ఊహించలేదు...! - రాము కోలా.దెందుకూరు

Voohinchaledu

"స్టార్ట్....ర్ట్ ఇమీడియట్లీ " లోహిత్ న్యూరో సర్జన్ ,హైదరాబాద్. మెసేజ్జ్ మొబైల్ స్క్రీన్ డిస్ప్లే చూపించడం తో అంత వరకు కాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్న రఘువీర్ అర్ధాంతరంగా మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని హైద్రాబాద్ బయలుదేరాడు. తనకు వ్యాపారం మాత్రమే‌ముఖ్యం అనుకునే రఘువీర్,వచ్చిన మెసేజ్ చూసుకుని లక్షల లావాదేవీలు కాదనంకుని బయలుదేరుతున్నాడంటే వచ్చిన మెసేజ్ చాలా ఇంపార్టెంట్ అయివుండాలి. ఎంతో అర్జంట్ అయితే తప్పు మెసేజ్ కానీ కాల్ కానీ రాని మొబైల్ అది . ఆ నెంబర్ తన వెల్విషర్స్ ఐదుగురి దగ్గర మాత్రమే ఉంటుంది. అందులో హైద్రాబాద్ లోహిత్ కార్పోరేట్ హాస్పటల్ న్యూరో సర్జన్ జగదీష్ ఒకరు ఇప్పుడు వచ్చింది అక్కడ నుండే. అందుకే కాన్ఫరెన్స్ సైతం రద్దు చేసుకుని హైద్రాబాద్ బయలుదేరాడు రఘువీర్.... గత రెండు సంవత్సరాలుగారా తన నాన్నగారు అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. జగదీష్ తన చిన్ననాటి స్నేహితుడు కావడంతో తన తండ్రిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను జగదీష్ కు అప్పగించాడు రఘువీర్. రఘువీర్ బెంగుళూరులో మల్టీమీడియా వ్యాపార రంగంలో అందేవేసిన చేయి. అతనికి ప్రోజెక్ట్ అప్పగించడం కొసం పోటీ పడుతుంటారు. అతను తమకు ప్రాజెక్టు వర్క్ చేసి పెట్టాడంటే వ్యాపార రంగంలో దూసుకు పోయినట్లే అనుకునే వారే అధికం. క్షణం కూడా తీరిక లేకుండా గడిపిన రోజులే ఎక్కువ రఘువీరు జీవితంలో. అయినా మనస్సులో చిన్న వెలితి వెంటాడుతునే ఉంది .అది తన నాన్నగారి నుండి. ఎంతగా చెప్పినా రఘువీర్ నాన్నగారు పరంధామయ్య గారు రఘువీర్ తో కలిసి ఉండడానికి ఇష్టపడక పోవడం,.. ****** అతి ఖరీదైన టాటా ఫ్యార్చునర్ కారు లోనుండి దిగిన రఘువీర్ నేరుగా జగదీష్ క్యాబిన్ చేర్చుకున్నాడు. ముందుగానే అపాయింట్మెంట్ ఉండడంతో ఎక్కువ సమయం వెయిట్ చేసే అవసరం లేక పోయింది రఘువీర్ కు. అలా వెయిట్ చేయడం కూడా తనకు నచ్చదు. తన క్యాబిన్ లోనికి ఎంటరైన రఘువీర్ ను పలకరిస్తూ, పరంధామయ్య గారు ఉన్న ఐ.సి.యూ రూమ్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు జగదీష్. "నిన్ను రాత్రి నాన్నగారి పరిస్థితి చాలా విషమించడంతో నీకు మెసేజ్ చేసాను. స్టెనోసిస్, వెన్నెముక కండరాల క్షీణత , వెన్నెముక డిస్క్ హెర్నియేషన్తో సహా ఆపరేషన్ చేసి మార్చుకోవాల్సి వచ్చింది." "అదే సమయంలో క్రానియోటోమీ అని పిలువబడే శాస్త్ర చికిత్స పుర్రెలోని , ఎముక యొక్క ఒక విభాగాన్ని తొలగించడానికి ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. చాలా రిస్క్ తో కూడిన ఆపరేషన్." "ప్రస్తుతం నాకు అందుబాటులో ఇటువంటి శాస్త్రచికిచ్చ చేసేవారు ఎవ్వరు లేక పోవడంతో సమస్య కాస్త చేయిదాటి పోతుంది అనుకున్న సమయంలో నీకు మెసేజ్ చేసాను." "ఏ దేవుడు కరుణించాడో,లేక నాన్నగారి అదృష్టమో మరో డాక్టర్ సహకరించడంతో నాన్నగారు క్షేమంగా సమస్యలనుండి బయట పడగలిగారు." జరిగింది వివరంగా చెప్పి పరంధామయ్య గారి దగ్గరకు తీసుకు వెళ్ళాడు జగదీష్. తనకు దగ్గరగా వచ్చిన రఘువీర్ ను "ఎలా ఉన్నావని" కన్నులతో తోనే ప్రశ్నించారు పరంధామయ్య గారు. కన్నుల నుండి ఊట భావిలోని నీరులా ఉబికి వస్తున్న కన్నీటిని అపుకునే ప్రయత్నం చేస్తూ తన తండ్రి చేతిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు రఘువీరు . "పర్వాలేదు బాగున్నాను" అనే భావం కలిగించేలా. ****** తన తండ్రి ప్రమాదం నుండి బయట పడినందుకు పదేపదే కృతజ్ఞతలు తెలుపు కుంటున్న రఘువీర్ తో "నేను నామ మాత్రంగానే నా ట్రీట్ మెంట్ చేసాను. కానీ అవసరమైన రెండు మేజర్ ఆపరేషన్స్ మాత్రం చేసింది న్యూరోసర్జన్ ముత్తు అనే మరో డాక్టర్." "సమయానికి అతని సహాయమే నాన్నగారిని కాపాడింది అని చెప్పక తప్పదు" "దాదాపుగా ఇటువంటి మేజర్ ఆపరేషన్స్ చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఎనిమిది నుండి పది లక్షలు వరకు చార్జి చేస్తారు"అంటూ వివరిస్తున్న జగదీష్ మాటలను మధ్యలోనే అడ్డుకున్నాడు రఘువీర్. "డబ్బు సమస్య కానే కాదు నాన్నగారి ప్రాణం నిలిపారు అది వెలకట్టలేనిది. "ఆ డాక్టర్ వివరాలు ఇవ్వండి ,ఇప్పుడే ఎమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను " "అవసరం లేదు రఘువీర్"అన్నాడు జగదీష్ "అదేమిటి!అంత ఎమౌంట్ నువ్వు బరాయించడం సరి కాదుకదా "అన్నాడు రఘువీర్. "అలా ఏమీ కాదు . డాక్టర్ ముత్తూ."ఇది తన తృప్తి కోసం చేసిన ఆపరేషన్ గా భావిస్తున్నారు." దీనికొరకు డబ్బులు కూడా తీసుకొనన్నారు. ఇది "తన గురువుగారికి తాను చెల్లించుకున్న గురుదక్షిణగా భావించామన్నారు." వింటున్న రఘువీర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు జగదీష్ వైపు. నాన్నగారి శిష్యులు సిటీలో ఇంత ఉన్నత స్థితిలో ఉన్నారా.అనుకున్నాడు మనసులో. ****** పది రోజులు గడిచిపోయాయి. పరందామయ్యగారి ఆరోగ్యం కుదుట పడింది పరంధామయ్య గారిని పూర్తి చెకప్ చేసిన తరువాత "నాన్నగారు ఇప్పుడు ఫర్ఫెక్ట్ ఆల్ రైట్ ." "ఈ రోజే డిశ్చార్జి చేస్తున్నాం" జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చూడు రఘువీర్ " అని చెప్పి.జగదీష్.తన క్యాబిన్ లోనికి వెళ్ళిపోయాడు. రఘువీర్ మనసులో ఒక ప్రశ్న అలాగే తిరుగుతూనే ఉంది. నాన్న గారిని అడగాలా వద్దా? అడిగితే ఏమనుకుంటారో"అనుకుంటూనే. "నాన్నగారు మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ముత్తూ బాగా పరిచయామా.? "అతను మీ శిష్యుడని కూడా విన్నాను." "తానే మీకు ఆపరేషన్ చేసాడట." "ఇది తన తృప్తి కొసం,తన గురువుగారికి ఇచ్చుకున్న చిన్న గురుదక్షిణ "అని చెప్పాడట "నాకు తెలిసినంతవరకు అటువంటి పేరుగల వారు ఎవ్వరూ లేరు అనుకుంటా." "మీ దగ్గర విద్య అభ్యసించిన అందరూ దాదాపుగా నాకు టచ్చ్ లోనే ఉంటారు" "కానీ ఎక్కడా ఈ పేరు వినలేదు." "ఇంతకు ఎవ్వరు నాన్నగారు ఇతను.." అంటూ తన మనస్సులోనో అనుమానం బయటకు తీసాడు రఘువీర్. "సిటీలో మంచి పేరున్న న్యూరో సర్జన్ డాక్టర్ ముత్తూ.." "చిన్నతనంలో ఎవ్వరి పక్కనైతే కూర్చోని చదువుకోను ,తనతో కలిసి చదువుకో వలసి వస్తే చదువే‌ మానేస్తానని గోల చేసి , చివరకు ఎవ్వరి చదువైతే మధ్యాంతరంగా ఆగిపోయేలా చేసావో నీకు గుర్తుందా.." "మన పాలేరు రంగన్న కొడుకు ..ముత్తయ్య! "అతనే ఈ డాక్టర్ ముత్తు.." "నీ కారణంగా ఒకరి చదువు ఆగిపోవడం నాకు నచ్చలేదు." అలాగని నీ చదువుకూడా నాకు చాలా ముఖ్యం." "అందుకే ముత్తయ్యను ఒక గురుకుల పాఠశాల్లో చేర్పించారు." "చదువుకు అవసరమైన సౌకర్యాలు నేనే చూసుకునేవాన్ని." "తను ఇంటర్ చదివే స్థాయికి వచ్చిన తరువాత ట్యూషన్లు చెప్పుకుంటూ చదువుకుంటూ.. నేడు ఇలా డాక్టర్ ముత్తుగా ఎదిగాడు." "నేను జగదీష్ దగ్గర జాయిన్ అయిన రోజే ముత్తు కు విషయం తెలియచేసాను" "ప్రతి రోజు నా రిపోర్ట్ అతనికి పంపించేవాన్ని." అంటూ చెప్పుకుంటూ వెళ్ళుతున్న పరంధామయ్య గారి మాటలకు రఘువీర్ కంటినుండి పశ్చాత్తాపంతో కన్నీరు జారుతుంది. మనస్సులో ముత్తును క్షమాపణలు కోరుకుంటూ..

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి