తీరిన కోరిక - కందర్ప మూర్తి

Teerina korika

నేను పూనా ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ( A.F.M.C) బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్ డిపార్టుమెంటులో సర్వీస్ చేస్తున్నప్పుడు నా సహచర తెలుగు మిత్రుడు బాల్ రాజ్ , ఫిల్మ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ కి వెళ్లి అక్కడి స్టూడియోలో షూటింగ్ లు , ట్రైనింగు విధ్యార్దుల్నీ చూడాలన్న కోరిక వాయిదా పడుతూ వస్తోంది. డైరెక్షన్ సెక్షన్లో తమ బంధవుల అబ్బాయి ఉన్నాడని అక్కడికి వెళ్లాక ఎంక్వరీ చేద్దామన్నాడు. కంటోన్మెంటు ఏరియాలో ఉండే మేము ఒక ఆదివారం ప్లాన్ చేసుకుని పూనా సిటీలో డెక్కన్ జింకానా లా కాలేజ్ ప్రాంతం లో ఉన్న ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ అడ్రస్ తెలుసుకుని ఉదయం పది గంటలకు చేరు కున్నాము. పాత రోజుల్లో సుప్రసిద్ద హిందీ ఫిల్మ్ నిర్మాత దర్శకుడువి.శాంతారామ్ గారి ప్రభాత్ ఫిల్మ్ స్టూడియోను ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ గా మార్చి దేశం లోని ఎంపికైన వివిధ రాష్ట్రాల విద్యార్థులకు చలనచిత్ర టెలివిజన్ విభాగాలలో నటన, డైరెక్షన్ , కెమేరా , ఎడిటింగ్ , సౌండ్ రికార్డింగ్ వంటి విభాగాల్లో ట్రైనింగ్ ఇస్తూంటారు. నేను , నా మిత్రుడు బాల్ రాజ్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ మైన్ గేటు దగ్గర సెక్యూరిటీ వారికి మా పరిచయం చేసుకుని డైరెక్షన్ సెక్షన్లో ఉన్న స్టూడెంట్ పేరు చెబితే మాకు తెలియదు విజిటింగ్ పాస్ లేనిదే లోపలికి పంపమని అడ్డు చెప్పేరు.ఎంత రిక్వెస్టు చేసినా ఫలితం లేకపోయింది. ఆదివారమైనందున సెలబ్రెటీల , స్టాఫ్ రద్దీ లేకుండా సెక్యూరిటీ గేటు ప్రశాంతంగా ఉంది. ఇంత దూరం వచ్చి ఫిల్మ్ఇన్సిస్టిట్యూట్ చూడకుండా వెనక్కివెళ్లడ మంటే నిరాశ అనిపించింది. మరొక మార్గం కనిపించక తిరిగి పోదామను కుంటూండగా లోపల కేంటిన్లో పని చేసే అబ్బాయి షిప్టు డ్యూటీ పూర్తయి వెల్తున్నాడు మేము అతన్ని ఆపి అక్కడికి వచ్చిన విషయం, సెక్యూరిటీ వాళ్లు లోపలికి వదలడం లేదని హిందీలో చెప్పాము. ఆ అబ్బాయి సానుభూతితో మా ఉత్సుకత అర్ధం చేసుకుని ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ వెనక లేబర్ స్టాఫ్ వెళ్లే ఫెన్సింగ్ అడ్డదారి చూపించి లోపలి కెళ్లమని సలహా ఇచ్చాడు. అతనికి ధన్యవాదాలు చెప్పి ఇన్ స్టిట్యూట్ వెనక గార్డెనింగు స్టాఫ్ దారి వెంట లోపలికి ప్రవేశించాము. ఆదివారం శలవు దినమైనందున స్టూడియో లోపల కూడా ప్రశాంతంగా ఉంది. విశాలమైన ప్రదేశంలో ట్రైనింగ్ స్టూడెంటు అబ్బాయిలు అమ్మాయిలు లాన్సు , చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పు కొంటున్నారు. వారి వేష భాషల్ని బట్టి అన్ని రాష్ట్రాల వారు కనబడుతున్నారు. మేము మెల్లగా భయపడుతూ ఎవర్ని పలకరించాలా అని సంశయంగా ఒక అబ్బాయి మా ముందు నుంచి వెల్తూంటే హిందీలో చంద్ర సిద్ధార్ద్ డైరెక్షన్ స్టూడెంట్ పేరు అడిగాము. మా అదృష్టం బాగుండి ఆ అబ్బాయే మేమడిన స్టూడెంటు. మాది హైదరాబాదని మిలిటరీలో ఉంటున్నామని ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ చూద్దా మని ఎంతో ఆశతో వచ్చామని చెప్పగా 'అరె , మీది హైదరాబాదా! తెలుగువారా " అంటూ మమ్మల్ని కేంటీనుకి తీసుకెళ్లి టిఫిన్ తినిపించి తర్వాత తన రూముకి తీసుకు వచ్చి రూమ్ మేట్ ఎడిటింగ్ ఒరిస్సా అబ్బాయి షాహును పరిచయం చేసాడు. తర్వాత తన పేరు మీకెలా తెల్సని చంద్రసిద్ధార్థ అడగ్గా బాల్ రాజ్ ఒక ఫంక్షన్లో తమ బంధువు చెప్పిన విషయం జ్ఞప్తికి వచ్చిన విషయం చెప్పాడు. రూము నిండా ఫిల్ము రీల్సు , ఫిలిం లిటరేచరు , షార్టు ఫిల్ముల ఫోటోలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ వివిధ సెక్షన్ల కోర్సుల్లో మొదటి సంవత్సరం అందరిదీ కామన్ కోర్సని ఫండమెంటల్సు చెబుతారనీ సెకెండ్ ఇయర్ నుంచి వారి ఒరిజినల్ సెక్షన్ కోర్సుల్లో థియరీ క్లాసులు , ప్రాక్టికల్సు, లఘు చిత్రాలు తయారు చేస్తూంటారని బొంబాయి , కలకత్త డిల్లీ నుంచి ఫిల్మ్ సెలబ్రిటీలు టెక్నికల్ స్టాఫ్ వచ్చి థియేటర్ , లెక్చర్స్ ఇస్తూంటారని వివరంగా చెప్పి ప్రభాత్ స్టూడియోలో సెట్టింగులు, లొకేషన్సు ఓపికగా తిప్పి చూపించాడు. ఫీచర్ ఫిల్మ్ , టెలివిజన్ విభాగాలు వేరుగా శిక్షణ ఉంటుందని చెప్పాడు. వాళ్ల సీనియర్ స్టూడెంట్సుకి బొంబాయి హిందీ సినిమాల్లో అవకాశా లొచ్చాయని తెలియ చేసాడు. శలవు రోజయినందున చాలా మంది స్టూడెంట్సు సిటీలోకి , బొంబాయి వెళ్లారట. మాకు తర్వాత తెల్సింది అప్పటి పాసవుట్ స్టూడెంట్సు చాలా మంది బొంబయి హిందీ ఫీల్డులో పెద్ద యాక్టర్సు ,డైరెక్టర్సు కెమేరా మెన్ , ఎడిటింగ్ , సౌండ్ రికార్డిస్టులుగా సెటిల్ అయారట. సీనియర్ బ్యాచ్ ల స్టూడెంట్సు శతృఘన్ సిహ్నా , జయాభాదురి, జరీనా వాహబ్ , తాళ్లూరి రామేశ్వరి, కమేడియన్స్ పైంటల్, సుభాష్ ఘయ్, నందమూరి జయకృష్ణ అలాగే మాకు పరిచయమైన చంద్ర సిద్ధార్థ్ తెలుగు సినీ ఫీల్డులో ' ఆ నలుగురు ' చిత్రం తో కాలు పెట్టారని తెల్సింది. ఇప్పుడు మేము ఫిల్మ్ ఇన్సిస్ట్యూట్ నుంచి బయటకు వెళ్లాలంటే సమస్య వచ్చింది. ఎంట్రన్సు మైన్ గేట్ నుంచి లోపలికి వచ్చే వారు విజిటర్ రిజిస్టర్లో ఇన్ , ఔటు టైము ఎంట్రీ చేస్తారు. బయటకు వెళ్లాలంటే విజిటర్స్ రిజిస్టర్లో ఔట్ టైమ్ ఎంట్రీ చెయ్యాలి. సెక్యూరిటీ స్టాఫ్ మమ్మల్ని గుర్తు పడతారు. అందువల్ల మళ్లీ దొడ్డి దారిన బయట పడవల్సి వచ్చింది. ఏది ఏమైనా మేము కోరుకున్నట్టు ఫిల్మ్ ఇన్సిస్టిట్యూట్ సందర్సన జరిగినందుకు ఆనందమైంది. * * *

మరిన్ని కథలు

Telivijana majaka
టెలివిజనా! మజాకా!?
- కందర్ప మూర్తి
Prateekaaram
ప్రతీకారం
- చెన్నూరి సుదర్శన్
Anasteeshiya
అనెస్థీషియా
- వెంకట రమణ శర్మ పోడూరి
Voohinchaledu
ఊహించలేదు...!
- రాము కోలా.దెందుకూరు
APP Street police
ఎ.పి.పి స్ట్రీట్ పోలీసు
- కందర్ప మూర్తి
Maskena covid naasti
మాస్కేన కోవిడ్ నాస్తి
- పి. వి. రామ శర్మ
Pantulamma
పంతులమ్మ
- చెన్నూరి సుదర్శన్