నిజాయితీని వరించిన పదవి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Nijayiteeni varinchina padavi

శివయ్య అనేయువకుడు బాగా చదువుకున్నప్పటికి ఉద్యోగం రాకపోవడంతో, ఒంటి ఎద్దుబండితో జీవనం సాగిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు పట్నం లో నిత్యావసర సరుకులు తన బండిలో ఎక్కించుకుని,ఆసరుకు యజమాని చెప్పిన ఊరికి వెళ్ళి ఆసరుకులు నిజాయితీగా దించివచ్చేవాడు.కొందరుఎడ్ల బండ్లవాళ్ళు తమబండిలో ఎక్కించిన సరుకులలో కొద్ది కొద్దిగా దారిలో తీసి ఇంటికి తీసుకువెళ్ళేవారు.

ఒక రోజు రామాపురంలో సరరుకులు దించి బండితో ఇంటికి వెళుతున్న శివయ్యకు, తనకు ముందు రహదారిపై ఒక వృధ్ధుడు బరువుగా ఉన్న చేతి సంచితొ నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతున్నడు. 'తాతా నేను పట్నం వైపే వెళుతున్నా పెద్దవాడివి అంతదూరం నడచి వెళ్ళడం కష్టం.పైగా పొద్దు పోతుంది. రా ఇలావచ్చి నాబండిలోకూర్చో' అని ఆవృధ్ధుడిని తన బండిలో ఎక్కించుకుని కొంతదూరం ప్రయాణం చేసిన అనంతరం,ఇద్దరు ముసుగు దొంగలు బండి వెనుకగావచ్చి, వృధ్ధుని చేతిలోని సంచి లాగే ప్రయత్నం చేయసాగారు.బండిలోని వృధ్ధుడు కేకలు వేస్తూ చేతి సంచి వదలకుండా పెనుగు లాడసాగాడు. ఆదృశ్యం చూసిన రామయ్య బండిని ఆపి చేతిలోని కర్రతో ముసుగుదొంగను తరిమాడు. ''తాతా భయపడక నాబండిలో ఉండగా నిన్ను ఎవ్వరూ తాకలేరు.నిన్ను క్షేమంగా నేను పట్నం చేర్చుతా ఆబాధ్యత నాది'' అని ఆవృధ్ధుడిని పట్నంలో దించాడు శివయ్య.

''బాబు సమయానికి వచ్చి నాప్రాణాలు,సంచిలోని సొమ్ముకాపాడావు. నీకు ఏమిచ్చినా రుణంతీరదు ఇదిగొ ఈపదివేలు ఉంచు''అన్నాడు ఆవృధ్ధుడు.

''వద్దు తాతా ఆపదలో ఉన్నసాటి వారిని ఆదుకోవడం మనిషిగా నాబాధ్యత.ఒక కాకి గాయపడితే వందకాకులు సహయంగా వచ్చి అరుస్తూ సానుభూతిని,సహాయాన్ని అందిస్తాయి.మనకళ్ళముందు సాటి మనిషికి కష్టం వస్తే ఆదుకోవడం మనిషి ధర్మం''అన్నడు శివయ్య.ఆశీర్వదించిన ఆవృధ్ధుడు వెళ్ళిపోయాడు.

మరునాడు సరుకులు దించి తన బండిపై పట్నం వెళుతున్న రామయ్యకు రహదారిపై వస్త్రంలో చుట్టబడిన మూట కనిపించింది. ఆచుట్టు పక్కల ఎవ్వరూ లేక పోవడంతో,ఆమూటను అలానే తన బండిలొ పెట్టుకుని రక్షక భటుల నిలయానికివెళ్ళి 'అయ్యా నాకు రహదారిలో ఈ మూట దొరికింది దీని సొంతదారులు ఎవరో వారికి అప్పగించండి'అన్నాడు రామయ్య.

అక్కడ కూర్చోని ఉన్న జమిందార్ గారు''నాయనా ఆమూటలో ఏముందో చూసావా? ''అన్నాడు.

"అయ్యగారు నాది నాని వస్తువు అది అందుకే నేను ఆమూట విప్పలేదు''అన్నాడు శివయ్య.

''భేష్ నాయనా నేను ఈపరగణా జమందారును,నిన్ను పరిక్షించచానికి నిన్న ముసుగు దొంగను పంపాను అప్పుడు నువ్వు చూపిన సాహసం,ధైర్యం,పరోపకార గుణం మెచ్చదగినవి.ఈరోజు నగల మూటను నీకు దొరికేలా నేనే ఏర్పాటు చేసాను ఇందులో నీ నిజాయితి నిరూపించుకున్నావు.నీ పరోపకార గుణం,నిజాయితి నీజీవితానికి బంగారు బాటను వేసాయి. బాగా చదువుకున్న నీలాంటి నమ్మకమైన నిజాయితీ పరుడే నాకు కావాలి.రేపటినుండి మాదివాణంలో ఉంటూ ఈ పరగణా అంతా పన్నులు వసూలు చేసే అధికారిగా నిన్ను నియమిస్తున్నాను.మంచి జీతంతోపాటు నీకుటుంబం అంతా మన దివాణంలో ఏర్పాటు చేసిన ఇంట్లో నివసించవచ్చు'అన్నాడు.

నిజాయితీ పరులు తాత్కలికంగా కష్టాలు అనుభవించినా వారి నిజాయితి వారిని ఏదో ఒకరోజున,ఏదో ఒక విధంగా ఆదుకుంటుందని రామయ్య అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు.

మరిన్ని కథలు

mamidi komma malli poochenulae
మామిడి కొమ్మమళ్ళీ పూచేనులే
- ప్రభావతి పూసపాటి
Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు