సాగర మథనం - ఎన్. ఏ. నాయుడు

Saagara Madhanam

అయన ఒక పెద్ద ఆఫీసర్. ఒక ప్రమాదం లో పెద్ద గాయం అయ్యి హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. ఆయనకి రక్తం కోసం అందరు వెతుకుతున్నారు. ఎవరి రక్తం సరిపోవటం లేదు. ఎందుకంటే అది తక్కువగా దొరికే రక్తపు తరగతి ఏ బి నెగటివ్. అతని ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉండటం వలన వాళ్ళు వెంటనే రాలేరు. సామాన్యంగా ఈ రక్తపు తరగతి వారికి తన పిల్లల రక్తం బోన్ మారో మాత్రమే సరిపోతుంది. చివరికి వాళ్ళ మరదలు వఛ్చి మా అబ్బాయి రక్తం చూడండి ఎందుకంటే మేనమామ కదా సరిపోతుందేమో అని. ఆ అబ్బాయి రక్తం పరీక్షించిన తరువాత డాక్టర్ గారు ఆశ్చర్య పోయారు. అన్ని రకాలుగా అతని రక్తం బోన్ మారో సరిపోయాయి. అతని రక్తం, బోన్ మారో తో ఆఫీసర్ ని రక్షించ డానికి ప్రయత్నిస్తారు. అందరు ఆనంద పడ్డారు. ఆఫీసర్ గారి భార్య ఎంతో కృతఙయతలు చెప్పింది. దానికేముంది అక్క మా భాద్యత అది. మా బావని రక్షించే బాధ్యత మాకుంది అనేసింది.

డాక్టర్ గారికి మాత్రం ఏంటో ఆశ్చర్యం వేసింది. ఇంత కరెక్ట్ గ అన్ని పారామీటర్లు ఎలా సరిపోతాయి అని. దీనిమీద ఏదైనా పరిశోధన చేస్తే మంచిది అనుకుంటాడు. ఎందుకైనా మంచిది అని మరదలిని పిలిచి బాబు విషయాలు అడుగుదామని ఆమెని తన ఛాంబర్ లోకి పిలిచి బాబు వివరాలు అడుగుతారు. బాబు పుట్టినప్పుడు ఆఫీసర్ గారు ఎక్కడ ఉన్నారు ఇటువంటివి. కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పిన తరువాత డాక్టర్ ఇక నాకు ఏ ప్రశ్నలు అడగకండి అని ఛాంబర్ నుండి వెళ్ళిపోతుంది. డాక్టర్ గారికి అంతా అర్ధం అయింది. తన మనసు నొప్పించ కూడదని ఇంకా ఏమి అడగరు. కానీ మరదలికి మాత్రం పాతిక సంవత్సరాలు ముందు జరిగిన సంఘటనలు అన్ని గుర్తుకొచ్చ్చాయి. తనలోని సాగర మధనం గుర్తుకొస్తుంది.

బావకి తానేంటో ఎంతో ఇష్టం. తనకి కూడా బావ అంటే ఎంతో ఇష్టం. అందరు చిన్నప్పుడు భార్య భర్తలు లాగే చూసే వారు. వాళ్ళ అమ్మ బావ నాన్న, అన్న చెల్లెల్లు తరువాత వీళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళ కుటుంబాలు ఊర్లో పంచాయితీ ఎన్నికల్లో రెండు పార్టీలు అయిపోయి మరి కలవలేక పోయారు. వీళ్ళ ఇంటి కాకి వాళ్ళ ఇంటి మీదకి వెళ్తే ఒప్పుకొనే వారు కాదు. రెండు కుటుంబాలు బద్ద విరోధులు అయిపోయారు. నాన్న గారు కూడా బావని కలవ వద్దని చెప్పేవారు. బావ మాత్రం ఎప్పుడు కలవడానికి ప్రయత్నించే వాడు. పట్నం నుంచి వచ్చ్చేటప్పుడు ఏవో పువ్వులు అవి తెఛ్చి అతని చెల్లెలి ద్వారా పంపే వాడు. తనని పదవ తరగతి వరకు మాత్రమే చదివించి ఆడపిల్ల అని మాన్పించేసారు. బావ మాత్రం పెద్ద చదువులకి బయటకి వెళ్ళాడు.

తనకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చ్చేసరికి ఇక పెళ్లి చూపులు చూడడం మొదలు పెట్టారు. అమ్మ, నాన్న వద్దు అన్న కూడా తన అన్నయ్య దగ్గరికి వెళ్లి పిల్ల పెళ్లి విషయం అడిగింది. మేనమామ వాడింకా చదువుకుంటున్నాడు వాడి చదువు అయ్యే వరకు మీరు ఉంచగలిగితే చూద్దాం అని తప్పించుకున్నాడు. అత్తయ్య మాత్రం ఎలాగైనా ఈ పెళ్లి అయితే బాగుండును అని ఎంతో ప్రయత్నించింది కానీ తన మాట చెల్ల లేదు. ఇక చేసింది లేక తాను వాళ్ళ నాన్నగారు తెచ్చ్చిన పక్క ఊరు సంబంధం చేసుకోడానికి ఒప్పుకుంది. కానీ ఎప్పుడు బావ గుర్తులు వస్తుండేవి. తాను బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలని దేవుడిని మొక్కు కొనేది.

తన మొక్కులు ఫలితంగానో లేదా బావ కష్టం వల్లో ఒక పెద్ద ఆఫీసర్ అయ్యాడు. అతనికి కూడా ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసేసారు. అయినా తనని ఎక్కడైనా చూసినప్పుడు ఎంతో అభిమానంగా చూసే వాడు. తనకి ముగ్గురు ఆడ పిల్లలు పుట్టారు. బావకి ఇద్దరు మొగ పిల్లలు పుట్టారు. తన అత్తింటి వారు మాత్రం ఎప్పుడు తనకి ఆడ పిల్లలు పుడుతున్నారని ఎంతో దుయ్యబట్టేవారు. దానికి తన తప్పేముంది అని ఎంత వాదించిన అత్త గారు వినే వారు కాదు. తమ కుటుంబానికి ఒక వారసుడు కావాలని ఎత్తి పొడిచే వారు. తన భర్త కూడా తల్లి దగ్గర భయపడి ఏమి అనేవారు కాదు. ఇక చివరిగా ఈ సారి మొగ పిల్లడు పుట్టక పొతే తన భర్తకి ఇంకొక పెళ్లి చేస్తామని పెట్టారు. విడాకులు కూడా ఇమ్మని అడిగేరు.

కూతురు పరిస్థితి చూసి నాన్న ఎంతో బాధ పడి చివరికి ఒక రోజు చని పోయారు. ఆయన చనిపోయిన తరువాత బావ గారి నాన్నగారు తన పంతం వదులుకొని చెల్లెలి కాపురానికి అండగా నిలవడం మొదలు పెట్టారు. అంత అన్యోన్యంగా ఉండే వారు. అయితే అందరికి ఒకటే బాధ తనకి మగ పిల్లవాడు లేడని. తన నాన్న చెనిపోయిన తరువాత ఇంకా గొడవ పెట్టటం మొదలుపెట్టారు. ఒకసారి ఇంటినుండి పంపించేశారు కూడా. ఈ బాధ చూడలేక తన తల్లి, మేనత్త ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సారి కొడుకు వచ్చ్చినప్పుడు ఇద్దరు తమ నిర్ణయాన్ని చెప్పారు. బావ చాలా వరుకు ఒప్పుకోలేదు. తన భార్యకి అన్యాయం చేసిన వాడిని అవుతాను అని అన్నాడు. ఎక్కడో మనం ఒకరికి సహాయం చేయడం లో చిన్న తప్పు చేసిన పర్వాలేదు అన్న సూక్తి భగవద్గితలోనో ఉపనిషత్తుల్లోనో విన్నాడు. దానిని విన్న తరువాత మరదలి కాపురం నిలబెట్టాలని ఒప్పుకున్నాడు. తనుకూడా ఇదే మంచి ఉపాయం అనుకుంది.

ఆ నలుగురు ఒప్పుకున్నతరువాత ఇంక ఎవ్వరికి కూడా తెలియకుండా ఉండాలి అన్న ఒప్పందం కుదుర్చుకున్నారు. బావని ఈ సారి ఒక్కడినే భార్యతో కాకుండా పదిహేను రోజులకి ఎదో పొలం పనులు ఉన్నాయని చెప్పి రమ్మనమని చెప్పారు. అదే సమయానికి తనని కూడా మా ఊరునుంచి ఎదో పూజ చేయిస్తామని పిలిపించారు. ఇద్దరివి పక్క పక్క ఇల్లే గనుక ఎవరికీ తెలియకుండా కలిసేటట్టు ఏర్పాటు చేశారు. మొదటి రోజు కలిసినప్పుడు తాను బావకి అడిగింది ఒక వేళ ఈ సారి కూడా ఆడ పిల్ల పుడితే ఏమిచేస్తాం అంది. ఆలా అవ్వదు ఎందుకంటే నేను మాకు ఆడపిల్లలు లేరని మా ఆవిడ మూడవ పిల్ల కోసం ప్రయత్నిద్దామంటే టెస్ట్ చేయించుకుంటే నాకు ఆడ పిల్లలు పుట్టే చాన్సులేదని చెప్పారు. అందుకే మరి ప్రయత్నించలేదు అని చెప్పాడు. ఒక వేళ ఏ కారణం వల్లనైనా ఆడ పిల్ల పుడితే నేను దత్తత తీసుకుంటాను అన్నాడు. ఎంతైనా బావకి నేనంటే ఇంకా ఇష్టం పోలేదు అనుకుంది. ఇద్దరు పదిహేను రోజులు మంచిగా గడిపేరు. తనకోసం ఒక మంచి నెక్లెస్ తెఛ్చి ఇచ్చ్చాడు. నీకు మనసారా కొడుకు పుట్టాలని కోరుకుంటున్నాను అన్నాడు. తరువాత బావ వెళ్ళిపోయాడు. తాను కూడా అత్తవారింటికి వెళ్ళిపోయింది.

ఎదో మనసులో తప్పు చేసినట్టు అనిపించినా తన మధుర శృతులని తలచుకొని అవన్నీ మరిచి పోయేది. బావకి మా ఆయనకి ఎంత తేడా. ఎంతో మంచిగా నాతొ ఉండే వాడు మా అయన లాగా మొరటుగా కాకుండా. బావకి ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. కనీసం మందు కూడా ముట్టడు. ఎంతైనా వాళ్ళ ఆవిడ చాల అదృష్ట వంతురాలు. బావ మధురశృతులు చాల మంచిగా అనిపించేవి. ఇక అమ్మ, మేనత్త మాత్రం తెగ గాభరా పడి నెల అవ్వగానే ఫోన్ చేసి అన్ని వివరాలు అడిగే వారు. ముట్టు అయిందా లేదా అని ఇంకేవోవో. రెండు నెలలు వరకు ముట్టు రాలేదంటే ఎంతో సంబర పడిపోయారు. వాళ్ళ అత్తయ్య మాత్రం ముభావంగా ఉండేది. ఇక మూడవ నెల కూడా తప్పిన తరువాత టెస్టింగ్ కి వెళ్ళింది. డాక్టర్ పాజిటివ్ అని చెప్పగానే ఏంతో ఆనందం అనిపించింది. అమ్మకి మేనత్తకి చెప్తే ఎగిరి గెంతేసినంత పని చేసారు. పూజలు పునస్కారాలు చేయించారు. అత్తగారు మాత్రం ఏమి సంతోషంగా లేరు. ఈ సారి కూడా ఆడపిల్ల పుడితే ఇక విడాకులే అని గట్టిగ చెప్పేసింది. ఎవరో ఎందుకైనా మంచిది పరీక్ష చేయించండి ఆడో మగో తెలుస్తుంది అనగానే అత్తగారు కొడుకుతో చెప్పి పరీక్ష చేయించ మంది. ఒక వేళ ఆడపిల్ల అయితే గర్భ స్రావం చేయించ మంది. కొడుకు అదే రకంగా చేసాడు. తన భర్తకి మాత్రం చెప్పింది ఆడ పిల్ల అయితే అనాధ ఆశ్రమంకి ఇచ్ఛేద్దాము గాని నేను గర్బస్రావం చేయించు కోనంది. అలా అయితే బావ దగ్గరైన పిల్ల పెరుగుతుంది అన్న ఆశతో. పరీక్ష చేయించు కోడానికి భర్తతో పట్నం వెళ్ళింది.

పరీక్ష చేయించు కోడానికి భర్తతో పట్నం వెళ్ళింది. మనసులో తన బావ అన్న మాటలు పదే పదే గుర్తుతెచ్చుకుంది నాకు ఆడపిల్లలు పుట్టరు అన్నదానిని. పరీక్ష అయిన తరువాత తెలిసింది మగ పిల్లాడు అని. తనకి ఏంతో ఆనందం అనిపించింది. భర్త కూడా చాలా ఆనంద పడ్డాడు.నిజానికి ఆయనకి నేనంటే ఇష్టం గాని అమ్మ నోటికి జడుస్తాడు. అత్తగారికి ఈ మాట తెలియగానే ఎగిరి గెంతేసినంత పనిచేసింది. తాను కూడా పూజలు చేయించింది. అమ్మకి మేనత్తకి కూడా చెప్పింది. వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. ఎలాగైనా బావకి ఈ కబురు చెప్తే మంచిది అని మేనత్తకి చెప్పింది. ఇక పిల్లవాడు కడుపులో పెరుగుతున్నకొద్దీ ఇంకొక గాభరా మొదలయ్యింది. పుట్టిన పిల్లవాడు అచ్ఛం బావలాగే ఉంటె ఎలా అనుకుండేది.ఎలా అయితే అలా అవుతుంది అని దేవుడు మీద భారం వేసి ప్రశాంతంగా ఉంది.అత్తగారు కాళ్ళు కింద పెట్టనివ్వకుండా అన్నిటికి పని వాళ్ళని పురమాయించింది. భర్త ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ శ్రీమంతానికి పంపమన్న పంపలేదు. నాలుగో పురుడు కాబట్టి మీ ఇంటికి పంపనక్కరలేదు అని పురిటి కూడా పంపలేదు. ఎక్కడైనా ప్రయాణం లో తేడా వస్తుందేమో అని ఆమె భయం.

ఇక పురిటి రోజు వచ్చింది. అందరికి గాభరా. ఆయా వచ్చి మగ పిల్లవాడు అని చెప్పగానే అత్తగారి కళ్ళలో వేయి కాంతులు వచ్చ్చాయి. భర్త, అమ్మ, మేనత్త అందరు చాలా సంతోషించారు. అమ్మకి ఒకటే భయం. పిల్లవాడు ఏ పోలికతో ఉన్నాడా అని. వాళ్ళ ఆయన బావ ఇద్దరు కూడా సామాన చాయగా ఉంటారు గాబట్టి అంతగా పోలిక తెలియలేదు. అమ్మయ్య అని ముగ్గురు ఊపిరి పూసుకున్నారు. పిల్లవాడు పెరిగిన కొద్దీ అందరు మేన మామలా ఉన్నాడు అనేవారు. అయినా ఎవరు అంతగా పట్టించుకో లేదు. బావ కూడా అప్పుడప్పుడు వఛ్చి మేనత్త ద్వారా ఏవో కానుకలు పిల్లవాడికి ఇచ్ఛే వాడు. అత్తగారు ఎదో అనారోగ్యం వఛ్చి చనిపోయారు. పిల్లవాడు పెద్దయిన కొలది అంత బావలాగే ఉంగరాల జుట్టు ఎడమ చేతి వాటం చూసి ఎక్కడైనా భర్తకి అనుమానం వస్తుందేమో అనుకునేది. మేనత్త, అమ్మ మాత్రం పిల్ల కాపురం బాగుపడింది అని సంతోష పడేవారు. భర్త ఒకటి రెండు సార్లు వీడేంటి మా ఇంట వంట లేదు ఎడమ చేతి వాటం అని కానీ మొగ పిల్లవాడు అన్న ఆనందంతో ఎంతో ఇష్టంగా చూసు కొనేవాడు. కొడుకు చదువు కూడా బాగా చదివే వాడు. తన కొడుకు కూడా బావ లాగే మంచి చదువులు చదివి పెద్ద ఆఫీసర్ అవ్వాలని కోరుకునేది. బావ కూడా అప్పుడప్పుడు వఛ్చి ఎదో సలహాలు చదువు విషయం లో ఇఛ్చి వెళ్లే వాడు.ఒక సారి తన భర్తకి ఎదో అనారోగ్యం చేస్తే పట్నం లో తన పలుకుబడితో మంచి వైద్యం ఇప్పించాడు. కొన్నాళ్ళకి తన అమ్మ మేనత్త కూడా చని పోయారు. ఇక ఆ విషయం తెలిసినది ఇద్దరమే మిగిలాము అనుకుంది.

ఈ లోపు డాక్టర్ గారు వఛ్చి బావ ఆపరేషన్ సఫలం అయింది అని చెప్పారు. అనగానే తను తన మధుర శృతులులోనుండి బయటకి వచ్చింది. బావ పూర్తిగా కోలుకున్న తరువాత ఎవరు లేనప్పుడు వెళ్లి కలిసింది. అయన ధన్యవాదం అని చెప్తే ఎందుకు బావా నువ్వు నాకు చేసిన సహాయం ముందర ఇది ఏమి కాదు. ఎవరికైనా మన విషయం చెప్పావా అని అడిగితె లేదు అని చెప్టింది. డాక్టర్ గారికి అనుమానం వచ్చి గుచ్చి గుచ్చి ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు అంది. ఎలాగో అతనికి సమాధానం చెప్పా. బావ అనుకుంటాడు "ఆడదాని మనసు ఎంతైనా సముద్రం లాంటిది అందులో ఎన్ని రహస్యాలైన ఇమిడి పోతాయి అని."
(The Heart of a woman is a deep ocean of secrets)

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ