స్వయం ఉపాధి - కందర్ప మూర్తి

Swayam vupadhi

ఆఫీసు టైమవుతోంది. ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. రోడ్లన్నీ నీటితో నిండి ఎక్కడ గుంతలు ఉన్నదీ తెలియడం లేదు. విజయ రైన్ కోటు తొడుక్కుని హెల్మెట్ పెట్టుకుని స్కూటీ స్టార్ట్ చేసి డ్యూటీకి బయలు దేరింది విజయ హైదరాబాదులోని ప్రైవేటు కంపెనీలో స్టెనోగా పనిచేస్తోంది. ఇంటి నుంచి ఆఫీసు ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది. డైరెక్టు బస్ సర్వీసులు లేవు. ప్రయాణానికే గంటపైన సమయం పడుతుంది. ట్రాఫిక్ జామ్ లు, సిగ్నల్ స్టాపులు మామూలే. ఎంత వడిగా స్కూటీ డ్రైవ్ చేసినా అర్థగంట ఆఫీసుకి లేటైంది. మానేజర్ చాంబర్ నుంచి పిలుపు. షరా మామూలే.అర్థగంట లేట్ మార్కుతో పాటు చివాట్లు. వాతావరణ పరిస్థితులు , దూరంతో మానేజ్మెంట్ కి పనిలేదు. టైమ్ ప్రకారం రావాలి, పని ఎక్కువ ఉంటే అరగంట లేటుగానైన ఇంటికి వెళ్లాలి. ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రమోషన్ బంద్, ఇష్టం ఉంటే పని చెయ్యి లేదంటే రిజైన్ చేసి ఇంటికి పోండి. ఇదీ వరస. విజయకు పెళ్లై పది సంవత్సరాలైంది.హజ్బెండ్ సతీష్ కు సాఫ్టువేరు కంపెనీలో జాబ్. ఒక పరిమితి సమయం లేని ఉద్యోగం. ఒకసారి డ్యూటీ పగలైతే ఇంకోసారి రాత్రి డ్యూటీ చెయ్యాలి. ఇంట్లో ఏ ముఖ్యమైన పనొచ్చినా,పిల్లల చదువులు, ఆరోగ్యం బాగులేకపోయినా తల్లిగా విజయ చూసుకోవల్సిందే. ఇది విజయ ఒక్కర్తే కాదు చాలమంది వెనక ఆడ సహాయం లేని ఉద్యోగాలు చేస్తున్న గృహిణులకు మామూలే. పెద్ద పిల్ల అమిత ఎనిమిదవ తరగతి చదువుతుంటే కొడుకు వినోద్ ఐదవ తరగతి చదువుతున్నాడు. విజయ ఉదయాన్నే లేచి పిల్లల్ని స్కూలుకు తయారు చేసి లంచ్ బాక్సులు సిద్ధం చేసి పంపాలి.పనిమనిషికి శుభ్రం చెయ్యడానికి పాత్రలు వేసి ఇల్లు ఊడిపించాలి. పిల్లలిద్దరూ స్కూల్ అవగానే ఇంటికి వస్తారు.వాళ్లకు తినడానికి చిరుతిళ్లు ఏర్పాటు చెయ్యాలి. కొంతసేపు టి.వీ. ప్రోగ్రాములు చూస్తారు. ఆఫీస్ డ్యూటీ అవగానే ట్రాఫిక్ లో ఈదుతు అలసి ఇంటికి చేరిన వెంటనే రెస్ట్యైనా లేకుండా బట్టలు మార్చుకుని వంటపనుల్లో నిమగ్నమవాలి. రాత్రి భోజనాలవగానే పిల్లల చదువు మీద దృష్టి సారించాలి. ఉదయం టైము ఉండదు కనక రాత్రే కూరలు వగైర తరిగి ఉంచుకోవాలి.మర్నాడు ఉదయ మవగానే ఉరుకులు పరుగులు. భర్త నైట్ డ్యూటి చేస్తే పగలు నిద్రతో గడిచి పోతుంది. పగలు డ్యూటీ ఉంటే ఆఫీసులో గడిచిపోతుంది. పిల్లలకు జ్వరం మరేదైనా శరీర ఇబ్బంది వస్తే అదో టెన్షన్. ఆదివారం వచ్చిందంటే బట్టలు వాషింగ్ మిషీన్లో వెయ్యడం, మైంటినెన్స్, వంటపనులతో మద్యాహ్నమవుతుంది. అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కనక ప్రత్యేక వంటకాలు కబుర్లలో గడిచిపోతుంది. పిల్లల బర్త్ డే, పండగలు పూజలు వ్రతాలప్పుడు సందడే సందడి. వీలుంటే బయట థియేటర్లో ఏదో మూవీకి ప్లాన్ చేసుకోవడం. పై ఊర్ల నుంచి అతిథులు ఇంటికి వస్తే వారికి మర్యాదలు పెట్టుపోతలు సరేసరి.ఆఫీసులో శలవులడిగితే నెగెటివ్ రిప్లై వస్తుంది. విజయకు స్టెనోగా గవర్నమెంటు డిప్లమో ఉన్నా రికమండేన్ లేక ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. పోస్టుకి డబ్బు ఖర్చు చేసే స్తోమత లేక ఊరుకుంది. పెళ్లికి ముందు నుంచి ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నా సరైన గుర్తింపు లేదు. మానేజ్మెంట్లు మారుతుండటంతో బంధుప్రీతి, సిఫార్సులతో వారికి కావల్సిన వారిని ఎపాయింటు చేస్తు సీనియారిటీని వెనక పెడుతున్నారు. ఎవరైనా క్వశ్చన్ వేస్తే వారిని బ్లాక్ లిస్టులో ఉంచి సతాయిస్తు ప్రమోషన్లు లేకుండా చేస్తున్నారు. ఎండైనా వానైనా ట్రాఫిక్ లో అష్టకష్టాలు పడుతు ఆఫీసు టైముకి చేరడమంటే రోజూ కత్తి మీద సామే. పెళ్లైన కొత్తలో కుటుంబ భాద్యత, చంటి వాడిని క్రెచ్ లో ఉంచడం, ఒక్కొక్కసారి వాడికి జ్వరం రావడం, క్రెచ్ నిర్వహకుల ఫోన్ మెసేజులు, వారికి తగిన సమాచారం ఇవ్వడం, టెన్సన్ తో క్రెచ్ కి వచ్చి పిల్లాడిని ఇంటికి తీసుకు వచ్చేవరకు మనసు కుదుట పడదు. ఆఫీసులో పని చేస్తున్నా ధ్యాస పిల్లాడి గురించే ఆలోచనలు. ఎంత మనోవేదన. ఇప్పుడు పిల్లలు కొంచం పెద్ద వాళ్లై వాళ్ల పనులు వాళ్లు చూసు కుంటున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గత్యంతరం లేని ఉద్యోగం, మిషినులా ఉదయం నుంచి సాయంకాలం వరకు భాద్యతలతో అలసట. ఆత్మతృప్తి లేని జీవితం. రోజంతా గొడ్డులా పని చేసినా ఆఫీసులో గుర్తింపు లేకపోవడం చూసిన విజయకు ఉద్యోగమంటే విరక్తి పుట్టింది. తన కన్న జూనియర్లను ఇంచార్జ్ గా వెయ్యడం సహించలేకపోయింది. అన్నీ ఆలోచించి ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. తను కొంత వెనకేసిన డబ్బు, ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత వచ్చిన పైకం, వంటి మీద బంగారం తాకట్టు పెట్టి మొత్తం డబ్బు జమచేసి స్వయం ఉపాధి పథకంలో స్టేషనరీ షాపుతో పాటు జరాక్స్ మిషీన్ కొని మంచి కమర్షియల్ సెంటర్లో ఇల్లు అద్దెకు తీసుకుని మొదలు పెట్టింది. ఆత్మ విశ్వాసం, తెగువ ఉంటే దేన్నైనా సాధించ వచ్చు. విజయ మొదలు పెట్టిన స్టేషనరీ ఫేన్సీ షాపు తక్కువ సమయంలోనే వ్యాపారం ఊపందుకుంది. రోజూ కలెక్షన్స్ బాగున్నాయి. నెల నెలా టర్నోవరు పెరిగింది. పెద్ద వ్యాపారులు సరుకులు ఇచ్చి వెల్తున్నారు. టెన్షన్ లేని జీవితం. మెల్లిగా ఇంటిపనులు చూసుకుని షాపు తెరిచి ఉంచుతోంది. వెనక సాయంగా కూతురు అమిత ఉంటోంది. పండగలు , వ్రతాలు , ఎవరైనా బంధువులు వచ్చినా ప్రశాంతంగా ఇంటి పనులు చూసుకుంటోంది. స్వయం ఉపాధితో టెన్షన్ లేని రోజులు గడుస్తున్నాయి విజయకు. * * *

మరిన్ని కథలు

SankalpaSiddhi
సంకల్ప సిద్ధి
- రాము కోలా.దెందుకూరు.
Voohala pallakilo
ఊహల పల్లకిలో
- కందర్ప మూర్తి
Vishanaagulu
విషనాగులు
- కొల్లా పుష్ప
Manishi nallana manasu tellana
మనిషి నల్లన..మనసు తెల్లన..
- బోగా పురుషోత్తం
Sandatlo Sademiya
సందట్లో సడేమియా
- అంబల్ల జనార్దన్
Viharayatralo vinodam
విహారయాత్రలో వినోదం
- కందర్ప మూర్తి