సూక్ష్మం - ఐసున్ ఫిన్

Sookshmam

(టైం 6 అయింది. వర్షం పడటం తో కరెంటు పోయింది. బయట చీకటి లేదు కానీ ఇంట్లో వెలుగు లేదు. అమ్మ, నాన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు ఇంట్లో ఆర్య ఒక్కడే ఉన్నాడు. కిటికి పక్కన కూర్చుని చదువుతున్నాడు. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది)

అమ్మ వచ్చేసిందేమో. వర్షం పడుతుందిగా తుడుచుకుంటూ వచ్చిందా?

(డోర్ ఓపెన్ చేసి చూడగా, వాచ్మాన్ కూతురు ఉంది)

అన్న, వర్షానికి చెట్టు కొమ్మ కరెంటు పోల్ మీద పడి కరెంటు పోయిందంట. వర్షం తగ్గాక, బాగు చేసిన తర్వాతే కరెంటు వస్తుంది అని నాన్న చెప్పమన్నారు.

సరే లహరి. థాంక్యూ.

(తను వెళ్ళిపోతుంది. డోర్ వేసి మళ్ళీ కిటికీ దెగ్గరికి వస్తాడు ఆర్య. వర్షం ఇంకా గట్టిగ కురుస్తుంది. మెల్లమెల్లగా చీకటి పడుతుంది)

ఇప్పుడు అమ్మ ఎలా వస్తుందో? ఎక్కడ ఉందో?

(అని కాల్ చేస్తాడు ఆర్య)

హలో, అమ్మ. ఎక్కడున్నావ్? ఇక్కడ వర్షం బాగా పడుతుంది.

అవును, ఇక్కడ కూడా. అందుకే ఇంకా ఆఫీస్ లోనే ఉన్న. రైన్ కోట్ ఉంది కానీ ఇంత వర్షం లో బండి ఎలా నడుపుకుని రాను. తగ్గాక బయల్దేరతాను.

సరే అమ్మ. జాగ్రత్త.

(ఇల్లంతా చాలా చీకటిగా ఉంది. ఫోన్ లో చదువుకుంటున్నాడు. మెరుపులు, ఉరుములతో చిన్న శబ్దాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతలో అరవింద్ కాల్ చేస్తాడు)

ఆర్య, ఎం చేస్తున్నావ్?

ఎల్లుండి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను.

ఇంత వాన కురుస్తుంటే, ఎలా చదువుతున్నావు. కరెంటు ఉందా?

మాకు కరెంటు పోయింది. ఫోన్ లో చదువుతున్నాను.

ఎందుకు రా అంత డెడికేషన్. కొంచెం సేపు పక్కన పెడితే సరిపోతుందిగా.

అలా పెట్టె ఎల్లుండి ఎగ్జామ్ కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను.

ఎం అవుద్ది ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్. ఈ ఇయర్ కాకాపోతే నెక్స్ట్ ఇయర్.

నీకు చెప్పడానికి బానే ఉంటుంది అరవింద్. మీ ఫామిలీ బిజినెస్ చూసుకుంటావ్.

ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామని ఎప్పటి నుంచో చెప్తున్నాను. నువ్వే గవర్నమెంట్ జాబ్ ఏ కావాలి అని మొండి పట్టు తో ఉన్నావు.

సరే రా. నువ్వు మల్లి మోదలుపెట్టకు.

(కొంచెం సేపు తర్వాత వర్షం తగ్గుతుంది. కరెంటు కూడా వస్తుంది. అమ్మ, నాన్న ఇద్దరు ఇంటికి వస్తారు)

ఎంత సేపు, ఎప్పుడూ అలా చదువుతూ ఉంటావ్ అర్జున్. రా, బిర్యానీ తిందాం.

ఎక్కడ అమ్మ, ఎప్పుడు చదువుతుంది. అలా చదివి ఉంటె, ఎప్పుడో ఉద్యోగం వచ్చేది.

ఎదో పెద్దది రాసి పెట్టుంది రా. అందుకే ఈ చిన్న చిన్నవి రావట్లేదు.

చాలు అమ్మ. వస్తున్న పద.

(తిన్నాక)

ఆర్య, రేపు మనం నా ఫ్రెండ్ కూతురి పెళ్లి కి వెళ్ళాలి. నీకు ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను, అమ్మ వెళ్లొస్తాం. అది రాత్రి కాబట్టి మేము నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాం.

సరే నాన్న.

( ఈవెనింగ్ ఆర్య వాళ్ళ అమ్మ, నాన్న లు పెళ్లి కి వెళ్తున్నారు)

నాన్న, మన కార్ ఏ తీసుకువెళ్ళొచ్చుగా. ఎందుకు ఈ క్యాబ్?

అంత దూరం డ్రైవ్ చేసుకుంటూ ఇప్పుడు వెళ్లొచ్చు కానీ రేపు మార్నింగ్ కి వచ్చే సరికి టైర్డ్ అయిపోతాం. ఆఫీస్ కి వెళ్ళాలిగా. నువ్వు వస్తే, నడిపేవాడివి.

అవును నిజమే నాన్న.

రేయ్, నీ ఫ్రెండ్ అరవింద్ ని రమ్మనురా, తోడుగా ఉంటాడుగా.

ఎందుకు అమ్మ. నేను ఉంటాను.

మార్నింగ్ అంటే ఉంటావు. నైట్ అంటే బయపడతావుగా.

బయమేస్తే అప్పుడు రమ్మంటానులే.

లేట్ అవుతుంది గంగ.

సరే రా, వెళ్ళొస్తాము.

(అని ఇద్దరు వెళ్ళిపోయాక, ఆర్య ఒక్కడే ఇంట్లో ఉంటాడు. అన్నం తినేసి, చదువుతూ ఉంటాడు. బయట నుంచి గాలి వస్తుంది, చలేస్తుందని కిటికీ తలుపు వేస్తాడు. ఇల్లంతా నిశ్శబ్డంగా ఉంది. తలుపు తెరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వెళ్ళి చూడగా అది అరవింద్)

ఏంట్రా? చెప్పకుండా అలా వచ్చేసావు. కొంచెం సేపైతే గుండె ఆగిపోయేది.

నువ్ ఒంటరిగా ఉన్నావని ఆంటీ తోడుగా ఉండమని నాకు చెప్పారురా.

అయినా, వచ్చే ముందు కాల్ చేయొచ్చుగా.

ఏమైంది ఇప్పుడు. వచ్చెసాగా. నువ్ బయపడకు.

నేను చదువుకోవాలి రా.

చదువుకో నేనేం చేసాను.

నువ్వుంటే నేను చదువుకోగలనా?

సరే అయితే, వెళ్ళిపోమంటావా? అసలు ఎందుకు రా నీకు ఇంత భయం? మార్నింగ్ బానే ఉంటావ్. నైట్ అయితే చాలు నీ మొహం మారిపోతది.

అలా ఎం లేదు రా.

నిజం చెప్పు ఆర్య, ఫేర్వెల్ రోజు కూడా అంతే. ఉండమంటే లేదు అమ్మ కాల్ చేసింది, రమ్మంది అని చెప్పి వెళ్లిపోయావ్ కానీ ఆంటీని అడిగితే అదేం లేదు, వాడికి చీకటంటే భయం, ఒక్కడే నైట్ ఇంటికి రాలేడు అని చెప్పారు.

వదిలేయ్, ఇప్పుడదంతా ఎందుకు? ఎం చేద్దామో చెప్పు. తాగడానికి తెచ్చావా? లేకపోతే సినిమా చూద్దామా?

తాగడానికే తెచ్చా. బయట పెట్టా.

ఎందుకు లోపలికి తేవాల్సిందిగా.

మల్లి నీ చదువు నేను చెడగొట్టానంటావుగా. నువ్వు అడిగితే తెద్దామ్ అని.

సరే నేనే చెప్తున్నా. తాగుదాం అరవింద్.

(సగం బాటిల్ కంప్లీట్ అయ్యాక)

ఆర్య, ఒక నిజం చెప్తావా?

ఏంట్రా?

నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదా?

నీకు తెలుసుగా లేదని. అయినా నేను ఎవరితోనైనా మాట్లాడతానా? మాట్లాడిన ఏదో సబ్జెక్టు గురించే అయుంటది.

అందుకే నిజం చెప్తావా అని అడిగా. సోది కాదు.

లేదు అరవింద్ నిజంగా ఎవరు లేరు.

వేరీ గుడ్. ఇంకో నిజం చెప్పాలి ఇలాగే.

ఏంటి?

ఎందుకు రా మనిద్దరం బిజినెస్ చేదాం అంటే వద్దంటావు?

ఎప్పుడు అదే ఎందుకు అడుగుతావు అరవింద్?

నువ్వు ఒక్కసారి ఆన్సర్ చెప్తే నేను మల్లి అడుగుతానా ఏంటి?

సరే చెప్తాను. ఇప్పుడు మా నాన్న గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు కానీ అంతక ముందు ఒక ఫ్యాక్టరీ లో పార్టనర్ గా ఉండేవారు. ఆ ఫ్యాక్టరీ ఓనర్ మా నాన్న కి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఒకరోజు అక్కడ ఒక వర్కర్ చేయి మెషిన్ లో పడి చేయి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మా నాన్న అతనకి కావాల్సినవన్నీ దెగ్గర ఉండి చూసుకున్నారు. నయం అయ్యాక, ఆయన ఇకపై ఆ ఒక్క చేయి తో కుటుంబాన్ని ఎలా పోషిస్తారు, మీరే ఏదోక పని ఇప్పించండి అని ఆ వర్కర్ వైఫ్ ఫ్యాక్టరీ కి వచ్చి గొడవ చేసింది. అప్పుడు నాన్న అతనకి లోడ్ కౌంట్ చేసి బుక్ లో అప్డేట్ చేసి, ప్రతిదీ లెక్క చెప్పమని చెప్పారు. అలా ఒకసారి రాత్రి అతను అంత కౌంట్ చేస్తుండగా, ఫ్యాక్టరీ లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వర్కర్ వైఫ్ వచ్చి మా ఆయన కనిపించట్లేదు అని చెప్పింది. నిన్న రాత్రి, మీ ఆయన ఫోన్ చేసాడు, లోడ్ కౌంట్ చెప్పాడు, ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయాడనుకున్నాను అని నాన్న అన్నారు. అప్పుడు ఆ ఫ్యాక్టరీ ఓనర్ పిలిచి, ఆ వర్కర్ ఉన్నట్టు తెలీదు, ఫ్యాక్టరీ ని కావాలని నేనే తగలబెట్టాను. ఇప్పటి వరకు మనమెంతో పెట్టాము, ఎంతో కష్టపడుతున్నాము కానీ అన్ని అడ్డంకులే. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేము. ఇలా తగలపడితే ఇన్సూరెన్సు డబ్బులు వస్తాయి. అందరికి జీతాలిచ్చేసి, మనం ఇంకో బిజినెస్ చేద్దామనుకున్నాను. ఇదంతా ఆవిడకి ఎలా చెప్పగలం, ఇది నా తప్పే అని అన్నారు. కానీ నాన్న ఇదంతా పోలీస్లు కి చెప్పారు. ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీ ఓనర్ కి జీవిత కారాగార శిక్ష పడింది. దానికి ఇప్పటికి మా నాన్న చాలా బాధపడుతున్నారు. ఇది అరవింద్ జరిగింది.

ఇంత నెగటివ్ గా ఆలోచిస్తున్నావు ఏంట్రా, ఆర్య? ఇప్పుడు మనము బిజినెస్ పెడితే ఇలా జరుగుతుందని అనుకుంటున్నావా?

లేదు అరవింద్, కానీ మా నాన్న రోజు బాధపడటం వల్ల ఆ బిజినెస్ అనే ఆలోచనే చాలా దారుణంగా అనిపిస్తుంది. నాకు, ఈ బిజినెస్ కి సెట్ అవ్వదు. రిస్క్ అంత మన చేతుల్లోనే ఉంటుంది.

ప్రాఫిట్స్ కూడా మన చేతుల్లోనే ఉంటాయి రా. మనం ఒకరి కింద పని చేయాల్సిన అవసరమే ఉండదు. అయినా నేను లాస్ వచ్చేలా చేయనురా. అప్పట్లో వాళ్లకి ఎం తెలీదు. ఇప్పుడంటే మనం అంత ఫుల్ అప్డేటెడ్ కదా. దేశాన్ని రూల్ చేసేదే బిజినెస్ పీపుల్.

నువ్వు ఎంత చెప్పిన, నేను మారను రా. సమాధానం చెప్తే మల్లి అడగను అని అన్నావుగా.

సరే ఇంకా ఈ టాపిక్ వదిలేద్దాము. ఇంకో ఆఖరి ప్రశ్న.

నాకు నిద్రొస్తుంది రా. అయినా అన్ని నువ్వే అడుగుతావా? నేను కూడా అడగాలి గా.

సరే అడుగు. నేనెప్పుడూ నిజమే చెప్తా. అయినా నీ దెగ్గర నేను దాచినవి ఎం ఉన్నాయని.

ఇంత బోరింగ్ గా ఉన్న నాతో ఎలా రా ఫ్రెండ్ అయ్యావ్. క్లాస్ లో నువ్వు తప్ప ఎవరు నాతో మాట్లడరు. మాట్లాడిన ఎగ్జామ్స్ అప్పుడే. నువ్వు మాత్రం నేను నీకు కాల్ చేయకపోయినా చేస్తావు. ఇప్పుడు నాతో ఇంట్లో ఉన్నావు. ఎందుకు అరవింద్?

తెలీదు రా. నేను నీకు కంప్లీట్ ఒప్పొసిట్ కదా. ఒప్పొసిట్స్ అట్ట్రాక్ట్ ఈచ్ అథెర్. అంతే నువ్వు నాకు ఇష్టం రా. నీతో మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటుంది. కానీ నీ గురించి నాకు అన్ని తెలియవు. ఎప్పుడు కొత్తగా కనిపిస్తుంటావు. నీ ఆలోచనలు నేను అంచనానే వేయలేను. నీ గురించి తెలుసుకోవాలనే ఆలోచనలతో నిన్ను వదలటం లేదేమో. ఒకవేళ తెలిస్తే..

(అంటూ అరవింద్ నిద్రలోకి జారుకుంటాడు. అరవింద్ పక్కనే ఆర్య కూడా పడుకుని)

నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టమేమో. అయినా ఫ్రెండ్ అనే మాటకే నేను సరిపోను.

(అని ఆర్య కూడా నిద్రపోతాడు. తర్వాత రోజు మార్నింగ్ ఆర్య వాళ్ళ అమ్మ, నాన్న ఇంటికి వస్తారు. ముందుగా అమ్మ తలుపు తెరుస్తుంది)

అసలు వీళ్ళని ఎం చేయాలి? ఎగ్జామ్ ఉంది ప్రిపేర్ అవుతాడనుకుంటే తాగి పడుకున్నాడు. కనీసం బాటిల్స్ అయినా దాపెట్టాలి కదా.

(అప్పుడు అరవింద్ నిద్ర లేస్తాడు)

ఆంటీ, మీరు అప్పుడే వచ్చేశారేంటి?

నీకు టైం తెలియట్లేదు అరవింద్. మేము కరెక్ట్ గానే వచ్చాము. అంకుల్ వస్తే వాడ్ని మాములుగా తిట్టరు. ముందు వాడ్ని లేపు.

ఆంటీ, వాడిని ఎం అనకండి. నేనే రాత్రంతా మాట్లాడుతూ కూర్చున్న. వాడి టైమింగ్ తెలుసు తొమ్మిదింటికే నిద్రపోతాడు. నా వల్ల లేట్ అయ్యింది.

(అంటూ బాటిల్స్ సద్దేస్తాడు అరవింద్. అప్పుడే నాన్న కూడా వస్తాడు)

ఏంటి అరవింద్ నైట్ అంత ఆర్య చదువుతూ ఉన్నాడా? ఇంకా నిద్ర లేవలేదు.

అవును అంకుల్. ఎలా జరిగింది పెళ్ళి? మీకు నిద్ర సరిపోయిందా?

ఆ బానే జరిగింది. ఆఫీస్ ఉందిగా త్వరగా వచ్చేసాం. కార్ లో నిద్ర కొంచెం సేపు పట్టింది. నేను రెడీ అవ్వాలి అరవింద్, ఆంటీ తో మాట్లాడుతూ ఉండు.

(అని లోపలకి వెళ్తారు)

నీతో మాట్లాడటం నా వల్ల కూడా కాదు అరవింద్. అసలు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటావు. ఆ బాటిల్స్ ని పడేసి రా. టిఫిన్ చేస్తా, ఇంటికి వెళ్ళిపోకు.

సరే ఆంటీ.

(అరవింద్ పడేసి వచ్చేసరికి, ఆర్య నిద్ర లేస్తాడు)

ఏంటి ఆర్య, తలపట్టుకున్నావ్?

తల నొప్పొస్తుంది రా. నిన్న బాగా ఎక్కువ తాగించావనుకుంటా.

అవును, మరి నేను తాపించడానికి నువ్వు చిన్న పిల్లాడివి. నేను తాపిస్తేనే నువ్వు తాగావా?

(లోపల నుంచి అమ్మ వస్తుంది)

అమ్మ, మీరెప్పుడు వచ్చారు?

మీరు తాగి నిద్రపోతున్నప్పుడు.

నాన్న కూడా చూసారా?

లేదులే. కానీ ఇలా తాగుతాం అని ముందే చెప్పుంటే కాల్ చేసేదాన్ని. అయినా నువ్ కాల్ చేయవు. అరవింద్ నువ్వైనా చెప్పాల్సింది.

సోరి ఆంటీ మర్చిపోయాను. అయినా ఇప్పుడు అంకుల్ కి ఎం తెలియలేదుగా.

నేను రెడీ అవ్వాలి, ఎగ్జామ్ కి వెళ్ళాలి, అసలకే చాలా టైం అయిపోయింది. ఇప్పుడు ఎం రాస్తానో కూడా తెలీదు.

ఎందుకు రా కంగారు పడతావు. ఎగ్జామ్ పదికి అయితే వీడు ఎనిమిదింటికి అక్కడికి వెళ్లి కూర్చుంటాడు ఆంటీ.

తెలిసిందే గా. ఇంట్లో కూడా అంత టైం కి జరగాలని అంటాడు.

(ఆర్య రెడీ అవుతుంటాడు)

ఆంటీ, మిమ్మల్ని ఒకటి అడగాలి.

చెప్పు అరవింద్.

ఆర్య కి నైట్ అంటే ఎందుకంత భయం?

నార్మల్ గానే అరవింద్. ఒంటరిగా ఉండలేదు. ఎప్పుడు తనతో వాళ్ళ అన్నయ్య ఉండేవాడు.

ఆర్య కి అన్నయ్య ఉన్నాడా? నాతో తను ఒక్కడే అని చెప్పాడు, ఆంటీ.

ఆకాష్ చనిపోయి ఏడేళ్లు అవుతుంది అరవింద్.

కానీ అసలు అన్నయ్య ఉండేవాడని కూడా చెప్పలేదేంటి ఆంటీ, వాడు?

నీకు తెలుసు కదా, ఆర్య ఎవరితో ఎక్కువగా మాట్లాడు. ఏ విషయం కూడా బయటకి చెప్పడు. ఆకాష్ ఉన్నప్పుడు, చాలా సంతోషంగా ఉండేవాడు. ఆక్టివ్ గా ఉండేవాడు. ఆ తర్వాత నుంచి ఆర్య చాలా మారిపోయాడు.

పక్కనవారితో పంచునుకుంటేనేగా బాధ పోతుంది. తనలోనే ఉంచుకుంటే ఎప్పుడు అలానే ఉంటాడు, ఆంటీ.

మేము చాలా చెప్పి చూసాము, అరవింద్. కానీ ఆర్య మారలేదు. నువ్వు ఉన్నప్పుడు, ఆర్య నార్మల్ గా అనిపిస్తాడు.

నేను ఇంకా ఇంట్రోవెర్ట్ అంటే ఇంతేనేమో అని అనుకున్నాను. డిప్రెషన్ లో ఉన్నాడా ఆంటీ, వాడు? డాక్టర్ దెగ్గరికి తీసుకు వెళ్ళారా?

అలా అంటే కోపం వచ్చేసిద్ధి. డాక్టర్ దెగ్గరకు తీసుకెళ్లడానికి చాలా సార్లు ట్రై చేసాం కానీ రాలేదు. ఎప్పుడు రాత్రి ఒంటరిగా ఉండలేదు.

(ఆర్య వస్తాడు)

ఏంటమ్మా ఇంకా టిఫిన్ అవ్వలేదా?

అయిపోయింది. ఇదిగో పెడుతున్న, కూర్చోండి.

(నాన్న కూడా వచ్చేస్తాడు. ఆర్య కంగారు పడుతూ ఉంటాడు)

మెల్లగా తిను, బాగా రాస్తావు లే.

చూద్దాము నాన్న.

అరవింద్, నువ్వేం చేస్తున్నావు?

ఎం లేదు అంకుల్, ఎం.బీ.ఏ చేద్దాము అని అనుకుంటున్నాను.

ఏంట్రా, నాకు చెప్పలేదు.

ఇప్పుడే అనుకున్నాను లే రా.

ఆల్ ది బెస్ట్, అరవింద్.

థాంక్యూ అంకుల్.

(తినేసాక, ఆర్య ఎగ్జామ్ కి, నాన్న ఆఫీస్ కి, అరవింద్ ఇంటికి వెళ్ళిపోతారు)

ఎగ్జామ్ అయిపోయాక అరవింద్ కాల్ చేస్తాడు

ఎలా రాసావ్ ఆర్య?

పర్లేదు. ఇంకా ప్రిపేర్ అయ్యి ఉంటె బాగా రాసేవాడిని.

నీకు వస్తది రా. నెక్స్ట్ ఏంటి?

ఏముంది, ఇంకో ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి.

ఒకటే ఫోకస్ చేయొచ్చు కదా.

అన్ని బాణాలు వేస్తేనేగా, ఏదొక దానికి తగులుద్ది.

సరే రా. నీకు క్లారిటీ ఉందిగా.

అవును, నువ్వు నిజంగానే ఎం.బి.ఏ చేస్తావా?

నువ్వే కదా రా, పెద్ద స్టోరీ చెప్పి బయపెట్టావ్. బిజినెస్ పెట్టాలంటే అదే గా చేయాలి. నాన్న ని కూడా అడిగాను. సరే చేయి అని అన్నారు.

సూపర్ రా. ఆల్ ది బెస్ట్ అయితే.

(ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది. ఆర్య సెలెక్ట్ అవుతాడు. ఇంటర్వ్యూ కి ఢిల్లీ వెళ్ళాలి)

ఆర్య, నువ్వు జాబ్ అంటున్నావు కానీ ఇప్పటి దాకా ఒంటరిగానే ఉండలేకపోతున్నావు. ఇప్పుడు ఇంటర్వ్యూ కి ఎలా వెళ్తావు? ఒక్కడివే అక్కడ ఎలా ఉంటావు.

దేనికైనా ఒక స్టార్టింగ్ ఉంటుంది అలాగే ఎండింగ్ కూడా ఉంటుంది. నేను ఒంటరిగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. ఒక్కడినే వెళ్తాను. ఒక్కడినే ఉంటాను.

నువ్వు మారితే మాకు కూడా సంతోషమే.

(నాన్న వస్తారు)

ఎప్పుడు బయల్దేరుతున్నావ్ ఆర్య?

ఈరోజు నైట్ ఏ నాన్న.

సరే, అల్ ది బెస్ట్. ధైర్యంగా ఉండు.

థాంక్యూ నాన్న.

(ఆర్య ట్రైన్ ఎక్కి తన సీట్ నెంబర్ వెతుక్కుని కూర్చుంటాడు. తన కాళ్ళు వణుకుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన సీట్ కి అటు ఇటు ఇంకా ఎవరు రాలేదు. చెవులో ఇయర్ పాడ్స్ పెట్టుకుని పాటలు విందామని అనుకుంటాడు. అప్పుడే ఒక ముసలాయన వస్తారు)

బాబు, ఈ టికెట్ లో ఉన్న సీట్, ఇది ఒకటేనా?

(ఆర్య చూసి)

అవును సర్. ఇదే. మీది అప్పర్ బెర్త్ కానీ మీరు పైకి ఎక్కలేరు కాబట్టి ఇక్కడ పడుకోండి. నేను పైన బెర్త్ తో పడుకుంటాను.

థాంక్యూ బాబు.

(ఆర్య, పాడుకోటానికి ఎంత ట్రై చేసిన నిద్ర రాదూ. పాటలన్ని అయిపోయి మల్లి రిపీట్ అవుతున్నాయి. తల తిరుగుతున్నట్టు, గుండె భారంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడే ఆర్య అంటూ ఒక గొంతు వినిపిస్తుంది. లేచి చూడగా టీ.సి)

మీ సీట్ నెంబర్ ఎంత?

సర్, నాది కిందది కానీ అక్కడ ఈ నెంబర్ ఒక ముసలాయనది, పైకి ఎక్కలేరని షిఫ్ట్ అయ్యాము.

కానీ కింద ఎవరు లేరే?

ఏంటి లేరా?

ముందు టికెట్ చూపించు.

(ఆర్య కి భయమేస్తుంది. చేయి వణుకుతుంది. టికెట్ చూపిస్తాడు)

నీది కింద సీట్. అక్కడే పడుకో.

సరే సర్.

(ఆర్య కి ఏమి అర్ధం కావట్లేదు. టైం 11 అయ్యింది. వాటర్ తాగుతాడు. అంత సైలెంట్ గా ఉంది. లైట్లు అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. ఫోన్ ఆన్ చేస్తే ఆ లైట్ ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడే అరవింద్ కాల్ చేస్తాడు)

ఆర్య, ముందే చెప్పుండాల్సింది కదా. నేను వచ్చే వాడిని. నువ్వు ఒక్కడివే ఉన్నావా ఏంటి?

ఎప్పుడైనా ఒంటరిగా వెళ్లాల్సిందేగా. జీవితాంతం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు రాలేవుగా.

అవును, కానీ ఇప్పుడు అవకాశం ఉన్న కూడా ఎందుకు ఇలా చేసావ్? ఆంటీ ఏమో, నువ్ ఇంకా ఆన్లైన్ లో నే ఉండటం చూసి పడుకోలేదు అని తెలుసుకుని నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యావ్ అని, ఢిల్లీ వెళ్తున్నావ్ అని. నాకు, నువ్వు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకు, ఆర్య?

ఎందుకు నీకు ఇబ్బంది అరవింద్. నేను బానే ఉన్నాను అని అబద్దం చెప్పలేను కానీ ఇది నాకు నేను పెట్టుకుంటున్న పరీక్ష. ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ అసలు ఫస్ట్ స్టేజి ఏ క్వాలిఫై అవ్వలేదు కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ దాకా వచ్చాను. ఈ జాబ్ ఎలాగైనా రావాలి అరవింద్. లేకపోతే ఇక నేను ఏది చేయలేనేమో అనిపిస్తుంది.

ఎందుకు రా, ఎప్పుడు నెగటివ్ గానే ఆలోచిస్తావు. నువ్వనుకున్నది జరుగుద్ది. బయపడకు, నేను నీతో పక్కన లేకపోయినా ఈ ఫోన్ లో నీతో మార్నింగ్ వరకు మాట్లాడుతూనే ఉంటాను.

అది సాధ్యమే కాదు.

అయితే నువ్వు నిద్రపోయే వరకు మాట్లాడతాను.

ఎందుకు అరవింద్.

సరే మామూలుగానే మాట్లాడుకుందాం.

(అలా కొంచెం సేపటికే ఆర్య నిద్రపోతాడు. అరవింద్ కాల్ కట్ చేస్తాడు. మార్నింగ్ లేవగానే ఆర్య, అరవింద్ కి మెసేజ్ పెడతాడు)

థాంక్యూ అరవింద్. ఇది ఒక్కదానికి కాదు, నువ్వు నాతో ఉన్న ప్రతి ఒక్క నిమిషానికి. నీకు తెలియకపోవచ్చు నువ్వు చేసిన హెల్ప్ నాకు ఎంత గొప్పదో కానీ నేను నీకు ఇది ఒక్క థాంక్యూ తో చెప్పే విషయం కాదు. చెప్పటానికి నా దెగ్గర మాటలు కూడా లేవు.

(ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చిన తర్వాత, ఫస్ట్ టైం ఆర్య, అరవింద్ కి కాల్ చేస్తాడు. కానీ అరవింద్ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆర్య రిటర్న్ ట్రైన్ లో ఇంటికి బయల్దేరతాడు. అమ్మ కాల్ చేస్తుంది)

ఎలా జరిగింది ఇంటర్వ్యూ?

బానే జరిగింది అమ్మ. ఈజీ గానే అనిపించింది. కానీ నాకు వస్తుందో రాదో అనే భయమేస్తుంది.

నీకు వస్తుంది ఆర్య. నిన్న రాత్రంతా మేల్కొనే ఉన్నావా?

లేదు, నువ్వు అరవింద్ కి చెప్పావుగా, వాడు కాల్ చేసాడు. అలా మాట్లాడుతూ నిద్రపోయాను. ఇంటర్వ్యూ అయ్యాక కాల్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. పొద్దున్న ఒక మెసేజ్ కూడ పెట్ట అది కూడా చూడలేదు.

అరవింద్ చాలా మంచివాడు ఆర్య. నువ్వెందుకు తనని దూరం పెడుతూవుంటావు?

దెగ్గరైపోతే నేను మళ్ళీ దూరం పెట్టలేనుగా అమ్మ. అయినా ఇప్పుడు బానే ఉన్నాముగా. ఇలానే ఉంటాను.

ఫ్రెండ్స్ తో అన్ని షేర్ చేసుకుంటారు ఆర్య. నువ్వు అన్ని నీ దెగ్గర ఉంచుకుంటే ఎలా?

తెలీదు అమ్మ. ఇంకా నాకు టైం పడుతుందేమో. కానీ అరవింద్ నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ.

(అరవింద్ కాల్ చేస్తాడు)

అమ్మ, అరవింద్ కాల్ చేస్తున్నాడు.

(అని చెప్పి ఫోన్ పెట్టేసి, అరవింద్ తో మాట్లాడతాడు)

ఏంట్రా ఆర్య, ఫస్ట్ టైం నువ్వు నాకు కాల్ చేసావని చూసే నాకు అసలేం అర్ధం కాలేదు. ఇంకా ఆ మెసేజ్ చూసాక నువ్వేనా అని అనిపించింది. ఏమైంది?

ఎం లేదు, నిన్న నాకు తోడుగా ఉన్నావుగా అందుకే పెట్టాను. ఇంటర్వ్యూ ఈజీ గానే ఉంది కానీ వస్తదో రాదో అని డౌట్ గా ఉంది అని, అంతే ఇది చెపుదామనే కాల్ చేసాను.

కచ్చితంగా రిజల్ట్ లో నీ పేరు ఉంటది ఆర్య. అప్పుడు పార్టీ ఇవ్వటం మాత్రం మర్చిపోకు. ఇంకేమైనా చెప్పాలా ఆర్య?

లేదు అరవింద్. ఉంటాను.

(అని ఫోన్ కట్ చేస్తాడు ఆర్య. ఇంటికి వచ్చాక ఆ ట్రైన్ లో ముసలాయన్ని ఎక్కడో చూసినట్టనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది. ఆర్య సెలెక్ట్ అవుతాడు. అరవింద్ కి చెప్తాడు)

కంగ్రాట్స్ ఆర్య. రేయ్ ఇప్పటి వరకు నువ్ ఏ పోస్ట్ కి రాసావో కూడా నాకు తెలీదు. అసలు ఎం పోస్ట్ రా?

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో సైంటిస్ట్ బి పోస్ట్.

అంటే ఎం చేస్తారు?

రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మానేజ్మెంట్, టెక్నికల్ సపోర్ట్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, పాలసీ అండ్ ప్లానింగ్.

చాలు రా. ఈ బి టెక్ వి అన్ని మన వాళ్ళ కాకే ఈ ఎం.బి.ఏ వైపు వచ్చాను. శాలరీ ఎంత?

లెవెల్ టెన్. బేసిక్ పే 56,100. అలవెన్సులు అన్ని కలిపి నెలకి ఒక 80,000 అలా వస్తాయి.

సూపర్ రా. సాదించావు గా. పోస్టింగ్ ఎక్కడ?

ఢిల్లీ లో నే.

ఎప్పుడు బయల్దేరుతున్నావ్?

ఫైవ్ డేస్ లో.

ఈ ఐదు రోజులు మనం ట్రిప్ కి వెళ్దాము రా.

ఓకే ఎక్కడికి?

గోవా. ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాను.

సరే కానీ 4 డేస్ మాత్రమే. సరే.

(ఇంట్లో)

కంగ్రాట్స్ ఆర్య. నువ్వు మారాల్సిన టైం వచ్చింది. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. అల్ ది బెస్ట్.

థాంక్యూ నాన్న. కచ్చితంగా, అన్ని నేర్చుకుంటాను.

ఎప్పుడు ఆర్య బయల్దేరేది?

ఇంకో ఫైవ్ డేస్ లో అమ్మ. అరవింద్ గోవా వెళ్దాము అంటున్నాడు.

ఆ వెళ్ళిరండి. నీకు జాబ్ రాకముందు వెళ్లే లాస్ట్ ట్రిప్. బాగా ఎంజాయ్ చేయి.

(గోవా లో)

ఆర్య, నీకు ఒక విషయం చెప్పాలి.

ఏంటి అరవింద్?

నా లైఫ్ లో జరిగే ప్రతి విషయం చెప్తాను కదా. అలాగే ఎం.బి.ఏ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యిందని చెప్పానుగా.

అవును చెప్పావు. ఏమైంది ఇప్పుడు?

తన పేరు అస్లాన్. తను ఉండేది గోవా లోనే. వాళ్ళ డాడీ గోవా షిప్యార్డ్ లిమిటెడ్ లో చీఫ్ జనరల్ మేనేజర్.

ఓకే. అయితే ఏంటి ఇప్పుడు?

నీ తర్వాత నాకు తనే.

లవ్ చేస్తున్నావా?

లేదు లేదు. బెస్ట్ ఫ్రెండ్ లా అంతే. తను కూడా ఇక్కడికి వస్తా అనింది. నీకు పరిచయం చేదాం అని.

నేను పరిచయం చేసుకుని ఎం చేస్తాను?

ఊరికే రా. హాయ్ చెప్పు చాలు.

(తను వస్తుంది)

అస్లాన్, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, ఆర్య. ఆర్య, తిను నీ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్, అస్లాన్.

హాయ్ ఆర్య, ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటాడు అరవింద్.

హాయ్ అస్లాన్, నైస్ టూ మీట్ యు.

అప్పుడే పంపించేదామనా?

లేదు, అలా అనుకోలేదు.

తను నాలాగే ఆర్య. ఊరికే అనింది.

(అలా మూడు రోజులు ముగ్గురు ఎంజాయ్ చేస్తారు, తర్వాత అరవింద్ ఢిల్లీ వెళ్తాడు)

వెల్కమ్ సైంటిస్ట్స్, నా పేరు నవీన్ చౌదరి, ప్రొఫెసర్ అఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ డీన్ ఎట్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ. మీరు వర్క్ చేయబోయే సైబర్ ఫోరెన్సిక్ టూల్కిట్ ప్రాజెక్ట్ కి హెడ్ నేనే. డిజిటల్ ఎవిడెన్స్ కలెక్షన్ అండ్ ఎనాలిసిస్ కోసం దీన్ని చేస్తున్నాం. రకరకాల డివైసెస్ నుంచి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసి, స్టోర్ చేసి, అనలైజ్ చేసి, పాటర్న్స్, అనోమలీస్, థ్రెట్స్ ని ఐడెంటిఫై చేస్తే ఇన్వెస్టిగేషన్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అండ్ సైబేరిసెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి ఇది పనికొస్తుంది. మీరు చేయాల్సింది సాఫ్ట్వేర్ మోడ్యూల్స్ ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్, టూల్స్ అండ్ ఫ్రేంవర్క్స్ ని ఇంటిగ్రేట్, టెస్ట్, డాక్యుమెంటేషన్, అలాగే ట్రైనింగ్ ఇవ్వటం. కొంత మందిని గ్రూప్ చేసి ఒక్కో డిపార్ట్మెంట్ లో వేస్తాం అవి డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్, ఇంటెగ్రేషన్ అండ్ టూల్స్, టెస్టింగ్ అండ్ వాలిడేషన్, డాక్యుమెంటేషన్ అండ్ ట్రైనింగ్.

(ఆర్య డాక్యుమెంటేషన్ అండ్ ట్రైనింగ్ టీం లో ఉంటాడు. టీం మెంబెర్స్ తో కలిసి పని చేస్తుంటాడు)

ఆర్య, ఎప్పుడు ఏదోకటి చేస్తూనే ఉంటావా? కొంచెం రెస్ట్ తీసుకోవచ్చుగా.

టైర్డ్ గా అనిపిస్తే కచ్చితంగా తీసుకుంటా విరాజ్. ఈ డేటా లో కొన్ని మోడిఫై చేసినట్టు అనిపిస్తుంది. అంటే కొన్ని కేసెస్ లో ఫోన్ లో నుంచి కలెక్ట్ చేసిన డేటా మిస్సింగ్ అని ఉంది.

ఎప్పటి కేసెస్ చూస్తున్నావ్?

2015 లోపల కేసెస్.

అప్పట్లో బ్యాక్ అప్స్ లేకపోటం, సాఫ్ట్వేర్ ఇష్యూస్, అవుట్డేటెడ్ టూల్స్, ఫోన్ సెక్యూరిటీ లేకపోటం వల్ల మిస్ అయుండచ్చు. ఫ్యూచర్ కి పనికి వచ్చేలా చేస్తున్నాం కానీ పాస్ట్ లో కేసెస్ సాల్వ్ చేస్తామా ఏంటి?

డేటా ముఖ్యం కదా.

ఒకటో రెండో మిస్ అయితే ఎం అవ్వదు ఆర్య. కాఫీ కి వెళ్దామా?

నువ్వెళ్ళు విరాజ్.

(సరే అని ఆర్య ఇంకా ఆ విషయాన్ని వదిలేస్తాడు. 2 ఇయర్స్ లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి అందరూ ఉపయోగిస్తూ ఉంటారు. ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఒక మెసేజ్ వస్తుంది)

హాయ్ ఆర్య, నేను అస్లాన్. ఎలా ఉన్నావ్?

హాయ్ అస్లాన్. బాగున్నాను. నువ్ ఎలా ఉన్నావ్? ఎం చేస్తున్నావ్?

బాగున్నాను ఆర్య. నా ఎం.బి.ఏ అయిపోయింది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో మానేజ్మెంట్ ట్రైనీ గా వర్క్ చేస్తున్నాను.

కంగ్రాట్స్ అస్లాన్.

థాంక్యూ ఆర్య. నేను ఒక విషయం గురించి నీతో మాట్లాడాలి ఈవెనింగ్ కలుద్దామా?

సరే అస్లాన్. ఎక్కడ?

7 ఓ క్లోక్ కి కేఫ్ పటిస్సేరీ.

(ఆర్య 6:50 కె వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటాడు. తను 7:05 కి వస్తుంది)

ఏమైంది అస్లాన్? ఏదో మాట్లాడాలన్నావు?

ఆర్య, సైబర్ ఫోరెన్సిక్ టూల్కిట్ ప్రాజెక్ట్ లో నువ్వు ఉన్నావు కదా?

అవును. దాంట్లో ఏమైనా డౌట్ ఉందా?

ఒక కేసు ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో సెన్సిటివ్ న్యూక్లియర్ డేటా ని కలెక్ట్ చేసి ఇరవై ఏళ్ళ నుంచి అక్తర్ హుస్సేనీ అనే వ్యక్తి పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ కి, ఇరాన్, రష్యా కి పంపిస్తున్నాడంట. అతను అలెగ్జాండర్ పాల్మెర్, అలీ రజా హుస్సేన్ అని ఫేక్ పాస్స్పోర్ట్స్ మెయింటైన్ చేస్తున్నాడు.

సరే, ఇప్పుడేమైంది?

మార్చ్ 2015 లో ఇతని మీద ఒక కేసు నడిచింది. ఫామిలీ మెంబెర్స్ పై వేధింపులకు సంబంధించినది. ఆ కేసు గురించి డిటైల్డ్ గా ఎక్కడ లేదు. అసలు అతని ఫామిలీ ఎవరో, ఎక్కడ ఉంటాడో, ఎవ్వరికి తెలీదు. 1994 వాళ్ళ అన్న ఆదిల్ చనిపోయాడు అని చెప్పి, తను ఒక్కడే ఉన్నాడు అని అంటున్నాడు.

నేనేం చేయగలను?

మీరు ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా డేటా మీద వర్క్ చేశారు కదా, దీనికి రిలేటెడ్ ఏమైనా డిజిటల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటె చెప్పు ఆర్య.

కచ్చితంగా అస్లాన్.

దీని గురించి ఎక్కడ తెలియనివ్వకు ఆర్య. ఎందుకంటే మీ ఆఫీస్ నుంచి కూడా ఎదో డేటా లీక్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఉంది. కేర్ఫుల్ గా ఉండు.

(మాట్లాడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఆర్య ఆ కేసు కోసం వెతుకుతాడు. హుస్సేన్ పేరు తో ఢిల్లీ కోర్ట్ కేసు కనిపిస్తుంది. అప్పుడు హుస్సేన్ కాల్ హిస్టరీ ఉన్న డేటా ఉంది. ఒక నెంబర్ చూడగానే ఆర్య కి ఇది తెలిసిన నెంబర్ లా అనిపించింది. అది ఆకాష్ ది. తనతో మాట్లాడిన వివరాలు గురించి ఏమి దొరకలేదు కానీ అది ఆకాష్ చనిపోయిన తర్వాత జరిగినది. ఆర్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ల్యాప్‌టాప్‌ను ఆపేశాడు. సమయం రాత్రి 11 గంటలు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. డెస్క్ నుండి లేవబోతుంటే, డోర్ వెనుక నుండి మెల్లగా తలుపు తెరచిన శబ్దం వినిపించింది. భయంతో వణుకుతూ డోర్ ఓపెన్ చేసి చూస్తే, బయట ఎవరూ లేరు. డోర్ వేయబోతుంటే, డోర్ ఫ్రేమ్ పక్కన ఉన్న చీకటిలో ఒక మసక రూపం కనిపించింది. అది ట్రైన్‌లో తన సీట్‌లో కూర్చుని మాయమైన ముసలాయన లాగా ఉంది. ఆర్య పరుగున లోపలికి వచ్చి, గట్టిగా డోర్ వేసి, లైట్లు వేయాలని ప్రయత్నించాడు. సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది. ఇల్లంతా నిశ్శబ్దం. ఆర్య గుండె వేగంగా కొట్టుకునే శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. చీకటిలో అతని కళ్ల ముందు. ముసలాయన రూపం, ఆకాశ్‌ రూపం అన్నీ కలగలిసిపోతున్నట్టు అనిపించింది. వెంటనే అరవింద్ కి కాల్ చేస్తాడు)

ఏమైంది ఆర్య, ఈ టైం లో కాల్ చేసావు?

నాకు భయంగా ఉంది, అరవింద్.

ఇన్ని రోజులు ధైర్యంగానే ఉన్నావుగా, ఆర్య. మల్లి ఈ భయం ఎందుకు పట్టుకుంది?

నీ దెగ్గర నేనొక విషయం చెప్పలేదు, అరవింద్.

ఏంటది?

నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. తన పేరు ఆకాష్.

నాకు తెలుసు ఆర్య, ఆంటీ చెప్పారు.

తెలిసిన, నన్ను ఎందుకు అడగలేదు.

నువ్వు చెప్పలేదంటే దాని వెనకాల ఒక రీసన్ ఉంటుందని తెలుసు. నువ్వు చెప్పినప్పుడు తెలుసుకుందామని.

చెప్తాను అరవింద్. 2013 బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో అన్నకి జాబ్ వచ్చింది. అన్న చాలా తెలివైన వాడు. ప్రపంచంలోనే ఫస్ట్ థోరియం బేస్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్, స్పెసిఫిక్ గా అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ని 2013 లో బి.ఏ.ఆర్.సి డెవలప్ చేసింది.అది థోరియం-232 ని యూ-233 ల మారుస్తుంది. పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. రేడియోఆక్టివ్ వేస్ట్ ని తగ్గిస్తుంది. ఇండియా లో థోరియం డిపోసిట్స్ ఎక్కువగా ఉన్నాయి. 2016 కళ్ల దాన్ని ఆక్టివ్ స్టేజి లోకి తీసుకొద్దామని అని అనుకున్నారు కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఆ టీం లో అన్న కూడా ఉన్నాడు. అన్న చావు ని అన్ఎక్సప్లైన్డ్ సర్కమ్స్టాన్స్స్ అని అన్నారు. అన్న చనిపోలేదు, చంపేశారు.

ఎం అంటున్నావ్, ఆర్య? ఇదంతా నీకు ముందే తెలుసా.

లేదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. 1995 నుంచి 2015 వరకు ఇస్రో లో 684, బి..ఆర్.సి లో 387, డి.ఆర్.డి.ఓ లో 260 మందికి పైగా దెత్త్స్ అన్ఎక్సప్లైన్డ్ సర్కమ్స్టాన్స్స్ వల్లనే.

ఇప్పుడు నువ్వేం చేయగలవ్, ఆర్య. జరిగిన వాటిని మార్చలేముగా.

కానీ ఇలాంటివి ఇంకా కొనసాగుతుంటే చాలా మందిని కోల్పోతూనే ఉంటాము.

అది గవర్నమెంట్ కి తెలీదనుకుంటున్నావా?

తెలిసి కూడా ఎందుకు ఏమి పట్టనట్టుంది?

ఆర్య, నువ్వు ధైర్యంగా ఉండు. ఇవన్నీ అస్లాన్ కి ఫార్వర్డ్ చేయి. తను చూసుకుంటుంది.

(తర్వాత రోజు, ఆఫీస్ కి నవీన్ వస్తారు)

ఆర్య, మన దెగ్గరున్న డేటా ఏదైనా నువ్వు మినిస్ట్రీ అఫ్ డిఫెన్సె కి షేర్ చేశావా?

(ఆర్య కి ఎం చెప్పాలో అర్ధం కాలేదు. అస్లాన్ ఎవరికీ తెలియకూడదని చెప్పింది కాబట్టి లేదని చెప్పాలా లేకపోతే ఇది చాలా పెద్ద విషయం కాబట్టి ఆయనకీ నిజం చెప్పి అన్న గురించి తెలుసుకుందామా అని ఆర్య ఆలోచిస్తున్నాడు)

ఆర్య, సమాధానం చెప్పు.

లేదు సర్. ఏమైంది?

ఎం లేదు. మన దేగ్గరున్నవి అన్ని కాన్ఫిడెంటియాల్, పర్మిషన్ లేకుండా ఏవైనా బయటకి వచ్చాయంటే చాలా పెద్ద ప్రాబ్లెమ్ అవుతుంది. ఓకే, నువ్వు నీ వర్క్ కంటిన్యూ చేయి.

(ఆర్య, వెంటనే అస్లాన్ కి మెసేజ్ చేస్తాడు)

అస్లాన్, నీతో మాట్లాడాలి.

(తను మెసేజ్ చూసిన రిప్లై ఇవ్వలేదు. మల్లి ఆర్య మెసేజ్ చేస్తాడు)

నిన్న కలిసాం కదా, అదే ప్లేస్ కి ఇప్పుడే రావా.

(తను రిప్లై ఇవ్వలేదు కానీ ఆర్య ఆ ప్లేస్ కి చేరుకుంటాడు. తను రాలేదు. మూడు గంటలు అక్కడే వెయిట్ చేస్తాడు. కాల్ చేసిన ఆన్సర్ లేదు. అరవింద్ కి కాల్ చేస్తాడు)

అరవింద్, అస్లాన్ దెగ్గర నుంచి ఏ రిప్లై లేదు. తను ఎక్కడ ఉంటుందో తెలుసా?

తెలుసు ఆర్య. హౌస్ నెంబర్ 12, చర్చి రోడ్, ఢిల్లీ కంట్.

సరే నేను అక్కడకి వెళ్లి చూస్తాను.

(ఆర్య, అక్కడకి వెళ్తాడు. తలుపు తాళం వేసుంటుంది. లోపలంతా చీకటిగా ఉంది. తిరిగి వెళ్లిపోయే సమయానికి లోపల నుంచి గ్లాస్ పగిలిన శబ్దం వినిపిస్తుంది. గట్టిగ డోర్ ని పగలకొట్టడానికి ట్రై చేస్తాడు. డోర్ ఓపెన్ అవుతుంది)

అస్లాన్, రక్తపు మడుగులో పడి ఉంటుంది.

(హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాడు. తనకు స్పృహ రాగానే)

ఆర్య, నీకేం కాలేదుగా?

లేదు, అసలు ఏమైంది?

నిన్న రాత్రి నువ్వు నాకు డేటా ఫార్వర్డ్ చేసావ్ కదా, అది నేను ఓపెన్ చేసేటప్పుడు డోర్ బెల్ మోగింది. డోర్ తీసి చూస్తే ఎవరు లేరు. డోర్ మూసి వెనక్కి తిరిగేలోపు ఎవరో గట్టిగ నా తల మీద కొట్టినట్టనిపించింది. నేను లేవడానికి ప్రయత్నించినప్పుడే ఫిష్ బౌల్ కిందపడిపోయింది.

నీ మొబైల్ ఎక్కడ ఉంది?

ఇంట్లోనే ఉండాలి.

(ఆర్య, అస్లాన్ ఇంటికి వెళ్లి చూడగా లాప్టాప్, ఫోన్ ఏవి కనిపించవు. తిరిగి హాస్పిటల్ కి వెళ్తాడు)

అస్లాన్, నువ్వు అడిగినట్టు అక్తర్ కేసు డీటెయిల్స్ దొరకలేదు కానీ దాంట్లో మా అన్న నెంబర్ కనిపించింది. తన పేరు ఆకాష్.

(అరవింద్ కి చెప్పింది చెప్తాడు)

ఆర్య, అన్న చనిపోయినప్పుడు తన ఫేస్ ని నువ్వు చూసావా?

లేదు, ఫేస్ అంత ఏదో ఆసిడ్ పోసినట్టు ఉంది. ఆ మొహం ఇప్పటికి నన్ను బాయపెడుతూవుంటుంది.

నాకు తెలిసి, అన్నకి ఈ విషయం తెలిసిందని, అక్తర్ ఏ చంపేసుంటాడు. కానీ దానికి తగిన సాక్ష్యాలు మన దెగ్గర లేవు.

దీని వెనక అక్తర్ ఒక్కడే కాదు, ఇంకా ఎవరో ఉన్నారు. మీ టీం తో చెప్పు అస్లాన్, నేను కూడా మీతో వర్క్ చేస్తాను.

అది జరగదు ఆర్య, ఎందుకంటే నీకు ఈ కేసు తో సంబంధం లేదుగా. ఇది నేను తెలుసుకోడానికి వేరే కారణం ఉంది.

ఏంటది, అస్లాన్?

మా నాన్న ఇప్పుడు వాళ్ళ కంట్రోల్ లో ఉన్నారు. ఈ కేసులో అక్తర్ ని మాత్రమే ఆఖరి లింక్ గా చూపించాలి, లేకపోతే వాళ్ళు మా నాన్నని చంపేస్తారు.

మరి నిన్నెందుకు చంపడానికి ప్రయత్నించారు?

తెలీదు ఆర్య. నేను అనవసరంగా నిన్ను దీంట్లోకి తీసుకొచ్చాను. ఈ కేసు కి దూరంగా ఉండు.

లేదు అస్లాన్. మా అన్న చావుకి సంబందించిన వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలి. నీ లాప్టాప్ అండ్ మొబైల్ ఐ.పి అడ్డ్రెస్సెస్ చెప్పు.

(ఆ అడ్డ్రెస్సెస్ ని ట్రాక్ చేస్తాడు. అది ఇక్కడ దెగ్గర్లో ఉన్న ఓల్డ్ అపార్ట్మెంట్ ని చూపిస్తుంది. అక్కడకి వెళ్తాడు. చాలా మంది పోలీస్లు ఉంటారు. ఏమైందని చూడగా ఒక వ్యక్తి చనిపోయారు అని తెలుసుకుంటాడు. అతను ఎవరో కాదు ఆరోజు ట్రైన్‌లో చూసిన వ్యక్తి. అక్కడ అస్లాన్ మొబైల్, లాప్టాప్, చనిపోయిన వ్యక్తి మొబైల్ ని డిజిటల్ ఎవిడెన్స్ గా కలెక్ట్ చేసి పెడతారు. అస్లాన్ ని ప్రైమ్ సస్పెక్ట్ గా గుర్తిస్తారు. వెంటనే హాస్పిటల్ కి వెళ్లి అస్లాన్ ని ఒక సేఫ్ ప్లేస్ లో ఉంచుతాడు)

అస్లాన్, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు.

(అరవింద్ కాల్ చేస్తాడు)

ఏంట్రా ఆర్య? అస్లాన్ కి ఏమైంది?

ఇక్కడ అంత అయోమయంగా ఉంది, అరవింద్. నాకేమి అర్ధం కావట్లేదు.

నువ్వు కంగారుపడకు, ఆర్య.

(ఆర్య, ఆ డిజిటల్ ఎవిడెన్స్ ని చూడటానికి ట్రై చేస్తాడు కానీ కుదరదు. వాళ్ళ టీం లో సౌమ్య ని కాంటాక్ట్ చేస్తాడు)

సౌమ్య, నాకొక హెల్ప్ కావాలి ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు? అతని ఫోన్ లో ఉన్న డేటా మొత్తం కావాలి.

ఆర్య, ఇది చాలా కష్టం.

నాకు వేరే దారి లేదు, సౌమ్య. నాకు చాలా ఇంపార్టెంట్.

ట్రై చేస్తాను.

(మూడు గంటలు తర్వాత)

తన పేరు ఆదిల్ అంట. కాంటాక్ట్స్ లో అక్తర్, అలెగ్జాండర్, అలీ అనే వాళ్ళు ఉన్నారు. కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి ఫార్వర్డ్ చేస్తున్న చూడు.

(ఆర్య వాటిని చూస్తాడు. ఒక ఫోటో లో సన్నని శరీరం, గాయాలు, రింగుల జుట్టు, గుబురు గడ్డం తో ఆకాష్ కనిపిస్తాడు)

అంటే అన్న బ్రతికే ఉన్నాడా? అన్నని బందీగా ఉంచారా?

(అలెగ్జాండర్, అలీ నంబర్స్ ని ట్రాక్ చేస్తాడు. లాంగ్లే, వర్జీనియా, యునైటెడ్ స్టేట్స్ అని తెలుసుకుంటాడు. ఈ విషయాలన్నీ నవీన్ కి చెప్తాడు)

ఆర్య, ఇదంతా డిఫెన్స్ కింద వస్తుంది. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇవన్నీ ట్రాక్ చేశామని తెలిస్తే ముందు మనల్ని అరెస్ట్ చేస్తారు. ఏదైనా నీకు సపోర్ట్ ఇవ్వడం కుదరదు. ముందు వాళ్లకి చెప్పాలి.

సర్, అంత టైం లేదు. అక్తర్ బయటకి వచ్చేస్తాడు. అస్లాన్ ని ఇరికించారు. అలాగే ఇన్నేళ్లు మా అన్న చనిపోయాడని అనుకుని, బ్రతుకున్నాడని తెలిసాక నేను ఒక్క క్షణం కూడా తనని చూడకుండా ఉండలేను. మీరు దయచేసి హెల్ప్ చేయండి సర్.

(నవీన్ కాసేపు ఆలోచించి)

సరే ఆర్య. నీ కళ్ళలో మీ అన్నయ్య ని కాపాడుకోవాలనే తపన చూస్తుంటే నేను కాదనలేకపోతున్నాను. కానీ అఫిషియల్ గా పర్మిషన్ ఇస్తే ప్రాసెస్ లేట్ అవుతుంది. అందుకే అన్-అఫిషియల్ గా నీకు "గోస్ట్ ప్రోటోకాల్" యాక్సెస్ ఇస్తున్నాను. కేవలం ఒక గంట మాత్రమే. ఈ లోపు ఆ లొకేషన్ ని క్రాక్ చేయాలి. నేను వెనక నుండి డిఫెన్స్ టీం ని అలర్ట్ చేస్తాను.

థాంక్యూ సర్.

(ఆర్య సిస్టమ్ ముందు కూర్చుంటాడు. అస్లాన్ ఇచ్చిన డేటా, ఆదిల్ ఫోన్ లో దొరికిన క్లూస్ ని బట్టి ఆర్య వేగంగా కోడింగ్ చేస్తాడు. ఆ ఐ.పి అడ్రస్ లు అన్నీ ఒక వి.పి.ఎన్ ద్వారా రీ-రూట్ అవుతున్నాయని గమనిస్తాడు. ఆ వి.పి.ఎన్ ని బైపాస్ చేయగా, అసలు లొకేషన్ లాంగ్లే కాదు, ఢిల్లీ శివార్లలోని మెహ్రౌలీ లో ఉన్న ఒక పాత గోడౌన్ అని చూపిస్తుంది)

దొరికింది సర్. మెహ్రౌలీ లోని పాత ఐస్ ఫ్యాక్టరీ.

గుడ్ జాబ్ ఆర్య. నువ్వు బయల్దేరు, నేను స్పెషల్ ఫోర్సెస్ ని అక్కడికి పంపిస్తాను.

నేను కూడా వెళ్తాను సర్.

వద్దు ఆర్య, అది ప్రమాదం.

మా అన్నయ్య అక్కడ ఉన్నాడు సర్. నేను వెళ్ళాలి.

సరే, కానీ జాగ్రత్త.

(ఆర్య వెంటనే బయల్దేరతాడు. ఆ గోడౌన్ దగ్గరకు చేరుకుంటాడు. బయట మనుషులు కాపలా ఉన్నారు. ఆర్య వెనక వైపు నుండి గోడ దూకి లోపలికి వెళ్తాడు. లోపలంతా డబ్బాలతో నిండి ఉంది. మధ్యలో ఒక కుర్చీకి కట్టేసి ఉన్న వ్యక్తిని చూస్తాడు. అది ఆకాష్. ఆర్య గుండె ఆగినంత పనయ్యింది. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అంతలో అలీ అక్కడకు వస్తాడు)

వెల్కమ్ ఆర్య. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. మీ అన్నయ్య ఎంత తెలివైనవాడో నువ్వు కూడా అంతే తెలివైన వాడివి.

అలీ, మా అన్నని వదిలేయ్. నీకు కావాల్సిన డేటా ఇంకా దొరకలేదా?

డేటా ఎప్పుడో దొరికింది. కానీ దాన్ని డీకోడ్ చేసే కీ మీ అన్నయ్య దగ్గరే ఉంది. అది చెప్తే ఎప్పుడో వదిలేసేవాడిని. కానీ మీ వాడు చాలా మొండి.

(అలీ గన్ తీసి ఆర్య వైపు గురి పెడతాడు)

ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి, నిన్ను చంపేస్తానని భయపెడితే, మీ అన్నయ్య ఆ కీ చెప్పేస్తాడు.

(అలీ నవ్వుతుంటాడు. ఆర్య చుట్టూ చూస్తాడు. పక్కనే మెయిన్ పవర్ సప్లై బాక్స్ కనిపిస్తుంది. చేతిలో ఉన్న ఇనుప రాడ్ ని విసిరి ఆ బాక్స్ ని పగలకొడతాడు. ఒక్కసారిగా ఫ్యాక్టరీ మొత్తం చిమ్మ చీకటి అలుముకుంటుంది. చీకట్లో అలీ మనుషులు కంగారు పడుతుంటారు. ఆర్య కి ఆ చీకటి అలవాటే. శబ్దం చేయకుండా పాకుతూ ఆకాష్ దగ్గరకు చేరతాడు. కట్లు విప్పుతాడు)

అన్నా. నేను ఆర్యని.

(ఆకాష్ నీరసంగా కళ్ళు తెరుస్తాడు. ఆర్యని చూడగానే నమ్మలేకపోతాడు)

ఆర్య. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో.

లేదు అన్నా, ఇద్దరం వెళ్తున్నాం.

(అంతలో లైట్స్ వస్తాయి. అలీ వాళ్ళ ముందు నిలబడి ఉంటాడు)

ఇక ఆటలు చాలు.

(అని ట్రిగ్గర్ నొక్కబోతాడు. అప్పుడే ఒక బుల్లెట్ వచ్చి అలీ చేతిని తాకుతుంది. గన్ కింద పడిపోతుంది. నవీన్ పంపిన స్పెషల్ ఫోర్సెస్ ఎంట్రీ ఇస్తారు. చుట్టూరా పోలీస్ లు అలీ గ్యాంగ్ ని అరెస్ట్ చేస్తారు. పోలీసులు అలీని అరెస్ట్ చేసాక, నవీన్ ఆకాష్ ని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయమంటాడు. కానీ ఆకాష్ నవీన్ వైపు సీరియస్ గా చూస్తాడు)

సర్, నాకు హాస్పిటల్ వద్దు. నన్ను, ఆర్యని కాసేపు ఒంటరిగా వదిలేయండి. ప్లీజ్.

సరే ఆకాష్. బయట సెక్యూరిటీ ఉంటుంది.

(అందరూ వెళ్ళిపోతారు. ఆ గదిలో ఆకాష్, ఆర్య ఇద్దరే ఉంటారు. ఆకాష్ మొహంలో ఇందాక ఉన్న భయం ఇప్పుడు లేదు)

అన్నా, ఏమైంది? ఎందుకంత సీరియస్ గా ఉన్నావ్? అలీ గాడు దొరికేసాడు కదా?

(ఆకాష్ నవ్వుతూ)

వాడు దొరికితే సమస్య తీరిపోతుందా ఆర్య? వాడు కేవలం ఒక చిన్న బంటు. అసలు కింగ్ ఎక్కడో అమెరికాలో కూర్చుని ఆడిస్తున్నాడు.

అంటే?

అలీ నన్ను కిడ్నాప్ చేయలేదు ఆర్య. నేను వాళ్ళతో కలిసి పని చేస్తున్నాను.

(షాక్ అయ్యి)

ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్ అన్నా? దేశం కోసం పని చేసే నువ్వు. టెర్రరిస్టులతో చేతులు కలిపావా?

టెర్రరిస్టులు కాదు ఆర్య. సి.ఐ.ఏ.

సి.ఐ.ఏ నా?

అవును. నీకు చరిత్ర తెలియదు ఆర్య. సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారు? లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ లో ఎలా చనిపోయారు? హోమీ బాబా విమానం ఎందుకు కూలిపోయింది? విక్రమ్ సారాభాయ్ నిద్రలోనే ఎలా చనిపోయారు? నంబి నారాయణ్ లాంటి సైంటిస్ట్ ని జైల్లో ఎందుకు పెట్టారు? ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి అని నమ్ముతున్నావా? కాదు. ఇవన్నీ మన దేశం తలెత్తుకోకూడదని వాళ్ళు చేసిన ప్లాన్స్. మన గవర్నమెంట్ మనల్ని కాపాడుకోలేదు ఆర్య. మనల్ని వాడి వదిలేస్తుంది.

అంత మాత్రాన దేశాన్ని అమ్మేస్తావా అన్నా?

(ఆవేశంగా ఆర్య కాలర్ పట్టుకుని)

దేశాన్ని అమ్మేయడానికి కాదు రా. మిమ్మల్ని కాపాడుకోవడానికి. నేను "అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్" డిజైన్ చేసినప్పుడే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి పని చేయకపోతే.. అమ్మని, నాన్నని, నిన్ను చంపేస్తామని బెదిరించారు. వాళ్ళు అది చేయగలరు ఆర్య. అందుకే చనిపోయినట్టు నటించి, వాళ్ళకి పని చేయడం మొదలుపెట్టాను. నా ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలంటే నేను దేశద్రోహిగా మారక తప్పలేదు.

మరి అలీ నిన్ను ఎందుకు కట్టేశాడు?

ఎందుకంటే. వాళ్ళు అడిగిన ఆఖరి పని చేయడానికి నేను ఒప్పుకోలేదు కాబట్టి.

ఏంటా పని?

"ప్రాజెక్ట్ బ్లాక్ అవుట్".

అంటే?

ఇండియాలో ఉన్న మొత్తం పవర్ గ్రిడ్స్, డిఫెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, బ్యాంకింగ్ సర్వర్స్. అన్నీ ఒకేసారి షట్ డౌన్ అయ్యేలా ఒక మాల్వేర్ ని తయారు చేయమన్నారు. అది కనుక యాక్టివేట్ అయితే. ఇండియా రాతి యుగంలోకి వెళ్లిపోతుంది. స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంది, ఆసుపత్రుల్లో పవర్ పోతుంది, బోర్డర్ లో రాడార్లు పనిచేయవు. ఆ గ్యాప్ లో పాకిస్తాన్, చైనా మన మీద ఎటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అది రేపు పొద్దున 4 గంటలకి యాక్టివేట్ అవ్వాలి. దాని "మాస్టర్ కీ" నా దగ్గర ఉంది. అది ఇవ్వనందుకే నన్ను టార్చర్ పెట్టారు.

(భయంతో)

ఇప్పుడు ఆ కీ ఎక్కడుంది?

సర్వర్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. కానీ దాన్ని ఆపే "కౌంటర్ కోడ్" నా బ్రెయిన్ లో ఉంది. కానీ ఆర్య. ఇప్పుడు నేను అది ఆపేస్తే, వాళ్ళు మిమ్మల్ని వదలరు.

అన్నా. మనం బ్రతికి ఉండి దేశం నాశనం అయిపోతే ఏం లాభం? మన కోసం కోట్లాది మందిని బలి ఇస్తావా? ఒకసారి ఆలోచించు. నువ్వు భయపడి బ్రతికిన ఇన్నేళ్లు నరకం చూడలేదా? మనం పోరాడదాం. నీకు తోడుగా నేను ఉన్నాను. నేను గవర్నమెంట్ లో ఎందుకు చేరానో తెలుసా? నీ అంత గొప్పవాడిని కాకపోయినా. నావంతు దేశానికి సపోర్ట్ గా ఉండాలనే.

(ఆలోచనలో పడతాడు)

వాళ్ళు చాలా పవర్ఫుల్ ఆర్య.

మన దగ్గర టెక్నాలజీ ఉంది అన్నా. నవీన్ సర్, మన టీం అంతా ఉంది. మనం ఈ "ప్రాజెక్ట్ బ్లాక్ అవుట్" ని ఆపాలి. అలాగే వాళ్ళ నెట్వర్క్ ని కూడా బయటపెట్టాలి.

(ఆకాష్ కళ్ళలో ఒక కొత్త మెరుపు కనిపిస్తుంది. తమ్ముడి మాటల్లో ధైర్యం చూసి నిర్ణయం తీసుకుంటాడు)

సరే. లాప్టాప్ ఇవ్వు.

(ఆర్య వెంటనే తన లాప్టాప్ ఇస్తాడు. ఆకాష్ వేగంగా టైప్ చేయడం మొదలుపెడతాడు)

ఆ మాల్వేర్ మన నేషనల్ గ్రిడ్ సర్వర్ రూట్ లో ఉంది. దాన్ని డిలీట్ చేయడం కుదరదు. కానీ దాన్ని రీ-రైట్ చేయొచ్చు. దానికి మనం ఆ సి.ఐ.ఏ సర్వర్స్ లోకి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాలి. ఆర్య. నువ్వు ఆ సి.ఐ.ఏ శాటిలైట్ లింక్ ని జామ్ చెయ్యగలవా? వాళ్ళు నేను ఏం చేస్తున్నానో చూడకూడదు.

ఒక్క నిమిషం అన్నా. "గోస్ట్ ప్రోటోకాల్" ఇంకా యాక్టివ్ గానే ఉంది. నేను వాళ్ళ సిగ్నల్ ని లూప్ లో పెడతాను.

(ఇద్దరూ అన్నదమ్ములు యుద్ధం మొదలుపెడతారు. ఒక పక్క ఆకాష్ కోడింగ్ రాస్తుంటే, ఆర్య ఫైర్ వాల్స్ ని బ్రేక్ చేస్తూ సిగ్నల్స్ ని బ్లాక్ చేస్తూ ఉంటాడు. టైం 3:55 అవుతుంది. ఇంకా 5 నిమిషాలే ఉంది)

ఆర్య. కోడ్ రెడీ. కానీ ఇది రన్ అవ్వాలంటే మెయిన్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. యాక్సెస్ డినైడ్ అని వస్తుంది.

అన్నా. అస్లాన్ లాప్టాప్ నుంచి దొరికిన అడ్మిన్ క్రెడెన్షియల్స్ వాడు. పాస్వర్డ్ "ప్రోమేతియస్".

(టైప్ చేస్తాడు)

ఎస్! కనెక్ట్ అయ్యింది. అప్లోడింగ్ వైరస్.

(స్క్రీన్ మీద పర్సంటేజ్ 99% దగ్గర ఆగిపోతుంది. సరిగ్గా 3:59 కి ఎర్రర్ వస్తుంది)

ఏమైంది అన్నా?

వాళ్ళు నా బయోమెట్రిక్ అడుగుతున్నారు. కానీ సిస్టమ్ నా ఫింగర్ ప్రింట్ ని స్కాన్ చేయడం లేదు. నా చేతికి గాయాలయ్యాయి కదా.

రెటీనా స్కాన్?

లేదు. వాయిస్ రికగ్నిషన్ ఉంది. కానీ కోడ్ వర్డ్ చెప్పాలి.

ఏంటి ఆ కోడ్ వర్డ్?

అది చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు వాడే పదం. "ఘోస్ట్".

(ఆకాష్ మైక్ ఆన్ చేసి గట్టిగా "ఘోస్ట్" అని చెప్తాడు. స్క్రీన్ మీద "యాక్సిస్ గ్రాంటెడ్" అని గ్రీన్ కలర్ లో వస్తుంది. మాల్వేర్ డిలీట్ అయిపోతుంది. ఇండియా సేఫ్. రిలాక్స్ అవుతూ హమ్మయ్య. అయిపోయింది.)

మనం సాధించాం అన్నా.

(అప్పుడే బయట సైరన్ల శబ్దాలు వినిపిస్తాయి. నవీన్ సర్ లోపలికి వస్తాడు)

ఆర్య, ఆకాష్. అమెరికన్ ఎంబసీ నుంచి ప్రెజర్ వస్తుంది. అలీని అప్పగించమని. కానీ మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మనం ఒప్పుకోలేదు.

సర్. అలీని వాళ్ళకి ఇచ్చేయండి.

ఏంటి అన్నా?

అవును ఆర్య. వాడు ఇక్కడ ఉంటే మనకి ప్రమాదం. వాడిని పంపించేస్తే. వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళే వాడిని చంపేస్తారు. మనం సేఫ్ గా ఉంటాం. కానీ..

కానీ ఏంటి అన్నా?

నేను మీతో రాలేను ఆర్య.

ఎందుకు?

నేను బ్రతికి ఉన్నానని తెలిస్తే వాళ్ళు మళ్ళీ టార్గెట్ చేస్తారు. ఈసారి డైరెక్ట్ వార్ ఉంటుంది. అది మన దేశానికి మంచిది కాదు. నేను చనిపోయినట్టే లోకం నమ్మాలి. నేను నీడలా ఉంటూనే. వాళ్ళ నెట్వర్క్ ని నాశనం చేస్తాను. ఈసారి భయంతో కాదు. బాధ్యతతో.

(కన్నీళ్లతో)

అంటే మళ్ళీ దూరంగా వెళ్లిపోతావా? అమ్మ, నాన్నకి ఏం చెప్పాలి?

వాళ్ళకి నేను బ్రతికే ఉన్నానని చెప్పు. కానీ దేశం కోసం ఒక సీక్రెట్ మిషన్ మీద వెళ్లాడని చెప్పు. ఎప్పటికైనా తిరిగి వస్తాడని చెప్పు.

(ఆకాష్ లేచి ఆర్యని హత్తుకుంటాడు)

ఆర్య. చిన్నప్పుడు చీకటి అంటే భయపడేవాడివి. ఇప్పుడు ఆ చీకటిలోనే యుద్ధం చేయడం నేర్చుకున్నావ్. నా ధైర్యం నువ్వే. అమ్మ నాన్నలని జాగ్రత్తగా చూసుకో. ఆకాష్ వెనుక ద్వారం గుండా చీకటిలోకి వెళ్ళిపోతాడు. ఆర్య కిటికీ దగ్గర నిలబడి చూస్తుంటాడు. వర్షం మొదలవుతుంది. ఆర్య ఫోన్ రింగ్ అవుతుంది. అది అరవింద్)

ఆర్య, కరెంట్ వచ్చింది రా. టీవీలో బ్రేకింగ్ న్యూస్. ఇండియా మీద జరగాల్సిన సైబర్ ఎటాక్ ని ఎవరో ఆపారంట. అది నువ్వే కదా?

నేను ఒక్కడినే కాదు అరవింద్. మా అన్నయ్య కూడా.

మీ అన్నయ్య దొరికాడా?

దొరికాడు. కానీ దేశాన్ని కాపాడటానికి మళ్ళీ చీకటిలోకే వెళ్ళిపోయాడు. వాడు ఒక "ఘోస్ట్". కనపడడు. కానీ మనల్ని కాపాడుతూనే ఉంటాడు.

(ఆర్య ఆకాశం వైపు చూస్తాడు. మెరుపులు మెరుస్తాయి. కానీ ఈసారి ఆర్య కళ్ళలో భయం లేదు. ఒక గర్వం, ఒక నమ్మకం ఉంది)

మరిన్ని కథలు

Pellipandiri
పెళ్ళీపందిరి
- సి.హెచ్.ప్రతాప్
Samudram lo Kakiretta
సముద్రంలో కాకిరెట్ట.
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Manavatavadulu
మానవతావాదులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Photo teeyadam neramaa
ఫోటో తీయడం నేరమా! (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Paarina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Jeevana deepam
జీవన దీపం
- సి.హెచ్.ప్రతాప్
Aasaraa
ఆసరా!
- రాము కోలా. దెందుకూరు
Ichhanamma vayanam-Puchhukunnanamma vayanam
ఇచ్చానమ్మా వాయనం పుచ్చుకున్నా...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు