిలేయి ఆ అమ్మయి జీవితం నాశనం చేయకురా అన్నాడు.
సుధాకర్ వెళ్లి సుమన్ కాళ్ళు పట్టుకున్నాడు..నా బిడ్డను వదిలేయమని ప్రాధేయపడ్డాడు..
కానీ..సుమన్ నిర్దయగా కాదు కూడదని తెగేసి చెప్పాడు..మేం కలిసే వుంటామని...మమ్మల్ని విడదీయాలని చూస్తే..మీ అందరి పేర్లు రాసి చచ్చిపోతామని బెదిరించాడు.
చూడమ్మా.. ఆడపిల్ల పుడితేనే భారమనుకునే ఈ రోజుల్లో...ఒక అమ్మాయిని కని పెంచిన తల్లిదండ్రలను..ఇంత ఘోరమైన స్థితికి దిగజార్చకఒడమ్మా...గుండెలపై ఆడించిన నేరానికి వాళ్ళ గుండెలు పగలగొట్టాలని చూడకండమ్మా అని...మందలించి ..ఇక ఏమి చెప్పినా లాభం ఉండదని...స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా ..మీ ఖర్మ  ఇక వెళ్లండి అన్నాడు.
సుధాకర్ లక్ష్మీ లు చివరిసారిగా బిడ్డను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చారు...వద్దమ్మా మా మాట వినమ్మా మోసపోతావమ్మా..మా తల్లివి కాదూ..మా మాట వినమ్మా అంటూ స్నేహను పట్టుకొని బాగా ఏడ్చారు.
కానీ స్నేహ...మొండిగా సుమన్ వైపే మొగ్గింది చావైనా బ్రతుకైనా..ఇక సుమన్ తోనే అని గట్టిగా చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది.
ప్రేమ మత్తు ఆవహించిన వారికి ఆ ప్రేమ తప్ప మరేది కనిపించదు వినిపించదంటారు, అది అక్షర సత్యం.
చేసేది లేక అంతా ఇంటి కి వచ్చారు. సుధాకర్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.
ఎలా ఈ విషయాన్ని సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ కి చెప్పడం..ఏమని చెప్పాలి...ఎలా ఎలా అని మదన పడుతున్నాడు. అప్పటికే సంజయ్  వాళ్ళు కార్డ్స్ కూడా ప్రింట్ చేశారు..ఈ పరిస్థితిలో చెప్పడం ఎలా..అని బాధపడ్డాడు.
పదే.. పదే..సంజయ్ ఫోన్ చేస్తున్నాడు..ఎప్పటికప్పుడు ఎదో ఒకటి చెప్పి మభ్యపెట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. సుధాకర్ చాలా బాదపడుతూ పని ఉందని చెప్పి ఉదయమే బైటికి వెళ్ళాడు..
రక రకాల ఆలోచనలతో సుధాకర్ మనసు బరువెక్కింది. ఎటు నడుస్తున్నాడో ఎంత సమయం గడిచిందో తెలియకుండా నడుస్తున్నాడు.
ఇంట్లో లక్ష్మీ వీణ ఎంత సేపైనా సుధాకర్ ఇంటికి రాక పోవడంతో చాలా కంగారు పడుతున్నారు.
ఇంతలో కారులో వచ్చిన సంజయ్ ను చూసి లక్ష్మీ వీణ లు జరిగిన విషయమంతా చెప్పి బోరున ఏడ్చారు.
వెంటనే వీణ ని వెంట తీసుకొని సంజయ్ వెతకడం మొదలు పెట్టాడు..ఎక్కడ సుధాకర్ కనిపించక పోడంతో..వీణ విపరీతంగా ఏడుస్తుంది...ఆమెను సముదాయించడం సంజయ్ వల్ల కావటం లేదు.
సంజయ్ కారు రైల్వే పట్టాల దగ్గర ఆపి..గబ గబా నడుస్తున్నాడు...
దూరంగా సుధాకర్ ట్రైన్ కు ఎదురుగా నడుస్తున్నాడు..ఒక్క క్షణం సంజయ్ వీణ ల గుండె ఆగినంత పనైంది.
సంజయ్  శక్తినంతా కూడగట్టుకొని వేగంగా వెళ్లి సుధాకర్ ను రెప్ప పాటులో పక్కకు లాగాడు ట్రైన్ వేగంగా వారి పక్క నుండి దూసుకెళ్లింది.
సుధాకర్..సంజయ్ ను పట్టుకొని గుండెలు అవిసేలా ఏడుస్తున్నాడు.. "బాబు నన్ను క్షమించు బాబు...నీకు చాలా అన్యాయం చేసాను బాబు..నా ముఖం నీకు ఎలా చూపించాలి బాబు..దానిని కన్న నేరానికి నాకు చావు తప్ప మరో దారి లేదు బాబు" అంటూ..ఏదేదో మాట్లాడుతూ ఏడుస్తూనే ఉన్నాడు.
నిజమే పరువుగల మనిషికి.. మాట కన్నా ప్రాణం ఎక్కువ కాదు కదా..వీణ సంజయ్ లు మెల్లగా సుధాకర్ ను ఇంటికి తీసుకొచ్చారు.
లక్ష్మీ జరిగింది తెలుసుకొని "ఏవండి ఎంత పని చేసారండి మీరు లేకుండా మీమెలా వుంటామనుకున్నారండి..చావాలనుకుంటే అందరం కలిసే చద్దాంమండీ" అంటూ భర్తను పట్టుకొని ఏడ్చింది.
"అంకుల్..మీరెవరూ బాధ పడకండి..జరిగిన విషయమంతా నాకు తెలుసు..అమ్మా నానాలను ఒప్పించి ఇదే ముహూర్థానికి మీ అందరికి ఇష్ట మైతే..వీణను పెళ్లి చేసుకుంటాను బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి, స్నేహ చేసిన తప్పుకు  మీరెందుకు బాధపడతారు..అని చెప్పి వెళ్లి పోయాడు.
లక్ష్మీ సుధాకర్ ఇద్దరు వీణ వంక చూసారు..
అమ్మ నీకు మనస్పూర్తిగా  ఇష్టమైతేనే చెప్పమ్మా...నీ మనసులో ఇంకేదైన ఉంటే వద్దమ్మా..అక్కలా మా గుండెలు పగల గొట్టొద్దమ్మా" అన్నారు లక్ష్మీ సుధాకర్లు..
"లేదు నానా...అలాంటిదేమి లేదు..మీ ఇష్టం" అంది వీణ.
సంజయ్ వీణ ల వివాహం అదే ముహూర్తానికి ఘనంగా  జరిగింది.
కొసమెరుపు ఏంటంటే...
వీణ..తన ప్రేమను కుటుంబం కోసం  త్యాగం చేసింది..వీణను ప్రేమించిన విశ్వాస్ కూడా పరిస్థితులను అర్ధం చేసుకున్నాడు.
ప్రేమ మనతో పాటు మన కుటుంబాలను కూడా సంతోషపెట్టాలి, కానీ బాధపెట్టకూడదు. మన ప్రేమ నిజమైతే మనం ఈ పరిస్థితిలో విడిపోవటమే మంచిది. అని వీణ విశ్వాస్ ఇద్దరు చిన్న వాళ్ళైనా పెద్దమనసుతో ఆలోచిఒచి తమ ప్రేమను త్యాగం చేసి విడిపోయారు..
అవును కదా నిజమైన ప్రేమ త్యాగాన్ని కూడా సంతోషంగా...భరిస్తుంది.
 

 

మరిన్ని కథలు

love affections
మమతానురాగాలు
- మల్లవరపు సీతాలక్ష్మి
Madhava seva
మాధవ సేవ (బాలల కథ)
- సరికొండ శ్రీనివాసరాజు
Bawa Bawa rose water
బావా బావా పన్నీరు....
- గొర్తి.వాణిశ్రీనివాస్
New cousins
కొత్త కోడలు
- యు.విజయశేఖర రెడ్డి
i hate my room mate
ఐ హేట్ మై రూమ్మేట్
- గంగాధర్ వడ్లమన్నాటి
gurupreet singh
గురుప్రీత్ సింగ్
- యు.విజయశేఖర రెడ్డి
pity sundaram
పాపం సుందరం!
- పద్మావతి దివాకర్ల
Listening to what is being said
చెప్పుడు మాటలు వింటే...!
- మీగడ.వీరభద్రస్వామి