మానవత్వం మెరిసింది - కందర్ప మూర్తి

Manavatwam merisindi

" రాజూ, పదరా ! ఇప్పటికే ఆలశ్యమైంది.ఇవాళ అమ్మ ఆపరేషన్ కి డబ్బు ఏర్పాటు చెయ్యకపోతే డాక్టరు గారు ఆపరేషన్ చెయ్యనన్నారుగా, అతి కష్టం మీద మూడు లక్షల రూపాయలు పోగయాయి.తొందరగా అమ్మకి గుండె ఆపరేషను జరగకపోతే ప్రాణాలకే ముప్పట " మిత్రుణ్ణి తొందర పెడుతున్నాడు నారాయణ. " వస్తున్నానురా, డబ్బు బేగులో సర్దుతున్నాను.నువ్వు బైకులో పెట్రోల్ కావల్సినంత ఉందో లేదో చూడు. మన ఊరి నుంచి పట్నానికి వెళ్లాలంటే యాబై కిలోమీటర్లు పోవాలి. రోడ్డంతా గుంతల మయం. మధ్యలో రైల్వే గేటు పడిందంటే ట్రైను పోయి ఎత్తేసరికి అరగంట అవుతుంది. ఈరోడ్డులో మోటరు బైకు నడపడమంటే నరకం " అంటూ రాజు బ్రీఫ్ కేసుతో ఇంట్లోంచి బయటికొచ్చాడు. మిత్రులిద్దరు మోటర్ బైక్ మీద ఎక్కి పట్నానికి బయలు దేరేరు. నారాయణ డ్రైవ్ చేస్తుంటే రాజు డబ్బున్న బ్రీఫ్ కేసు పట్టుకుని వెనక కూర్చున్నాడు. దేవరాజు, ఆదినారాయణ చిన్నప్పటి మిత్రులు. కలిసి చదువు కున్నారు. స్నేహితులైనా అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. డిగ్రీ అవగానే నారాయణ బి.ఎడ్. ట్రైనింగు పూర్తి చేసి గవర్న మెంటు స్కూల్లో టీచర్ గా జాబ్ సంపాదిస్తే , రాజు పోలీస్ సబినస్పెక్టర్ గా సెలక్టయి ట్రైనింగు పూర్తయి ప్రొబెషన్ చేస్తున్నాడు. గ్రామంలో ఉన్న తల్లికి గుండె పోటు వస్తే ఇంటికి వచ్చి పట్నం ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించి డబ్బు సర్దుబాటు చేసి బయలు దేరేరు. వారి బైకు దారిలో రైల్వేగేట్ దగ్గరకు రాగానే గేటు మూసి ఉంది. ట్రైను వస్తున్నట్టు సిగ్నల్ పడింది. గేటు తియ్యడానికి సమయముంది. దేవరాజు డబ్బున్న బ్రీఫ్ కేసు ఆదినారాయణ కిచ్చి మూత్ర విసర్జనకని రైల్వే ట్రాకు పక్క కొచ్చాడు.దూరంగా సూపర్ ఫాస్టు ఎక్స్ ప్రెస్ వస్తున్న శబ్ధం , హారన్ వినబడుతోంది. సడన్ గా ఒక యువతి ట్రాక్ మధ్యకొచ్చి రైలు కెదురుగా పరుగులు పెడుతోంది.ట్రైన్ డ్రైవరు హారన్ గట్టిగా వాయిస్తూ సడన్ బ్రేక్ వేసేడు. ఆ దృశ్యం చూసిన దేవరాజు తక్షణం స్పందించి దైర్యంగా ట్రాకు మీదకు చేరి పరుగు పరుగున ఆ యువతిని రక్షించడానికి ప్రయత్నిస్తు న్నాడు. ఆ స్త్రీ ఇంకా స్పీడందుకుని ట్రైను కెదురుగా పరుగులు తీస్తుంటే వెనక రాజు వెంబడిస్తున్నాడు.ఆదృశ్యాన్ని గేటు దగ్గర ఆగిన జనం , నారాయణ భయంగా చూస్తున్నారు. దూరం నుంచి ట్రాకు మీద ఎదురుగా పరుగు పెట్టి వస్తున్న యువతిని చూసి డ్రైవరు ట్రైనుకి బ్రేకు వేసినప్పటికి ఆ యువతిని ముందు కెళ్లకుండా గట్టిగా పట్టుకున్న దేవరాజును తాకి ఇంజను ఆగిపోయింది. ఒక్క నిమిషం ఆలశ్యమైనా వాళ్లిద్దరు చక్రాలధ్య నలిగి ప్రాణాలు పోయేవి. ఇంజన్ దిగిన డ్రైవరు వాళ్లిద్దరు ప్రాణాలతో బ్రతికుండటం చూసి సంబ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ట్రైన్లో జనం దిగి , దైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ యువతిని కాపాడిన దేవరాజును అభినందించారు. రైల్ గేటు దగ్గర కంగారుగా ఉన్న జనంతో పాటు నారాయణ ఊపిరి పీల్చుకున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన యువతి భర్త, అత్త వారి కట్నం వేదింపులకి విసిగి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెల్సింది. దేవరాజు ప్రదర్సించిన దైర్య సాహసాలు తెలిసి సిబ్బంది , పోలీసు ఆఫీసర్సు అభినందించారు. * * *

మరిన్ని కథలు

Peddarikam munduku vaste
పెద్దరికం ముందుకువస్తే
- శింగరాజు శ్రీనివాసరావు
Sayodhya
సయోధ్య
- కందర్ప మూర్తి
Karona kaatu
కరోనా కాటు
- సోమవరపు రఘుబాబు
Chillara Sevalu
చిల్లర శవాలు
- అఖిలాశ
Tel malisha majaka
తేల్ మాలీషా ! మజాకా!?
- జి.యస్. కె. సాయిబాబా
Sivayya tarimina deyyam-Story picture
శివయ్య తరిమిన దెయ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.