ప్రతిరోజూ పండగ రోజే.... - మీగడ.వీరభద్రస్వామి

everyday like a festival

సుబ్బరాజు బజారునుండి వచ్చి భార్య శ్వేత చెప్పినట్లే వేడి నీళ్లతో స్నానం చేసి,బట్టలు కూడా వేడి నీళ్లలో జాడించి,ఉతికిన టవల్ చుట్టుకొని,తాను ఉతికిన బట్టల్ని ఆరుబయట ఎండలో ఎండబెట్టి శ్వేత ఇచ్చిన ఉతికిన పొడి బట్టలు కట్టుకొని...

"కాసేపు ప్రపంచాన్ని చూసి వద్దామోయ్" అంటూ... టీవీ ఆన్ చేసి,"శ్వేతా ఈరోజు మన రైతు బజార్ లో సామాజిక దూరం అమలు చెయ్యడం చాలా భేషుగ్గా వుందోయ్...అంతేకాదు మన జనాలు కూడా కరోనా కట్టడికి మంచి అవగాహనతో ఉంటున్నారు" అని అన్నాడు.

"నిజమేనండి ఈ రోజు మన కుళాయి దగ్గర కూడా సామాజిక దూరం తూచా తప్పక అమలుచేసాం,అయినా ఆరోగ్యమంటే ఎవరికి శ్రద్ధ ఉండదు చెప్పండి!...అందుకే అందరూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు"అని అంది శ్వేత.

"శ్వేతా నువ్వు సహకరిస్తే.. ఈ సెలవుల్లో ఒక మంచి పని చెయ్యలనుకుంటున్నాను"అని అన్నాడు సుబ్బరాజు. "అదేంటి అలా అంటారు ఏమి చేద్దామో చెప్పండి మీమాట ఏదైనా కాదన్నానా!"అని అంది శ్వేత.

"ఏమీ లేదోయ్ మన స్తోమతుకు తగ్గట్టుగా రోజుకి కనీసం పది భోజనాలు తయారు చేసి రోడ్డు మీద డ్యూటీ చేస్తున్న హోమ్ గార్డ్స్ కి,పోలీసులకి అందజేయాలని అనుకుంటున్నాను" అని సుబ్బరాజు అంటుండగానే...

"సరిపోయింది ఈ విషయం నేనే మీకు చెబుదాం అనుకుంటున్నాను,మీరు కూడా అదే అన్నారు...మీకు అభ్యంతరం లేకుంటే రోజుకి పదికాదు ఇరవై భోజనాలు ఇద్దాం"అని అంది శ్వేత నవ్వుతూ...

"దట్స్ గుడ్! ఒక్కటీ మాత్రం గుర్తుపెట్టుకో,పోలీసులు, హోమ్ గార్డ్స్ గౌరవ ప్రధమైన స్థానంలో వున్నారు,వాళ్లకు భోజనాలు మంచి శుచీ శుభ్రత రుచి రూపంతో ఉండాలి సుమా..."అని అన్నాడు సుబ్బరాజు."బలేవారే ఆ విషయం నాకు చెప్పాలా..."అని అంది శ్వేత."ఇంకేమ్ ప్రొసీడ్"అంటూ తానూ భార్యతో పాటు వంటగదిలోకి చేరాడు సుబ్బరాజు.

మరిన్ని కథలు

Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ