విచక్షణ -వివేచన - B.Rajyalakshmi

Vichakshana-vivechana

ప్రతి వ్యక్తీ యేదో ఒకరోజు తన గతాన్ని , అనుభవాలను ,తన చర్యలను ఆలోచించక మానడు . ఆ రోజు రాధాకృష్ణకు వచ్చింది . అపుడే విశ్వం ,మురళీ వచ్చి "నాన్నా .... తిరుమలకు బుక్ చేసాం . వచ్చే శనివారం బయల్దేరాలి ,అలాగే నీ కోరిక కాణిపాకం వినాయకుడిని దర్శించుకుందాం "చెప్పి వెళ్లారు . అప్పుడు రాధాకృష్ణకు --నిజంగా మూర్ఖంగా తాను రఘురాం మాటలకు లొంగిపోయి విచక్షణ లేకుండా ప్రవర్తించి వుంటే యీ రోజు తనింత హాయిగా వుండేవాడా ! విశ్వం ,మురళీ జీవితాలు యింత ప్రశాంతం గా వుండేవా !అసలు తను రఘురాం ని గుడ్డిగా నమ్మడమే తప్పు .రాధాకృష్ణకు తనగతం మబ్బుల మసకలోవెలుతురు కిరణాలు మెరిసాయి .

రాధాకృష్ణ నిరుపేద కుటుంబం లో పుట్టాడు . అతని తండ్రి వ్యాపారస్తుని దగ్గర గుమాస్తాగా పని చేసేవాడు . ఆ తర్వాత రాధాకృష్ణ కూడా ఆ వ్యాపారస్తుని కొడుకు సీతారాం దగ్గర గుమస్తాగా పని చేసాడు . అయితే తేడా యెక్కడంటే సీతారాం ,రాధాకృష్ణా చిన్నప్పుడు ఒకే బళ్లో చదువుకున్నారు . సీతారాం ఉదార స్వభావుడు , మంచిమనసున్నవాడు. అప్పుడప్పుడూ రాధాకృష్ణను ఆర్ధికం గా ఆదుకునేవాడు . రాధాకృష్ణకు పెద్దమ్మాయి జానకి యిద్దరుకొడుకులు విశ్వం ,విజయ్ . భార్య రమణమ్మ యెప్పుడూ యేదో ఒక అనారోగ్యం . రాధాకృష్ణ తన జీతం తో బండి లాక్కొచ్చాడు . ఖర్చుల కోసం అప్పులు చేసేవాడు . జానకి అందగత్తె కాదు ,చదువూ లేదు ,తెలివితేటలూ అంతంత మాత్రమే . రమణమ్మ అనారోగ్యం వల్ల జానకి చదువాపేసి యింటి బాధ్యతలను చూసుకునేది . పెద్దకొడుకు విజయ్ ఛిన్నాభిన్నం యింటిపరిస్థితులను ఆసరాగా చేసుకుని చెడు స్నేహాలకు అలవాటు పడి యింట్లో మాట వినకుండా తయారయ్యాడు . విశ్వం పసివాడు . అయిదేళ్లు . అక్కయ్య చాటున పెరుగుతున్నాడు . అగ మ్యగోచరం సంసారం లో రాధాకృష్ణ సాయంకాలాలు యెక్కువగా రఘురాం తో గడిపేవాడు . సీతారాం చిన్న నాటి స్నేహితుడయినా , తన యజమాని కావడం వల్ల పైగా అప్పుడప్పుడూ డబ్బు అతని దగ్గర తీసుకుంటూ వుండడం వల్ల రాధాకృష్ణకు సీతారాం పట్ల కృతజ్ఞతా ,గౌరవ భావం వుండేవి .

సీతారాం తండ్రికి ఒక్కడే కొడుకు . వ్యాపార దక్షత తెలిసినవాడు . తండ్రి వ్యాపారాన్ని లాభాల బాటలోకి మలిచాడు రాధాకృష్ణను ఆదుకుంటూ తనకు నమ్మకమైన మనిషిగా మార్చుకున్నాడు . భార్య తులసమ్మ సిరీ ,సంపదల కుటుంబం నించి వచ్చినా అహంభావం లేని యిల్లాలు . సీతారాం కి తగిన యిల్లాలు . అందరిలో మంచి పేరు తెచ్చుకుంది . ఒక్కటే దిగులు ,పిల్లలు పుట్టకపోవడమే ! ఇద్దరికీ పసిబిడ్డలన్నా ,పిల్లల ఆటల పాటలన్నా మహా మురిపం . సంతానం కోసం గుళ్లకెళ్లారు ,పూజలెన్నో చేసారు ,అన్నదానాలూ ,సంతర్పణలేన్నో చేసారు అయినా ఫలితం లేకపోయింది .

అందుకే సీతారాం దంపతులు రాధాకృష్ణ కొడుకు విశ్వాన్ని యింటికి తెచ్చుకుని అన్ని బొమ్మలూ యిస్తూ వాడ్ని ఆడిస్తూ సంతోషం గా గడిపేవారు . రాధాకృష్ణ కూడా తన పేదరికం వల్ల ,పైగా కూతురు కూడా యింటి పనితో అలసిపోవడం వల్ల విశ్వాన్ని తనే సీతారాం యింట్లో దింపేవాడు . రాధాకృష్ణ ఒప్పుకుంటే విశ్వాన్ని మంచి బళ్లో చేర్చి చదివిస్తానన్నాడు సీతారాం .

విశ్వానికి అయిదేళ్లప్పుడు . అనారోగ్యంతో చనిపోయింది . పెద్దపిల్ల జానకి పన్నెండేళ్లు . విజయ్ దారితప్పాడు . రాధాకృష్ణకు కోపం వచ్చి . బాగా కొట్టాడు . అంతే వాడిల్లొదిలి వెళ్లిపోయాడు . ,పిల్లలంటే . మతి తప్పుతున్నది . గతి తప్పుతున్న కుటుంబం లో విశ్వం ఒక ఆశాకిరణం ."రాధాకృష్ణా !!1సీతారాం విశ్వం చదువూ ,మంచీ ,చెడూఅన్నీ చూసుకుంటానన్నాడు కదా ,పైగా వాళ్లకు పిల్లలు కూడా లేరు . మంచి రోజు చూసుకుని విశ్వాన్ని తీసికెళ్లి దించేసి రా "అన్నాడు . జానకిని తన దగ్గరే కొన్నాళ్లు పెట్టుకుందామనుకున్నాడు రాధాకృష్ణ .

.

తెలిసీ తెలియని వయస్సు ,తల్లి ప్రేమకూడా . సరిగా నోచుకోని విశ్వం ,అక్కయ్య యేది పెడై అది తిని ఆడుకునేవాడు . అమాయకమైన ముఖం ,స్వచ్ఛమైన నవ్వు ,చూడంగానే అందరికి నచ్చేస్తాడు . తల్లిప్రేమను నోచుకోని వాడు . అందుకే సీతారాం దంపతులు వచ్చి మంచిమాటలు చెప్పి బొమ్మలు యివ్వగానే వాళ్లతో వెళ్లిపోయాడు . ఆ రాధాకృష్ణ యేడ్చాడు . చిన్నపిల్లాడు ,వాడ్ని కూడా సరిగా చూసుకోలేని తన అసమర్ధతకు సిగ్గుపడ్డాడు . అయినా విశ్వం బంగారు భవిష్యత్తు కళ్లముందు కనిపించింది . సీతారాం సంస్కారం సభ్యతా వున్న మంచిమనిషి అహంకారం లేదు . తనబోటి దరిద్రుడి కొడుకును పెంచుకోవడమంటే యెంతో మంచి మనసుండాలి . భగవంతుడి లీలలు వింతగా వుంటాయి . డబ్బుంది ,మంచిమనసుంది . రాధాకృష్ణకు సీతారాం అంటే కృతజ్ఞత . విశ్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . పెరిగి పెద్దవాడై ఆఫీసరవుతాడని తనకు చేయూతగా వుంటాడని ఆశ . కానీ మళ్లీ యెక్కడో అనుమానం ,అసలు విశ్వానికి తనల్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం యేముంది ?పోషించలేక పంపించేసాడుగా . రాధాకృష్ణకు కళ్లు చెమ్మగిల్లాయి .

విశ్వం సీతారాం దగ్గర పెరుగుతున్నాడు . బళ్లో చేరాడు . ఆ దంపతులకు విశ్వమే సర్వస్వం . మంచి తిండీ ,మంచి డ్రెస్సులూ . ఆరోగ్యంగా అందంగా పెరుగుతున్నాడు . భక్తీ ,పూజా ,జాలీ ,మానవత్వం కూడా అలవరించుకుంటున్నాడు . అప్పుడప్పుడూ రాధాకృష్ణ వెళ్లి పలకరించి వచ్చేవాడు .

విశ్వం ఆ వెళ్లిన వేళావిశేషం ,సీతారాం భార్య గర్భవతయ్యింది . పెళ్లయిన పదిహేనేళ్లకి పిల్లలు పుడతారన్న ఆశ వదులుకున్నాక భార్య నెల తప్పిందన్న వార్తకు సీతారాం ఆనందానికి అవధులు లేవు . వ్యాపారం కూడా చాలా చాల సిరెట్టుకుంది . విశ్వం వాళ్ళింట అడుగుపెట్టిన వేళావిశేషంగా అనుకున్నారు .

ఒకరోజు రాధాకృష్ణ స్నేహితుడు రఘురాం రాధాకృష్ణను కలిసాడు . "ఒరేయ్ రాధాకృష్ణా ,తొందరపడి విశ్వాన్ని పెంపకానికిచ్చావేమో ,యిప్పుడు వాళ్లకు యేడాది పసిబిడ్డ మురళి ,విశ్వాన్ని సరిగా చూసుకుంటారో లేదో ,"అంటూ రాధాకృష్ణ బుర్రలో ఒక చిన్న చీడపురుగును పంపించాడు . కానీ రాధాకృష్ణ సీరియస్ గా తీసుకోలేదు

"విశ్వం అక్కడ బంగారం లా పెరుగుతున్నాడు . వాడు ఆ యింటి పెద్దబిడ్డ . అమ్మా ,అమ్మా అంటూ ఆవిడ కొంగుపట్టుకు తిరుగుతాడు . విశ్వం ,మురళీ ఆడుకుంటుంటే చూడ్డానికి రెండుకళ్ళూ చాలవు . విశ్వం హాయిగా సంతోషం గా వున్నాడు " అన్నాడు రాధాకృష్ణ .'రఘురాం నవ్వేసాడు . రాధాకృష్ణ ను పిచ్చివాడిని చూసినట్టు చూసాడు .

"విశ్వాన్ని పెంపకానికి తీసుకున్నప్పుడు వాళ్ళుమటుకు కలగన్నారా ? పిల్లలు పుట్టరని అనుకున్న తర్వాతే కదా వాళ్లు నిర్ణయం తీసుకున్నది ?అయినా విశ్వం ఆ యింటి ముద్దులబిడ్డ "రాధాకృష్ణ కళ్ళల్లో కాంతి ,మాటల్లో ఆత్మవిశ్వాసం .

"ఒరేయ్ నువ్వు వూహించని మరో మలుపు ,నీకు యేమవుతుందో అర్ధం అవుతుందా ?విశ్వం ఆ యింట్లో వాళ్ల బిడ్డల్ని ఆడించేవాడిగా తయారవుతాడు . ఆ యింట్లో .వాడి విలువ అదే . "గట్టిగా అన్నాడు రఘురాం .

రాధాకృష్ణకు అసలు యీ ఆలోచన తట్టలేదు . రఘురాం చెప్పేది నిజమేనా ?

" నువ్వు కన్నతండ్రివి . కన్నప్రేమ సీతారాం కు మందుకోసం మందుకోసం ?పిల్లవాడు పుట్టకముందు వేరే విషయం . పుట్టిన తర్వాత వాళ్లు విశ్వాన్ని పరాయి పిల్లాడిలాగానే చూస్తారు . వాడు బానిస లాగానే ఆ యింట్లో వుంటాడు "

రాధాకృష్ణ మెదడులోకి బోలెడు చీడపురుగులు దూరాయి . ఆలోచనలో పడ్డాడు . తెలియని కసి ,అసూయ యేడాది పసిబిడ్డ మురళి మీద యేర్పడ్డాయి . అతను బ్రతికుంటే తన కొడుకు సుఖపడడు . రాధాకృష్ణ మనసులో విషబీజం నాటుకుంది .

అక్కడి పరిస్థితి చూసి రాధాకృష్ణ విస్తుపోయాడు . "నాన్నావిశ్వం కళ్ళుతెరు ,"అంటూ యేడుస్తున్న సీతారాం దంపతులను చూసాడు . విశ్వం గుడ్లు తేలేసి నురగలు కక్కుకుంటున్నాడు .

"మా బంగారుకొండ ,మా పెద్దవాడు విశ్వం పొరపాటున నువ్వు తెచ్చిన మందు తాగాడయ్యా .యేమైందో యేమో ఒక్కటే వాంతులు గుడ్లు తేలేస్తున్నాడు ,పెద్ద డాక్టర్ కి కబురు చేసాం ,,"అంటూ భోరున యేడ్చేసాడు సీతారాం

రాధాకృష్ణకు తనమీద తనకే .అసహ్యం వేసింది . తనెంత నీచంగా ఆలోచించాడు !తను మందులో కలిపిన గన్నేరుపప్పు తన కన్నకొడుకే తాగాడు . అక్కడ వాళ్లు మురళినికూడా పట్టించుకోకుండా విశ్వం కోసం విలవిలలాడుతున్నారు ,మరి తను ?వాళ్లకు లేక లేక పుట్టిన బిడ్డను చంపాలనుకున్నాడు .

అదృష్టం కొద్దీ సీతారాం పుణ్యం వల్ల బిడ్డలిద్దరూ బ్రతికారు . రాధాకృష్ణ జీవితం లో చెప్పుదుమాటలకు సందివ్వలేదు . సీతారాం దగ్గరే కాలాన్ని గడిపేసాడు . అన్నదమ్ముల్లాగా వున్నారు ,అలాగే విశ్వం ,మురళీలను అనుబంధాలతో ,అత్మియలతో పెంచారు .

ఈనాడు ప్రయోజకులైన కొడుకులను చూసి పొంగిపోతున్నాడు . అందుకే చెప్పుదుమాటలు వినని అందమైన ఐక్యతను కుటుంబం చవి చూసింది .

మరిన్ని కథలు

Nene apaadhini
నేనే అపరాధిని
- సరికొండ శ్రీనివాసరాజు
Parasuraamudu
భాగవత కథలు - 16 పరశురాముడు
- కందుల నాగేశ్వరరావు
Jeevitaniki maro vaipu
జీవితానికి మరోవైపు ......
- జీడిగుంట నరసింహ మూర్తి
Sumangali
సుమంగళి
- మద్దూరి నరసింహమూర్తి
Yagnam
యజ్ఞం
- శింగరాజు శ్రీనివాసరావు
Chandra vamsham
భాగవత కథలు – 15 చంద్ర వంశం
- కందుల నాగేశ్వరరావు