నాన్న!మారిపోయాడు - కె.వి.వి.లక్ష్మీ కుమారి

Naanna maripoyadu

"ఒసేయ్ !తలుపు తియ్యవే ! నిన్నే పిలిచేది తలుపు తీయి" అంటూ తాగివచ్చిన తన భర్త కేకలకు తలుపు తీసి "ఎవయ్య !తాగొద్దు అంటే వినవు కదా! "ఇలా తాగి అర్ధ రేతిరి వచ్చి తలుపు కొడతావు" "ఎవరైనా ఏదైనా అనుకుంటారనీ కాస్తో కూస్తో సిగ్గు అనిపించటం లేదా" "ఛీ నువ్వు మారవు ,నీ బ్రతుకు ఇంతే " అని తిడుతున్న అమ్మ మాటలకు కూతురు తలుపు దాకా వచ్చి " ఎందుకమ్మ నాన్నను అలా తిడతావు." "నువ్వు రా నాన్న "అంటూ తండ్రిని లోపలికి తీసుకు వెళ్ళింది రమ్య. పెరట్లో కూర్చో పెట్టి స్నానం చేయించి కంచంలో అన్నం పెట్టింది. "చూసావా నా కూతుర్ని నా కూతురు బంగారమే" అంటూ కూతుర్ని పొగడ సాగాడు తండ్రి. ఆమాటలకు "మరే మీ అబ్బా కూతురు ఒకటేగా. నన్నెవరు పట్టించుకుంటారు " అని బుంగమూతి పెట్టుకున్న అమ్మతో "అయ్యో అమ్మా అదేం లేదులేగాని , నాన్నకు ఈ అలవాటు మీ పెళ్లికి ముందే ఉందని చెప్పావు కదా ! మరి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు" అని అడిగింది రమ్య. "అంటే అందరిలాగే నేను కూడా మాన్పించొచ్చు అనుకున్నాను. "కానీ మీ నాన్న వింటేగా పగలు ఒట్టు పెట్టడం. రాత్రి మరిచిపోవడం " "ఎం చెయ్యను మరి "అని చెప్పిన తల్లి మాటలకు "అవును కదా ! "మరి ఇన్ని సంవత్సరాలుగా మానలేని నాన్న ఇప్పుడు ఎంత తిడితే మాత్రం మానతాడా చెప్పు నెమ్మదిగా మార్చుకుంద్దాములే పడుకో అమ్మ." అంటున్న రమ్య వైపు ఆశ్చర్యంగా చూస్తుండి పోయింది. సూర్యుడు సుర్రుమంటూ వంటిని తాకడంతో నిద్ర లేచాడు రామయ్య లేచి లేవగానే "రమ్య అమ్మ రమ్యా " అంటూ కూతుర్ని పిలిచాడు. "లేచావా నీ కూతురు ఎప్పుడో ఆఫీస్ కి వెళ్ళిపోయింది." " టైం చూడు ఎంత ఐనదో " అంటూ వంటింట్లో నుంచి గిన్నెల శబ్దంతో చెప్పింది భార్య. "సరే నేనలగా కాసేపు బయటికి వెళ్లి వస్తాను" అంటూ వెళ్తున్న భర్తని అపి "ఏవయ్యో నీకసలు బుద్ది ఉందా ! "ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు. కూతురు కష్ట పడుతుంటే మనం తిని కూర్చుంటున్నాము. సిగ్గువుందా నీకు పైగా పెళ్లి చేద్దాము అన్న ఆలోచనే లేదు నువ్వు అసలు మనిషివేనా " అంటూ నిలదీసింది భార్య. "నా కూతురికేంటే ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుంటామని వస్తారు చూస్తూ ఉండు " అంటూ బయటికి వెళ్ళిపోయాడు రామయ్య. ఆఫీసులో తన ట్యాలెంట్తో అందరి మన్ననలను పొందుతూ ఓ గుడ్ ఇమేజ్ని సంపాదించుకుంది రమ్య. చూడ్డానికి అందం,అభినయం, అనుకువ ఇవ్వన్నీ కలపోసుకుని పుత్తడి బొమ్మలా ఉండే రమ్య అంటే ఆ ఆఫీసులో అందరికీ చాలా ఇష్టం. అందరితో కలుపుకోలుగా మాట్లాడే ఆమె తీరు అందరినీ తన వైపు మల్లేలా చేస్తోంది. అందుకే తనతో పాటు పనిచేసే నవీన్ అనే అబ్బాయి రమ్యను రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం రమ్యకు కూడా చెప్పాడు. రమ్య మా తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లిచేసుకుంటాను అని చెప్పింది. ఇది ఇలా ఉండగా రోజులాగే ఆఫీసుకి వెళ్ళడానికి బస్ స్టాప్ లో నిలుచున్న రమ్యను చూసి ఓ నలుగురు పోకిరీ వెధవలు గతంలో జరిగిన గొడవలో చెప్పుతో బుద్ధి చెప్పిందన్న కక్షతో ఇప్పుడు ఒంటరిగా ఉండటం చూసి ఏడిపించడం మొదలు పెట్టారు. "ఏంటిరా అంటున్నారు! మొన్న కొట్టిన దెబ్బ సరిపోలేదా" అంటూ రమ్య అన్న మాటలకు "పోవే పెద్ద చెప్పొచ్చావు మీ బాబు తాగుబోతోడేగా నిన్ను కూడా ఏ తాగుబోతోడికో ఇచ్చి చేస్తాడు. " "ఏరా అప్పుడు దీని పరిస్థితి ఏంటి రా !మొగుణ్ణి, బాబుని కూర్చోబెట్టి మందు ఇదే పోస్తదేమో అహహహ..... " అని విరగపడి నవ్వుతూ " ఇదిగో నీకు చేతనైతే మీ బాబుకి చెప్పుకో ఈ నితులన్నీ వాడిని మార్చుకోవే ,వెల్లెళ్ళు పెద్ద మనకి చెపుతుంది తాగుబోతోడి కూతురు. " అంటూ నోటికొచ్చినట్లుగా అవమానించారు. చుట్టూ చూస్తున్న వారిలో ఓ ఆమె రమ్యతో "ఇదిగో చూడు రమ్య ఇంట్లో మగ దిక్కు సరిగ్గా లేకపోతే ఇలా ప్రతి అడ్డమైన వెధవలు నోటికొచ్చినట్లుగా అంటూ ఉంటారు." "నువ్వేమో మీ నాన్న తాగి వస్తున్నా మాట పడనివ్వవు." "ఏమి అనవు ఇలా ఐతే ఎలా రమ్య " అంటూ రమ్యనే అనసాగారు. మనసులోనే దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఇంటికి వచ్చేసింది రమ్య. "అదేంటి రమ్య ఆఫీసుకి వెళ్లకుండా ఇలా వచ్చేసావు "అని అడుగుతున్న తల్లి మాటలకు బదులు చెప్పకుండా తన గదిలో కెళ్ళి తలుపేసుకుంది. తల్లి ఎంత పిలిచినా తలుపు తియ్యలేదు. పక్కింటి ఆవిడ వచ్చి జరిగిన విషయం రమ్య తల్లికి చెప్పింది. "అయ్యో ఇంత గొడవ జరిగింది ,అసలు దీని కంతటికీ ఆయనే కారణం " "ఈ రోజు అటో ఇటో తేల్చేయ్యాలి" అంటూ భర్త కోసం ఎదురుచూడ సాగింది. కూతురి జారిన అవమానాన్ని నలుగురో నోట విని చాలా చలించి పోయి ఎం తోచక చెరువు గట్టున కూర్చుని బాధ పడుతున్న రామయ్యాను ,చూసి "ఎందుకురా అలా బాధ పడుతున్నావు.ఆ పోకిరి వెధవలు అన్నది నిజమేగా !అయినా నీ కూతురు,నీ భార్య కదా బాధ పడవాల్సిన వారు "నీకు నీ గొంతులో చుక్క పడిందా లేదా అనేదే ముఖ్యం కదరా ! "వెళ్ళు వెళ్లి చుక్కవేసుకుని ఆ చుక్కలోనే దొళ్ళు" అంటున్న తన తోటివారి మాటలకి "అదేంటిరా నువ్వుకుడా ఇలా అంటున్నావు" .అని అన్నాడు రామయ్య. దానికి "ఇంకేం అనాలిరా! నీకు కాస్తో కూస్తో పరువు ఉందంటే అది నీ కూతురు వల్లేరా " "నీ కూతురి వ్యక్తిత్వంన్నీ ఈరోజు నీ వల్లే దిగజారి పోయింది. నీ కూతురు గురించి నువ్వు మారి చూడు అప్పుడు ఏ వెధవా నీ కుటుంబం గురించి పలెత్తు మాట అనరు. " అని చెప్పిన తన తోటివారి మాటకు " నిజమేరా నేను మారతాను "నిజంగా నా కూతురి కోసం మారతాను అంటూ ఇంటికి చేరుకుని తన కూతుర్ని పిలిచాడు పలకలేదు ఇంతలో తన భార్య "వచ్చావా నీ కోసమే చూస్తున్నాను ఎందుకు వచ్చావు ఇంకా మేము బ్రతుకున్నామా లేదా అని చూడ్డానికి వచ్చావా" "నీకు మా ఇద్దరి బాధ ఎం అర్ధం అవుతాధి ,అదిగో నీ కూతురు పొద్దుట నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా నేను ఎంత పిలిచినా పలకకుండా గదిలోనే ఉంది వెళ్లి తీసుకురా " అని చెప్పగానే రామయ్య కూతురి గది తలుపుతట్టి" అమ్మ రమ్య తలుపు తియ్యమ్మా" అంటూ పిలిచాడు. తండ్రి మాట వినగానే తలుపు తీసిన రమ్య ఎందుకు నాన్న అని అడిగింది. "రా అమ్మ భోజనం చేద్దాము" అని అన్నాడు. "నాకు ఆకలిగా లేదు నాన్న నువ్వు తినేసేయ్ "అని చెప్పింది. "అదేంటమ్మా రోజు నువ్వు పెట్టకుండా నేనెప్పుడైనాతిన్ననా ! "రా అమ్మ మా తల్లివి కదూ" అంటూ బ్రతిమాలిన తండ్రికి "నీ కూతురు ఎప్పుడో చచ్చి పోయింది నాన్న" అన్న రమ్య మాటలకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు రామయ్య. కాస్త తేరుకుని "అమ్మా అంత మాట అనకు" "నువ్వు నా ప్రాణానివి "అంటూ ఏడవ సాగాడు. "నాన్న నిన్ను ఎప్పుడూ కూడా తాగుడు మానై నాన్న అని అడగలేదు" "ఎందుకంటే అమ్మకి చెప్పిన అబద్ధమే నాకు చెపుతావు అని భయమేసి ఇన్నాళ్లు అడగలేదు." "ఇప్పుడు అడుగు తున్నాను తాగుడు మానై నాన్న....." అన్న రమ్య మాటలకి "నిజంగా మనేస్తాను తల్లి, నీ మీద ఒట్టు నీ కోసం తప్పనిసరి మానేస్తాను. నన్ను నమ్ము తల్లి నన్ను క్షమించు" అంటూ బోరున దుఃఖిస్తున్న తన తండ్రిని చూసి నాన్న అంటూ రమ్య కూడా ఏడవ సాగింది. భర్తలో ఈ సారి నిజంగా మార్పు వస్తుంది అన్న నమ్మకం ఏర్పడింది రమ్య తల్లికి. మరునాడు రమ్య నిద్రలేచే సరికి తండ్రి కనిపించలేదు. "అమ్మా నాన్న ఏరి " అంటూ అడిగింది. ఈ రోజు మీ నాన్న కోడి కూయకమునుపే బయటికి వెళ్ళాడు , బహుశా పనిలోకేమో "అని తల్లి చెప్పిన మాటలకు రమ్య "నిజంగానా" అంటూ తల్లిని వాటేసుకుని "చాలా సంతోషంగా ఉందమ్మా" అని రమ్య ఆఫీసుకి రెడీ అవ్వడానికి తన గదిలోకి వెళ్ళింది. అక్కడ తన టేబుల్ మీద వికసించే ముద్ద మందారం దాని కింద ఓ కాగితం పెట్టి ఉంది.అదేంటబ్బా అనుకుంటూ తీసి చూసింది ఆ కాగితంలో "అమ్మా నువ్వు ఆఫీసుకి వెళ్ళిరా నేను పనికి వెళ్లి వస్తాను" అని. తన తండ్రిలో ఈ మార్పుకి చాలా సంతోషానిచింది రమ్యకు .✍️

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి