బాల్కనీ లవ్ - తాత మోహనకృష్ణ

బాల్కనీ లవ్


నా పేరు ఆనంద్. మేము కొత్తగా ఒక ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయ్యాము. మా ఫ్లాట్ బాల్కనీకి ఎదురుగా.. ఎదురింటి ఫ్లాట్ బాల్కనీ ఉంటుంది. చక్కని గాలి, వెలుతురు కోసం నేను ఎప్పుడూ మా బాల్కనీ లోకి వచ్చి కొంత సేపు కూర్చుంటాను. కాఫీ అక్కడే కూర్చొని తాగితే... ఆ ఫీలింగే వేరు..

మా ఇంటికి ఎదురుగా ఉన్న బాల్కనీ ఇంటికి ఇంకా ఎవరూ షిఫ్ట్ అవలేదు.. ఖాళీగానే ఉంది. ఒక రోజు నేను సాయంత్రం మా బాల్కనీలో ఉన్న మొక్కలకి నీళ్ళు పోస్తుంటే, ఎవరో ఏదో ఫ్లాట్ లోకి కొత్తగా షిఫ్ట్ అవుతున్నట్లు తోచింది. చూస్తే, ప్యాకర్స్ అండ్ మూవర్స్ ట్రక్ లో సామానులు వచ్చాయి.

కొంతసేపటికి, ఆ ట్రక్ సామానుల ఓనర్స్ కాబోలు.. సామానులు జాగ్రత్తగా ఎక్కించమని ట్రక్ లోవాళ్లకి చెబుతున్నారు. ఈలోపు ఒక అందమైన అమ్మాయి పక్కనే ఆగిన కార్ దిగి.. ఓనర్స్ దగ్గరకు వెళ్ళింది..

"అమ్మా! షిఫ్టింగ్ ఎంత సేపు పడుతుంది చెప్పు..!"
"ఒక గంట లో అయిపోతుంది.. కావాలంటే, మన ఫ్లాట్ బాల్కనీ లోకి వెళ్లి కూర్చో.." అంది తల్లి

"అలాగే..అక్కడే బెటర్.." అని ఆ అమ్మాయి వెళ్ళింది

ఇదంతా, నా బాల్కనీ లోంచి నేను గమనిస్తున్నాను. ఆ అమ్మాయి కి ఒక ఇరవై వయసు ఉంటుంది. చూసిన వెంటనే నచ్చేసింది. ఆ అమ్మాయి నా బాల్కనీ కి ఎదురు బాల్కనీ లోకి రావాలని కోరుకున్నాను. వెంటనే, ఎదిరింటి బాల్కనీ డోర్ ఓపెన్ అయి, ఆ అందమైన అమ్మాయి బయటకు వచ్చింది.

ఏమైనా సహాయం కావాలేమో అని ఎలా అడగాలో తెలియలేదు. "నైబర్స్ కదా, చనువు తీసుకుని.. అమ్మాయికి ఒక స్మైల్ ఇచ్చాను. నా వైపు చూసి, లోపలికి వెళ్ళి ఒక కుర్చీ తీసుకుని వచ్చి.. కూర్చొని మొబైల్ లో ఏదో చూస్తోంది.. ఫోన్ డేటా స్లోగా ఉందేమో, చాలా చిరాకుగా ఉంది ఆ అమ్మాయి..

"హలో..! నేను ఆనంద్.. మీకేమైనా హెల్ప్ కావాలా?" అని అడిగాను

"వైఫై పాస్వర్డ్ కావాలి..ఇస్తారా..? మూవీ చూడాలి.."

"ఓకే.. అలాగే అని పాస్వర్డ్ చెప్పాను.."

"అలా నా వైఫై పాస్వర్డ్ షేర్ చేశాను. కనెక్ట్ అయిన తర్వాత, ఆమె ముఖంలో ఆనందం చూడాలి.. గోల్డ్ మెడల్ వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యింది.."

"థాంక్స్ ఆనంద్ గారు.."

"ఇంతకీ మీ పేరు ఏమిటి మిస్..?"

"నా పేరు అనిత..నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను.."

" మీరు ఏం చేస్తున్నారు ఆనంద్ గారు ? "

"నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను అనిత గారు .. "

"ఏ కాలేజీ లో ?" అని అడిగింది అనిత

" ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీ..లో" అని అన్నాను

"నేనూ అక్కడే ఫైనల్ ఇయర్ లో జాయిన్ అయ్యాను. మా నాన్నకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అవడం చేత.. సామానులతో పాటే వచ్చేసాము.." అంది అనిత

అయితే మేము నైబర్స్ ప్లస్ కాలేజీ మేట్స్ అనమాట. అనిత కి దాదాపు సగం దగ్గర అయిపోయినట్టే అనుకున్నాడు ఆనంద్..

అనిత వాళ్ళు ఎదురింట్లోకి షిఫ్ట్ అయిపోయారు. బాల్కనీ లో అందమైన మొక్కల కుండీలు పెట్టుకున్నారు. రోజూ సాయంత్రం..అనిత మొక్కలకి నీళ్ళు పొయ్యడానికి బాల్కనీ లోకి వచ్చిన వెంటనే...నేను కుడా మొక్కలకు నీళ్ళు పొయ్యడానికి వెళ్తాను. నేను ఒక స్మైల్ ఇస్తాను..రిప్లై గా అనిత ఒక స్మైల్ ఇచ్చి..'హాయ్' చెబుతుంది.

తర్వాత రోజు నుంచి, కాలేజీ లో కలుసుకోవడం.. సాయంత్రం బస్సు లో ఇద్దరు కలిసి ఇంటికి రావడంతో...మా ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి..బాగా దగ్గరయ్యాము. ఇద్దరి ఆలోచనలు..అభిరుచులు బాగా కలిసాయి. రోజూ సాయంత్రం ఇద్దరమూ..మా బాల్కనీల్లో ఎదురు ఎదురుగా కూర్చొని, ఫోన్ లో నవ్వుకుంటూ మాట్లాడుకుంటాము. చూసేవారికి..ఎక్కడా డౌట్ రాకుండా..

ఇప్పుడు ఇద్దరి చదువులు కంప్లీట్ అయ్యాయి. ఆనంద్ కు పెద్ద కంపెనీ లో మంచి ఉద్యోగం వచ్చింది.

ఒకరోజు..అనిత కు అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. తనకి వచ్చిన వ్యాధికి మందు ఇంకా కనిపెట్టలేదని డాక్టర్ చెప్పారు. వెంటనే, ఆయుర్వేదంలో ఏమైనా మందు దొరుకుతుందేమోనని నాకు తెలిసిన డాక్టర్ ని అడిగాను. ఎక్కడో అడివిలో దొరికే..ఒక మొక్క పసరుతో నయం కావొచ్చని చెప్పాడు డాక్టర్. కానీ, ఆ మందు తో నయం అయ్యే ఛాన్స్ చాలా తక్కువని కుడా చెప్పాడు. అక్కడకి వెళ్లి ఆ మొక్కలు తీసుకురావడం చాలా రిస్క్ అని కుడా అన్నారు. కానీ, ఆనంద్ తన ప్రాణాలకు తెగించి అక్కడకు వెళ్లి..ఆ మొక్కలు తెచ్చాడు.

ఆ మొక్కల పసరు తో అనిత కు నయమైంది. తన కూతురిని కాపాడిన ఆనంద్ కి అనిత ను ఇచ్చి పెళ్ళి చేసాడు అనిత తండ్రి. ఇప్పుడు అనిత..ఆనంద్ ఇద్దరు ఒకే బాల్కనీ లో కూర్చొని రోజూ మాట్లాడుకుంటూ హ్యాపీ గా ఉన్నారు..

********

మరిన్ని కథలు

Kurukshetra sangramam.6
కురుక్షేత్ర సంగ్రామం .6.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.5
కురుక్షేత్ర సంగ్రామం .5.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.4
కురుక్షేత్ర సంగ్రామం .4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Padavee viramana kanuka
పదవీవిరమణ కానుక
- బామాశ్రీ
Kokku pandi
కొక్కుపంది .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Varsham kosam
వర్షం కోసం
- తాత మోహనకృష్ణ
Konaseema kurradu
కోనసీమ కుర్రాడు
- సిహెచ్. వి. యస్. యస్. పుల్లంరాజు
Marchery lo muchhatlu
మార్చురీలో ముచ్చట్లు
- మద్దూరి నరసింహమూర్తి