అతను ఆమె మదిలో - బొబ్బు హేమావతి

Atanu aame madilo

ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కి యూనివర్సిటీ నుండి పదిమందిని సెలెక్ట్ చేశారు. ఆ పది మందిలో శ్రీజ కూడా ఉంది.

శ్రీజ పని చేసేది హైదరాబాదులోని ఉన్నతమైన విశ్వ విద్యాపీఠం బి.వి.ఆర్ అటానమస్ యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కి అందరూ అటెండ్ అయ్యారు. ఆ ప్రోగ్రాం కి చాలా యూనివర్సిటీ నుండి కాలేజీల నుండి ఆచార్యులు అటెండ్ అయ్యారు.

శ్రీజ అందరితో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటే అదే యూనివర్సిటీ నుండి అటెండ్ అయిన శేఖర్ ఆమెనే గమనించ సాగాడు. శేఖర్ ఆమెలోని కాన్ఫిడెంట్ నేచర్ ని పసిగెట్టాడు. ఆమె ఎంతో మంచిదని గమనించాడు.

శేఖర్ కు శ్రీజా ని చూస్తూ ఉంటే ఎందుకో తెలియదు కానీ ఆమెను provoke చెయ్యాలని అతనికి అనిపించ సాగింది.

మొదటి రెండు రోజులు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం చాలా ఉత్సాహంగా గడిచిపోయింది. ఆరోజు అటెండ్ అయిన ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ మధుసూదన్ అందర్నీ ఉత్సాహపరుస్తూ మాట్లాడుతున్నంతలో శేఖర్ మధ్యలో లేచి శ్రీజ వైపు చూపించి అన్నాడు...

మీరు ఇప్పుడు మోనో యాక్షన్ చేయాలి అది ఎలాగంటే మీ పిల్లల తో కలిసి మీరు ఎగ్జిబిషన్ కి వెళ్ళినట్లు అక్కడ మీ పిల్లలు ఇద్దరు తప్పిపోయినట్లు మీరు ఏడుస్తూ నటించాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్లు ఏడుస్తూ నా పిల్లలను నాకు తెచ్చి ఇవ్వండి అని బాధపడుతూ నటించడం కాదు జీవించాలి అన్నాడు.

కోపంతో శ్రీజ అతని వైపు చూస్తూ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా... ఏంటి అంటున్నావ్... నా పిల్లలు ఏంది తప్పిపోయేది.. నేను ఎందుకు ఏడవాలి... మాట్లాడడానికి ఇంకేమైనా టాపిక్స్ దొరకలేదా నీకు... అని అనగానే

మిగతా ఫ్యాకల్టీ కూడా సమూహాలుగా విడిపోయారు. కొంతమంది అతను అన్న దాంట్లో తప్పేముంది. యాక్షనే కదా చేయమన్నాడు. అదేమీ నిజం కాదు కదా అని అతడిని సపోర్ట్ చేయసాగారు. కొంతమంది శ్రీజ కు సపోర్ట్ చేస్తూ అయినా అటువంటి మాటలేంటి. మనం ఇక్కడికి వచ్చింది ట్రైనింగ్ కోసము. అంతేకానీ సరదాగా కూడా ఇటువంటి మాటలు అనకూడదు. ఇది ఎమోషనల్ అబ్యుజ్. ఆమెకు ఇది హరాస్మెంట్ కూడా అని అన్నారు.

చివరికి గొడవను సర్దపరచడానికి ప్రొఫెసర్ మధుసూదన్ జోక్యం చేసుకొని రెండు గ్రూపులను సైలెంట్ గా కూర్చోమన్నాడు. శేఖర్ తో అన్నాడు " మీ మాటలు ఏమీ బాగోలేదు. మనలోని ఒక ఫ్యాకల్టీని ఇలా మాట్లాడటం మంచిది కాదు. మనిషిలో కైండ్ నెస్ ఉండాలి కానీ జెలసి ఉండకూడదు" అన్నాడు. శ్రీజ వైపు చూసి మేడం ఏమైనా ఉంటే బయట చూసుకోండి. ఇక్కడ ఎందుకు గొడవ అన్నాడు. ఒక్క క్షణం చకితురాలు అవుతూ శ్రీజ... అయన వైపు చూసి నాదేమీ లేదు అని చెప్పాలని అనుకుని చెప్పలేక సైలెంట్ గా కూర్చుంది.

ఆరోజు ప్రోగ్రాం బయటకు వచ్చి శ్రీజ దగ్గరికి వెళ్లి సారీ చెప్తూ మొదటి రోజు మిమ్మల్ని చూసి ప్రొఫెసర్ అనుకోలేదు. ఏ ప్రొఫెసర్ గారి భార్య వో అనుకున్నాను.సరదాగా తీసుకోండి అన్నాడు. పక్కనే ఉన్న పరమేశ్వరి శేఖర్ అటు వెళ్ళాక అన్నది... వీడికి ఒక కాలు కుంటి. సరిగ్గా ఉంటే ఇక ఎలా ఉండేవాడో అన్నది కోపంగా.

ఆరోజు శ్రీజ ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఎందుకో తెలియదు కానీ ఆలోచనల నిండా శేఖర్. తల వేడెక్కింది ఆమెకి.

శ్రీజ ఏదో ఇబ్బంది పడుతుండడం గమనించి శ్రీజ కూతురు కీర్తి ... అమ్మ నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. ఈరోజు వంట నేను చేస్తాను అన్నది. చింటూ తో అమ్మని రెస్ట్ తీసుకొని, నీ హోం వర్క్ నేను చేపిస్తాను అన్నది.

చింటూ కోసం కీర్తి బెల్లం దోశ చేసి పెట్టింది. అమ్మకి కూడా ఒక దోశ వేసి ప్లేట్లో పెట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళింది. సోఫాలో కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ అని పిలవగానే శ్రీజ కళ్ళు తెరిచి చూసింది. దోశ తిను అమ్మ అనగానే శ్రీజ నాకొద్దమ్మా అనింది. ప్లీజ్ అమ్మ... అనగానే, శ్రీజ దోశ తీసుకుని తింటూ పిల్లలిద్దరినీ తృప్తిగా చూసుకుంది.

పరమేశ్వరి శ్రీజ తో మాట్లాడుతూ ... మా చెల్లెలు జీవితం ఏమైపోతుందో అర్థం కావడం లేదు అన్నది. శ్రీజ పరమేశ్వరి తో నువ్వు ఒక్కటే కదా మీ అమ్మకు. నీకు చెల్లెలు ఎక్కడ ఉంది అన్నది. పరమేశ్వరి శ్రీజ వైపు చూస్తూ చెల్లెలు అంటే మా చిన్నమ్మ కూతురు రుక్మిణి అదే ఆరోజు మనిద్దరం పెళ్లికి వెళ్ళాం కదా అన్నది.

శ్రీజ ఏమైంది అని అడగగానే... పరమేశ్వరి కళ్ళ నీళ్లతో చెప్పింది... నిన్న మా చెల్లెలు గాజులు నూరుకొని చావడానికి ప్రయత్నించింది. పెళ్లయి పది రోజులు కాలేదు. అతనికి పెళ్లికి ముందే వేరే అమ్మాయితో శారీరక సంబంధం ఉందని తెలిసింది. వాళ్ళిద్దరూ కలిసి మూడు రోజుల నిద్ర కూడా చేయలేదు. పల్లెలో అతను ఎప్పుడూ ఆ అమ్మాయి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. తన అత్తగారు మా చెల్లెలను తిడుతూ మొగుడిని కట్టేసుకోవడం రాదా నీకు. మీ అమ్మ నీకు ఏమీ నేర్పించలేదా అని మా పెద్దమ్మ ను అవమానిస్తూ మాట్లాడుతున్నారు.

రుక్మిణి గర్భసంచిని తొలగించారు నిన్న. మా పెద్దమ్మ ఒకటే ఏడుపు. వాడు ఆ వెధవ అసలు రానే రాలేదు హాస్పిటల్ వైపు .తన అత్తగారు మొక్కుబడిగా వచ్చి ఇంటికి తీసుకుపోండి అని వెళ్ళిపోయింది. పోనీ దూరపు సంబంధం అంటే కాదు. సొంత మేనత్త కొడుకు.

నేను కూడా మాట్లాడదామని ప్రయత్నించాను అతనితో. కానీ అతను నా మాట వినిపించుకోవడం లేదు. ఆ పిల్లతో కాపురం చేయలేను. ఆ పిల్లకు నేను ఏమి నేర్పించలేను అంటున్నాడు. ఎంత సోపు సెక్స్. భార్య అనే ఆలోచన లేదు అతనిలో. మా చెల్లెలు ఏడుస్తూ అతని తో నేను వెళ్ళను అంటూ ఉంది. ఇద్దరూ దీర్ఘంగా ఆలోచిస్తూ తమ తమ పనుల్లో మునిగిపోయారు.

పది పాస్ అయిందో లేదో మా చెల్లెలు, అప్పుడే మా చిన్నాయన తన అక్క అడుగుతోందని, నాకు ఇప్పుడే పెళ్లి వద్దు అని మా చెల్లెలు అంటున్నా వినిపించుకోకుండా బలవంతంగా నేను చెప్పింది చెయ్యి అంటూ పెళ్లి చేశాడు. నేను కూడా నచ్చ చెప్పాలని చూసాను మా చిన్నాయనకి. అప్పుడు ఆయన నా మాట వినలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మ అంటూ ఏడుస్తున్నాడు.

ఇప్పటికైనా బిడ్డ మాటకు విలువీయండి అని నేను మా చిన్నాయనతో ఘాటుగా చెప్పాను. ఇద్దరూ దీర్ఘంగా ఆలోచిస్తూ తమ తమ పనుల్లో మునిగిపోయారు.

శేఖర్ పని ఉన్నట్లు మాథ్స్ డిపార్ట్మెంట్ స్టాఫ్ రూమ్ కొచ్చి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు తిరుగుతూ శ్రీజ దృష్టిలో పడాలని చూసేవాడు. ఆమెతో కావాలని కల్పించుకుని మాట్లాడటం మొదలుపెట్టారు. ఒకసారి మేడం అంటూ నవ్వుతూ ఒక్కొక్కసారి అక్కాయ్ అంటూ ఆమెను కవ్వించాలని చూస్తూ ఉండేవాడు. అతని పిలుపుకి అతని చూపుకి ఎంతో తేడా. ఎందుకో నిద్ర లో కూడా అతని మాటలు ఆమెకు గుర్తుకు రాసాగాయి.

శ్రీజ మీ చెల్లెలు రుక్మిణి ఎలా ఉంది అని పరమేశ్వరిని అడిగింది. పరమేశ్వరి శ్రీజ వైపు చూసి...మేడం మీకు చెప్పనేలేదు కదూ. ఇద్దరూ కలిసి విడాకులు కావాలని అప్లై చేసుకున్నారు. అతను మా చెల్లెలకు భరణంగా నెలకు ఐదువేలు ఇస్తానన్నాడు. రుక్మిణి ఒప్పుకోలేదు. నాకు ఒక్క రూపాయి కూడా వద్దు, విడాకులు కావాలి అంది. మా చిన్నాయన తనకు మళ్ళీ పెళ్లి చేస్తాను అని అన్నా కూడా తను నాకు పెళ్లి అన్నది ఇక వద్దు. నేను మీ ఇద్దరినీ చూసుకుంటాను. నన్ను మీ కొడుకు అనుకోండి. ఇక ఎప్పుడు పెళ్లి మాట తలపెట్టకండి అంది. పూర్తిగా వైరాగ్యం లో మునిగిపోయింది అని విచారంగా అంది. కాలమే నిర్ణయిస్తుంది నువ్వు దిగులుపడకు అని శ్రీజ అంది.

ఆరోజు శ్రీజా కు ఎందుకో కలత నిద్ర. తను నీటిలో కొట్టుకుపోతున్నట్లు గట్టుపైన నిల్చని తమ యూనివర్సిటీ ఫాకల్టీ శేఖరు, జాన్ అబ్రహం , మిత్య, మమత, మాధవి తనను చూసి నవ్వుతున్నట్లు కనిపించింది. శ్రీజ ఉలిక్కిపడి నిద్రలేచింది. తనమీద ఏదో కుట్ర జరుగుతున్నట్లు తోచింది.

ఆరోజు యూనివర్సిటీకి వెళ్ళగానే అప్పుడెప్పుడో అప్లై చేసిన సెమినార్ కి వెళ్లాలని గుర్తొచ్చి సెలవు పెట్టాలని ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళింది.

ప్రిన్సిపల్ ఆమెకి పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఇంకా క్లాసులు కంప్లీట్ చేయాలి. సెమినార్ కి నేను పంపను.

మీ క్లాసులను ఎవరికైనా అప్పగించండి. నేను మీకు పర్మిషన్ ఇవ్వలేను. రేపు రండి అని ఆమెను ఎంతో టైం కూర్చోబెట్టి మిగతా ఫ్యాకల్టీ లకు పర్మిషన్ ఇస్తూ ఆమెకు ఇవ్వకుండా జాప్యం చేశాడు.

ఆమె కోపంగా ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటకు వచ్చి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ప్రిన్సిపల్ నాకెందుకు పర్మిషన్ ఇవ్వలేదు అని అడిగింది. వెళ్లి అదే మాట ప్రిన్సిపల్ ని అడగండి చెప్తాడు అన్నాడు.

శ్రీజ వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఎందుకు నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అడిగింది.మీరు చాలా డామినేట్ అంట కదా. నాకు ఐదు మంది వచ్చి రిపోర్ట్ చేశారు అన్నాడు.

శ్రీజ వెంటనే ఎవరు వాళ్ళు అని అడిగింది. నేను వాళ్ళ పేరు చెప్తే వాళ్ల మీద ఏమన్నా కోపం తీర్చుకుందామనే అని అన్నాడు. నేను ఎలా చెప్పేది నేను అటువంటి దాన్ని కానని. మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారు. నేను ఇదే కాలేజీలో పదేండ్ల నుంచి పనిచేస్తున్నాను అనగానే ప్రిన్సిపాల్ ఆమె వైపు చూస్తూ వాళ్ళ పేర్లు చెప్తూ నా పవర్ మీకు తెలియదు. నీకు ప్రమోషన్ రాకుండా చేయగలను అన్నాడు. శ్రీజ ఇక ఇతను ఏమి వినిపించుకోడు అనుకుని పర్మిషన్ తీసుకోకుండా అతని గదిలో నుండి బయటకు వచ్చింది.

ఈ శేఖర్ తనను ఎందుకు రెచ్చగొడ్తున్నాడు అనుకుంటూ బాధపడింది. అతను అలా ఆమె మదిలోకి మరింత నాటుకుని పోయాడు. ఆమెను భయపెట్టి తన అధీనం లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె మీద పవర్ ప్రయోగించాడు.

స్త్రీ పురుషుల మధ్య పోరాటమంతా పవర్ కోసము లేదా సెక్స్ కోసము. శేఖర్ ఆమెను చూసిన రోజు నుండి లొంగదీయడానికి ఆమె మీద పవర్ ప్రయోగిస్తున్నాడు.

అతను శ్రీజ ను చూసి తప్పుకొని తిరగసాగాడు.ఆమె క్లాస్ కి వెళ్లేటప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు ఆమె వైపు అగ్గ్రెస్సివ్ గా చూస్తూ వెళ్ళసాగాడు.

ఆరోజు ఆమె ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి చెప్పింది... శేఖర్ ప్రవర్తన బాగాలేదు. అతను ఇలాగే చేస్తూ ఉంటే నేను ఉమెన్స్ ఫారం కి వెళ్తాను.

ఒకటి అతనిని మీరైనా కంట్రోల్ చేయండి లేదా నేను అతనిని కంట్రోల్ చేయాల్సి వస్తుంది అన్నది. దానితో అంత వరకు అతను ఆడిన ఆటకు చెక్ పడింది.

మరిన్ని కథలు

Rendu mukhalu
రెండు ముఖాలు
- భానుశ్రీ తిరుమల
Anandame anandam
అందమె ఆనందం
- వెంకటరమణ శర్మ పోడూరి
Maa aayana great
మా ఆయన గ్రేట్
- తాత మోహనకృష్ణ
Iddaroo iddare
ఇద్దరూ ఇద్దరే
- M chitti venkata subba Rao
Teerpu lekundane mugisina vyajyam
తీర్పు లేకుండానే ముగిసిన వ్యాజ్యం
- మద్దూరి నరసింహమూర్తి
Anubhavam nerpina patham
అనుభవం నేర్పిన పాఠం!
- - బోగా పురుషోత్తం
Tappevaridi
తప్పెవరిది
- మద్దూరి నరసింహమూర్తి
Pandaga maamoolu
పండగ మామూలు
- M chitti venkata subba Rao