ప్రాయశ్చిత్తం - సుధీర్ ధమ్మా

Prayaschittam

మనం చేసిన పాపాలకి మనకి శిక్ష పడితే చేసిన పాపం పండింది అని అనుకుంటాం కానీ మనం చేసిన తప్పుకి మన వాళ్ళు అనుకొనే వారికి ఏమైన జరిగితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొనే వరకు అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది నా పేరు శివ నేను vizag lo engineering చదువుతున్న నా సొంత ఊరు పశ్చిమ గోదావరి లో ఒక గ్రామం నాకు ఇంజనీరింగ్ సీట్ వైజాగ్ లో రావడం తో కాలేజీ హాస్టల్ లోనే ఉండి చదువుకొంటున్న ఇప్పుడు నేను సెకండ్ year ఒక్క year లోనే నాకు వైజాగ్ బాగా అలవాటు పడ్డాను దానికి కారణం ఇదరు, నాతో పాటు హాస్టల్ లో ఉంటూ చదువుకొనే కార్తిక్ ఇంక శ్రీవల్లి మేము ముగ్గురం class mates one year లోనే చాలా మంచి ఫ్రెండ్స్ ఐయ్యం శ్రీ వల్లీ ది సొంత పూరు వైజాగ్ తను వాళ్ళ ఇంటి నుండే రోజు కాలేజీ కి వస్తు ఉండేది ఎక్కడ కి వెళ్లిన మేము ముగ్గురం కలిసి వెళ్ళే వాళ్ళం అలాగే వైజాగ్ మొత్తం చుట్టేసం ,free gaa ఉన్నపుడు శ్రీ వల్లి చాలా సార్లు వాళ్ళ ఇంటికి పిలిచేది వాళ్ళ మమ్మీ డాడీ కూడా మా యిద్దరిని చాలా బాగా రిసీవ్ చేసుకొనే వాళ్ళు లాస్ట్ year నా birthday సెలబ్రేషన్స్ కూడా వాళ్ళ ఇంటిలోనే జరిగాయి నాకు మెల్లగా మెల్లగా శ్రీవల్లి మీద ప్రేమ మొదలైంది తను నా మీద చూపించే ఎఫెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది కార్తిక్ కంటే నా మీదే తను ఎక్కువ ఎఫిక్షన్ చూపిస్తుంది అని నాకు చాలా సార్లు అనిపించింది శ్రీవల్లి ని ప్రేమిస్తున్న అన్న విషయం ముందు కార్తిక్ కి చెప్పాలి అనిపించింది ఎందుకంటే వాడు నన్ను ప్రతి విషయం లో support చేస్తూ వచ్చాడు ఈ విషయం లో కూడా సపోర్ట్ గా ఉంటాడు అని అనిపించింది ఒకరోజు శ్రీవల్లి నీ ప్రేమిస్తున్న అన్న విషయం వాడికి చెప్పేశా వాడు చాలా షాక్ ఇయ్యడు ఇది ఎప్పుడు నుంచి one year back అడిగితే ఫ్రెండ్ అన్నవ్ కథ రా అని నన్ను అడిగాడు అదేంటో వాడు అడిగిన తరవాతే తన మీద ప్రేమ పుట్టింది తనని ఒక ఫ్రెండ్ లాగా చూడటం మానేసి ప్రేమికుడి లా చూడాలి అనిపించింది వాడికి ఈ విషయం చెప్పిన తరవాత తనకి ఎప్పుడు చెప్తావు అని నన్ను అడిగాడు కానీ దానికి నా దగ్గర సమాధానం లేదు ఎందుకంటే తనకి నా మీద కేవలం స్నేహితుడిని అన్న భావన మాత్రమే ఉంది అని నాకు స్పష్టం గా తెలుసు ఇదే విషయం కార్తిక్ కూడా చెప్పాను కానీ వాడు నన్ను ఒక్కసారి చెప్పి చుడు తనకి ఇష్టం లేకపోతే నేను కవర్ చేస్త తను నీన్ను ఏమి అనకుండా అని అన్నాడు దానితో కొంచం ధైర్యం వచ్చింది ఒకరోజు శ్రీవల్లి కాలేజీ లైబ్రరీ లో చదువు కొంటుంది అక్కడ propose చేసిన లైబ్రరీ కాబట్టి ఏమి అనదు అని కార్తిక్ గాడే ఐడియా ఇచ్చడు. నేను కార్తిక్ లైబ్రరీ కి వెళ్లి తనకి చెరొక పక్కన కూర్చున్నాము తను నవ్వి ఏంటి రెండు రోజుల నుండి ఇద్ధరు కనపడటం లేదు నాకు కనపడకుండా ఏమైన ప్లాన్ చేస్తున్నారా అని అడిగింది ఆ మాట వినగానే నాకు కొంచం బెదురు మొదలైంది అక్కడ నుంచి లేచి వెల్లిపోధం అనుకొన్న కానీ కార్తిక్ సైగ చేసి వద్దు అన్నాడు ప్లాన్ ఐతే చేసం నీకు చెప్పడమే మిగిలింది అని అన్నాడు కార్తిక్ ,ఏంటి అది అని అడిగింది వల్లి, చెప్పరా అని నన్ను అన్నాడు నేను భయ పడుతూ వల్లి చేతిలో ఉన్న బుక్ తీసుకొని అందులో i love you ani రాసి తనకి ఇచేశా తను ఆ బుక్ తెరచి చూసి నా వంక కోపం గా చూసి ఆ బుక్ close chesi వెళ్ళిపోయింది తరవాత రోజు నుండి నాతో మాట్లాడటం మానేసింది నేను మాట్లాడదాం అని ట్రై చేసిన పట్టించుకునేది కాదు నా బదులు కార్తిక్ వెళ్లి మనం ఇది వరకు లాగా ఉందం అని తనకి నచ్చ చెప్పి చూసాడు కానీ అందుకు తను ఒప్పుకోలేదు ఇంకొక్క సారి నా ప్రస్తావన తీస్తే కార్తిక్ తో కూడా మాట్లాడను అని అన్నది ఫ్రెండ్ గా ఉన్నపుడు కనీసం ముగ్గురం కలిసి హ్యాపీ గా ఉండేవాళ్ళం నా వల్ల ఆ స్నేహం కూడా చెదిరిపోయింది అని నాకు చాలా బాధ కలిగింది ఇంకొక 2 days lo శ్రీవల్లి birthday last year తన birthday celebrations చాలా బాగా చేసాము కానీ ఈ year మాతోనే సరిగ్గా మాట్లాడటం లేదు ఇంక సెలబ్రేషన్స్ ఏమి ఉంటాయి ఈ year కూడా తన birthday బాగా సెలబ్రేట్ చెయ్యాలి అని నేను కార్తిక్ అనుకొన్నము ఇంక తనకి దూరం గా ఉండటం మా ఇద్ధరి వల్ల కాలేదు నా వల్ల అస్సలు కాలేదు ఈరోజు నుంచి మాతో సరిగ్గా ఉంటుందో లేదో తెల్చేసుకొందం అనీ Sunday ఐనా తన ఇంటికి వెళ్ళాం కాలేజ్ లో ఎలాగో మాతో సరిగ్గా మాట్లాడటం లేదు అని. శ్రీవల్లి ఉంద aunty అని వాళ్ళ అమ్మగారిని అడిగితే ఈరోజు స్పెషల్ క్లాస్ ఏదొ ఉంది కాలేజ్ కి వెళ్తున్న అని చెప్పింది ,ఏంటి మీకు లేదా క్లాస్ అని మమల్ని అడిగారు మాకు తెలిసీ ఈరోజు ఏ స్పెషల్ class లేదు అది చెప్తే aunty ఎక్కడ కంగారు పడతారో అనుకొని మొన్న బాగా చదివే వాళ్ళని తీసి ఒక సెక్షన్ కింద పెట్టారు aunty అందులో మేము లేము అందుకే మేము వెళ్ళలేదు అని చెప్పాము వల్లి ఎక్కడ కి వెళ్ళింది అన్న కంగారు మా యిద్దరికీ పట్టుకొంది మాతో మాట్లాడడం మానేసిన తరవాత వల్లి మా క్లాస్ girls ఇద్ధరితో పరిచయం పెంచుకుంది వాళ్ళకి ఫోన్ చేసి అడిగాం వల్లి మీ దగ్గరకు వచ్చిందా అని కానీ వాళ్ళు రాలేదు అన్నారు నాకు మెల్లగా ఒకటి అర్థం iendhi వల్లి ఇంకెవరినొ ప్రేమిస్తుంది అందుకే నేను propose chestey రిజెక్ట్ చేసింది ఇదే విషయం కార్తిక్ కి కూడా చెప్పాను ఇంక ఈ విషయం లో చేసేది ఏమీ లేక వాళ్ళ ఇంటి నుండి నడుచుకొంటూ వాళ్ళ సందు చివరి వరకు వచ్చాం సరిగ్గా అప్పుడే ఎవరి car లొంచో వల్లి దిగడం మేము చూసాము కానీ తను ఏడుస్తూ దిగుతుంది మేము తనకి కనపడకుండా పక్కన దాకున్నం మేము అనుకొన్న దానికి వల్లి ఏడుస్తు చూసే సరికి మేము అనుకొన్నది కరెక్ట్ ఏనా అని నాకు అనిపించింది అస్సలు వాడు ఏవడై ఉంటాడు అని వాడి కార్ వెనకాల మేము follow అవ్వడం మొదలు పెట్టాము దారిలో ఇంకొక అమ్మాయి నీ అక్కించు కోవడం చూసాము తనని వాడు ఒక రెస్టారెంట్ కి తీసుకొని వెళ్ళాడు మేము వాడి వెనకాల అక్కడికి వెళ్ళాం ఇంతకు ముందు ఎప్పుడు వాడిని ఎక్కడ చూడలేదు ఆ అమ్మాయి నీ వాడు తన పక్కన కూర్చోపెట్టుకొని తన మీద చేతులు వేస్తున్నడూ తనకి వాడు అల చెయ్యడం అస్సలు ఇష్టం లేనట్టు ఉంది చాలా చిరాగ్గా ఫీల్ అవుతున్నాది అది మాకు స్పష్టం గా తెలుస్తున్నది ఆ అమ్మాయి తన హ్యాండ్ bag లోంచి కొంత డబ్బు తీసి వాడికి ఇచ్చింది వాడు తనతో ఏదో చెప్పాడు కానీ దూరం గా ఉండటం వల్ల మాకు సరిగ్గా వినపడలేదు తను అక్కడ నుంచి బయటకి వెళ్ళిపోయింది మేము తన వెనకాలే వెళ్లి తనని ఒక చోట ఆపి అస్సలు జరిగింది ఏంటి అని అడిగాం ముందు తను మాకు చెప్పడానికి చాలా భయ పడింది కానీ కార్తిక్ వెంటనే నా చెల్లి వారం వారం స్పెషల్ class ani చెప్పి బయటకి వెళ్తుంది ఏంటి అని ఈరోజు ఆర తీస్తే వాడి కార్ లోంచి దిగింది అని చెప్పాడు అప్పుడు ఆ అమ్మాయి ఏంటి వాడు మీ చెల్లిని కూడా వదల లేదా అని వాడి గురించి చెప్పడం మొదలు పెట్టింది ఒక రోజు నేను mobile display పోయింది అని repair కి ఇచ్చను తరవాత రోజు వెళ్లి కలెక్ట్ చేసుకొన్న కానీ కొన్ని రోజుల తరవాత నా మొబైల్ లో ఉండే కొన్ని సెక్రక్ట్ ఫొటోస్ ఒక నంబర్ నుండి నాకు వచ్చాయి అవి పంపింది వాడే ఫోన్ repair చేసిన వాడితో కలిసి నా మొబైల్ లో డేటా అంత తీసుకొన్నడూ అప్పటి నుండి నన్ను డబ్బులు ఇవ్వమని లేకపోతే నా ఫొటోస్ అన్ని నెట్ లో పెట్టేస్తాను అని blackmail చేస్తున్నాడు ఇంక నేను చేసేది ఏమి లేక ఇలా వాడు చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుంది అని తను మాతో చెప్పుకొని చాలా ఏడిచింది నాకు కార్తిక్ కి అనిపించింది శ్రీవల్లి నీ కూడా ఇలాగే blackmail చేస్తున్నాడు అని ఇంక వాడిని చంపెయ్యలి అన్నంత కోపం కానీ ఏం చెయ్యాలో తెలియని పరిస్తిధి మేము అడిగిన వల్లి మాకు చెప్తుంది లేదో తెలియదు కానీ మాకు తెలిసీ వల్లి కి లవర్ ఎవరు లేరు కానీ తను ఎందుకు వాడు చెప్పినట్టు చేస్తుంది మా యిద్దరికీ అర్థం కావడం లేదు అస్సలు ఏం జరిగిందో తెలుసుకోవాలి ఎలా గైన అనుకొని మేము ఇద్ధరం వల్లి ఫోన్ తీసుకొంటే అస్సలు ఏం జరిగిందో తెలుస్తుంది అని అనిపించింది వల్లి కి మా తరవాత అంత దగ్గరగా ఉన్న ఫ్రెండ్ స్నేహ తనకి జరిగింది అంత చెప్పి వల్లి తెలియకుండా తన ఫోన్ నువ్వు ఇస్తే అస్సలు వాడు ఏం చూపించి తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో అర్థం అవుతుంది అని చెప్పాము దానికి స్నేహ కూడా మాకు సాయం చేస్తాను అని చెప్పి ఒక రోజు వల్లి lunch చేస్తూ ఉండగా తన మొబైల్ తీసుకొని వచ్చేసింది మాకు ఎలాగో వల్లి ఫోన్ password తెలుసు ఫోన్ ఓపెన్ చేసేసం already ఆ Balck mail కి గురి అవుతున్న అమ్మాయి వాడి నంబర్ మాకు ఇచ్చింది వాడి కాంటాక్ట్ whats app లో ఓపెన్ చెయ్యమని ఆ చట్ మొత్తం చదవమని స్నేహ కి మేము చెప్పాము ఎందుకంటే అందులో ఏ ఫొటోస్ ఉన్నాయో మాకు తెలియదు స్నేహ అవి చూసి తను చెప్పిన మాటకి నేను కార్తిక్ షాక్ ఇయ్యము అందులో వల్లి బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఇంకొక అబ్బాయి తో ఉన్న ఫొటోస్ ఉన్నాయి అని వాటిని చూపించి వల్లి నీ blackmail చేస్తున్నాడు అని మాకు చెప్పింది వల్లి వచ్చేస్తుంది అని స్నేహ తన ఫోన్ నీ తన బెంచ్ లో పెట్టేసింది కానీ మా ముగ్గురికీ ఒక డౌట్ మొదలైంది అందులో వల్లి ఫొటోస్ కాకుండా వాళ్ళ బాబాయ్ అమ్మాయి ఫొటోస్ ఉంటే వాడు వల్లి నీ ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో మాకు అర్థం కాలేదు క్లాస్ లో కూర్చున్నాం కానీ మాకు అదే ఆలోచన ఎలా వల్లి నీ దీనిలోంచి బయట పడెయ్యలో నాకు అర్ధం కావడం లేదు క్లాస్ తరవాత సాయంత్రం నేను కార్తిక్ , స్నేహ నీ తీసుకొని వల్లి దగ్గరకు వెళ్లి నేను తనతో ఇలా అన్న నువ్వు ఇంతకు ముందు లా లేవు నేను propose చేస్తే నే నువ్వు నన్ను దూరం పెట్టే అంత స్వాబావం నీకు లేదు నువ్వు ఇంకొక దానింగురించి బాధ పడుతున్నావు అది ఏంటి చెప్పు అని నేను తనని అడిగాను కానీ తను అది ఏం లేదు నేను బాగనే ఉన్న అని అన్నది తను చెప్తుంది ఏమో అని చూసా కానీ చెప్పడం లేదు ఇంక నేను ఓపిక పట్టలేక మీ బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఎలా ఉంది అని అడిగాను ఈ మాటతో వెళ్ళిపోతున్న వల్లి తిరిగి నా వంక చూసింది తన కళ్ళలో ఒక బాధ ఆ బాధ తో తను పరుగున వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలు పెట్టింది మా ముగ్గురికీ కళ్ళు చెమర్చాయి వల్లి బాధ చూసి అస్సలు ఏం జరిగింది చెప్పు అని నేను అన్న తను కొంచం ఊపిరి పీల్చుకొని మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి కి నాకు చిన్నప్పటి నుండి చదువులలో పోటీ ఉంటు ఉండేది నా మీద ఎప్పటికప్పుడు తనే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటూ ఉండేది అలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకొన్నపుడల్ల మా బాబాయ్ మా ఇంటికి వచ్చి గొప్పలు చెప్పు కొంటు ఉండేవాడు దానికి ఎలాగైనా నా మీద మార్క్స్ తక్కువ వచ్చే లాగా చెయ్యాలి అనుకొన్న ఒకరోజు మా బాబాయ్ వాళ్ళు ఊరు వెళ్ళారు అని మా నాన్న మా చెల్లికి తోడు పడుకోవ మని అన్నారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను తను ఒక రూమ్ లో పడుకొన్నం సరిగ్గా నైట్ 12 గంటలు iendhi నేను పడుకొన్న అనుకొని మా చెల్లి ఒక అబ్బాయి నీ కలవడానికి ఇంటి back side కి వెళ్ళింది నేను మెల్లిగా తన వెనకాల వెళ్లి వాళ్లిద్దరినీ ఫొటోస్ తీశాను అది చూపించి మా చెల్లిని భయపెట్టి నాకంటే తక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అని చెప్దం అనుకొన్న కానీ సరిగ్గా నేను గదిలోకి వెళ్తున్నపుడు మెట్లు ఏక్కుతుండగ కాలు జారీ కింద పడిపోయా అప్పుడే నా ఫోన్ కింద పడి పడిలిపోయింది నేను ఫొటోస్ తీసిన సంగతి మా చెల్లికి నా ఫోన్ బాగయనా తరవాత చూపించి భయపెడదం అనుకొన్న తరవాత రోజు నా ఫోన్ తీసుకొని వెళ్లి సెల్ ఫోన్ repair shop లో ఇచ్చా వాడు సాయంత్రానికే నా ఫోన్ repair చేసి ఇచ్చెశాడు కానీ ఆ రోజు రాత్రి నాకు ఒకడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది నీ ఫోన్ లో ఫొటోస్ చాలా బాగున్నాయి అని నీవి కాదు అని నాకు తెలుసు అవి ఏవరివైన నాకు అనవసరం నేను అడిగినపుడు నాకు కావల్సినంత డబ్బులు నువ్వు వచ్చి నాకు ఇచేస్తే నేను ఎవరికీ ఇవి చూపించాను లేకపోతే ఇవి ఇంటర్నెట్ లో రేపటినుంచి చక్కర్లు కొడతాయి అని అన్నాడు నా స్వార్థం కోసం నేను చేసిన పని మా చెల్లి జీవితాన్ని పణం గా పెట్టవలసి వస్తుంది నిజం గా ఈ ఫొటోస్ బయటకి వస్తే మా చెల్లి మా బాబాయ్ వాళ్ళు ఎవరు బయట తల ఏత్తుకొరు దాని జీవితం నాశనం ఐపోతుంది నాకు ఏం చెయ్యాలో కూడా తోచడం లేదు శివ అని నన్ను పట్టుకొని తెగ అడ్చేసింది వల్లి తన చేసిన తప్పు తను తెలుసుకోంది ఇప్పుడు వాడి చేతుల్లోంచి తన చెల్లిని కాపాడుకోవాలి అనుకుంటుంది తను చేసిన తప్పుకి వాళ్ళ చెల్లి ఎక్కడ శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఏమో అని. ఇంక మా ముగ్గురికీ కూడా ఈ సమస్య నుండి వల్లి నీ బయట పడేయాలి చెప్పాలి అంటే వల్లినే నే కాదు వాడి వల్ల బాధ పడుతున్న అమ్మాయి లందరిని కాపాడాలి అని అనుకొన్నము ముందు అస్సలు వాడు ఎవడో తెలుసుకోవాలి వాడి గురించి నీకు ఏం తెల్సు అని నేను వల్లి నీ అడిగా దానికి వల్లి నాకు పెద్దగా ఏం తెలియదు కానీ ఆ మొబైల్ షాప్ వాడితో వాడికి సంబంధం ఉంది అని నేను అనుకొంటున్న ఎందుకంటే వాడికి నా ఫోన్ repair కి ఇచ్చిన తరవాత నే నాకు వాడి దగ్గర నుండి బెదిరింపు వచ్చాయి అని అన్నది ఈసారి నన్ను వాడు ఒక లక్ష రూపాయి లు అడుగుతున్నాడు నాకు ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు అని అన్నది వల్లి ,తన బాధ చూసి నాకు ఒక ఉపాయం తట్టింది వెంటనే స్నేహ నీ నా మొబైల్ కి వల్లి దగ్గర ఉన్న వాళ్ళ చెల్లి ఫొటోస్ transfer చెయ్యమన్నా నేను స్నేహ ఫోన్ తీసుకుని ఫోన్ display పోఏ లాగ చేసి ఆ ఫోన్ నీ స్నేహ తో అదే మొబైల్ repair shop లో ఇవ్వమని అన్న దానికి స్నేహ ఒప్పుకొని అక్కడ ఇచ్చి వచ్చింది నేను వెంటనే వాడి దగ్గరకి వెళ్లి అన్న ఇప్పుడు నీకు ఫోన్ repair కీ ఇచ్చి వెళ్ళింది కదా నాకు తన నంబర్ కావాలి చాలా రోజుల నుంచి తన వెనక తిరుగుతున్న నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు నంబర్ కూడా మార్చేసింది, చాలా అందం గా ఉంది అనీ పొగరు చూపిస్తుంది తన నంబర్ నాకు ఇస్తే మీకు నేను డబ్బులు ఇస్తాను అని అన్నాను దానికి వాడు సరే అని డబ్బులు తీసుకొని తన నంబర్ నాకు ఇచ్చడు తరవాత రోజు స్నేహ నీ వాడి దగ్గర నుంచి ఫోన్ తీసుకోవద్దు అని చెప్పను కాని నేను మాత్రం వాడి దగ్గరకి వెళ్లి భయ్య నిన్న వచ్చి తన నంబర్ తీసుకొన్న కధ ఆ అమ్మాయి ఫోన్ ఇంక నీ దగ్గరే ఉంద అని అడిగాను దానికి హా నా దగ్గరే ఉంది అని అన్నాడు , నేను వాడితో ఇలా అన్న, తననీ కొన్ని సెక్రెక్ట్ ఫొటోస్ తీసా అవి తన ఫోన్ కి పంపాను ఎందుకు తన నుండి reply ఇంక రాలేదు ఏంటి అనుకొంటున్న ఫోన్ నీ దగ్గరే ఉండి ఉంటుంది అని వచ్చ నీ దగ్గరే ఉందా లేక తీసుకొని వెళ్ళిపోయిందా నా దగ్గరే ఉంది అని అన్నాడు సరే అని నేను అక్కడ నుంచి వెళ్ళిపోయా నేను దూరం నుండి వాడిని గమనిస్తూనే ఉన్న వాడు ఇంకెవరికో ఫోన్ చేసి తన మొబైల్ లోంచి ఫొటోస్ వాడికి పంపాడు వాడికి అర్థం ఐపోయింది alreday వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ ఏ వాడికి send చేసాము అని కానీ వాడి ఫోన్ లోవి delete చేయకముందే రంగం లోకి దిగారు స్నేహ వాళ్ళ uncle SI విజయ్ కుమార్ వెంటనే వాడి షాప్ లోకి వెళ్లి వాడి ఫోన్ తీసుకొని చెక్ చేస్తే స్నేహ ఫోన్ లో ఉన్న పిక్చర్స్ ఇంకెవరి కొ పంపాడు వాడిని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళి నాలుగు తగిలిస్తే వాడి వెనకుండీ నడిపిస్తుంది ఎవరో చెప్పేశాడు వాడు ఎవరో కాదు మున్సిపల్ కార్పొరేటర్ కొడుకు ఈ విషయం తెలిసి కూడా విజయ్ కుమార్ గారు ఆలోచించ కుండ వాడి మీద case file చేసి జైల్ లో పెట్టించారు ఇలా చెయ్యడం వల్ల ఒక్క శ్రీవల్లి ఏ కాదు మాకు తెలియని చాలా మంది అమ్మాయి లు బయట పడ్డారు దీని తరవత శ్రీవల్లి నన్ను ప్రేమిస్తున్న అని చెప్పింది కానీ నేను మనం ఇదివరకు లాగానే మంచి ఫ్రెండ్స్ లాగా ఉందాం ఎందుకంటే ప్రేమ అనే ఆకర్షణలో పడే కదా ఇంకొకడు మన జీవితం తో ఆడుకొనే ఛాన్స్ వాడికి వచ్చింది అని చెప్పా లేని పోని చిక్కులో పడేసే ప్రేమ కన్న ఒకరికి ఒకరు సాయం చేసుకొనే స్నేహమే గొప్పది అని నేను అన్న దానికి శ్రీవల్లి కూడా ఒప్పుకొంది ఇంక మళ్ళీ మేము ముగ్గురం మంచి స్నేహితులు ఐపోయం.

మరిన్ని కథలు

Chinni aasha
చిన్ని ఆశ..!
- ఇందుచంద్రన్
Taraalu antaranga raagaalu
తరాల అంతరంగ రాగాలు
- సి హెచ్.వి యస్ యస్.పుల్లం రాజు
Sneha dharmam
స్నేహ ధర్మం
- వెంకటరమణ శర్మ పోడూరి
Nirnayam
నిర్ణయం
- జీడిగుంట నరసింహ మూర్తి
Toli prema
తొలి ప్రేమ..!
- ఇందుచంద్రన్
Nakka vaibhogam
నక్క వైభోగం
- నిశ్చలవిక్రమ శ్రీ హర్ష