సయోధ్య - కందర్ప మూర్తి

Sayodhya

ఊళ్లోని కుక్కలకీ ఊరి బయట గుట్టల్లోని నక్కలకూ అరుపుల యుద్ధం జరుగుతోంది. అర్థరాత్రి నక్కలు ఊళ్లోకొచ్చి కోళ్లనీ మేకపిల్లల్ని బాతుల్నీ ఎత్తుకు పోతున్నా ఊళ్లో కుక్కలు ఏం చేస్తున్నాయని ఊరి పెద్దలు మమ్మల్ని తిడుతున్నారనీ కుక్కలు వాదోప వాదాలకు దిగాయి. మన అరుపులకు పెద్దోళ్ళకు నిద్రాభంగ మవుతోందని నిందలు వేస్తున్నార ని వాపోయాయి. ఇంతకీ నక్కల ఫిర్యాదు ఏమిటంటే ఊళ్లో జనం గుట్టల్లో ఉన్న చెట్లూ తుప్పలు కంపలు నరికి పట్టుకు పోతున్నారనీ మరుగు ఆవాసం లేకుండా అల్లాడి పోతున్నాం , వేటాడటానికి చెవుల పిల్లుల్నీ ఉడుముల్నీ ముంగిసలు ఉడతలు వేటగాళ్లు వలలు వేసి పట్టుకు పోతూంటే మేం ఆకలితో మాడి పోతున్నాం అంటూ ఊళ్లో జనం మీ కుక్కలకి గంజీ అన్నం పండగ లపుడు బొమికలు పడేసి మేపుతున్నారు. మరి మా ఆకలి తీరే దెలా అంటూ సతమత మవుతున్నాయి. మధ్యలో ముళ్లపందులు ఊరి మీద పడి పొలాల్లో చిలగడ దుంపలు శనక్కాయలు ఒలుచుకు పోతున్నాయి.అవీ కూడా మాకు తిండి లేకుండా చేస్తున్నాయి. ఈ సమస్య తేలక ఇటు ఊరి కుక్కలూ అటు గుట్టల్లో నక్కలు పొలిమేరల కొచ్చి రోజూ వాగ్వివాదం చేసు కుంటున్నాయి. రోజులు గడుస్తున్నాయి. ఒక పరిష్కార మార్గంగా తోడేళ్ళు ఒక ఆలోచన చేసాయి.ముళ్ల పందుల్ని ఊళ్లోకి రాకుండా ఉపాయం ఆలోచించాయి. కొన్ని కుందేళ్ల ను భయపెట్టి ముళ్ల పందులుండే పరిసరాల వైపు పరుగెత్తించాయి. వేటగాళ్లు చెవుల పిల్లుల కోసం వెళ్లగా ముళ్ల పందుల గుంపులు కనిపించాయి.వేటగాళ్లు వారి వద్ద ఉన్న వలల్ని విసిరి బంధించి తీసుకు పోయారు. ఈ లోపున గ్రామ ప్రజలు వర్షాకాల ఆరంభ మవగానే హరిత హారం పేరున పెద్ద ఎత్తున మొక్కల్ని గ్రామం చుట్టూ పెంచడం మొదలెట్టారు. వాటి వల్ల వృక్ష సంపద పెరిగి జంతు జాలానికీ రక్షణ ఆహారం లభించింది.కోతులు నెమళ్ళు విష సర్పాలు ఊరి మీదకు రాకుండా కట్టడి జరిగింది. గ్రామ సింహాలు నిజంగా అడవి సింహాల్లా చెవులు నిలబెట్టుకుని తిరుగు తున్నాయి. ఊళ్లో జనం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. * * *

మరిన్ని కథలు

Anakonda
అన”కొండ”
- రాపాక కామేశ్వర రావు
Cheekati pai yuddham
చీకటి పై యుద్ధం
- హేమావతి బొబ్బు
Mokkalu naatudam
మొక్కలు నాటుదాం!
- చెన్నూరి సుదర్శన్
Vuppena
ఉప్పెన
- కందర్ప మూర్తి
అహల్య
అహల్య
- సుమ సావి3
Viswasa pareeksha
విశ్వాస పరీక్ష!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Katha addam tirigindi
కథ అడ్డం తిరిగింది
- టి. వి. యెల్. గాయత్రి