చుట్టముట్టించి ప్రసిడెంటు భుజంపై జారుతున్న కండువా సరే చేసుకుంటూ పొలం బయలుదేరాడు, దారిలో సుడిగాడి ఇంటి ముందు ఊరిజనం మూగి ఉండటం కనిపించింది.నాలుగు అడుగుల్లో అక్కడకు చేరి ఆశ్చర్యపోయాడు ప్రసిడెంట్ ,పెళ్ళయి వారం రోజులుకూడా కాలేదు తన భార్య జుట్టుపట్టుకుని కొడుతున్నాడు సుడిగాడు.
" ఒరేయ్ ఆగరా బుధ్ధిమంతురాలు, చదువుకున్న పిల్లని అలాఎందుకు కొడుతున్నావు ? " అన్నాడు ప్రసిడెంట్ .
" కొట్టాల కోయాలా ,టీ తీసుకురావే అన్నా నాకళ్ళముందే టీగ్లాసులో మరుల మందు చిన్న సంచిలో వేసి కలుపుతూ మంత్రాలు చదువుతుంది మా అమ్మ అప్పుడే చెప్పింది చదువుకున్నదానితో జాగ్రత్త అని "అన్నాడు సుడిగాడు .
" ఏంజరిగిందమ్మ " అని సుడిగాడి భార్యను ప్రసిడెంట్ అడిగాడు.
" బాబాయ్ చెక్కెర కలిపిన పాలగ్లాస్ లో టీపొడి బ్యాగ్ కదుపుతూ ఈరోజు మంగళవారంకదా హనుమాన్ చాలీసా వెలుపలకు వినిపించేలా చదివాను ఈనెల తక్కు సచ్చినోడికి టీపొడిబ్యాగు మరులమందుగా, హనుమాన్ చాలీసా మంత్రాల్లా వినిపించాయి" అన్నది.
" తప్పయి పోయింది తొందర పడ్డాను మన్నించు మామా " అన్నాడు సుడిగాడు.
"తింగరోడా నాకు కాదు క్షమాపణలు చెప్పవలసింది నీభార్యకు చెప్పు "అని ప్రసిడెంట్ పొలం వెళ్ళిపోయాడు.
వారం తరువాత...
" పరంధామయ్య బావా రేపు ఉదయం ఆరుగంటలకు మనఊరికి బస్ వస్తుంది దానికి సరిపడా యాభై రెండు మందిని తీసుకువచ్చే బాధ్యతనీది ఇక్కడ ఏడుగంటలకు బయలు దేరితేకాని ముహుర్త సమయానికి చేరుకుంటాం,వివాహం అనంతరం భోజనాలు ముగిసిన వెంటనే మనల్ని మన ఊరుచేర్చేలా బస్ మాట్లాడాను మనిషి ఒక్కింటికి అయిదు వందలకు మాట్లాడాను బస్ లో యాభైరెండు సీట్లు నిండాలి అనే నిబంధన పెట్టాడు ఆబస్ వాడు ,మరో ముఖ్యవిషయం ఈపెండ్లికి మనతో సుడిగాడు రాకుండా చూడాలి " అన్నాడు ఆఊరి పంచాయితి ప్రసిడెంటు .
" సుడిగాడు వస్తే ఏమౌతుంది " అన్నాడు రామన్న పంతులు.
" అయ్యోరు వాడి లీలలు మీకు తెలియవు వాడు అన్నవి అన్ని జరగకపోయినా ఏవిజరగ కూడదో అవే జరుగుతుంటాయి. సుడిగాడు అమాయకుడో అతితెలివిగాడో నాకు ఇప్పటికి అర్ధంకాదు మోన్న చాకిచర్ల పెళ్ళికి వెళుతూ , మామా నేను వస్తానంటే సరే అని ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కించుకున్నా ట్రాక్టర్ వేగంగా వెళుతుంది ' మామా ఇప్పుడు గనక మనట్రాక్టర్ పట్టుతప్పిందనుకో మనమంతా పంటపొలంలోని నారు మడులమీద ఉంటాం కదా' అన్నాడు మరునిమిషమే గేదె ఊహించని విధంగా రోడ్డుపైకి వేగంగారావడంతో మాట్రాక్టర్ పట్టుతప్పి రోడ్డు దిగువన ఉన్న పంటపొలాల పల్టిలు కొట్టింది దెబ్బలు తగిలిన వాళ్ళు ఒకతన్నుతంతే ,దెబ్బలు తగలనివారు రెండు తన్నులు తన్నారు మనె సుడిగాడిని " అన్నాడు ప్రసిడెంటు .
" ఆ మీరు అలా అంటారు కాని వాడి విషయంలో ఎప్పుడు వాడిమాట ఫలిస్తుందా ఏమిటి " అన్నాడు పంచాయితి మెంబరు పరంధామయ్య .
" అన్ని మాటలు కాకున్నా కొన్ని మాటలు అక్షరాలా జరిగి తీరుతాయి పోయిన మాసం కిరాణా కొట్టు రంగయ్య కొడుకు పెళ్ళికి వచ్చిన వాళ్ళలో సుడిగాడు కనిపించాడు వాడిని చూస్తూనే నాఎడమకన్ను అదిరింది బిర్యాని విందుకుముందు పెళ్ళికి వచ్చిన మగవారందరికి తలా ఒక మందు సీసా ఇచ్చాడు రంగయ్య నాపక్కనే కూర్చున్న సుడిగాడు " మామా ఈమందు తాగిన తిక్కలో పెళ్ళికూతురు తరుపువాళ్ళు తమకు మాంసం ముక్కలు తక్కు పడ్డాయని తన్నులాటకుదిగి ఈపెళ్ళి ఆగి పోదుగా "అన్నాడు.
" వాడు అలా అని నోరు మూయకముందే భోజనాలదగ్గర పెద్దకలకలం
మాంసం ముక్కలు అన్ని వరుడి తరుపువాళ్ళకె పెడుతున్నారని రభస చేస్తూ ఓ పాతిక ప్లాస్టిక్ కుర్చిలు ఇరగకొట్టారు అమ్మాయి తరుపువారు సుడిగాడు వాక్కు పుణ్యాన పెళ్ళి ఆగిపోయింది .నేను నానాబాధలు పడి మరో ముహుర్తంలో ఆపెళ్ళి తిరుపతిలో చేయించాను,ఇప్పటి కే పొద్దు పోయింది ఉదయం ఆరు గంటలకు పంచాయితీ ఆఫీస్ వద్ద బస్ ఉంటుంది అందరు వచ్చేయండి "అని బయలుదేరాడు ప్రసిడెంటు.
తెల్లవారి ఆరుగంటలకు బస్ పంచాయితీ ఆఫీస్ వద్దకువచ్చింది . అప్పటికే
సిధ్ధంగా ఉన్నవారంతా వారికి కావలసిన సీట్లలో కూర్చొన్నారు .
' నిత్యం వేపచెట్టుకింద నులకమంచంపైన ఉండే చెంగయ్య " ఒడ్రవరో ఏ.సి . వేయవయ్యా "అన్నాడు .నోట్లో నాలుగు పళ్ళుకూడాలేని బసవయ్య తాత " డ్రయవర్ అబ్బి జ్యోతిలక్ష్మి,జయమాలిని పాటలున్న వీడియో వేసివెళ్ళు నాయనా " అన్నాడు.
" బస్ బయలు దేరాకే మఏదైనా వేసేది " అన్నడు డ్రవర్ .
" ఇదిగో డ్రవర్ బాబు ఏడు కావస్తుంది బండి తీయి అవతల ముహుర్తానికి అందుకోవాల "అన్నాడు ప్రసిడెంటు.
"కుదరదు రెండు సీట్లు ఖాళీగాఉన్నాయి నేను ముందె చెప్పాను ఖిళీ సీట్లు ఉండకూడదు "అన్నాడు డ్రవర్ .
" ఓసామి సుడిగాడు వస్తాడని మేము భయపడుతుంటే మధ్యలో నీసీట్లగోలేమిటి "అన్నాడు రామన్న పంతులు.
" సుడిగాడు ఏమన్న పెద్దరౌడినా నాదగ్గర వాడి పప్పులు ఉడకవు " అన్నాడు డ్రవర్ .
" అసలు విషయం ఏమిటంటే మాసుడిగాడు వచ్చాడంటే ఇక్కడ ఉన్న వారిలో ఎవరో ఒకరికి లేదా మనందరికి నష్టమో ,కష్టమో తప్పక జరుగుతుంది అదివాడి వాక్కుమహిమ ప్రతిసారి వాడి వాక్కు ఫలించకపోవచ్చు కాని అధికశాతం వాడి వాక్కు ఫలిస్తుంది " అన్నాడు ప్రసిడెంటు.
" ఈరోజుల్లోకూడా వాక్కు ప్రభావం ఉందని నమ్ముతారే ,నేను జనమన చైతన్య సమితి జిల్లా ప్రసిడెంటును ఈ కాకమ్మకథలు మేము నమ్మం " అన్నాడు.
దూరంగా పరిగెత్తుకుంటూ వస్తు తెగిన స్లిప్పర్ కు పిన్నిసు పెడుకనిపించాడు సుడిగాడు. అదిచూసి బస్ లోనివారంతా ఏంవార్త తీసుకువచ్చాడోనని భయంతో బిగుసుకు పోయారు.
సుడిగాడిని దూరంగా చూడటంతోనే ప్రసిడెంటు ఎడమకన్ను అదరసాగింది.
బస్ వద్దకు చేరుకున్న సుడిగాడు ప్రసిడెంటును చూస్తూ 'మామా పెళ్ళికి వెళ్ళబోకండి రాత్రి పెళ్ళికూతురు ప్రేమించినోడితో లేచిపోయిందట ఇప్పుడే
ఫోన్ వచ్చింది ' అన్నాడు ఆయాసపడుతూ .
పోలోమంటూ బస్ లోనివారంతా వెళ్ళిపోయారు .
' చెపితే విన్నావా ? ఇప్పుడునీకు ఇరవై ఆరు వేలు నష్టం సుడిగాడు మాఊరివాళ్ళను వదలి నీకు ఎసరు పెట్టాడు , ఏదైనా పెద్దలు చెపితేవినాలి 'అన్నాడు రామన్న పంతులు.
ఎందుకైనా మంచిది భవిష్యత్తులో ఉపయోగపడవచ్చునని ,సుడిగాడి ఫోటో తనఫోన్ లో భద్రపరచుకున్నాడు బస్ డ్రవ.
ఓదార్పుగా డ్రవర్ భుజంతట్టిన ప్రసిడెంట్ వేయి రూపాయలు అందించి 'బండిలో ఆయిల్ పోసుకుని ఇల్లు చేరు అన్నాడు.

