కొంత మంది  పిల్లలు ముందు తరం దూతలు - భాస్కర్ కంటేకర్

ome children are messengers of the previous generation

అందరూ అజంతా గుహలు చూస్తూ ఆనందంగా తన్మయత్వంలో పరవశిస్తూ ఉన్నారు. ఒక మోడ్రన్ జంట ,ఇద్దరు జీన్స్ షార్ట్స్ లలో ఉన్నారు.ఇద్దరు మంచి కుటుంభం నుంచి వచ్చినట్లున్నారు.వారికి ఒక అబ్బాయి కూడా. అబ్బాయి చాలా చలాకీగా కనిపిస్తున్నాడు.ఇక తల్లి తండ్రులు ఆ బుడతన్ని అదుపుచేయలేక పోతున్నారంటే నమ్మండి.అల్లరే అల్లరి! అలా ఒక్కో గుహ చూస్తూ , నేను మా ఆవిడ నడుస్తున్నాము. మా ముందు ఆ జంట, ఆ చిన్న అబ్బాయి అందరమూ ఒకటే సమూహం. మాకంటే ముందు ఉన్న గ్రూపు లోని ఒక యువకుడు , అరటి పండు తిని తొక్కను అలాగే నేలపై విసిరేసాడు. అంతే దానిని మా గ్రూప్ లో ఉన్న ఆ బుడతాడు గమనించాడు.తన తల్లి చేతిని ఎలాగో అలాగా వదిలించుకొని రివ్వున పరిగెత్త సాగాడు. మేమందరం ఆశర్యగా చూస్తున్నాము.మాకు అర్థం కాలేదు, ఆ అబ్బాయి ఎక్కడకు పరిగేడుతున్నాడో, కానిఅతను పరిగెత్తే దిశను బట్టి మాకు ఇట్టే తెలిసిపోయింది. ఆ అబ్బాయి వెంట తల్లి తండ్రులు అతన్ని పట్టుకోడాని పరిగెడుతున్నారు. ఆ గిడుగు వారికెప్పుడు దొరకాలి. మొత్తం మీద పెద్దలకు దొరక్కుండా పరిగెత్తి, ఆ అరటి తొక్క దగ్గరికి వెళ్ళాడు.ఆ తొక్కను తన చేతిలోకి తీసుకున్నాడు. వాల్ల మమ్మీ, "చీ , డోంట్ టచ్" అంటూ వెనక నుండి అరవసాగింది. అయిన అవి ఏవి పట్టిచుకోకుండా వాడు ఆ అరటి తొక్కలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మాకైతే అర్థం కాలేదు, ఆ పిల్లవాడు ఆ అరటి తొక్కను ఎందుకు తీసుకున్నాడో. ఒకటి మాత్రం మేమూహించాము, వాని వీపు విమానపు మోత మొగబోతుందని. కామి ఆశ్చర్యo, ఆ పిల్లవాడు ఆ అరటి తొక్కని పుచ్చుకొని , తన దిశను మార్చి వేరొక వైపు పరిగెత్తి సాగాడు. వెంటనే తల్లి కూడా పరిగెడుతుంది. ఆ రాళ్ళ మీద ఎక్కడ పడతాడొ అని చూసే వాళ్లందరికీ ఒకటే ఉత్కంఠ. బహుశా , అరటి పళ్లంటే ఆ పిల్లవాడికి ఇష్టమేమో. అయిన పిల్లలని వెంట వేసుకుని వచ్చేటప్పుడు, తినడానికి ఏమైనా వెంట తెచ్చుకోవాలి, లేదంటే ఇలాంటి కోతి పనులే చేస్తారని మా ఆవిడ అంది. అవును అన్నట్లు పక్కవాళ్లు కూడా పత్తాసు పలికారు. ఇంతలో , ఆ అవును పిల్లలను పెంచే విధానంలో కూడా ఉంటుంది అని మా గ్రూప్ లోని మరో అతను అన్నాడు. నేను మాత్రం ఆ పిల్లవాడి వైపే చూడసాగాను. ఆ అరటి తొక్కనుతీసుకొని పరిగెత్తి అక్కడ అమర్చబడినచెత్త బుట్టలోవేశాడు. మా అందరికి ఆశ్చర్యంవేసింది. అలా ఆ అరటి తొక్కను చెత్తబుట్ట దాఖలా చేస్తూ ఉంటే ,ఆ పేరెంట్స్ అతనివైపు గోముగా చూడసాగారు. ఆ అరటి తొక్కను చెత్త బుట్ట లో వేసి మాత్రం, తల్లి దగ్గరికి వచ్చాడా లేదే మళ్ళీ ఇంకో వైవుకు పరుగు లంకించుకున్నాడు. 'ఇపుడెక్కడకి అబ్బా' అని నివ్వెర పోవడం మా వంతైపోయింది. ఈసారి ఇంకెవరైన అరటి పళ్ళు తిని తొక్కలు పారేసారా అని అటు ఇటు చూసేలోపల మా దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పిల్లవాడు బలిష్టంగా ,అందంగా ఉన్నాడు.మంచి ఆక్టివ్.అంతే కాదు తొక్కలను చెత్త బుట్టలో వేయాలనే సంస్కారం కూడా కలిగి ఉన్నవాడు. "ఎస్క్యూజ్ మీ అంకుల్ "అంటూ మా పక్కన ఉన్న నీటి కొలాయి దగ్గరికెళ్లి చేతులు కడుక్కొని, రివ్వున వాళ్ళ అమ్మన్నానల దగ్గరికి పరుగెత్తాడు. చూడటానికి ఎంతో ముచ్చట వేసింది. రాబోయే తరం నుండి కూడా మనం నేర్చు కోవాల్సి ఉంటుంది. కొంత మంది పిల్లలు ముందు తరం దూతలు.

మరిన్ని కథలు

The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ