పుణ్యానికి పోతే - మద్దూరి నరసింహమూర్తి,

unyaaniki pote

“ఆపు, ఆపు” అంటూ తమ రిక్షావాడిని ఆపిన రఘునాథరావు క్రిందకు గెంతి – “కామేశం, ఇంత రాత్రి మీరిద్దరూ నడుస్తూ ఎటు బయల్దేరేరు”

“సినీమాకు సర్, మేము తెమిలేసరికి ఇలా ఆలస్యమైపోయింది”

“ఓ పని చేయండి, మీరు ఈ రిక్షా మీద సినీమాకు వెళ్లిపోండి” అంటూ --

“సీతా నువ్వు పిల్లలూ రిక్షా దిగి నడుస్తూ ఇంటికి పదండి, నేను వెనక వస్తూంటాను” అంటూ అమ్మాయిని తాను దింపగా సీత అబ్బాయితో దిగింది”

“మీరు ఇంటికి నడిచిపోవాలి కదా సర్”

“ఫరవాలేదు, మేము ఇంటి దగ్గరకు వచ్చేసేము కదా, నడిచిపోతాం. మీరు సినీమాకు త్వరగా ఈ రిక్షాలో వెళ్ళండి”

“ధన్యవాదాలు సర్”

రఘునాధరావు చర్యకు అలిగిన భార్య సీత పిల్లలిద్దరితో నడుచుకుంటూ దగ్గరలోనే ఉన్న తమ ఇంటిలోనికి వెళ్లి, ధడాలుమని వీధి తలుపు వేసింది.

కామేశం దంపతులు రిక్షాలో బయలుదేరినవరకూ ఆగిన రఘునాధరావు తాపీగా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరేడు.

అతను నాలుగు అడుగులు నడిచేసరికి, విద్యుత్ ప్రసారం ఆగిపోయి ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది. ఆ చీకట్లో, రఘునాధరావు దారిలో పడుకున్న కుక్కతోక తొక్కేసరికి, ఆ కుక్క కోపంతో అతని కాలును దాని పళ్లతో బలంగా పట్టుకుంది. ఫలితంగా, అతను బొడ్డు చుట్టూ పదునాలుగు ఇంజెక్షన్లు తీసుకోవలసి రావడమే కాక, భార్యతో చీవాట్లు కూడా తినవలసి వచ్చింది.

**శ్రీరామ**

మరిన్ని కథలు

Dayyaala Meda
దయ్యాల మేడ
- డా:సి.హెచ్.ప్రతాప్
Chivari chitram
చివరి చిత్రం
- డా:సి.హెచ్.ప్రతాప్
Idi ekkadi nyayam
ఇది ఎక్కడి న్యాయం
- ప్రభావతి పూసపాటి
Maa Inti TV (feelgood story)
మా ఇంటి టి.వి (feelgood story)
- అనిసా తబస్సుమ్ sk
Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)