అవ్వ మనసు - డాక్టర్ కెఎల్వి ప్రసాద్

Avva manasu

రామకృష్ణాకాలనీ హన్మకొండ.* వర్షాకాలమే ,అయినా వర్షాలు లేవు . మేఘము -మెరుపులు జతకట్టి ఉరుముల చప్పుడుకి ,వర్షించడం మాని ,ఆకాశంలో తేలిపోయాయి .ఇం ట్లో ,ఫ్యాన్ తిరుగుతున్నా ,ఉక్కబోత ఎక్కువై ,బయటకు వచ్చి ,వరండా లో వున్న వాలుకుర్చీలో ఒరిగాడు నాగయ్య . నాగయ్య పుట్టుక తోనే నోట్లో వెండి చెంచా తో పుట్టిన వాడు కాదు . కష్టాలు చవిచూచి ,అందులో నే ,సుఖాన్ని వెతుక్కుని ,సమాజంలో తన కాళ్ళమీద తాను నిజాయితీ గా ,నిలబడి తన స్థానాన్ని నిలదొక్కుకున్నవాడు ! అతను కష్టపడినంత కాలం కష్టపడ్డాడు . పిల్లలు పెరిగి చేతికి అందారు. నాగయ్య మొత్తం వ్యాపారం పిల్లల చేతిలోపెట్టి తాను విశ్రాంతి తీసుకుంటు న్నాడు . జీవితాంతం కష్టానికి అలవాటుపడ్డవాడు ,విశ్రాంతిపేరుమీద ఖాళీగాకూర్చోవడంకూడాకష్టమే!ఏదోచేయాలనే ఆత్రుత ప్రతి క్షణం మనిషిని ప్రశాంతంగా వుందానివ్వదు.అందుకే,నాగయ్య సేవాకార్యక్రమా- లు పట్ల మక్కువ చూపించడం మొదలుపెట్టాడు .అదే ఆలోచనలలో--- వున్న నాగయ్య గతకొద్దిరోజులుగా లాక్ డౌన్ బాధితులకు తనవంతు చేసి న సేవాకార్యక్రమాలు మననం చేసుకోసాగాడు .పేదరికం నుండి వచ్చిన నాగయ్య,పేదవారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు .గతాన్ని గుర్తు చేసు కుంటూనే,ఒక్కొక్క మెట్టు పదిలంగాఎక్కి ధనవంతుల జాబితాలో చేరాడు నాగయ్య.వాలు కుర్చీలో పడుకుని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న నాగయ్యకు తన ఇంటిముందు నుండి నడిచిపోతున్న వృద్ధురాలు కని-- పించింది.ఆమె,అక్షరాలా శ్రీశ్రీ’’ భిక్షువర్షీయసి’’ కవితలోని ముసలిదాని--- వలే వుంది,ఆ..వృద్ధ మహిళ చాలా పేదరికంలో వున్న లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నాగయ్యకి .ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో ,పరిశుభ్రత పాటించే అవకాశాలు ఆమెలో నాగయ్యకి కనిపించలేదు . వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది . తక్షణం లేచి ఇంట్లోకి వెళ్లి రెండు సబ్బు బిళ్ళలు ఒక శానిటైజర్ సీసా తీసుకుని బయటికి వచ్చాడు ,ఆ .. అవ్వకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో . కానీ అప్పటికే ఆమె తారాజువ్వలా చాలా దూరం వెళ్ళిపోయింది . నాగయ్య ఎంతప్రయత్నించినా ఆమెను అందుకోలేడు , అందుకని ,ఆ .. అవ్వ వైపు వెళుతున్న ఒక మోటార్ సైకిలిస్టును ఆపి విషయం చెప్పి ,సబ్బులూ -శానిటైజర్ ,అవ్వకు ఇమ్మని ప్రాధేయపడ్డాడు అతను నాగయ్య అభ్యర్ధనను మన్నించినట్టే నటించి ,ఏదో దొంగ చేతుల్లో నుంచి తప్పించుకున్నట్టుగా తుర్రున పారిపోయాడు . అతని చేష్టలకు నాగయ్య మనస్సు చివుక్కుమంది . అవ్వకు అవి అందించలేకపోయా-- నన్న బాధ అతనిలో మొదలై కించిత్ నిరుత్సాహానికి గురయ్యాడు. ఈ లోగా ఆతని మానసిక వ్యధని గమనించి ,దేవుడే పంపాడా .. అన్నట్టు నాగయ్య దగ్గర పనిచేసే కుర్రాడు ఏదోపనిమీద అతనిదగ్గర కు వచ్చాడు సైకిలు మీద . బ్రతుకు జీవుడా .. అనుకుని ,నాగయ్య కుర్రాడిని దగ్గరికి పిలిచి ,విషయం చెప్పి అవ్వకు ఇచ్చిరమ్మని తొందర చేసాడు . కుర్రాడు సైకిలుమీద అవ్వను వెంబడించాడు . అప్పటికే అవ్వ చాలాదూరం వెళ్లి పోయింది . కొద్దినిముషాల్లోనే అవ్వను చేరుకొని ,బెల్లు కొట్టి అవ్వ ముందు సైకిలు ఆపాడు కుర్రాడు . అవ్వ ఒక్కసారి తన నడకకు సడెన్ బ్రేక్ వేసి ---’’ ఏంటి బిడ్డా .. ?’’అన్నట్టు చూసింది కుర్రాడివంక . ‘’ అవ్వా .. గీ .. సబ్బు బిళ్ళలు ,చనితైజరూ .. నీకిమ్మన్నడు మా సేటు ‘’ అన్నాడు కుర్రాడు . ‘’ దేనికి బిడ్డా .. అవి ?’’అంది అమాయకంగా అవ్వ . ‘’అవ్వా .. దేశంలా రోజులు బాలెవ్వు కదా .. గందుకే శుభ్రంగా చేతులు కడుక్కొనికి ,ఈ .. సబ్బు బిళ్ళలు ,చేతికి పూసుకోనీకి ఈ చానీ తైజరు ‘’ అన్నాడు కుర్రాడు ,తనకు తెలిసిన భాషలో . ‘’ బిడ్డా .. ఎంత గొప్పోడు మీసేటు .. గాయన్ని ఓమాలి చూపిస్త్తవూ ?’ అంది బ్రతిమాలినంత దీనంగా కుర్రాడి కళ్ళల్లోకి చూస్తూ . ‘’ అలాగే .. అవ్వా .. సైకిలు ఎక్కు తీస్కపోతా … ‘’అన్నాడు కుర్రాడు . ‘’వద్దులే బిడ్డా .. నడిచేవస్ధ .. నీ వెంబడి ‘’ అంది కాస్త చిరునవ్వు చిలక రిస్తూ.. ‘’ గట్లనే..పద’’ అన్నాడుకుర్రాడు .ముందుకుర్రాడు నడుస్తుంటే వెనుక అవ్వవేగంగానే నడుస్తూంది.నడిచినంత సేపూ నాగయ్యవివరాలు కను- క్కుంటూనే వుంది అవ్వ .కొద్దినిముషాల్లోనే ఇద్దరు నాగయ్య ఇంటికి చేరుకున్నారు. ‘’ అవ్వను పట్టుకొస్తువెంది శ్రీను’’ అడిగాడు ,నాగయ్య . ‘’ అవ్వ నిన్ను చూడాలంది ,గందుకే తోలుకొచ్చిన సెటూ..’’అన్నాడు, కుర్రాడు. ‘’ ఏందీ..అవ్వా..ఇంత దూరం తిరిగొస్తి వీ..’’ అన్నాడు కాస్త నవ్వుముఖం తో… ‘’ అవ్..బిడ్డా..నిన్నుచూడాలని ఇంతథూరం వచ్చిన .నువ్వు దేవుడివి బిడ్డా..నువ్వు చల్లగుండా..నీపిల్లలు చల్లగుండా..నీకుదేవుడు మరింత ఆయుష్షునియ్యలే..మీఅందరూ చల్లగాఉండుండి బిడ్డా..దేవుడు మీకు ఇంకా మేలు చేస్త డు..’’అంది,నెత్తిమీద చిటికెలు విరుచుకుంటూ..అవ్వకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ..’’ అవి తీసుకో..అవ్వా..’’ అన్నాడు. ‘’ బిడ్ద..ఏమీ అనుకోకు..నీ కాళ్ళు మొక్కుతా!ఇవేమీ నాకు వద్దు..నాబతుకంతా కాయ కష్టంతోనే తెల్లారిపాయె..ఉచితంగా తీసుకొనుడు నాకు ఇష్టంలే..బిడ్డా..నా.బతుకంతా..ఇలానే నడిచిపోనీ..’’ అని నాగయ్య కాళ్ళు మొక్కి చ ర..చర..వచ్చిన దారినే వెనుదిరిగి వెళ్ళిపోయింది అవ్వ. నాగయ్య..శ్రీను..కొద్దీక్షణాలు ఒకరిముఖంలోకి ఒకరు చూసుకుంటూ మాటలు రాని శిలల్లా అక్కడే నిలబడి పోయారు . ** **

మరిన్ని కథలు

Nene apaadhini
నేనే అపరాధిని
- సరికొండ శ్రీనివాసరాజు
Parasuraamudu
భాగవత కథలు - 16 పరశురాముడు
- కందుల నాగేశ్వరరావు
Jeevitaniki maro vaipu
జీవితానికి మరోవైపు ......
- జీడిగుంట నరసింహ మూర్తి
Sumangali
సుమంగళి
- మద్దూరి నరసింహమూర్తి
Yagnam
యజ్ఞం
- శింగరాజు శ్రీనివాసరావు
Chandra vamsham
భాగవత కథలు – 15 చంద్ర వంశం
- కందుల నాగేశ్వరరావు