జ్ఞానోదయం - - బోగా పురుషోత్తం, తుంబూరు.

Gnanodayam

జ్ఞానోదయం వెంకటాపురంలో వెంకటయ్య అనే ఓ శిల్పి వుండేవాడు. ఎన్నో ఏళ్లుగా అదే ఊరిలో అతడు దేవతలు, దేవుళ్ల విగ్రహాలు అందంగా చెక్కి విక్రయించేవాడు.

రాముడు, కృష్ణుడు, శివలింగం, రాధాదేవి, వెంకటేశ్వరుడు, కామాక్షి దేవి వంటి పలు రాతి విగ్రహాలు చెక్కేవాడు. కళా సౌందర్యత ఉట్టిపడే అతని నైపుణ్యతకు మంత్ర ముగ్ధులైన ప్రజలు అడిగినంత సొమ్ము ఇచ్చి విగ్రహాలు కొని తీసుకుని వెళ్లేవారు. అలా అతనికి ఆదాయం పెరిగి పని మనుషుల అవసరం వచ్చింది. దీంతో వెంకటయ్య ఓ ఇద్దరు చిన్నారులను నియమించుకున్నాడు.
ఆ ఇద్దరు చిన్నారులు మంచి తెలివైన పిల్లలు కావడంతో విగ్రహాలు తయారు చేయడంలో నైపుణ్యత సాధించారు. అనతికాలంలోనే స్వయంగా ఆ చిన్నారులు సొంతంగా నాణ్యమైన విగ్రహాలు తక్కువ ధరకే విక్రయించసాగారు.
వెంకటయ్య ధనార్జనే ధ్యేయంగా మారాడు. నాసిరకం విగ్రహాలు తయారు చేసి విక్రయించసాగాడు.
ప్రజలకు వెంకటయ్య విగ్రహాలపై నమ్మకం పోయింది. అవి తీసుకెళితే విరిగిపోయి నిరుపయోగంగా మారడంతో కొనేవారు తగ్గిపోయారు. చివరకు వెంకటయ్య ఇల్లు గడవడం కష్టంగా మారింది.
అతని వద్ద శిక్షణ పొందిన చిన్నారులు మంచి నాణ్యమైన రాతితో విగ్రహాలకు జీవంపోసి అమ్ముతుండడంతో అందరూ వారి వద్దే కొనసాగారు.
ఇది జీర్ణించుకోలేకపోయిన వెంకటయ్య ఓ పన్నాగం పన్నాడు. చిన్న పిల్లలు తయారు చేసే విగ్రహాలు పూజిస్తే భక్తి తగ్గుతుందని పైగా వారు అన్య మతస్థులని , వాటిని కొనవద్దని ప్రచారం చేశాడు.
ప్రజలు వెంకటయ్య మాయమాటలు నమ్మలేదు.
ఆ ముస్లిం చిన్నారులు అత్యంత నైపుణ్యంతో తయారు చేసిన రాతి విగ్రహాలే తీసుకెళ్లి ఆలయాలలో ప్రతిష్టించే వారు. వాటిని పూజిస్తుంటే దేవుళ్లు మనసులో ప్రత్యక్షమై భక్తిభావంతో పరవశించిపోయారు. కంటికి కనిపించని దేవుడు ఒకడే అని, మనుషులంతా ఒకటే అని, దేవుడి ముందు మతాలు లేవని అందరిదీ మానవతా మతం అని ,ఎవరు ఏయే రూపాల్లో తలుచుకుంటే వారికి ఆయా రూపాల్లోనే దేవుడు కనిపిస్తాడని ప్రజలు భావించారు. భక్తి భావం ఉట్టిపడుతున్న చిన్నారుల చేసిన విగ్రహాలను చూసి మెచ్చుకునేవారు.
కొద్ది రోజులకు వెంకటయ్య కు జబ్బు చేసింది . అతని కొడుకు ఉన్నత చదువులకు డబ్బు లేక చదువు విరమించుకున్నాడు ఇది విన్న చిన్నారి శిల్పులు వెంకటయ్య వద్దకు వెళ్లారు. అతని కుమారుడి చదువుకు అయ్యే ధనం సాయం చేశారు. వెంకటయ్యకు పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఆరోగ్యం కుదుట పడిన తరువాత తమవద్దే పని ఇప్పించారు. చిన్నారుల సాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మానవత్వం మరిచి తను చేసిన పనికి క్షమాపణకోరి పచ్చాత్తాపపఅద్దాడు. దేవుడి ముందు మతాలు లేవని మానవత్వమే అందరి మతమని గ్రహించాడు జ్ఞానోదయమైన వెంకటయ్య. వారి వద్దే కూలి పనిచేసుకుంటూ హాయిగా జీవనం సాగించాడు .

మరిన్ని కథలు

Dayyaala Meda
దయ్యాల మేడ
- డా:సి.హెచ్.ప్రతాప్
Chivari chitram
చివరి చిత్రం
- డా:సి.హెచ్.ప్రతాప్
Idi ekkadi nyayam
ఇది ఎక్కడి న్యాయం
- ప్రభావతి పూసపాటి
Maa Inti TV (feelgood story)
మా ఇంటి టి.వి (feelgood story)
- అనిసా తబస్సుమ్ sk
Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)