పరదేసి - కందర్ప మూర్తి

Paradesi

పరదేశి డెబ్బై సంవత్సరాల మాజీ సిపాయి. తండ్రి బర్మా యుద్ధ సమయంలో రంగం ( రంగూన్ ) నుంచి పసివాడైన కొడుకుతో తాతల నాటి తాటిపూడి గ్రామానికి చేరుకున్నాడు. పసివాడికి పరదేశి పేరు పెట్టి పెంచి పెద్దవాణ్ణి చేసాడు. ముసలి తండ్రి చనిపోయిన తర్వాత చదువు సంధ్యలు లేని పరదేశి జీవనాధారం కోసం భారత సైన్యంలో సిపాయిగా చేరి చైనా యుద్ధంలో మందుపాతర పేలి కాలి కింది భాగం పోగొట్టుకుని స్వగ్రామం తాటిపూడికి చేరి పెళ్లి చేసుకుని ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగుచేస్తూ ఊరి పురోభివృద్ధికి పాటు పడుతున్నాడు. అక్షరం ముక్క జ్ఞానం లేని పరదేశి సబ్యత సంస్కారం సైన్యంలో శుసిక్షితుడైన క్రమశిక్షణ గల సిపాయిగా లోకజ్ఞానం సంపాదించాడు. కొడుకును హైస్కూలు వరకు చదివించి ఆర్మీకి పంపేడు. కూతుర్ని మిలిటరీ సిపాయి కిచ్చి పెళ్లి చేసాడు. మిలిటరీలో పనిచేసిన నువ్వు వికలాంగుడిగా తిరిగి వచ్చావు.మళ్లీ కొడుకుని మిలిటరీకే పంపుతున్నావు.దినదిన గండం ఆర్మీ కొలువున్న కుర్రాడికి కూతుర్నిచ్చి పెళ్లి చేసావని ఊరి పెద్దలు నచ్చచెప్పినా వినలేదు. పరదేశి వారందరికీ సమాధాన మిస్తూ నేనొక మాజీ సైనికుడిగా సైన్యంలో కస్టనష్టాలు నాకు తెలుసు. అందరూ మీలాగే ఆలోచిస్తే దేశ సరిహద్దుల్ని అహర్నిశలు కాపాడే మిలిటరీ దళానికి సైనికులు ఎలా వస్తారు. దట్టమైన మంచు కొండలు, ఎముకలు కొరికే చలి, భయంకర అడవులు, భీకర పర్వతాలు , వేడికి తట్టుకోలేని కంటిచూపులో మొక్క మోడు కనిపించని ఎడారి ప్రాంతం ఇలాంటి క్లిష్ట వాతావరణం లో భార్యాబిడ్డలు కన్నవారికి దూరంగా ఎప్పుడు ఏ వైపు నుంచి శత్రు సైనికులు మన సైనిక శిబిరాల మీద విరుచుకు పడతారనే సతర్కతతో ఇరవై నాలుగు గంటలూ దేశ సరిహద్దుల్ని కాపాడుతున్న సాహస సైనికుల త్యాగాల వల్ల మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించ గలుగుతున్నాం. వారికి మనోదైర్యాన్నివ్వండి. మన వంతు సాయం చేద్దాం , మిలిటరీలోనే కాదు చావు అనేది ఎక్కడైనా రావచ్చు అని వారందరికీ నచ్చ చెప్పాడు పరదేశి. అన్ని వర్గాల వారు అంటే చదువు కున్నవారే కాదు చాకలి మంగలి సఫాయి వారు వంటలవారు వడ్రంగి లాంటి అన్ని కులవృత్తుల వారు సైన్యానికి అవుసరం. ఈ పల్లె వాతావరణమే కాదు, దేశం నాలుగు దిక్కులు అక్కడి ప్రాంతీయ వేష భాషలు తిండీ అన్నీ తెలుసుకో వచ్చు.దేశ సేవలో కొన్ని త్యాగాలు తప్పవు. కుటుంబ సబ్యులకు దూరంలో ఉండవల్సి వస్తుంది. ప్రభుత్వం పదవీ విరమణ చేసిన విశ్రాంత సైనిక సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాల్ని సద్వినియోగం చేసుకోవాలి. సైనికునిగా దేశ సేవకే కాదు మనకి జన్మనిచ్చి పెంచిన ఊరికీ సమాజానికి ఇతోదిక మేలు చెయ్యడం పౌరులిగా మన కర్తవ్యం. సిపాయి పరదేశి రక్షణ దళం నుంచి పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం ఇచ్చిన బంజరు భూమిని స్వయంకృషితో కటుంబ సబ్యులతో కష్టపడి ఫలసాయ భూమిగా మార్చి ఫలవృక్షాలు కాయకూరలు పండిస్తూ పాడి గేదెలను సాకుతు పాల ఉత్పత్తులను పట్నానికి పంపుతు ఊరి మిగత రైతులకు మార్గదర్శక మయాడు. గ్రామ సర్పంచిగా భాద్యతలు తీసుకుని పంచాయతీకి ఆర్థిక వనరులు సమకూర్చాడు. నీటి పారుదలశాఖ అధికారులను మెప్పించి కొండ దిగువ కాలువకి చెక్ డ్యామ్ నిర్మింపచేసి వర్షకాలం వరద నీటిని గ్రామ చెరువుకి మళ్లించి చేపల పెంపకం ద్వారా ఆదాయ వనరులు కల్పించాడు. విద్యాధికారుల సహకారంతో ప్రాథమిక పాఠశాల ఏర్పరచి వ్యవసాయ పనులకు , పశువులను మేతకు తోలుకుపోయే పిల్లలను పాఠశాల వైపు మళ్లించి విధ్యార్థులుగా మార్చాడు. బ్యాంక్ అధికారులను సంప్రదించి పనులు లేక తిరిగుతు దుర్వ్యసనాలకు పాల్పడుతున్న కూలి జనాలకు లోన్లు ఇప్పించి కోళ్ల ఫారాలు , పాడి పశువుల డైరీఫారం ద్వారా ఆర్థికంగా సహకారం అందించాడు. సహకార సంఘాల ద్వారా డబ్బు పొదుపుపై అవగాహన కల్పించాడు. రోడ్డు సౌకర్యంతో రవాణా సదుపాయాలు ఏర్పడి గ్రామీణ ఉత్పత్తులు పట్నానికి చేరవేయ గలుగుతున్నారు రైతులు. గ్రామంలో పారిశుద్యం , రక్షిత మంచినీటి ట్యాంకు , విధ్యుత్ వెలుగులు సమకూరాయి. నిరక్షరాస్యత , మూఢ నమ్మకాల కారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడే అమాయక జనాలను చైతన్యవంతులుగా చేసి వారి జీవనోపాధికి వనరులు ఏర్పాటు చేసాడు. గ్రామం చుట్టూ బంజరు భూముల్లో ఫలవృక్షాలు జీడితోటలు సరుగుడు యూకలిప్టస్ వంటి వృక్ష సంపదతో పర్యావరణానికి పాటుపడ్డాడు. పనికి ఆహార పథకం అమలు పర్చాడు. బోరుబావుల సాయంతో ఆకుకూరలు కాయగూరలు పండిస్తున్నారు రైతులు. రసాయన ఎరువులు బదులు సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల కూరగాయలకు పట్నంలో డిమాండ్ పెరిగి ఆర్థికంగా మేలు జరుగతోంది. వయసు మళ్లిన ముసలి వారికి కూర్చుని చెయ్యగలిగే చేతివృత్తులు గంపలు బుట్టలు అల్లడం, తాళ్లు పేనడం నేర్పించి జీవనోపాధి ఏర్పర్చడం జరిగింది. పనులు లేక ఊరు వదిలి పోయిన యువత ఇళ్లకు తిరిగి వచ్చి కుటుంబ సబ్యులతో సుఖంగా ఉంటున్నారు. మాజీ సిపాయి పరదేశి కృషి పట్టుదలతో గ్రామస్తుల సహకారంతో తాటిపూడి రూపురేఖలే మారి పోయాయి. నవనాగరిక ప్రపంచానికి దూరంగా మారుమూల గ్రామం తాటిపూడి అన్ని విధాల అబివృద్ధి చెంది జిల్లాలో ఆదర్స పంచయతీగా ఎన్నిక కాబడి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నగదు బహుమతి ప్రశంసా పత్రం అందు కున్నారు. * * *

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి