ఘరానా మోసం - డా:సి.హెచ్.ప్రతాప్

Gharana mosam

రంగనాథం గారు రిటైర్డ్ తాహసీల్దార్‌. నలభై ఏళ్ల ప్రభుత్వ సేవలో ఒక్కసారి కూడా అవినీతిని తాకని నిజాయితీ గల అధికారి. రిటైర్మెంట్‌ తర్వాత చిన్న తోటకు నీళ్లు పోయడం, పత్రికలు చదవడం, సాయంత్రం చాయ్‌తో పాత మిత్రులతో చర్చలు — ఇవే ఆయనకు మిగిలిన జీవితంలోని చిన్న చిన్న ఆనందాలు.

ఒక మధ్యాహ్నం, ఆకాశం మబ్బులతో కమ్ముకున్నపుడు, ఫోన్ మోగింది. అపరిచిత నంబర్‌. మొదట ఆయన దానిని పట్టించుకోలేదు. కానీ కొద్దిసేపటికి అదే నంబర్‌ మళ్లీ రింగ్‌ అయింది.

ఆసక్తితో ఎవరో పదే పదే చేస్తున్నారు, తెలిసిన వాళ్లయివుంటారు, పాపం ఏ అవసరం వచ్చిందో అని అనుకుంటూ ఆ వీడియో కాల్‌ లిఫ్ట్‌ చేశారు.

తెరపై కనిపించిన దృశ్యం ఆయనను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. వెనుక “సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్” బోర్డు, ఎదుట యూనిఫారంలో ఉన్న అధికారి, పక్కన ఇద్దరు కానిస్టేబుళ్లు.

“మీరు రంగనాథం కదా?” అని గంభీరంగా అడిగాడు ఆ అధికారి.

“అవును,” అని రంగనాధం సమాధానమిచ్చారు.

“మీ పేరు ఒక అంతర్జాతీయ మనీలాండరింగ్‌ కేసులో ఉందని మాకు సమాచారం అందింది. ఆ సంగతి రికార్డులను చెక్ చేస్తే కరక్టేనని ధృవీకరింపబడింది. ఈ స్కాంలో మీ ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్లు వాడబడ్డాయి. ఇప్పుడే మీరు మీ బ్యాంక్‌ వివరాలు మరియు మీ మొబైల్ కు వచ్చే ఒక వో టి పి పంపించాలి. లేని పక్షంలో మిమ్మల్ని డిజిటల్‌గా అరెస్ట్‌ చేస్తాం,” అని అధికార ధాటితో చెప్పాడు.

ఆ వోటిపి , డిజిటల్ అరెస్ట్ అన్న పదాలు విన్న వెంటనే రంగనాథం గారి అనుభవం మాట్లాడింది.

“ఇది ఎక్కడో విన్నాను... డిజిటల్ అరెస్ట్‌ మోసమేమో!” అని ఆయన మనసులో కాంతి పుంజం మెరిసింది.

తన వయస్సు, అనుభవం కలిపి ఆయనను స్థిరంగా ఉంచాయి.

అధికారి మాట వింటునట్లు నటిస్తూ, రంగనాథం పక్క మొబైల్‌తో సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ 1930కు కాల్‌ చేశారు.

“నేను రిటైర్డ్ తహసీల్దార్ రంగనాథం మాట్లాడుతున్నాను. నకిలీ పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌తో వీడియో కాల్ చేసి, వోటిపి అడుగుతున్నారు కాదంటే డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. నంబర్‌ ట్రాక్ చేయండి,” అని తెలిపారు.

సైబర్ క్రైమ్ అధికారులు రంగనాథం తెలివిని అభినందించి వెంటనే లొకేషన్‌ ట్రేస్‌ మొదలుపెట్టారు.

మూడు రోజుల్లోనే హైదరాబాద్‌ శివార్లలోని ఒక అపార్ట్‌మెంట్‌లో దాగి ఉన్న మోసగాళ్లను పట్టుకున్నారు.

కానీ అక్కడ ఎదురుచూసిన దృశ్యం రంగనాథం గారిని చీల్చేసింది —

అక్కడ ఉన్న నలుగురిలో ఒకరు ఆయన స్వంత కొడుకు ఆకాష్‌!

ఐటీ గ్రాడ్యుయేట్‌, చిన్నప్పటి నుండి చదువులో అమోఘమైన తెలివితేటలు ప్రదర్శించి హైదరాబాద్ లో ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ గా పని చేస్తున్నాడు. . ఇప్పుడు అదే తెలివిని దుర్వినియోగం చేస్తూ డిజిటల్ అరెస్ట్‌ మోసాలకు నాయకత్వం వహిస్తున్నాడు.

విచారణలో తేలింది — ఆకాష్‌ గత ఆరు నెలల్లో 50 మందికి పైగా వృద్ధుల నుండి ₹2 కోట్లకు పైగా దోచుకున్నాడని. అతను నకిలీ వీడియో బ్యాక్‌గ్రౌండ్స్‌, వాయిస్‌ సింథసిస్‌, వోటిపి ఫిషింగ్‌ లింక్స్‌ వంటి సాంకేతిక మార్గాలు వాడి ప్రజలను మోసం చేస్తిన్నాడు.

కోర్టులో హాజరైనప్పుడు ఆకాష్‌ తలదించుకుని నిశ్శబ్దంగా తండ్రి వైపు చూసాడు.

రంగనాథం గారు మాత్రం కన్నీళ్లు ఆపుకుంటూ, గట్టిగా అన్నారు —

“చట్టం ముందు కొడుకు, తండ్రి, బంధువు అనేవి లేవు. నేరం చేసినవాడు ఎవడైనా సరే — నేరస్తుడే!”

ఆ మాటలతో కోర్టు ప్రాంగణం నిశ్శబ్దమైంది.

కేసు అనంతరం సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు:

“ఈ ఘటన ప్రతి పౌరుడికి పాఠం కావాలి. ఇప్పటి మోసగాళ్లు టెక్నాలజీని ఆయుధంగా వాడుతున్నారు. వీడియో కాల్స్‌లో నకిలీ పోలీస్ బ్యాక్‌డ్రాప్స్, డిజిటల్ అరెస్ట్‌, చిన్నప్పటి నుండి చదువులో అమోఘమైన తెలివితేటలు ప్రదర్శించి హైదరాబాద్ లో ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ గా పని చేస్తున్నాడు. ఫ్రాడ్స్ — ఇవి ప్రతీ రోజూ వందల మంది ప్రజల జీవితాలను దెబ్బతీస్తున్నాయి.

నిజమైన పోలీస్ ఎప్పుడూ ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా అరెస్ట్ చేయరు. ఎవరైనా చిన్నప్పటి నుండి చదువులో అమోఘమైన తెలివితేటలు ప్రదర్శించి హైదరాబాద్ లో ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ గా పని చేస్తున్నాడు. అడిగినా, ఫోన్ కట్ చేయండి. వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సంప్రదించండి.”

మర్నాడు పేపర్లో పై సంఘటన గురించి వివరాలు ప్రచురితమయ్యాయి.ఆందులో రంగనాధం గారి అప్రమత్తత గురించి , ఆయన ప్రవర్తన స్పూర్తిదాయకంగా వుందని రాసారు. కన్న కొడుకే ఈ స్కాం లో వున్నాడన్న వార్త రంగనాథం గారి మనసు ముక్కలయినా, ఆయన చూపిన అప్రమత్తతే మరెందరోని రక్షించింది. సాంకేతికత మన సేవలో ఉండాలి; మనసును మోసం చేయడంలో కాదు. అప్రమత్తతే నిజమైన భద్రత అన్న విషయం అప్పుడు అందరికీ బోధపడింది.

మరిన్ని కథలు

Tappu telisindi
తప్పు తెలిసింది
- కందర్ప మూర్తి
Aaru chintachetlu
ఆరు చింతచెట్లు
- డా. భీమ మోహన రావు
Manavatwam
మానవత్వం
- సి.హెచ్.ప్రతాప్
Naa asha aakanksha
నా ఆశ-ఆకాంక్ష
- రాపాక కామేశ్వర రావు
Inner child
ఇన్నర్ చైల్డ్
- రాజు యెదుగిరి
Pavitra prema
పవిత్ర ప్రేమ
- సి.హెచ్.ప్రతాప్
Manasika vaikalyam
మానసిక వైకల్యం
- సి.హెచ్.ప్రతాప్
Pedanaanna
పెదనాన్న
- ఏ. కృష్ణమోహన్