బలిపీఠం దిమ్మతిరిగింది - కందర్ప మూర్తి

బలిపీఠం  దిమ్మతిరిగింది

సంక్రాంతి పండగ రోజు లొచ్చాయి.అదొక ప్రశిద్ధ కోడిపందాల నిర్వహణ కేంద్రం. లక్షల రూపాయలు కోడి పందాల మీద బెట్టింగులు జరుగుతుంటాయి. పట్నాల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, సినిమారంగ ప్రముఖులు వచ్చి విలాసవంతమైన విడుదుల్లో ఉంటూ పండగ మూడు రోజులు మద్యం, పందెం కోళ్ల మషాల ఫ్రైలతో మజా చేసి వెల్తూంటారు.

వారి వినోద వేడుకల కోసం నెలల ముందు నుంచి తర్ఫీదు ఇచ్చిన పందెం కోళ్లు చురకత్తుల వాడి, మద్యం మత్తులో శరీర అంగాంగాలు రక్తం చిందిస్తూ కొన ఊపిరి ఉన్నంత వరకూ పోరాడుకుంటు చివరికి బలిపీఠం ఎక్కి పట్నం బాబుల మందు పార్టీలకు , వినోదాలకు ఆహుతి అవుతాయి. పందేల కోసం అనేక మగజాతి కోడి పుంజుల్ని వాటి పుట్టుక జాతకాలు, శరీర దారుడ్యం, వంటి సుళ్లు, కాలిగోళ్ల సామర్థ్యం, శరీర రంగుల ప్రకారం ఎంపిక చేసి నెలల ముందు నుంచి నిపుణులతో కత్తులు లేకుండా పందెంలో తర్ఫీదు ఇవ్వడం, రోజూ పరుగు పందేలు, నీటిలో ఈతలు, బరువు తూకం, జంతు డాక్టర్ చేత ఆరోగ్య పరీక్షలు, రోగ నిరోధక యాంటీబయోటిక్ మందులు, శరీర దారుడ్యానికి రోజు కాజు పిస్తా మొక్కజొన్న రొయ్యల పొట్టు వేరుశనగ నెయ్యి చెక్కీలు పూట పూటకు తినిపిస్తు, రాత్రిళ్లు మందు మత్తులో వెచ్చగా ఉంచుతూ రాజభోగాలతో పందేల సమయం వరకు కంటికి రెప్పలా కాపాడు తుంటారు పందెం కోళ్ల నిర్వాహకులు.

అటువంటి పందెం కోళ్ల శిక్షణా కేంద్రం అది. రకరకాల రంగుల పందెం కోళ్ల కాళ్లను నూలు తాళ్లతో కట్టి విశ్రాంతి కోసం చెట్ల కింద కట్టి ఉంచారు. పందెం కోళ్లు వాటి వాటి సాధక బాధకాలు చెప్పుకుంటు తమ జీవన ప్రమాణం లెక్కించు కుంటున్నాయి. తెల్లని రంగు మీద తెల్లని చుక్కలున్న కోడిపుంజు తమది బొబ్బిలి వంశమనీ, ఎరుపు మీద నల్లని చారలు మెడ మీద తెల్లని చుక్కల ఠీవి పింఛంతో ఉన్న మరో కోడిపుంజు తనది పల్నాటి వంశమని , రెక్కలు తోక మీద పంచరంగుల వర్ణం పుంజు రెడ్డి రాజుల వంశమని తమ వంశ చరిత్రలు చెప్పు కుంటున్నాయి. మా వంశంలో ఓటమి అన్నది లేదని ఎవరికి వారు వంశ చరిత్రలు చెప్పుకుంటున్నాయి.

వాటి మాటలు విన్న ఒక అనుభవం గల పందెం కోడిపుంజు అందర్నీ ఉద్దేశించి, " మన మరణ శాసనం మనమే రాసుకుంటున్నాం.మద్యం మత్తులో మనలో మనమే కత్తులు నూరుకుంటూ బలిపీఠం ఎక్కుతున్నాం.ఇలా మన తరం పోతే ఇంకో తరం ఈ మనుషుల స్వార్దానికి బలైపోతున్నాము. మనకు చావు ఎలాగు తప్పదు. కనక భయంకర నరక యాతనకంటే ఒక్క సారే చస్తే నయం కదా ! దీనికొక ఉపాయం ఆలోచించాను. అదేమిటంటే, మనమందరం ఐక్యంగా ఉంటే ఈ గండం నుంచి గట్టెక్క వచ్చు. ఇప్పటి వరకు కత్తులు లేకుండా మన మద్య పోట్లాటలు పెడుతున్నారు. రేపు పందేలప్పుడు మన కాళ్లకు పదునైన చురకత్తులు కడతారు. మస్తుగా మద్యం తాగిస్తారు. మనల్ని రెచ్చగొట్టి పోరాటానికి పురిగొల్పుతారు. మనం సహనం కోల్పోకుండా ఒక్క మాట మీద ఉండాలి. కాళ్లకి కత్తులు కట్టిన తర్వాత ఎంత రెచ్చకొట్టినా రోషం తెచ్చుకోకుండా కత్తి కట్టిన కాళ్లు ఎత్తకుండా మైదానంలో ఒకరికొకరు ఆప్యాయంగా వాటేసుకుందాం. ఈ మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సహనం కోల్పోవద్దు." అని అన్ని పందెం కోళ్ళకు ఉద్భోదన చేసింది. వాటి మద్య ఐక్యతా భావం నూరిపోసింది.

పండగ రోజులొచ్చాయి. మైదానంలో టెంట్లు వేసి కోడిపందేల సన్నాహాలు మొదలెట్టారు. జన సందోహం పెరిగింది. పందాలు మొదలయాయి. గెలుపు కోడిపుంజుల మీద వేల రూపాయలు బెట్టింగులు కాసేరు. నా కోడి పుంజు గెలుస్తుందంటే నేను కాసిన పుంజే గెలస్తుందని సవాల్ విసురు కుంటున్నారు. పందెం కోళ్లు మాత్రం కత్తులు కట్టిన కాళ్లు పైకి ఎత్తకుండా మెడకి మెడ ఆప్యాయంగా వాటేసుకున్నాయి. పందెం కోళ్ల శిక్షకులు నిర్వాహకులు విస్తుపోయారు. బెట్టింగ్ రాయుళ్ళు స్థానువుల్లా నిలబడ్డారు. కోళ్ల శిక్షకులు ఎంత రెచ్చగొట్టినా ఫలితం లేక పోయింది. కోళ్లు పోరాటం లేకుండా ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్నాయి.

ఇంతలో జీవకారుణ్య సమితి ఫిర్యాదుతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు పందెం నిర్వాహకుల్ని, పందెం కోడిపుంజుల్నీ స్టేషన్ కి తీసుకెళ్లి సెల్ ఒకగదిలో కోళ్లను మరొక గదిలో శిక్షకుల్నీ ఎదురెదురుగా ఉంచారు పోలీసులు. నిర్వాహకులు ఏడుస్తూంటే పందెం కోడిపుంజులు విజయ దరహాసంతో ఆనందం కనబరిచాయి.

* * *

బలిపీఠం దిమ్మతిరిగింది

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి