నో ఇండిపెండెన్స్ ఫర్ విమెన్ - Sudheer dhamma

No independence for women

ముందు మాట : ఎప్పుడో 1947 అంటే మనకి స్వాతంత్రం వచ్చినపుడు మహాత్మా గాంధీ గారు నిజమైన స్వాతంత్రం ఎప్పుడు అంటే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరి గా బయట ఏ హాని లేకుండా తిరగడమే అని అన్నారు. ఇది 2021 దాదాపు 70 ఏళ్ళు పూర్తి అయింది అర్ధరాత్రి ఏ హాని లేకుండా స్వేచ్ఛగా బయటకి వెళ్ళవచ్చు స్వతంత్రం మగవాళ్ళకీ మాత్రమే కాదు ఆడపిల్లలకు అని కూడా వచ్చింది అనే నమ్మకం తో బయటకి వెళ్లిన ఒక అమ్మాయి కాదే ఈ " No independence for women" కధ లోకి వెళ్లిపోదాం: కృష్ణ అనే అబ్బాయి హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో ఇంజినీర్ గా వర్క్ చేస్తున్నడు తన టీం లో తనతో పాటు ఇంకా నలుగురు పనిచేస్తున్నారు వాళ్ల పేర్లు విజయ్,దివ్య, కీర్తి,యశోధ. వాళ్ళ అందరిదీ ఒకే వయసు కావడం తో కంపెనీ లో జాయిన్ ఐన ఒక సంవత్సరం లోనే మంచి ఫ్రెండ్స్ ఐపోయారూ పని కలసి చేసుకొనే వాళ్ళు సినిమాలకి , సరదాగా బయటకి వెళ్లే వాళ్ళు కృష్ణ , విజయ్ మాధపూర్ లో ఒకే రూమ్ షేర్ చేసుకొంటున్నారు కీర్తి,యశోధ గచ్చిబౌలి హాస్టల్లో ఉంటున్నారు ఆఫీస్ కి దగ్గరగా ఉంటుంది అని, దివ్య మాత్రం తనతో పాటు చదువుకున్నా జాహ్నవి అన్న అమ్మాయి తో అమీర్పేట్ లో ఉంటుంది కీర్తి , యశోధ చాలా సార్లు గచ్చిబౌలి షిఫ్ట్ ఐపోవచ్చు కధ నీకు ఆఫీస్ కి దగ్గరగా ఉంటుంది అని ఆడిగారు కానీ తన ఫ్రెండ్ జాహ్నవి తో పాటు ఉండటం తనకి ఇష్టం అని చెప్పేది దివ్య. అ టీం లో కృష్ణ కి తెలిసిన విషయం ఎవరికి తెలియని విషయం ఒకటి ఉంది కృష్ణ కి దివ్య అంటే చాలా ఇష్టం ఈ విషయం తనకి చాలా సార్లు చెప్పాలి అని ఎంతో ట్ర్య్ చేసాడు కానీ ధైర్యం సరిపోక మానేశాడు ఎప్పుడు లాగే ఈ వీకెండ్ కూడా సినిమా కి వెళదాం అని అందరం అనుకున్నారు శుక్రవారం సాయంత్రం ఆఫీస్ ఐపోయి కృష్ణ , విజయ్ వాళ్ల రూమ్ కి వచ్చేసాక కీర్తి ఫోన్ చేసి మనం రేపు సినిమా కి వెళదాం టిక్కెట్ బుక్ చై అని అంటుంది, దివ్య కూడా వస్తుందా అని అడుగుతాడు కృష్ణ ,కీర్తి ని లేదు తనని అడిగాను రాను అని అన్నది అని అంటుంది కీర్తి సరే అని కృష్ణ ఫోన్ పెట్టేసి దివ్య కి ఫోన్ చేసి ఏంటి సినిమా కి రాను అన్నావ్ అంట కదా ఎందుకు అని అడుగుతాడు కృష్ణ దివ్య ని దివ్య దానికి నేను మూవీ కి రావాలి అంటె మళ్ళీ గచ్చిబౌలి రావాలి ఎందుకు అంత దూరం అందుకే నేను రాను మీరు వెళ్ళండి అని అంటుంది. అమీర్పేట్ లో టికెట్స్ బుక్ చేస్తే వాస్తవ నువ్వు అని అంటాడు కృష్ణ నా ఒక్కదాని కోసం మీరు అందరు రావడం ఎందుకు అని అంటుంది దివ్య పరవాలేదు సినిమా ఐపోయాక అక్కడ నుంచి ట్యాంకబండ్ కి వెళదాం లే అని అంటాడు కృష్ణ మిగతా వాళ్ళని నేను ఒప్పిస్తా అని కూడా అంటాడు , అన్నట్టు గానే వాళ్ళందరిని ఒప్పిస్తాడు కృష్ణ శనివారం నైట్ అందరూ అమీర్పేట్ లో సినిమా కి వెళ్తారు దివ్య పక్కన కావాలి అని కూర్చుని హల్ల్లోనే తన ప్రేమ ని చెప్పేదం అనుకొంటాడు కృష్ణ అలా అనుకొనే తన పక్కన కూర్చుంటాడు కృష్ణ ,కానీ సినిమా స్టార్ట్ ఐనప్పటినుంచి సినిమా ని కూడా చూడకుండా ఫోన్ లో తెగ చాటింగ్ చేస్తూ ఉంటుంది దివ్య ఏంటి సినిమా కూడా చూడకుండా చాటింగ్ చేస్తుంది అని కృష్ణ కుడా తన వైపు తెగ చూస్తూ సినిమా చూడటానికి వచ్చావ చాటింగ్ చేసుకోడానికి వచ్చావ అని అంటాడు కోపం వచ్చి దివ్య ని , దివ్య sorry చెప్పి phone లోపల పెట్టేసి సినిమా చూస్తుంది కానీ దివ్య ఫేస్ dull ఐపోతుంది interval లో నేను వెళ్లి నీకు తినడానికి తీసుకొని వస్తాను అని అంటుంది దివ్య కృష్ణ తో, కృష్ణ కూడ సరే అంటాడు సినిమా స్టార్ట్ ఐపోతుంది దివ్య ఇంకా రాదు తనతో పాటు బయటకి వెళ్లిన యశోధని అడుగుతాడు ఏంటి ఇంకా దివ్య రాలేదు అని యశోధ తను కాల్ మాట్లాడుతుంది అంటుంది సినిమా స్టార్ట్ ఐన 20 minutes కి వస్తుంది దివ్య ఏంటి ఇంత సేపు యంచేశావ్ అని అడుగుతాడు దానికి దివ్య వాష్ రూమ్ కి వెళ్ళాను అని అంటుంది ఇంకా ఈ అబద్ధపు మాటతో కృష్ణ కి మూడ్ అంత మారిపోతుంది మొత్తం డల్ గా ఐపోతాడు సినిమా అయ్యక బయటకు వస్తారు అందరూ విజయ్ ట్యాంక్ బండ్ కి వెళదాం అంటాడు నాకు ఇంట్రెస్ట్ లేదు మనం రూమ్ కి వెళ్లిపోదాం అని అంటాడు కృష్ణ దానికి విజయ్ నువ్వే కదా సినిమా అయ్యాక ట్యాంక్ బండ్ కి వెళదాం అన్నావు మళ్ళీ ఏంటి రూమ్ కి వెళ్లిపోదాం అంటున్నావు అని అంటాడు అప్పటివరకు డల్ గ ఉన్న దివ్య తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి లేదు మనం లాంగ్ డ్రైవ్ కి వెళదాం అంటుంది కృష్ణ అలాగే దివ్య వైపు చూస్తాడు ఏంటి దివ్య సడన్ గా లాంగ్ డ్రైవ్ అంటుంది అని ఆలోచిస్తాడు మిగతవాళ్ళు అందరూ వెళదాం కృష్ణ అని అంటారు కృష్ణ కూడా సరే అంటాడు ఎక్కడికి వెళదాం అని విజయ్ అంటాడు అబ్బా నాకు ఆకలి వేస్తుంది ముందు ఏమైనా తినాలి అని కీర్తి అంటుంది సరే ముందు తినేసక ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేదం అంటాడు విజయ్. కృష్ణ మాత్రం దివ్య ఏంటి ఇలా ఉంది అని ఆలోచిస్తూనే ఉంటాడు. ఏ రెస్టారెంట్ కి వెళదాం అని అంటాడు విజయ్ నాకు యశోధకి saturday , ఈరోజు NON -VEG తినము సో మేము టిఫిన్ చేస్తాం అని అంటుంది కీర్తి మీరు ఇద్దరు టిఫిన్ ఐతే మేము మీతో పాటు టిఫిన్ చేసేస్తాం అని అందరూ అనుకొంటారు రోడ్ సైడ్ టిఫిన్ van ఉంటే అక్కడకి వెళ్తారు అందరూ టిఫిన్ తింటున్నపుడు కీర్తి కి ఒక కాల్ వస్తుంది దివ్య వాళ్ళ అమ్మ నుండి "ఏంటి కీర్తి, దివ్య మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది జాహ్నవి కి చేస్తే మీరు అందరూ బయటకు వెళ్లారు అని అన్నద దివ్య కి ఒక్కసారి ఫోన్ ఇవ్వవ అని అంటారు వాళ్ల అమ్మ కీర్తి aunty కాల్ చేశారు అని ఫోన్ దివ్య కి ఇస్తుంది. దివ్య పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది మిగిలిన వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటారు కృష్ణ మాత్రం దివ్య వాళ్ల అమ్మ తో ఏం మాట్లాడుతుందో కొంచం కొంచం గా వింటూ ఉంటాడు ఫోన్ లో: దివ్య వాళ్ల అమ్మ : ఎంటి దివ్య ని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది దివ్య:అమ్మ నీకు ఎన్ని సార్లు చెప్పాలి వాడిని నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పమని అమ్మ : ఎవడే.... దివ్య : ఇంకెవడు ఆ రాజేష్ గాడు కాల్స్ మెసేజ్ లు చేసి తెగ విసిగిస్తాడు అమ్మ: అందుకే నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొన్నావ్ మంచి జాబ్ వాళ్ల ఫ్యామిలి కూడా మనకి బాగా తెలుసు వాడిని పెళ్లి చేసుకోడానికి నీకు ప్రాబ్లెమ్ ఏంటి చెప్పు దివ్య:అమ్మ నేను ఇంకొక అబ్బాయి ని లవ్ చేస్తున్న అమ్మ:లవ్ చేస్తున్నావా ఎవరు ఆ అబ్బాయి మన కాస్ట్ యేన ,వెనకాల ఏమైనా ఉందా . దివ్య : అవన్నీ నీకు తరవాత చెప్తాను అ రాజేష్ గాడిని మాత్రం నాకు కాల్స్ చెయ్యదు అని చెప్పు అని అంటుంది. అమ్మ: అది కాదే నేను చెప్పేదే విను... దివ్య: నీకో దణ్ణం పెడతా ,ఉంటాను నేను ఫ్రెండ్స్ తో బయటకి వచ్చ bye అని ఫోన్ పెట్టేస్తుంది. అందరూ టిఫిన్ చేస్తున్న కృష్ణా మాత్రం టిఫిన్ తింటూనే ఈ ఫోన్ లో మాట్లాడుకొన్న మాటలు వింటాడు దివ్య మాటలు విన్నాక కృష్ణ కి చాలా ఆనందంగా ఉంటుంది దివ్య తనని లవ్ చేస్తుంది అనుకొంటా చెప్పడానికి ఇబంది పడుతున్నట్టు ఉంది నేనే తనకి చెప్పేస్తే ఐపోతుంది అనుకొంటాడు తనలో తానే చాలా సంతోష పడిపోతాడు. అందరూ టిఫిన్ చేసేస్తారు విజయ్ ఎక్కడికి వెళదాం ఇప్పుడు చెప్పండి అంటాడు ,దివ్య వెంటనే శంషాబాద్ airport.... అని అంటుంది హే అంత దూరం నైట్ టైం సేఫ్ కాదు అని యశోధ అంటుంది మరి లాంగ్ డ్రైవ్ అంటే ఇంకా ఏ ప్లేస్ ఉందొ మీరే చెప్పండి అదే బెటర్ త్వరగా వెళ్లి వచేయచ్చు వెళదాం ప్లీస్ అంటుంది దివ్య సరే వెళదాం.. అని కృష్ణ అంటాడు అందరూ సరే అనుకుంటారు నేను అంత దూరం బైక్ డ్రైవ్ చేయలేను అని అంటుంది దివ్య తన బైక్ ఏక్కాలి అన్న వంకతో దివ్య అలా అంటుంది అనుకొంటాడు కృష్ణ అస్సలు లాంగ్ డ్రైవ్ అన్నదే నువ్వు ఇప్పుడు బైక్ డ్రైవ్ చేయలేను అంటున్నావు అని కీర్తి అంటుంది దొరికిందే ఛాన్స్ అని కృష్ణ కీర్తి తో okk తను నా బైక్ ఏక్కుతుంది నువ్వు దివ్య scooty డ్రైవ్ చేసుకొంటూ రా అని అంటాడు నేను చెయ్యను అంటుంది కీర్తి వచ్చేటప్పుడు తను చేస్తుంది లే అంటాడు కృష్ణ దివ్య కి తన లవ్ విషయం చెప్పి చాలా సేపు మాట్లాడుకోవడానికి టైం కూడా ఉంటుంది అనుకొంటాడు కృష్ణ కృష్ణ అనుకొన్నట్టు గానే దివ్య కృష్ణ బైక్ మీద యశోధ విజయ్ ఒక బైక్ మీద ,కీర్తి మాత్రం దివ్య స్కూటీ డ్రైవ్ చేసుకొంటూ శంషాబాద్ స్టార్ట్ అవుతారు దివ్య ని బైక్ ఏక్కించుకొన్నదుకు కృష్ణ తనలో తానే చాలా ఆనందపడతాడు కొంచం దూరం వెళ్ళాక కృష్ణ కావాలని ఏంటి మీ అమ్మగారితో ఫోన్ లో అంత కోపం గా మాట్లాడుట్జున్నావ్ అని అడుగుతాడు దివ్య ని అప్పుడు దివ్య ఏమి లేదు నాకు నచ్చని సంబంధం తెచ్చి పెళ్లి చేసుకోమంటున్నారు అంటుంది నీకు ఎలాంటి అబ్బాయి ఇష్టం అని అడుగుతాడు కృష్ణ దివ్య ని అబ్బాయి అందం గా లేకపోయినా పరవాలేదు అర్ధం చేసుకునే వాడు ఐతే చాలు అంటుంది దివ్య. అర్ధం చేసుకునే వాళ్ళు ధోరకాలి అంటే లవ్ marriage చేసుకోవడం బెటర్ , ఎవరిని లవ్ చెయ్యలేద నువ్వు అని అడుగుతాడు కృష్ణ దివ్య ని ఎవరిని లవ్ చేయలేదు అంటుంది దివ్య ఇదేంటి తన లవ్ విషయం చెప్పేస్తుందు అనుకొంటే అస్సలు ఎవరిని లవ్ చేయలేదు అంటుంది ఎంటి అనుకొంటాడు కృష్ణ నిజం చెప్పు పరవాలేదు అంటాడు నిజం గా ఎవరిని చెయ్యలేదు ఒకవేళ చేస్తే నీకే ఫస్ట్ చెప్తా అని అంటుంది ఇది ఏంటి ఇలా అంటుంది అనుకొంటాడు కృష్ణ కానీ ఇంటిలో వాళ్ళకి మనం పెర్సొనల్ గా ఎలా ఉన్నాం అన్న దానికంటే బయటకి ఎంత బాగా కనపడుతున్నాం అన్నదే కావాలి , అందరి parents లాగే మా parents కూడా అలాగే ఆలోచిస్తున్నారు అబ్బాయి బాగా ఉన్నవాడ ఎన్ని కార్లు ఉన్నాయి అన్న దానికంటే న personal attachment ముఖ్యం అనే చెప్తున్న కానీ వాళ్ళు అర్ధం చేసుకోవడం లేదు నాకు రాజేష్ అన్న వాడిని నాకు అంటించాలి అని చూస్తున్నారు వాడు ఎమో నాకు మెసేజ్ లు చేసి కాల్స్ చేసి విసిగిస్తున్నాడు అని అంటుంది దివ్య . ఇంతకు ముందు వరకు డల్ గా ఉన్నావ్ వాడి వల్లేన అని దివ్య ని అడుగుతాడు కృష్ణ దివ్య అవును అంటుంది అలాంటి వారిని దూరం పెట్టాలి దివ్య మంచి పని చేశావ్ అంటాడు కృష్ణా ఇలా మాట్లాడుకొంటు శంషాబాద్ దగ్గర వరకు వెళ్ళిపోతారు తను కావాలి అనే తనని ఏడిపిస్తూ ఐ లవ్ యు అని చెప్పకుండా నా చేతనే చెప్పించుకోవాలి అనుకొంటునట్టు ఉంది అనుకొంటాడు కృష్ణ ఇదే మంచి సమయం తన మనసులో ఉన్న మాట దివ్య కి చెప్పేదం అని కృష్ణ అనుకొంటూ ఉంటాడు ఇంకా చెప్పేదం అని అనుకోని దివ్య నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు కృష్ణ కృష్ణ పోలీస్ లు అని అంటుంది దివ్య. నైట్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఇంకా లైసెన్స్ లు ఉన్నాయా అని పోలీస్ లు చెక్ చేస్తూ ఉంటారు కృష్ణ బైక్ ని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ బైక్ ని కూడా పోలీస్ లు ఆపుతారు కృష్ణ కాంస్టేబుల్ తో సర్ మేము శంషాబాద్ వెళ్తున్నాం అని అంటాడు మీరు ఏమైనా చెప్పుకోవాలి అంటే SI గారితో చెప్పుకోండి అని అంటాడు కృష్ణ ఇంకా విజయ్ సర్ మేము శంషాబాద్ శంషాబాద్ వెళ్తున్నాం గో కార్టింగ్ కోసం (చిన్న కార్ రేస్ టైప్) అని అంటాడు ఆడపిల్లతో నైట్ టైం రైడ్ ఏంటి బుద్ధి ఉందా వెళ్ళడానికి అని తిడతాడు SI, అటు వైపు ఉన్న ఒక కాంస్టేబుల్ ఇటు వస్తాడు అతని పేరు రమేష్ ,విజయ్ కి ఈ రమేష్ బాగా తెలుసు కృష్ణ SI తో మాట్లాడుతుండగా విజయ్ వెళ్లి రమేష్ అన్న నేను విజయ్ ని అంటాడు అప్పుడు రమేష్ ఏంటి రా విజయ్ ఇలా వచ్చావు ఏమీ లేదు అన్న ఫ్రెండ్స్ తో శంషాబాద్ వెళ్తుంటే మీ SI సీన్ చేస్తున్నాడు కొంచం నువ్వు వచ్చి చెప్పు అన్న అంటాడు విజయ్ అరే ఆడపిల్లలు కూడా ఉన్నార మీ పని బాగుంది రా అని అంటాడు రమేష్ ,అదేం లేదు అన్న సరదాగా లాంగ్ డ్రైవ్ అన్నారు అని వచ్చాము అంతే అని విజయ్ అంటాడు SI వినడు రా చెప్పిన అని అంటాడు రమేష్ అన్న ప్లీస్ అన్న ప్లీస్ అంటాడు విజయ్ సరే చెప్తాను లే అని SI దగ్గరకు వెళ్లి సర్ మా వాళ్ళే కొంచం వదిలేయండి అంటాడు రమేష్ దానికి SI మీ వాళ్ళు ఐతే నైట్ టైం ఇ రైడ్ లు ఏంటి అమ్మైయాలని వేసుకొని సర్ ఏదో సరదాగా వెళ్తున్నారు అంటా గో కార్టింగ్ కి(చిన్న కార్ రేస్ టైప్) అని అంటాడు రమేష్ రమేష్ నువ్వు వెళ్లి ఆల్కహాల్ టెస్టర్ తీసుకొని రా అని అంటాడు SI. సర్ వదిలేయండి సర్ అని అంటాడు రమేష్ ముందు నువ్వు వెళ్లి తీసుకొని రా అని SI కోపంగా అంటాడు సరే అని జీప్ లో ఉన్న ఆల్కహాల్ టెస్టర్ తీసుకొని వస్తాడు రమేష్ వీళ్ళని టెస్ట్ చై ఎవడైనా తాగాడు అని తెలిస్తే నైట్ అంతా స్టేషన్ లో ఉంచేస్తా ఆడపిల్లలు ఉన్నారు అని కూడా చూడను అని అంటాడు సర్ మేము ఏం తాగలేదు అని కృష్ణ అంటాడు రమేష్ టెస్ట్ చై అని అంటాడు SI టెస్ట్ చేసాక ఎవరు తాగలేదు అని తెలుస్తుంది తాగలేదు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్న ఇంకెప్పుడు ఇలాంటి రైడ్ లు వేసుకోకండి అంటాడు SI అందరిలో ఒక్కసారి గా ఉన్న టెన్షియన్ అంత పోతుంది థాంక్స్ రమేష్ అన్న అని విజయ్ చెప్తాడు, అన్న ని నెంబర్ మిస్ చేసుకొన్న ఇవ్వవ అని అడుగుతాడు విజయ్, రమేష్ ని రమేష్ నంబర్ చెప్పి ఫీడ్ చేసుకో అని అంటాడు థాంక్స్ అన్న bye అని అంటారు ఇద్దరు బైక్స్ తీసుకొని యధావిధిగా శంషాబాద్ స్టార్ట్ అవుతారు నాకు అస్సలు చాలా భయం వేసింది మన అందరాని ఎక్కడ ఆ SI స్టేషన్ కి తీసుకొని వెళ్తాడు ఏమో అని నాకు అస్సలు ఈ నైట్ రైడ్ ఆంటే నే చాలా భయం అందులో ఇలాంటివి ఏమైనా జరిగితే ఇంకా భయం వేస్తోంది అని అంటుంది దివ్య కృష్ణ తొ భయం ఎందుకు మనం ఏ తప్పు చెయ్యనపుడు అని అంటాడు కృష్ణ మీకు ఆ కానిస్టేబుల్ తెలుసా అని అంటుంది దివ్య కృష్ణ ని విజయ్ కి తెలుసు వాడు నైట్ రైడ్స్ కి ఎక్కువ వెళ్తాడు కదా అలా పరిచయం ఐ ఉంటాడు అని అంటాడు కృష్ణ ఎలాగో దగ్గరకి వచ్చేసాం వెళ్ళాక చెప్పవచ్చు అని అనుకొంటాడు కృష్ణ శంషాబాద్ వెళ్ళాక గో కర్టింగ్ చేస్తారు దివ్య కృష్ణ చేసేసిన తరవాత మిగతవాళ్ళు చేస్తుంటే చూస్తూ ఉంటారు ఇదే మంచి టైం అనుకోని దివ్య నీకు ఒక విషయం చెప్పాలి అని కృష్ణ దివ్య తో అంటాడు ఏంటి కృష్ణ అని అడుగుతుంది దివ్య నువ్ అంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఒప్పుకొంటే మీ ఇంటిలో వాళ్ళని ఒప్పించి నిన్ను పెళ్లిచేసుకొంటా అంటాడు కృష్ణ రాజేష్ లా ఉండే వాళ్ళని దూరం పెట్టాలి అని నువ్వే అన్నావ్ ఇప్పుడు ని విషయం లో నేను ఎమీ చెయ్యాలి కృష్ణ అని అంటుంది దివ్య నువ్ మీ అమ్మగారితో ఫోన్ లో ఒకరిని లవ్ చేస్తున్నావ్ అన్నావు కదా నన్ను కాదా అని అంటాడు కృష్ణ నిన్ను కాదు అని అంటుంది దివ్య మరి ఎవరిని లవ్ చేస్తున్నావ్ అని అడుగుతాడు కృష్ణ అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది దివ్య కోపం తొ sorry దివ్య నేను అంటే నీకు ఇష్టం అనుకుని ఇంత చనువుగా చెప్ప అని తన వెంటపడుతూ అంటాడు కృష్ణ ఈలోపు గోకార్టింగ్ కంప్లీట్ చేసుకొని మిగతా వాళ్ళు కృష్ణ , దివ్య ఉన్న చోటకి వచ్చేస్తారు విజయ్ అంటాడు ఫస్ట్ టైం ర చాలా బాగుంది ఈ గోకార్టింగ్ మళ్ళీ చేదం వాస్తవ అని అడుగుతాడు నాకు ఇంట్రెస్ట్ లేదు ర అని అంటాడు కృష్ణ సరే అని దివ్య ని అడుగుతాడు విజయ్ నేను అర్జంట్ గా మా రూమ్ కి వెళ్ళాలి నేను వెళ్లిపోతున్నా అంటుంది హే దివ్య అంత దూరం నుండి వచ్చి ఇక్కడ కాసేపు కూడా లేకుండా ఏంటి ఇంకో రౌండ్ వేదం పదా అంటుంది యశోధ ,దివ్య నాకు ఇంట్రెస్ట్ లేదు నేను అర్జంట్ గా నా హాస్టల్ కి వెళ్ళాలి అంటుంది దివ్య ఏంటి ఎమీ అయింది అరే కృష్ణ ఏమీ జరిగింది అని అడుగుతాడు విజయ్, కృష్ణ కూడా ఏమి మాట్లాడాడు కీర్తి దివ్య ని అడిగితే దగ్గరకి పిలిచి చెవిలో నాకు periods అని చెపుతుంది సరే మనం స్టార్ట్ అయిపోదాం అంటుంది కీర్తి , బైక్స్ దగ్గరకి వెళ్తారు దివ్య అంటుంది మీరు గచ్చిబౌలి వెళ్ళాలి కదా మళ్ళీ అమీర్పేట్ ఏం వస్తారు నేను ఇటు వెళ్లిపోతా నా స్కూటీ మీద అని చెప్తుంది ఒక్కదనివే ఏమీ వెళ్తావు మేము అటు వచ్చి నిన్ను దింపేసి వెళతాం లే అంటారు ఉన్న వాళ్ళు అంత కృష్ణ అస్సలు ఏమీ మాట్లాడడు దివ్య వద్దు మీకు లేట్ ఐపోతుందు వద్దు వెళ్లిపోండి నేను ఇలా వెళ్లిపోతా అంటుంది దివ్య ఎందుకో కోపంగా ఉంది అని అర్ధం చేసుకుని సరే ఐతే జాగ్రత్త గా వేళ్ళు అని అంటారు అందరు టైం నైట్ 11 అవుతుంది సరే నువ్ రీచ్ ఇయ్యక కాల్ చై అని అంటారు అందరూ సరే అని దివ్య వెళ్ళిపోతుంది వీళ్లు అందరూ, ఏంటి దివ్య సడన్ గా ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకోని ఏరా కృష్ణ ఏమీ జరిగింది నువ్ అయిన చెప్తావా చెప్పవ అని అంటాడు విజయ్ ఏమో రా తన మమ్మీ దగ్గర నుండి ఫోన్ వచ్చింద అంతే తను డల్ ఐపోఇంది అని అబద్ధం చెప్తాడు కృష్ణ అందరితో ఇది ఎప్పుడు ఇంతే అని అంటుంది కీర్తి దివ్య తన స్కూటీ వేసుకొని వెళ్ళిపోయాక కీర్తి ఏమో కృష్ణ బైక్ యశోధ ఏమో విజయ్ బైక్ ఎక్కుతుంది వీళ్లు స్టార్ట్ అవుతారు కృష్ణ కి దివ్య అన్న మాటలే గుర్తుకు వస్తాయి కొంచం దూరం వెళ్ళాక ఒక జీప్ వేసుకొని కొంత మంది అబ్బాయిలు వీళ్ల బైక్స్ వెనకాల వెళ్తూ పిచ్చి కామెంట్స్ అన్ని చేస్తారు కృష్ణ కి కోపం వచ్చి బైక్ ఆపి అందులో ఒక అబ్బాయి తో గొడవ పెట్టుకొంటాడూ లాస్ట్ కి తప్పు మనదే అని వాళ్ళులో ఒక అబ్బాయి వాళ్ళని ఆపి అక్కడ నుంచి యూటర్న్ చేసుకొని వెళ్ళిపోతారు టైం నైట్ 12 :30 అవుతుంది కీర్తి ,యశోధ ని వాళ్ళ రూమ్ దగ్గర దింపేసి మాధపూర్ లో ఉన్న వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతారు విజయ్ ,కృష్ణ . కృష్ణ దివ్య అన్న మాటలకి బాధతో కన్నీళ్లు పెట్టుకొని పదుకొంటాడు సరిగ్గా ఒక్క అరగంట తరవాత విజయ్ కృష్ణ ను లేపి దివ్య ఇంకా తన హాస్టల్ కి వెళ్ళలేదు అంటా అని అంటాడు కృష్ణ ఒక్కసారిగా ఈ మాట విని షాక్ ఐపోతాడు కీర్తి ఈలోపు విజయ్ కి కాల్ చేస్తుంది కృష్ణ తీసుకుంటాడు విజయ్ ఫోన్ ని హలో కీర్తి చెప్పు అని అంటాడు కృష్ణ దానికి కీర్తి ఏంటీ ని మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇందాక వాళ్ళతో జరిగిన గొడవలో కింద పడి స్విచ్ ఆఫ్ ఐపోఇంది on చేస్తుంటె అవ్వడం లేదు అని అంటాడు కృష్ణ, దివ్య ఇంకా హాస్టల్ కి వెళ్ళలేదు అంటా తన ఫ్రెండ్ జాహ్నవి కాల్ చేసింది నాకు ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు తనతో వెళ్లి మనం తన హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి రావాల్సింది తప్పు చేసాం నాకు చాలా భయం గా ఉంది అంటుంది కీర్తి కృష్ణ తో నువ్వు ఏమి కంగారు పడకు నేను విజయ్ ఏదొకటి చేస్తాం నువ్వు దివ్య మొబైల్ కి ట్ర్య్ చేస్తూ ఉండు అంటాడు కృష్ణ ,కీర్తి తో. అరేయ్ ముందు మనం అమీర్పేట్ కి వెళదాం దివ్య హాస్టల్ దగ్గరకి అక్కడ నుంచి శంషాబాద్ రూట్ కి వెళదాం మేబి తన బైక్ పంచర్ అయుండఉండవచ్చు అని అనుకోని కృష్ణ, విజయ్ అమీర్పేట్ దివ్య హిస్టల్ కి వెళ్తారు దివ్య ఫ్రెండ్ అయిన జాహ్నవి ని కిందకి రమంటారు కృష్ణ జాహ్నవి తో మేము అక్కడ 11 కి స్టార్ట్ ఐపోయాం దివ్య కూడా అక్కడ నుంచి స్టార్ట్ ఐపోయంది హ తను నాకు కాల్ చేసి చెప్పింది నేను స్టార్ట్ అవుతున్న అని 11 కి ఆ టైం కి దివ్య మొబైల్ స్విచ్ on చేసుకుంది ఒక వన్ hour తరవాత కాల్ చేస్తుంటే continous స్విచ్ ఆఫ్ అనే వస్తుంది విజయ్ ని కృష్ణ పక్కకి పిలిచి ఒరేయ్ 11 తరవాత దివ్య కి ఏదొ ఐనది అనిపిస్తుంది మనం ఒక్కసారి మళ్ళీ శంషాబాద్ వెళ్తే మంచిది అనుకొంటున్న అంటాడు జాహ్నవి దగ్గరకి వెళ్ళి బైక్ పంచర్ అయుంటుంది మొబైల్ స్విచ్ ఆఫ్ ఐ వుంటుంది ఏమో నాకు తెలిసి మేము శంషాబాద్ రూట్ లో వెళ్తే మాకు కనిపిస్తుంది దివ్య నువ్వు ఏమీ కంగారు పడకు మేము వెళ్లి చూసి వస్తాం అంటారు ఇద్దరూ జాహ్నవి తో కృష్ణ , విజయ్ శంషాబాద్ స్టార్ట్ అవుతారు కృష్ణ ఇంత ధైర్యంగా జాహ్నవి కి ఏదో చెప్పిన లోపల తెలియని ఒక భయం గ ఉంటుంది మద్యలో కీర్తి ,యశోధ కంగారు పడుతూ వీళ్ళకి ఫోన్ చేస్తారు ఏరా ఏమి అయింది మేము శంషాబాద్ వెళ్తున్నాం మళ్ళీ నాకు తెలిసి కీర్తి ఆ దారిలో కనిపించవచ్చు అరే పోలీస్ కంప్లెయింట్ ఇద్దమా అని అంటుంది కీర్తి మేము శంషాబాద్ వెళ్తున్నాం కధ ఒకవేళ తను ఎక్కడ కనపడకపోతే అదే చేదం అంటాడు కృష్ణ కీర్తి తో కృష్ణ వాళ్ళు వెళ్తారు ఎక్కడ దివ్య కనిపించదు కృష్ణ తనలో తాను చాలా డిప్రెస్ ఐపోతాడు తన లవ్ accept చెయ్యలేదు అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తాడు ముందు తను చాలా ప్రేమించిన దివ్య తనకి కనపడలి అదే ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా ఇలా బాధపడుతున్నపుడూ కృష్ణ కి ఒక ఐడియా వస్తుంది విజయ్ తో ఇలా అంటాడు అరే మనం వచ్చే దారిలో టోల్ గేట్ ఉంది కదా దివ్య బైక్ అక్కడ నుంచి క్రాస్ అయిందో లేదో ఒక్కసారి చూదాం వాడు అడిగితే అమ్మాయి మిస్ అనకుండా బైక్ మిస్ అయింది అని చెపుదాం అనుకోని ఇద్దరు కలిసి టోల్ గేట్ footage కోసం అక్కడికి వెళ్తారు కృష్ణ టోల్ ఫీ కాలేక్ట్ చేసుకొనే అబ్బాయి దగ్గరకి వెళ్ళి 11 నుంచి 12 వరకు ఉన్న footage కావాలి అన్న కొంచం ఇస్తావా మా బైక్ మిస్ అయింది అని అడుగుతాడు దానికి ఆ వర్కర్ ఇది ఎవరు అడిగితే వాళ్ళకి చూపించారు మా manager అప్రూవల్ కావాలి ఒకవేళ మీరు ఆయన దగ్గరకి వెళ్లిన ఎందుకు దేనికి అని చాలా క్యూషన్స్ వేస్తాడు బెటర్ బైక్ మిస్సింగ్ అంటున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తే వాళ్ళ లీగల్ గా వచ్చి తీసుకొంటారు అంటాడు విజయ్ అంటాడు కృష్ణ చెవిలో ఒరే వీడికి బైక్ మిస్ అయింది అంటేనే ఇవన్నీ అంటున్నాడు అమ్మాయి మిస్ అంటే ఇంకా ఏమైనా ఉందా అని అంటాడు ఎమీ చెయ్యాలో తెలియదు కృష్ణ ఇంకా విజయ్ లకి ఆ టోల్ గేట్ దగ్గరే నిలబడి ఏమీ చెయ్యాలో ఆలోచిస్తూఉంటారు విజయ్ ఇంకా మనం చేసేది ఏమీ లేదు రా పోలీస్ కంప్లయింట్ ఇవ్వాల్సిందే అంటాడు విజయ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కానీ వాళ్ళు ఏక్షన్ తీసుకోవడానికి టైం పడితే ఈలోపు దివ్య కి జరగరనిది ఏమైనా జరిగితే ఏంటి అని ఆలోచిస్తున్న అని అంటాడు కృష్ణ అరే విజయ్ లాస్ట్ ట్రయిల్ ఒక పని చేదం రా మీ రమేష్ అన్న ఉన్నాడు కదా తను ఎక్కడ ఉన్నాడో కాల్ చై రా ఒకవేళ తను ఈ దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఇలా బైక్ మిస్ అయింది అన్న శంషాబాద్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం అని చెప్పవచ్చు వచ్చాక ఇలా జరిగింది అనవచ్చు అని అంటాడు కృష్ణ విజయ్ తొ ముందు విజయ్ వద్దు అంటాడు కానీ బయపడుతు రమేష్ కి కాల్ చేస్తాడు ఫోన్ కాల్ లో : రమేష్ అన్న నేను విజయ్ ని రమేష్ : హ చెప్పారా విజయ్ విజయ్ :ఎక్కడ ఉన్నావ్ అన్న రమేష్: డ్యూటీ ఇప్పుడే అయింది ర శంషాబాద్ దగ్గరలో ఉన్న విజయ్ :అన్న మేము శంషాబాద్ నుంచి అమీర్పేట్ వెళ్లే దారిలో టోల్ గేట్ ఉంటుంది కదా అక్కడ ఉన్నాం రమేష్: ఏర ఎమి అయింది విజయ్: బైక్ పోయింది అన్న ఇక్కడ టోల్గేట్ లోంచి క్రాస్ అయిందో లేదో చూదాం అంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు కొంచం రా అన్న రమేష్ :సరే నేను ఎలాగో అటువైపు వెళ్ళాలి వస్తున్న విజయ్ :థాంక్స్ అన్న అని ఫోన్ పెట్టేస్తాడు ఒక 10 నిమిషాలు అయ్యక రమేష్ వస్తాడు టైం 2 am అవుతుంది ఏర ఎందుకు చూపించాను అంటున్నాడు పద వెళ్లి మనం అడుగుదాం అంటాడు రమేష్ దానికి కృష్ణ విజయ్ అది అన్న ఎమీ అయింది అంటే మిస్ అయింది బైక్ ఒకటే కాదు బైక్ తో పాటు అమ్మాయి కూడా అరే ఏమి మాట్లాడుతున్నారు రా మీరు అమ్మాయి మిస్ అవ్వడం ఏంటి అని షాక్ అవుతాడు రమేష్ అన్న మెము శంషాబాద్ నుండి తిరిగి వచ్చేటప్పుడు మేము అలా గచ్చిబౌలి సైడ్ వెళ్లిపోయాం దివ్య మాత్రం తన స్కూటీ తో అమీర్పేట్ సైడ్ వెళ్లిపోతాను అన్నది అని విజయ్ రమేష్ తొ అంటాడు అలా నైట్ ఒక్కతే వెళ్తాను అంటే మీరు ఎలా వెళ్ళనిచ్చారు రా మొన్నే కదా దిశ అన్న అమ్మాయి ఇన్సిడెంట్ జరిగింది ఇలా ఎలా చేశారు రా అని అంటాడు రమేష్ వాళ్ళతో ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లయింట్ ఇద్దాం పదండి అని అంటాడు రమేష్ అన్న కంప్లయింట్ ఇదం కానీ ఎలాగో వచ్చావు కదా అన్న ఒక్కసారి దివ్య ఈ టోల్ గేట్ క్రాస్ అయిందో లేదో చూదాం అన్న అని అంటాడు కృష్ణ సరే అని చెప్పి సీసీ footage చూపించమంటాడు రమేష్ టోల్ గేట్ బాయ్ ని సరే సర్ అని చూపిస్తాడు వీళ్ళకి అందులో దివ్య బైక్ 11 తరవాత క్రాస్ చెయ్యడం ఉంటుంది, అన్న ఈ అమ్మాయి దివ్య మా ఫ్రెండ్ అని చూపిస్తారు ఇద్దరు అరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి రా మళ్ళీ లేట్ చేస్తే చాలా పెద్గ ప్రాబ్లెమ్ అవుతుంది అమ్మాయి ని ఎవరైన ఏమైనా చేసి ఉంటే మనం ఎమి చేయలేము అని రమేష్ వాళ్ళతో అంటాడు ఈ మాట విన్న కృష్ణ కి సడన్ గా ఆ జీప్ వాళ్ళు గుర్తుకు వస్తారు అన్న మేము శంషాబాద్ నుండి స్టార్ట్ అయినపుడు కొంత మంది కుర్రవాళ్ళు మాతో పాటు ఉన్న అమ్మాయిలని కామెంట్ చేశారు అని వాళ్ళతో గొడవ పెట్టుకొన్న తరవాత వాళ్ళు యూటర్న్ చేసుకొని వెళ్లిపోయారు ఒకవేళ వాళ్ళు కానీ దివ్య తరవాత ఈ టోల్ గేట్ క్రాస్ చేసి ఉంటే వాళ్ళే దివ్య ని ఏదో చేసి ఉండవచ్చు అని నాకు అనిపిస్తుంది ఒక్కసారి దివ్య క్రాస్ ఐన తరవాత వీళ్ళు క్రాస్ ఇయ్యారో లేదో చూదాం అంటాడు కృష్ణ సరే అని మళ్ళీ సీసీటీవీ footage చూస్తారు కరెక్ట్ గా 10 మినిట్స్ తరవాత దివ్య క్రాస్ చేసాక ఈ టోల్ గేట్ క్రాస్ చేస్తారు అన్న కచ్చితం గా వీళ్ళే అని కృష్ణ ,విజయ్ అంటారు రమేష్ తో రమేష్ వెంటనే వాళ్ల జీప్ నెంబర్ నోట్ చేసుకొని తన దగ్గర ఉన్న వాకి టాక్ తీసుకొని ఎమర్జెన్సీ ఈ నెంబర్ ఉన్న రెడ్ కలర్ జీప్ ఎక్కడ ఉన్నా చెప్పండి అంటాడు అన్న ఒకవేళ తనని వాళ్ళు తీసుకొని వెళ్లి ఉంటే దివ్య బైక్ మేము వచ్చే దారిలో కనపడుతుంది కదా కానీ బైక్ కూడా కనపడలేదు అని అంటాడు కృష్ణ ,అవును అది నిజమే అని రమేష్ ,విజయ్ అంటారు ఈలోపు కీర్తి కాల్ చేస్తుంది కృష్ణ ఎమీ అయింది అని కీర్తి దివ్య బైక్ నెంబర్ చెప్పు అని అంటాడు తను చెప్తుంది నీకు నేను తరవాత కాల్ చేస్తా అని పెట్టేస్తాడు కృష్ణ అన్న ఈ బైక్ నెంబర్ ఇచ్చి ఎక్కడ కనపడిన చెప్పమని inform చెయ్యమని చెప్పు అని అంటాడు కృష్ణ, రమేష్ తో ,రమేష్ అలాగే అని inform చేస్తాడు మనం వెంటనే స్టేషన్ కి వెళ్లి ఈ ఇష్యూ మీద SI గారికి ఇన్ఫోర్మ్ చేదం సెర్చ్ టీమ్స్ ని ఏర్పాటు చేస్తారు అప్పుడు తనని వెతకడం easy అవుతుంది వెంటనే వెళదాం అంటారు వీళ్ళు వెళ్తున్న దారి మద్యలో వాకి టాకీ లో హలో హలో బైక్ నో 1429 బ్లూ కలర్ activa రింగ్ రోడ్డు వెళ్తున్న దారిలో దొరికింది ఇది వినగానే అక్కడ డ్యూటీ లో ఉన్న పోలీస్ లకి కాల్ చేస్తాడు రమేష్ నేను రమేష్ శంషాబాద్ PS(పోలీస్ స్టేషన్) నుంచి ఇప్పుడు మీరు ఒక స్కూటీ ని పట్టుకున్నారు కదా ఆ స్కూటీ ని వేసుకోచిన అమ్మాయి అక్కడ ఉంటే తనకి ఫోన్ ఇవ్వండి అంటాడు రమేష్ సర్ స్కూటీ వేసుకొని వచ్చింది అమ్మాయి కాదు ఒక అబ్బాయి అంటాడు ఆ కాంస్టేబుల్ రమేష్, కృష్ణ ,విజయ్ , దివ్య బైక్ వాడు ఎవడో వేసుకొని రావడం ఏంటి అని షాక్ ఐపోతారు వెంటనే ఫోన్ లో రమేష్ ఆ కాంస్టేబుల్ కి సర్ ఆ స్కూటీ ఒక అమ్మాయి ది తను మిస్సింగ్ వాడికి ఎక్కడ దొరికిందో అడగండి అంటాడు శంషాబాద్ ఎంట్రన్స్ లో దొరికింది అంటున్నాడు సర్ అని అంటాడు ఆ కాంస్టేబుల్ రాజు,రమేష్ తో మేము వెంటనే అక్కడికి వస్తున్నాం మేము వచ్చే వరకు వాడిని అక్కడే ఉంచండి అని అంటారు పోలీస్ స్టేషన్ కి వెళ్లే వాళ్ళు ఇంకా రింగ్ రోడ్డు ఎక్కుతారు చాలా ఫాస్ట్ గా ఆ స్కూటీ ఉన్న ప్లేస్ కి వెళ్తారు వెళ్ళాక అ స్కూటీ వేసుకొని వచ్చిన వాడిని నాలుగు కొడితే శంషాబాద్ టోల్ గేట్ దాటాక అక్కడ పడిపోయి ఉంది కీస్ కూడా బండి కి ఉన్నాయి కదా అని తీసుకొన్నాను సర్ అని అంటాడు ఆ దొంగ ,మరి అమ్మాయి ఏదీ అని అంటాడు రమేష్ దేవుడు మీద ఓటు సర్ నేను వెళ్లే సరికి ఈ బండి మాత్రమే ఉంది అంటాడు ఆ దొంగ, కృష్ణ దివ్య ఎమీ ఐపోఇంది అని చాలా బాధ పడుతూ ఆ దొంగ చేతికి ఉన్న వాచ్ ని చూస్తాడు వెంటనే ఆ దొంగ దగ్గరకి వెళ్ళి హే ఈ వాచ్ ఎక్కడిది అని అడుగుతాడు కృష్ణ ,బండి తో పాటు నాకు అదే ప్లేస్ లో దొరికింది అంటాడు దొంగ ఏంటి కృష్ణ అని రమేష్ కృష్ణ ని అడుగుతాడు అప్పుడు కృష్ణ అరే విజయ్ ఆ జీప్ లో ఉన్న వాడితో మనం గొడవ పడ్డాం కదా వాడిదేరా ఇ వాచ్ అవును రా నేను చుశాను వాడి చేతికి ఉంది. రమేష్ అన్న చెప్పాను కధా వాళ్లే దివ్య ని ఏదో చేసి ఉంటారు , అన్న వాళ్ళ వెహికల్ నెంబర్ బట్టి వాళ్ల ఇంటి అడ్రస్ వస్తుంది కద కొంచం PS కి కాల్ చేసి కనుక్కో అన్న అని అంటాడు కృష్ణ అరే కృష్ణ మనం కంప్లైంట్ ఇవ్వకుండా ఇవన్నీ చేయలేము అని అంటాడు రమేష్ ఈ ఒక్క పని చై అన్న ప్లీస్ అంటాడు వెంటనే PS కి ఫోన్ చేసి అడ్రడ్స్ తీసుకొంటాడు రమేష్ ఆ అడ్రస్ రింగ్ రోడ్డు లోపలి ఉన్న చిన్న village ఫార్మ్ హౌస్ అని తెలుస్తుంది వెంటనే కృష్ణ రమేష్ తో అన్న ఒక పని చేదం నువ్వు విజయ్ శంషాబాద్ PS కి వెళ్లి కంప్లైంట్ రిజిస్టర్ చెయ్యండి ఇక్కడ ఉన్న కాంస్టేబుల్ అన్న నేను కలసి ఇ ఫార్మహౌస్ అడ్రస్ కి వెళతాం అని అంటాడు ఏంటి అన్న ఆలోచిస్తున్నావ్ ఇప్పుడు లేట్ చేస్తే అక్కడ ఆ అమ్మాయి జీవితం నాశనం ఐపోతుంది ఈ టైం లో ఇదే కరెక్ర్ అని ఆ కాంస్టేబుల్ రాజు ని కూడా ఒప్పించి ఫార్మహౌస్ అడ్రస్ కి స్టార్ట్ అవుతారు కృష్ణ ఇంకా రాజు కృష్ణ ,రాజు ఆ ఫార్మహౌస్ దగ్గరకి 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు కృష్ణ చూసిన జీప్ బయట ఉంటుంది కృష్ణ ఇంకా రాజు లోపలకి వెళ్తారు లోపల ఎక్కడ చూసినా ciggrriate వాసన తాగి పడేసిన మందు బొట్టలే పైకి వెళ్లి అక్కడ తాగి పడుకున్న కొంత మంది ఉంటారు కృష్ణ తో గొడవ పడ్డ వాడు కూడా తాగేసి పడుకొని ఉంటాడు కృష్ణ వాడిని లేపుతాడు కాలర్ పట్టుకొని కోపం గా అమ్మాయి ని ఎమీ చేశారు రా అని రాజు కూడా లాటి తో మిగతా వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేస్తాడు వెంటనే అందులో ఒకడు మేము అమ్మాయి ని ఏడిపించిన మాట నిజమే కానీ మేము ఏడిపిస్తూ ఉంటే ఒక బ్లాక్ కలర్ కార్ వచ్చి ఆగింది అందులో ఒకడు దిగి తనని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు మాకు అదే తెలుసు ఇది అంత విన్న కృష్ణ, రాజు మొబైల్ తీసుకొని విజయ్ కి కాల్ చేస్తాడు అరే విజయ్ ఎక్కడ ఉన్నారు మీరు అంటాడు దానికి విజయ్ PS కి దగ్గరలో ఉన్నాం రా అంటాడు అరే దివ్య ని తీసుకొని వెళ్ళింది వీళ్లు కాదు రా వీళ్లు దివ్య ని ఏడిపిస్తున్న టైం కి బ్లాక్ కలర్ వెర్నా లో ఒకడు వచ్చి దివ్య ని తీసుకొని వెళ్ళిపోయాడు అంట అని విజయ్ తో చెప్తాడు కృష్ణ వెంటనే విజయ్ వాడి పేరు ఏమైనా తెలుసా అని అడుగుతాడు వీళ్ళకి తెలియదు అంట నువ్వు వెంటనే కీర్తి కి కాల్ చేసి బ్లాక్ కలర్ కార్ ఉన్న ఫ్రెండ్ దివ్య కి ఎవరైన ఉన్నాడా అని అడుగు అంటాడు కృష్ణ విజయ్ కీర్తి కి కాల్ చేస్తాడు కీర్తి బ్లాక్ కలర్ కార్ ఉన్న ఫ్రెండ్ ఎవరైన ఉన్నారా దివ్య కి అని అడుగుతాడు ఏమో నాకు తెలియదు విజయ్ జాహ్నవి ని అడుగుతను అని అంటుంది వెంటనే కాల్ చేసి అడుగు అని అంటాడు విజయ్ హ సరే అని జాహ్నవి కి కాల్ చేసి అడుగుతుంది దివ్య కి బ్లాక్ కలర్ వెర్నా కార్ ఉన్న ఫ్రెండ్ ఎవరైన ఉన్నారా అని అడుగుతుంది దానికి హ మా స్కూల్ మెట్ కార్తిక్ తనకి కాల్ చేసి దివ్య తన దగ్గర ఉంది ఏమో అడుగు అంటుంది కీర్తి సరే నేను కాల్ చేసి అడిగి చెప్తాను అంటుంది జాహ్నవి కార్తిక్ కి కాల్ చేస్తుంది కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసి హ న దగ్గరే ఉంది అని అంటాడు మరి చెప్పవచ్చు కదా మేము చాలా టెన్షియన్ పడ్డాం అని అంటుంది కార్తిక్ తో ఒక్కసారి దివ్య కి ఫోన్ ఇవ్వు మాట్లాడతాను అని అంటుంది జాహ్నవి తను పడుకొంది బాగా అలసిపోయి అంటాడు కార్తిక్ ఒక్క మార్నింగ్ నేను వచ్చి పిక్ అప్ చేసుకొంటే లే అని ఫోన్ పెట్టేస్తుంది వెంటనే జాహ్నవి కీర్తి కి కాల్ చేసి కార్తిక్ దగ్గర సేఫ్ గా ఉంది అని చెప్తుంది కీర్తి విజయ్ కి కాల్ చేసి తన ఫ్రెండ్ కార్తిక్ అంట తన దగ్గర సేఫ్ గా ఉంది అంటా అని చెప్తుంది ఈ విషయం తెలిసిన విజయ్ ఇంకా రమేష్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొంటారు ,ఇంకా బెటర్ కేస్ ఇంకా ఫైల్ చెయ్యలేదు లేకపోతే చాలా పెద్ద ఇష్యూ ఐఏది ఇ విషయం ముందు కృష్ణ వాళ్ళకి చెప్పు అంటాడు విజయ్, కృష్ణ పక్కన ఉన్న రాజు ఫోన్ కి కాల్ చేస్తాడు దివ్య తన స్కూల్ మెట్ కార్తిక్ అన్న అబ్బాయి దగ్గర ఉంది వాళ్ల దగ్గర నుండి తనే సేవ్ చేసి తీసుకొని వెళ్ళాడు అంటా అని చెప్తాడు పక్కన ఉన్న కాంస్టేబుల్ రాజు ఈ అమ్మాయిలు ఇంటికి దూరం గా ఉండి ఏ లవర్ తోనో ఇలా బయటకి పోతారు అది తెలియక ఇంటిలో వాళ్ళు ఇలా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే ఇలా కంగారు పడాల్సి వస్తుంది కాంస్టేబుల్ రాజు అన్నాడు అని కాదు గాని నిజం గా దివ్య ఆ కార్తిక్ అన్న అబ్బాయి నిజంగా లవ్ చేస్తుంది అంటావా అని తనలో తానే ప్రశ్నించుకొంటాడు చాలా బాధ పడతాడు దివ్య స్కూటీ ఏ ప్లేస్ లో ఉందొ అక్కడికి వెళ్ళిపోతారు కృష్ణ ,విజయ్ థాంక్స్ రమేష్ అన్న థాంక్స్ రాజు అన్న ఇంత హెల్ప్ చేసినందుకు సరే ఈ స్కూటీ తీసుకొని వెళ్లిపోండి ఈ దొంగ సంగతి మేము చూసుకొంటాం అంటారు వాళ్ళు 4 am కి కృష్ణ ఇంకా విజయ్ మాధపూర్ లో ఉన్న వాళ్ళ రూమ్ కి వెళ్తారు కృష్ణ పడుకొనే ముందు తన బాటరీ డెడ్ ఐన మొబైల్ ని on చేసుకొంటాడు దివ్య దగ్గర నుండి 12 am కి 3 మెస్సేడ్ కాల్స్ ఉంటాయి 11:30 కి జాహ్నవి కి ఫోన్ చేసి నేను స్టార్ట్ అవుతున్న అన్న దివ్య 12 కి నాకు ఎందుకు 3 టైమ్స్ కాల్ చేసింది తరవాత తన నెంబర్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది అని అనుకొంటాడు అరే విజయ్ వెంటనే జాహ్నవి కి ఫోన్ చై అని అంటాడు కృష్ణ ఎందుకు రా అని అడుగుతాడు విజయ్ చెప్తాను నీకు ముందు చై అంటాడు కృష్ణ జాహ్నవి కి కాల్ చేసి జాహ్నవి నేను కృష్ణ ని నువ్వు కార్తిక్ కి కాల్ చేసినపుడు కార్తిక్ మాత్రమే నీతో మాట్లాడడా దివ్య కూడా నీతో మాట్లాడింద అని అడుగుతాడు దానికి జాహ్నవి లేదు కార్తిక్ మాత్రమే మాట్లాడాడు అంటుంది కార్తిక్ ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా అని అడుగుతాడు హ జూబ్లీ హిల్స్ అంటుంది జాహ్నవి లొకేషన్ నాకు పంపు అంటాడు కృష్ణ ఏ ఎందుకు కృష్ణ అని అంటుంది జాహ్నవి ఎమీ లేదు నీకు తరవాత చెప్తాను ముందు పంపు అంటాడు కృష్ణ ఏరా కృష్ణ ఇవన్నీ జాహ్నవి ని ఎందుకు అడుగుతున్నావ్ ఎమీ అయింది అని అంటాడు విజయ్ మనకి అంత టైం లేదు మనం వెంటనే కార్తిక్ గాడి ఇంటికి వెళ్ళాలి అని జూబ్లీ హిల్స్ స్టార్ట్ అవుతారు కార్తిక్ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొడతారు కార్తిక్ ఓపెన్ చేస్తాడు కార్తిక్ అంటె మీరేనా అని అడుగుతాడు కృష్ణ హ నేనే మేము దివ్య తో వర్క్ చేస్తున్నాం అదే తను మీ దగ్గర ఉన్నది అని చెప్పారు కద తీసుకొని వెళదాం అని వచ్చాము అని కృష్ణ అంటాడు తను పడుకొంది రేపు నేను డ్రాప్ చేస్తా అని చెప్పాను కదా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు అని అంటాడు కార్తిక్ ఒక్కసారి తనని పిలువు మాట్లాడి వెళ్లిపోతాం అంటాడు కృష్ణ తను మా మమ్మీ రూమ్ లో పడుకుంది అని అంటాడు కార్తిక్ హ సరే అని బయటకి వచేస్తారు తిరిగి వెళ్లిపోతుంటే బయట లేడీస్ చెప్పులు ఏమీ లేవు కార్తిక్ ఎంటి మా మమ్మీ గదిలో పడుకుంది అంటున్నాడు అని జాహ్నవి కి కాల్ చేసి కార్తీక్ ఇక్కడ ఒక్కడే ఉంటున్నాడా లేకపోతేయ్ వాళ్ల ఫ్యామిలీ తో ఉంటున్నాడా అని అడుగుతాడు దానికి జాహ్నవి లేదు ఒక్కడే ఉంటున్నాడు అంటుంది కృష్ణ ఇంకా విజయ్ మళ్ళీ కాలింగ్ బెల్ కొడతారు కార్తిక్ తలుపు తీస్తాడు వెంటనే విజయ్ కార్తిక్ ని గట్టిగా పట్టుకొంటాడూ కృష్ణ దివ్య దివ్య అని గట్టిగా అరుస్తాడు పై ఫ్లోర్ నుండి ఏదో సౌండ్ రావడం విన్న కృష్ణ పైకి వెళ్తాడు పైన ఉన్న బెడ్రూమ్ తలుపు తీసి చూస్తే దివ్య తాళ్లతో కట్టేసి ఉంటుంది వెంటనే కృష్ణ ఆ తాళ్ళను విప్పేసి దివ్య ని కిందకి తీసుకొని వస్తాడు దివ్య ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటుంది కిందకి తీసుకొని వచ్చిన వెంటనే దివ్య స్పృహ తప్పి పడిపోతుంది దివ్య ని కృష్ణ లేపుతు ఉంటాడు ఈలోపు విజయ్ కార్తిక్ ని కింద పడేసి తెగ కొడుతుంటాడు ,కృష్ణ కొన్ని వాటర్ తెచ్చి దివ్య మొహం మీద వేసి లేపి సోఫా లో కూర్చో పెట్టి కార్తిక్ ని ఒక్కటి తన్ని ఎందుకు రా తనని తీసుకొని వచ్చి కట్టేసావ్ ఎం చేదం అనుకొన్నావ్ అని అడుగుతాడు తన వెనకాల 4 ఇయర్స్ నుంచి పడుతున్న లవ్ చెయ్యమని కానీ వాడు ఎవడో కృష్ణ అంట వాడిని లవ్ చేస్తున్న అని చెప్తుంది అందుకే దానికి జీవితం లేకుండా చేదం అని రక్షించినట్టు నమ్మించి ఇక్కడికి తీసుకొని వచ్చ అని అంటాడు కార్తిక్ ,ఇది అంత విని కృష్ణ గట్టిగా ఒక్కటి కొడతాడు కార్తిక్ ని స్పృహ తప్పిపోతాడు కార్తిక్ వెంటనే తాళ్లతో కార్తిక్ ని కట్టేసి విజయ్, దివ్య ని తన హాస్టల్ లో డ్రాప్ చేసి వచ్చాయ్ తరవాత వీడి సంగతి చెపుదాం అంటాడు కృష్ణ తొ అప్పుడు కృష్ణ దివ్య ని తీసుకొని అమీర్పేట్ లో తన హాస్టల్ కి తీసుకొని వెళ్తాడు జాహ్నవి కిందకి వస్తుంది కృష్ణ ఎమీ జరిగింది అని అడుగుతుంది అంత తరవాత చెప్తా తనని లోపలకి తీసుకొని వేళ్ళు అంటాడు కృష్ణ సరే అని దివ్య ని తీసుకొని వెళ్తున్నపుడు దివ్య మళ్ళీ కృష్ణ దగ్గరకి వచ్చి ఐ లవ్ యు కృష్ణ అని గట్టిగా పట్టుకొంటుంది నువ్ నాకు చెప్పునపుడు నిన్ను సరదాగా ఏడిపిదం నాకు ఇష్టం లేనట్టు ప్రవర్తించి తరవాత నిన్ను వెనక్కి తిరిగి పిలుదాం అనుకొన్న కానీ ని మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఈలోపు ఇది అంత జరిగిపోయింది అని ఏడుస్తుంది. కృష్ణ దివ్య కన్నీళ్లు తుడిచి రేపు మాట్లాడుకొందాం వెళ్లి పడుకో అని అంటాడు దివ్య వెళ్ళిపోయాక కృష్ణ కార్తిక్ వాళ్ల ఫ్లాట్ కి వెళ్లి రమేష్ అన్నాకి ఫోన్ చేసి జరిగినదంతా చెప్తారు అప్పుడు రమేష్ అన్న వాడిని మాధపూర్ PS లో వదిలేయండి నేను చూసుకొంటా అని అంటాడు రమేష్ చెప్పినట్టెయ్ కృష్ణ ,విజయ్ కార్తిక్ ని మాధపూర్ PS లో వదిలేస్తారు.పోలీస్ లు కార్తిక్ కి తగిన శిక్ష వేస్తారు. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి వేళ ఒంటరిగా రోడ్ మీద ఉంది అంటే ఒక మగడిగా తనకి ఏ హాని కలగకుండా చూసుకొన్నప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు