కరోనా కాటు - సోమవరపు రఘుబాబు

Karona kaatu

"లాక్ డౌన్ పొడిగించే యోచనలో ప్రభుత్వం"

టి.వి.లో మరల మరల వస్తున్న స్క్రోలింగ్ చూస్తూ తల పట్టుకున్నాడు కిరణ్.

కరోనా మహమ్మారి ఎంత పని చేసింది. మనసులో వెయ్యోసారి అనుకున్నాడు కిరణ్. అతని మది నిండా మరదలు రమ్యతో గడిపిన జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. నిద్ర రాదు - తిండి సయించదు. మెలకువగా ఉన్నప్పుడు రమ్య గుర్తుకొస్తూ ఉంటుంది క్షణ క్షణం. నిద్ర పడితే కలల్లోనూ రమ్యతో గడుపుతున్న ఊహలే..!

"కలలకు భయపడి పోయాను..

నిదురకు దూరం అయ్యాను..

వేదన పడ్డాను‌.."

ఆచార్య ఆత్రేయ ఎంత బాగా రాశాడు..! అనుకున్నాడు ఎఫ్.ఎమ్. రేడియోలో వస్తున్న అభినందన సినిమాలోని పాట వింటూ.

* * *

కిరణ్ వాళ్ల ఊరు గోదావరి జిల్లా లోని ఓ అందమైన పల్లెటూరు. విశ్వనాథ్, వంశీ సినిమాలలోని లొకేషన్స్ లా చాలా అందంగా ఉంటుంది. కిరణ్ వాళ్ల నాన్నకి పొలం ఏమీ లేకపోవడంతో రోజూవారీ కూలి పనులకెళుతూ ఆ కష్టం తన కొడుకు పడకూడదని, తను తిన్నా తినక పోయినా కొడుకుని డిగ్రీ దాకా చదివించాడు. కిరణ్ కూడా తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాడు.

అన్నీ బాగానే అమిరాయి. ఇక కోరుకున్న మరదలితో పెళ్లే జరగాల్సి ఉంది.

కిరణ్ మేనమామకి ఆడపిల్ల పుట్టడం తోటే కిరణ్ కి భార్యగా ప్రకటించేశారు ఇరువైపు కుటుంబాలలోని వారూను.

చిన్నప్పటి నుండి కిరణ్ కి కాబోయే భార్య రమ్య అని ప్రతి ఒక్కరూ అనడం, మొగుడూ పెళ్లాలు అని ఆట పట్టించటం.. వారిరువురికీ పసితనంలోనే ప్రేమను చిగురింపజేశాయి.

డిగ్రీ చదవటం కోసం పట్నం రావటం, తర్వాత జాబ్ లో చేరటం చక చకా జరిగిపోయాయి.

'ఆడపిల్లకి చదువెందుకమ్మా, ఉద్యోగాలు చేయాలా ఊళ్లేలాలా?' అని రమ్యను ఇంటర్ తోటే చదువు మాన్పించేశారు ఆమె తల్లిదండ్రులు.

ఇంటర్ పూర్తయి పట్నం వచ్చేటప్పుడు మనసు ఊళ్లోనూ తనువు తనవెంటా తెచ్చుకున్నాడు కిరణ్. డిగ్రీ చదువుతున్నన్నాళ్లూ సెలవులెప్పుడిస్తారా రమ్యని ఎప్పుడు కలుద్దామా అనుకునేవాడు. జాబ్ లో చేరాక, పండగలెప్పుడొస్తాయా ఊరెళ్లి రమ్యని తన కానుకలతో ఎప్పుడు ముంచేద్దామా అనుకునే వాడు.

సంక్రాంతికి వెళ్లినప్పుడు రమ్య తండ్రి కిరణ్ వాళ్ల ఇంటికి వచ్చాడు.

"రా మామయ్యా" సాదరంగా ఆహ్వానించాడు కిరణ్.

"ఈ వేసవిలో అమ్మాయికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి మీరిద్దరూ ఒకరికొకరుగా పెరిగారు. పెళ్లి కాకుండా ఇలా ఊళ్లో నువు తనతో తిరగటం మంచిది కాదు. నువ్వేమో చదువుకుని హైదరాబాదులో జాబ్ చేస్తున్నావు. వచ్చి ఊళ్లోనే ఉండి వ్యవసాయం చేయలేవు. కాబట్టి పెళ్లయాక రమ్యను సిటీకి తీసుకెళ్లిపో. అందాకా అనవసరంగా కలిసే ప్రయత్నాలు చేయకు"

క్లుప్తంగా వివరంగా చెప్పిన మామయ్య మాటలకు సరేనని తలూపి హైదరాబాద్ తిరిగి వచ్చేశాడు కిరణ్.

* * *

ఇంతలో పిడుగులాంటి వార్త! ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాపిస్తున్నదట. అది సోకిన వారికి మందు లేదట. భారతదేశంలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలలోకూడా లాక్'డౌన్ ప్రకటించడంతో ఎక్కడి రవాణా వ్యవస్థ అక్కడ నిలిచిపోయింది. రాష్ట్రాల సరిహద్దులు మూసేశారు.

అందరూ స్వచ్ఛంద గృహ నిర్బంధనం పాటిస్తున్నారు.

కిరణ్ కూడా తన ఊరు వెళ్లాలని ప్రయత్నించి మళ్లీ కంపెనీ వాళ్లు పిలుస్తారేమో, పిలిస్తే తిరిగి రాలేకపోతే జాబ్ లోంచి తీసేసేస్తారేమోననే భయంతో హైదరాబాద్ లోనే ఉండిపోయాడు.

మనసులో మాత్రం రమ్యకి చెందిన ఆలోచనలే!

"కనులు తెరచినా నీవాయే

కనులు మూసినా నీవాయే"

అన్నట్లుంది అతని పరిస్థితి. ఇప్పుడప్పుడే లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితి కనపడటంలేదు. మరో రెండు నెలలు పొడిగిస్తారట అని ఫ్రెండ్స్ చెబుతూంటే మనసు కలవరపడుతోంది.

పట్టణాలలో జనసాంద్రత అధికంగా ఉండటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికం అని, ఊళ్లనుంచి వచ్చిన వారందరూ తిరిగి సొంత ఊళ్లకు వెళ్లిపోవటం, తను పట్నంలోనే ఉండిపోవటంతో కలత చెందాడు కిరణ్. రమ్య మాటి మాటికి గుర్తుకి రావడం.. నిద్రాహారాలు మానుకుని రోజు రోజుకీ పేషెంట్ లా తయారవుతున్నాడు.

* * *

ఓ రోజు ఉదయం కళ్లు నులుముకుంటూ లేచి మొబైల్ ఓపెన్ చేశాడు కిరణ్. వాట్సాప్ లో చాలా అన్ రీడ్ మెసేజెస్ ఉన్నాయి. వేళ్లతో జరుపుతూ నోటిఫికేషన్స్ చూస్తున్నాడు. రమ్య నుండి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేశాడు.

"కాల్ మి బావా" అని ఉంది.

వెంటనే కాంటాక్ట్స్ ఓపెన్ చేసి రమ్యకి కాల్ చేశాడు.

"ఇక నువ్వు నన్ను మర్చిపోవాలి బావా. మా నాన్న నాకు వేరే సంబంధం చూశాడు. మన ఊరి మోతుబరి రైతు కొడుకుతో నాకు సంబంధం ఖాయం చేశారు. నిశ్చితార్థం కూడా చేసేశారు. నిన్ను చేసుకుంటే నేను కూడా వచ్చి పట్నంలో ఉండాల్సి వస్తుందనీ, ఎప్పుడు ఆ కరోనా అంటుకుని పోతామో తెలియదనీ, ఊళ్లో అతనినే పెళ్లి చేసుకుంటే ఇక్కడే సేఫ్ గా ఉండవచ్చనీ మా నాన్న ఈ నిర్ణయం తీసుకున్నాడు. నేను కాదని ఎదురు చెబితే ఉరేసుకుని చచ్చిపోతామని మా అమ్మా నాన్న బెదిరించారు. వాళ్ల ఉసురు పోసుకుని ప్రేమని గెలిపించుకునే ధైర్యం లేని పిరికిదాన్ని. నన్ను క్షమించి మర్చిపో బావా"

అని ఫోన్ పెట్టేసింది రమ్య.

విని స్థాణువైపోయాడు కిరణ్. కాళ్లకింద భూమి కంపిస్తున్నట్టుగా, తనని తలకిందులుగా వేలాడేసి ఎవరో తీవ్రంగా కొడుతున్నట్టుగా ఫీలయ్యాడు. మూడు నెలల క్రితం పెళ్లి చేసుకోమని ప్రొపోజ్ చేసిన మేనమామ ఇంత సడన్ గా స్వార్థం తో యూ టర్న్ తీసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రాణాతీతంగా ప్రేమించిన రమ్యకూడా అశక్తతతో తల దించుకోవడం తట్టుకోలేక పోతున్నాడు.

"అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం" అని గట్టిగా ఎలుగెత్తి పాడాలనిపించింది.

"నువ్వు లేకపోతే నేనూ బతకలేను రమ్యా" అని చెబుదామని ఫోన్ తీసుకుని రమ్య నంబర్ కి డయల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతోంది గానీ తీయడం లేదు. పది నిమిషాలకోసారి ట్రై చేస్తున్నాడు - తీయడం లేదు. పదకొండోసారి ట్రై చెస్తే స్విచాఫ్ అని వచ్చింది. వాట్సప్ ఓపెన్ చేసి మెసేజ్ పెడదామని చూశాడు. బ్లాక్ చేయబడి ఉంది. గుండె బద్దలైంది కిరణ్ కి.

* * *

మర్నాడు లోకల్ న్యూస్ పేపర్స్ లో క్రైం పేజ్ కాలమ్ లో "కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య" అని ఒక వార్త వచ్చింది.

"తనకు కరోనా లక్షణాలు ఉన్నాయనీ, ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాననీ, హైదరాబాద్ లో గోదావరి జిల్లాకి చెందిన కిరణ్ అనే వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని చనిపోయాడ"ని ఆ వార్త సారాంశం.

మరిన్ని కథలు

Kreeda sphoorthi
క్రీడాస్ఫూర్తి
- డి.కె.చదువులబాబు
Bhale alochana
భలే ఆలోచన
- సరికొండ శ్రీనివాసరాజు
Naanna maripoyadu
నాన్న!మారిపోయాడు
- కె.వి.వి.లక్ష్మీ కుమారి
Veedhi arugulu
వీధి అరుగులు
- రాముకోలా.దెందుకూరు.
Vennamuddala kalyanam
"వెన్నముద్దల కళ్యాణం"
- కొత్తపల్లి ఉదయబాబు
Mantri yukthi
మంత్రి యుక్తి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Chandrudi salaha
చంద్రుడిసలహా
- డి.కె.చదువులబాబు