పద్మ ఇంటిముందు ముగ్గేసి ఇంట్లోకి వెళ్లబోతుంటే గేటు ముందు ఏదో ట్రక్ ఆగిన శబ్దం వచ్చింది. ఒక ట్రక్ సామాన్లతో గేటు దెగ్గర ఆగి ఉంది, అప్పుడు తోచింది పద్మకి పక్క పోర్షన్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళని. ఇంట్లోకి వెళ్ళింది పద్మ. కొత్త ఇంట్లో సామాన్లు సర్దుకుంటున్నపుడు టీ తీసుకొని వెళ్లి కొత్తగా వచ్చిన వాళ్ళని పరిచయం చేసుకుంది పద్మ. పక్క వాటాలోకి దిగింది ఒక చిన్న కుటుంబం.ఆ ఇంటి ఇల్లాలు కీర్తి, ఆమె భర్త సురేష్, వీరిద్దరికి రెండేళ్ల బాబు. కీర్తి హాస్పిటల్ లో రెసెప్షనిస్టుగా పనిచేస్తుంది. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. పద్మ, కీర్తి మంచి ఇరుగుపొరుగు వాళ్ళు కావడానికి ఎక్కు సమయమేమి పట్టలేదు. ఇద్దరు ఎదురు పడినప్పుడు కబుర్లు చెప్పుకోవడం, ఇంటి విషయాలు పంచుకోవడం, కూరలు మార్చుకోవడాలు జరిగేవి. ఒకరోజు పొద్దునే కీర్తి డ్యూటీకి వెళ్ళేటపుడు పనీర్ ప్యాకెట్ పద్మకిచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమని ఇచ్చింది. పద్మకి పనీర్ చూడగానే కొంచం గమతుగా అనిపించింది. ఆ కూర చేయడం పద్మకి రాదు,"ఈసారి పనీర్ కూర వండేటప్పుడు నాకు నేర్పించు కీర్తి" అని అడిగింది. సరే సరే పద్మగారు అంటూ నవ్వుతు డ్యూటీకి వెళ్ళింది కీర్తి. సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చాక పాలక్ పనీర్ కూర చేసి కొంచం పద్మ వాళ్ళకి ఇచ్చింది కీర్తి. ఉప్పు,కారం అన్ని సరిగ్గా ఉండటంతో పనీర్ కూర చాల రుచిగా అనిపించింది పద్మకి. ఇదిలా ఉండగా సురేష్ ఉద్యోగాని వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాడు. కొన్ని రోజులకి తెలిసింది,సురేష్ ఉద్యోగం పోయిందని. కీర్తి డ్యూటీకి వెళ్తే ఆమె వచ్చేదాకా అతడు ఇంట్లోనే ఉంటూ బాబుని చూసుకునేవాడు. ప్రతి రోజు తాగుడు అలవాటు చేసుకున్నాడు. పద్మ కీర్తి పక్క పక్కనే కావడంతో అప్పుడప్పుడు కీర్తి డ్యూటీ నుంచి వచ్చాక భర్త సురేష్ కీర్తితో గొడవ పడేవాడు.తాగిన మత్తులో కీర్తిని సిగరెట్లతో కాల్చేవాడు,ఒక్కోసారి కీర్తి సురేష్ కి ఎదురుతిరిగేది. పద్మ కుటుంబం గొడవ ఆపి సర్ది చెప్పాలి అనుకున్న, భార్య భర్తల విషయంలో కలుగ చేసుకోకూడదు అని ఆగేవారు.ఒక్కోసారి పద్మ కీర్తి మొఖం చూస్తే మొఖం మీద దెబ్బలు కనిపించేవి అయినా అలానే డ్యూటీకి వెళ్ళేది కీర్తి. సురేష్ కి తాగుడు ఒక్కటే కాకుండా కీర్తి మీద అనుమానపడడం మొదలుపెట్టాడు. ఈ అనుమానాలతో కూడా ప్రతి రోజు గొడవ పడేవాడు,కొన్నిసార్లు కీర్తి పై చేజేసుకునేవాడు. రోజు రోజుకి సురేష్ పనులతో విసుగెత్తిపోతుంది. వీళ్ళ గొడవలు ఇరుగు పొరుగు వాళ్ళకి తెలుస్తున్నాయి అని కొంత సిగ్గుతో పద్మతో కూడా మాట్లాడం మానేసింది కీర్తి. రోజు రోజుకీ తనకు తాను దూరమవుతుంది . ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకు నవ్విన ఆమే… ఇప్పుడు నవ్వడం కూడా మర్చిపోయింది. అద్దంలో తన ముఖం చూసుకుంటే… కళ్ల కింద నల్లటి మచ్చలు వచ్చాయి , జీవం లేని కళ్ళగా మారిపోయాయి. సురేష్ ఆమెతో గొడవ పడడం ఇదేమి కొత్త కాదు. బాబు పుట్టాక ముందు కూడా ఇలానే గొడవలు అయితే పెద్దలు సర్దిచెప్పారు. ఎప్పుడు మళ్ళీ ఇలా మారాడు సురేష్. బాబు భవిష్యత్తు గురించి ఆలోచించి ఓపికతో సహనంతో భర్త ఎన్ని హింసలు పెట్టిన భరిస్తుంది కీర్తి. ఎన్ని రోజులు, నెలలు గడిచిన సురేష్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. అతనికి ఉద్యోగం వచ్చింది లేదు, తాగుడు మనింది లేదు. కనీసం ఉద్యోగం వెతికే ప్రయత్నం కూడా చేయకుండా, తాగుతూ...కీర్తి సంపాదనతో బ్రతుకుతున్నాడని ఆమె మీద కోపం,ద్వేషం పెంచుకొని ఆమెతో కఠువుగా ప్రవర్తిస్తున్నాడు. కీర్తి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఏదో ఒక కారణం వెతికి మరి గొడవపడి,ఆమెను కొట్టేవాడు. ఒక రోజు రాత్రి..... 1:00 అవుతుంది. కీర్తి ఇంట్లో నుంచి సురేష్ గొంతు గట్టి గట్టిగ వినిపిస్తున్నాయి. కీర్తి ఒక్కసారిగా గట్టిగ అరిచింది. పద్మ దంపతులకు పూర్తిగా మెలకువ వచ్చి ఏం జరుగుతుందో అని కంగారు పడ్డారు. మధ్యలో వెళ్ళి మాట్లాడదాం అనుకుంటే అసలే తాగేసి ఉన్నాడు, ఎం అంటే ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచించి ఆగిపోయారు. తెల్లవారు పద్మ ముగ్గు వేయడానికి బయటికి వస్తే సురేష్ ఏంటో కంగారు కంగారుగ బయటికి వెళ్తూ కనిపించాడు. కీర్తి ఇంటి వైపు చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది. ఆ టైంకి కీర్తి డ్యూటీకి వేళ్ళాదే అనుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోయింది. 4,5 రోజులు అయినా కీర్తి కానీ సురేష్ కానీ ఎవరు రాలేదు. ఒక నెల తర్వాత కీర్తి తన తల్లితండ్రులతో కలిసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి సురేష్ బాగా తాగి కీర్తిని సిగరెట్లతో కాలుస్తూ, ఆ మద్యం మత్తులో ఆవేశంతో వంటగదిలోకి కూరగాయలు తరిగి పక్కన పెట్టి ఉన్న కత్తి తీస్కొని కీర్తిని గోడకి ఆనించి పట్టి కత్తితో పొడవబోతే కీర్తి భయంతో గట్టిగ గావుకేక పెట్టింది. ఆ గోలకి బాబు నిద్రలేచి ఏడవడంతో బాబుని పడుకోబెడుతూ ఆ మత్తులో అతను కూడా పడుకున్నాడు. ఈ హఠాతు సంఘటనకు పూర్తిగా భయపడిపోయిన కీర్తి, వాడి వాడిగా పరిగెత్తుకుంటూ డాబా పైకి పరుగెత్తుకొని వెళ్లి ట్యాంకుల ట్యాంకుల వెనక దాక్కొని కీర్తి తల్లితండ్రులకు,ఆమె తముడికి ఫోన్ చేసి సంగతి చెప్పి ఉంటేనే ఇంటిదెగ్గరకు రమ్మని చెప్పింది. ఇంకా అతనితోనే ఉంటె చంపినా చంపేస్తాడు అని భయపడి. రాత్రి మూడింటికి కీర్తి తమ్ముడు ఇంటి దెగ్గరకు రాగానే. పిల్లాడ్ని ఎత్తుకొని కావలసిన వస్తువులు తీసుకొని ఇంటి నుంచి పుట్టింటికి వెళ్ళింది. విష్యం తెలుసుకున్న సురేష్ కీర్తి ఇంటి దెగ్గర,కీర్తి పనిచేసే హాస్పిటల్ దెగ్గరకు వెళ్లి గోల గోల చేసాడు. సురేష్ తో ఎప్పటికైనా ఇబందే అని అలోచించి అతనిమీద కేసు పెట్టి ,విడాకులు తీసుకుంది. తన గతంలో తనకు ఎదురైనా చేదు అనుభవాలను మర్చిపోయి, కీర్తి తన కొడుకుతో సంతోషంగా ఉంటూ,అతని ఆలనా పాలనా చూసుకుంటూ,కొత్త ఆశలతో తన కొత్త జీవితానికి నాంది పలికింది. పద్మ దంపతులు ఈరోజుకి కీర్తి విషయంలో పశ్చాతాపంగా భావిస్తారు. ఒక ఆడపిల్ల కష్టంలో ఉందని తెలిసి కూడా ఆ సురేష్ కి భయపడి వెళ్లి కాపాడనందుకు,ఆమెకు అండగా నిలవనందుకు ఆ దంపతులు వారి తప్పు తెలుసుకొని ఈరోజుకి బాధపడుతూనే ఉన్నారు.

