ధర్మ సూక్ష్మం - BHASKAR CHANDRA

Dharma sookshmam

ఒక వైపు సంకలో బ్యాగు ,చేతిలో ఫైలు.
మరోవైపు, మెట్రో స్టేషన్లో విపరీతమైన రద్దీ. కాలు పెట్ట సందు లేదు. అయినా ముందు వరుసలో నిలబడి ,వడివడిగా ఎక్కి సీటుసంపాదించాలనుకున్నా .అయినా లాభం లేకపోయింది.

ఎడమ పక్క ఉన్న పొడుగాటి పక్క సీట్లలో, వరుసగా అందరూ వయసు పైబడిన వారు కూర్చుని ఉన్నారు , గత్యంతరం లేక పై ఉన్న సపోర్టింగ్ రాడ్డుని పట్టుకుని నిలుచున్నా .పక్కనే ఉన్న సైన్ బోర్డ్ చూశాక అది సీనియర్ సిటిజన్స్ కోచ్ అని అర్థమఇంది . సీనియర్ సిటిజన్స్ కోచ్ లో ఎక్కిన ఇక సీటు దొరికే అవకాశం అయితే లేదు.
ముందు వరుసలో కూర్చొని ఇదంతా గమనిస్తున్న ఒక తను, నా అవస్త చూడలేక తన సీటు నాకూ ఆఫర్ చేసాడు.
చూస్తే అతను నాకంటే వయసులో చిన్న వాడిలా ఉన్నాడు
బహుశా నా రూపం అంటె ,మెరిసిన గడ్డం, బాన పొట్ట, బట్ట తల, కళ్ల జోడు ,పాతకాలం ప్యాంట్ చూసీ నన్ను సీనియర్ అనుకుని ఉంటాడు .

ఏది ఏమైనా, ఇలా వయస్సు పైబడినట్లు కనిపించడం
ఒకందుకు మంచిదే అయ్యింది.

"సీటు ఇచ్చిన అతనికి కృతజ్ఞతగా, మీ బ్యాగు ఇలా ఇవ్వండి, పట్టుకుంటాను "అన్నా

"అవసరం లేదండీ, థాంక్స్ "అని అలాగే నా ముందు నిలుచు న్నారు,

నీటుగా డ్రస్సింగ్, ఖరీదైన వాచీ, ఆ లేదర్ బ్యాగు ,ఆ దర్పం చూస్తుంటే మనోడు ఏదో సీనియర్ పొజిషన్ లో ఉన్నవాడే అని అనిపిస్తుంది ,'ఏముంది చిన్న వయసులో పెద్ద ఉద్యోగాలు సంపాదించిన వారికి చీకా? చింతా?!, మంచి ఏపుగా పెరగక ఏమి చేస్తారు ?!'అని మనసుకి సర్ది చెప్పుకున్నా సరే ఎక్కడో, ఏదో ఒక మూల ఈర్ష్య మనసును పొడుస్తూనే ఉన్నది.
××××××÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷=====//

పది అయినా పరమేశం టీ ఇవ్వడంలేదు.
పరమేశం అంటే మా ఆఫీసు బాయ్. పది పడేస్తే కాని పనులు జరగవు.

అతను ఇచ్చే టీ కన్నా, తెచ్చే సమాచారం ముఖ్యం.
టీతో పాటు నేనడిగిన సమాచారం పేపరు రూపంలో పెట్టి వెళ్లి పోయాడు.

టీ తాగుతూ ఆ పేపర్ వైపు చూశాను.

అమ్మయ్య వయసులో నా కంటె మూడేళ్లు పెద్ద.
చదువు తదితర విషయాలపై ఒక అవగాహన వచ్చింది.

ఏమైనా కొత్త బాస్ ముందు హుందాగ ఉండాలి,ఏమాత్రం ఎక్కడా తగ్గ కూడదు.వయసులో నా కంటే పెద్ద వాడు.
ఇక్కడ వయసులో చిన్న వాడికి ఏస్ బాస్ అనాల్సి వస్తుందో అని కంగారు పడ్డాను.

పరమేశం కాలీ కప్పులు తీస్తు నా దగ్గరకు వచ్చాడు, టేబుల్ పై ఉన్న కప్పు ట్రే లో పెడుతూ, "పెద్ద సారూ మంచి వారనీ, అందరిననీ గౌరవంగా చూస్తారని చెప్పాడు? ఏమైనా మంచి మర్యాదస్తుడు బాబు" అన్నాడు.
అందరూ స్టాఫ్ మెంబెర్స్ వెళ్లి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఒక్క నేను తప్ప,

నాకూ కూడా యెందుకో వెళ్ళి కలిస్తే సరి కదా అనిపించింది. కానీ ఏదో ఈగో అడ్డు వస్తుంది.

వెళ్లి డోర్ నాక్ చేసి లోనికి వెళ్లాను. సర్ప్రైజ్ లోన ఉన్నది ఎవరో కాదు. ఇంతకు ముందు నాకూ మెట్రో లో సీటు ఇచ్చినతనే !!

నన్ను చూసి అతను కూడా ఆశ్చర్యానికి లోనై, పరిచయాలు గట్రా అయిన తరువాత, ఆనందంతో అతని అంటే ఒక సదభిప్రాయం ఏర్పడింది.

"సరిగ్గా ఒక వారం తరువాత, తాను నన్ను క్యాబిన్ లోకి పిలిచి సౌత్ హెడ్ నియామకం ఎందుకు ఆలస్యం అవుతోందని" అడిగాడు

నా దగ్గర ఉన్న ప్రోఫైల్, ఇంటర్వూ డిటైల్స్ , పై ఆఫీసర్స్ కామెంట్స్ అన్నీ టేబుల్ ఫామ్ లో వేసి అతని ముందు పెట్టాను.

అతని కళ్లు సరిగ్గా నేను అనుకున్న కాండిడేట్ దగ్గరనే ఆగాయి.
అతని గురించే అడిగాడు. "ఆతడు అన్నీ విదాలా యోగ్యుడైనప్పుడు,ఇక అపాయింట్ మెంట్ కి యెందుకు ఆలస్యం" అని వాకబు చేశాడు.
"సార్, అన్నీ ఒకే కాని, అతనికి వయసు ఎక్కువ. ఇదేమో సేల్స్ జాబ్, నెలకు 15 రోజులు బయట వుండాలి.అంతే గాక మిగతా రోజుల్లో మార్కెట్లో తిరిగీ క్లయింట్స్ ని విరివిగా కలవాల్సి ఉంటుంది. ఈ వయసులో అతడు ఇంత శ్రమ పడగలడా" అని నా అభిప్రాయం వ్యక్తపరిచా.

"అతనికి ఉద్యోగం కూడా చాలా అవసరం ఉన్నట్లుందీ,ఇదిగో చూడండి అతను ఉద్యోగం కోసం ఫాలో అప్ చేస్తూ రాసిన ఉత్తరాలు"అంటూ ఫైల్ చేసి ఉంచిన మెయిల్ హార్డ్ కాపీస్ చూపించా.

"వయసు అతని శరీరానికే కావచ్చు, మనసుకీ కాక పోవచ్చు కదా?!!"
"అవసరం ఉన్న వారికి ఉద్యోగం ఇవ్వడమే ధర్మం.
కొన్ని సందర్భాలలో అవసరాలను గ్రహించి అర్హతను జోడించాలి" అన్నాడు అతను.

అతని మాటల్లో నిజం ఉంది.అతను తీసుకునే నిర్ణయంలో స్పష్టత ఉంది
ఆనాడు, మెట్రోలో నాకు సీటు ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చింది.వయసులో పెద్ద వారిగా కనిపించి నందుకు కాదు, తానూ నాకు సీటు ఇచ్చింది.నే పడుతున్న అవస్థను చూసి నన్ను అర్హున్ని చేసి,నాకు సీటు ఇచ్చాడు.

ఇక్కడ ,ఇప్పుడు అదే రూలు పాటించి నట్లున్నాడు.

మొత్తమ్మీద ఏదో ధర్మ సూక్ష్మం బోద పడినట్టు, నా సీట్లోకి వచ్చి ఆ అభ్యర్ధికి అపాయింట్ మెంట్ లెటర్ పంపించేందుకు సిఫారసు పంపాను.
'నా వయసుని మించి శరీరం పెరిగింది కానీ,బుర్ర మాత్రం పెరగలేదని ,నేను ఇంకా బాగా ఎదగాలని'మొదటి సారిగా అనిపించింది.

+++సమాప్తం+++

మరిన్ని కథలు

Sagatu manishi andolana & aswasana
సగటు మనిషి ఆందోళన & ఆశ్వాసన
- మద్దూరి నరసింహమూర్తి
Evarini Chesukovali
ఎవరిని చేసుకోవాలి?
- తాత మోహనకృష్ణ
Mana oudaryam
మన ఔదార్యం
- సిహెచ్. వెంకట సత్య సాయి పుల్లంరాజు
Swardha poorita pani
స్వార్ధపూరిత పని
- మద్దూరి నరసింహమూర్తి
Ratee manmadhulu
రతీ మన్మథులు
- కందుల నాగేశ్వరరావు
Aparichitudu
అపరిచితుడు
- మద్దూరి నరసింహమూర్తి