అరవరాజు గుమ్మంలో కూర్చున్నాడు బైటనుoచి జానకి ఓబాబుని తీసుకుా రావడం చూసాడు. గుమ్మందగ్గరే ఆగిపోయింది. అరవరాజు "అదేంటి జానకి అక్కడే ఆగి పోయావు లోపలికి రా" అన్నాడు సౌమ్యంగా. "ఆబాబు మన బాబేనా" అని మళ్ళా అడిగాడు. జానకి ఆశ్చర్య పోయింది అతనంత సౌమ్యంగా అడగడం చూసి. "అవునుమనబాబే" అంది నెమ్మదిగా. "మరైతే వచ్చావెందుకు" అడిగాడు అరవరాజు. ఆమె కొంచంసేపు తటపటియించి ఈబాబు తనకొడుకు కాదుకనక బాబు తండ్రికి ఇచ్చేసి రమ్మన్నాడు" అంది పక్కకు తిరిగి. "అది సరే ఈబాబు మనఇద్దరి పుట్టినవాడు కదా, మరినువ్విలా ఈబాబునివదిలేసి వెడితె వీడి ఆలన పాలనా ఎవరు చూస్తారు మా ఇంట్లో ఆడదక్షతకూడా లేదు మానాన్న పెద్దవాడైపోయాడు" అన్నాడు. "అయితే నువ్వు పెళ్ళి చెసుకోలేదా" అడిగింది జానకి. "లేదు ఎలాగు నామూలంగా నువ్వు తల్లివైనావు కదాని మనంపెళ్ళి చేసుకొందాం అనిఅడిగితె నువ్వు నిరాకరించావు, ఇంక నాకు పెళ్ళిమీద యావ పోయింది". అన్నాడు అరవరాజు. "ఐతె మరెలా ఈబాబుని తీసుకు రావద్దని గట్టిగా చెప్పాడు రమేష్ " అంది నసుగుతు. జానకి. అరవరాజు కొంచంసేపు ఆలోచించి "అతన్నివదిలేసి ఈబాబుతో నాదగ్గర ఉండకూడదా" అడిగాడు. "అంటె అతను నన్ను బాగా ఇష్టపడుతున్నాడు నాపేర ఏభైలక్షలకు ఇన్సురెన్సు కూడా చేయించాడు" అంది. ఆమాటకు అరవ రాజు ఉలిక్కిపడి. "ఇన్సురెన్సు నీపెర చేయంచడమేమిటి అతనిపేరకదా తీసుకోవాలి" అని అడిగాడు ఆశ్చర్యంగా! "లేదు అది ఏభైలక్షలు నాకేవస్తాయిగా అందకని అలా చేసాడంట"అందిజానకి "హలో పిచ్చిదానా నీకు ఏభైలక్షలు వచ్చెదాకా నువ్వుంటావా?" అడిగాడు అరవరాజు. "అదేంటి అలామాట్టడతనావు" కంగారుగా అడిగింది జానకి. "అంటే ఏభై లక్షలు దాక కట్టడానికి శానారోజులు పడతది. ఈలోగ రెండేళ్ళు కట్టాక నిన్ను సంపేసి నాభార్య పాయిందని ఏభైలక్షలు లాగేత్తడు, కావాలంటే ఎవరైన ఇన్సురన్సుఏజంటు నడిగితె తెలుత్తాది, నేనలా బైటకెల్త, పిల్లగాడితో ఈడనే ఉండు సీకటైపోతందికదా తెల్లారాక పోదుగాని, ఈలోగ మానాయన కూడ వత్తాడు"అని బైటకు దారితీసాడు అరవ రాజు. ఆతరవాత జానకి తలుపేసి తనకు తెలిసినఏజంటు దగ్గరకు పోయి బోగట్టచేసింది, అతగాడు అంత వివరంగా చెప్పాడు. తిన్నగా ఇంటికొచ్చింది. అప్పటికే అరవరాజు నాయన వచ్చేఉన్నాడు, జానికిని చూసి ఆనమాలుకట్టి ఏంఅమ్మాయి బాగుండావా ఎడుంటున్నావు ఈడు నీ కొడుకా" అడిగాడు. "బాగనె ఉన్నాను, బొంబాయిలో ఉంటన్నా ఈడు నీమనవడే అరవరాజు కొడుకే" అంది "అట్టనా మంచిగున్నాడమ్మ, మరెందుకు వచ్చినావు" అడిగాడు ఆయన, "నేనిందాకానే వచ్చా అరవరాజుని కలిసినా ఆయన బైటకెళ్ళాడు, ఈలోగ నాకు ఎరికైన వాళ్ళ ఇంటికి పాయి వచ్చినాను" అంది ఇంతలో అరవరాజు వచ్చాడు. ఏంటి ఏంఆలోసించుకొన్నావు" అని అడిగాడు. అసలుయీషయం నాకు బాగ భోధైనాది అతగాడి మోసం తెలిసినాది నెను ఈడనేఉండిపోతా" అంది తలొంచుకొని. ఆతరవాత అరవరాజు అతని నాయనకు వీషయం బాగా వివరించాడు. "సరే బాబ మంచిది రెపేపోయి గుడిలో తాళికట్టెసి తీసుకురా బెడదుండదు" అన్నాడు. అలా ఓవారం గడిచింది. ********* ఓరోజు ఉదయమే పరంధామయ్య వచ్చాడు రండి సార్ పరంధామయ్యగారు" పిలిచాడు అరవరాజు."మర్యాదలక్కరలేదు మీనాయనని పిలు" అన్నాడు ఆయన కటువుగా. ఇంతలో అరవరాజు తండ్రిగురుమూర్తి వచ్చాడు. "ఏమయ్య అప్పుతీర్చవా ఇప్పటికె పాతిక వేలయ్యంది" అన్నాడు కోపంగా పరంధామయ్య. "అయ్య తమరు నాకుఇచ్చింది పదిఏలే కదండి పాతికంటరేమిటి" అన్నాడు అతను కంగారుగా. "వడ్డి ఎవడు కడతాడు నీబాబా" అన్నాడు ఆయన మరింత కోపంగా. వెంటనే అరవరాజు ముందుకి వచ్చి "సార్ పోయిన ఆయన బాబేం వస్తాడండి వడ్డి కట్టడానికి" అన్నాడు సౌంమ్యంగా. "లేపోతే నువ్వు కట్టు" అని అరిచాడు పరంధామయ్య. "అలాగెనండి తప్పకుండా అయతే చిన్న యిన్నపం" అన్నాడు అరవరాజు. "ఏంటది" మరింత కటువుగా అన్నాడు ఆయన. మాకు దుబాయ నించి డబ్బురావాల యుద్దం కదండి లేటైయినాది ఒవారంలో వత్తదండి అప్పుడు తమఅప్పు తీర్చేత్తానండి" అన్నాడు అరవరాజు. "అదేంకుదరదు రేపీలోగా ఇవ్వకపోతే దావాచేసేత్తను మీ ఇల్లు ఏలం వెయించేత్తను"అన్నాడు కోపంగా. " అలాంటారా, ఓఇషయం మనవి సేత్తాను యినుకోండి దావా అంటే అదితేలేటప్పటికి ఎవరుంటారో తెలియదు అపీడరుగారు కూడా బాగనే లాగుతారు చివరాఖరుకి మీకుమేం ఇవ్వవలసిన బాకి కంటా ఖర్చు అదికం అయిపోతందండి బాగా ఆలోసించండి రేపు మీఇంటికి వత్తానండి" అన్నాడు అరవరాజు సౌమ్యంగా. ఆమరనాడు అరవరాజు పరంధామయ్య గారింటికి వెళ్ళాడు. "ఎవయింది డబ్బు తెచ్చినావా" గట్టిగా అడిగాడు ఆయన. "సారు తవరు కోర్టుకెల్తనని అన్నారుగా, దాని యిసయం తెలుసుకొందామని వచ్చానండి తవరు కోర్టుకెల్తె ప్రస్తుతం డబ్బుఅవసరం లేదని దుబాయికి ఫోన్చేద్దాం అనుకొంటన్నానండి" అన్నాడు వినయంగా. పరంధామయయ్య గారిలో కంగారు పెరిగింది ఉదయం లాయరు దగ్గరకెల్తే ఆయన చావుకబురు చల్లాగా చెప్పాడు ఆనోటు కాలదోషం పట్టిపోయిందని దావాకి పనికిరాదని ,ఆయన కంగారుగా లేచి, ఇదిగో బాబు మీనాయన చాలామంచోడు, అంచేత దావా సేయదల్చుకోలేదు, వీలు సూసుకొని దుబాయి డబ్బు రాగానే బాకికట్టేయి" అన్నాడు చాలాసౌమ్యంగా. "అలాగేనండి" అని వెనక్కితిరగబోయి అక్కడున్న అబ్బాయినిచూసి "మీ అబ్బాయిగారాండి" అని అడిగాడు. "అవును" అన్నాడాయన. "ఐతె అబ్బాయిగార్కి పెళ్ళి అయిందాండి" అని అడిగాడు అరవరాజు. "లేదండి, నాకసలుపెళ్ళికాదండి, ఇదిగో ఈపీనాసి బాబు ఉండగా నాకు పెళ్ళికాదండి, ఎవళ్ళోచ్చినా ఏభైలక్షలు కట్నం కావాలని అడుగుతున్నాడండి దాంతొ ఆళ్ళు పారిపోతన్నారండి" అన్నాడాఅబ్బాయి కొపంగా. "అవును నాకాడ ఆస్తుంది డబ్బుంది అంచేత కట్నం ఇవ్వవలసిందే" అన్నాడు పరంధామయ్య. "నిజమేనండి ఆమాత్రం కట్నంతీసుకోవడం తప్పులేదండి, కానైతే మరో ఇషయం కూడా మీరు ఆలోసించాలండి. అదేంటంటే ఏభైయేలు కట్నం ఇచ్చెవాడు తమ ఇల్లు పరిసరాలు తమని చూత్తారు కదండి, మరైతే ఇవి ఇలాగే ఉంటే ఆళ్ళమ్మాయి ఎంత సుఖపడతదో ఆలోసిత్తారు కదండి, అందుకని యిఅన్ని మార్చియాలండి, ముందు ఇల్లు బాగుసేయించలండి ,ఆతరవాత మీరు ఆమాసిపోయి వాసనోత్తన్న బట్టలు మార్చలండి ఇల శానా మార్చలండి లేపోతె ఆవచ్చినోడు అదేదారిని పారిపోతాడండి, ఇంక అబ్బాయికి పెళ్ళుండదండి మీకు కింత కాలు సెయ్య వంగాక కాంత గంజి కాచిఇచ్చే దిక్కూ ఉండదండి, అదలాఉంచండి, అసలుసంగతి సెప్పటం మరసిపోయాను, మీకు లాగురవయ్యగారు తెలుసు కదండి "ఆ తెలుసు చాలా పెద్దమనిషి సమయాని బాకి ఇంటికట్టుకొచ్చి ఇచ్చెసేవాడు" అన్నాడు పరంధామయ్య. "సరే పాపం ఆయనకి కాలు తీసేసినారండి" అన్నాడు అరవరాజు. "అదేంపాపం, ఎవయింది" అడిగాడు ఆయన. "అంటే మనూరికి జమిందారుగారు కాపరంవచ్చారండి తెలుసా" అడిగాడు అరవరాజు."తెలుసు ఐతె" అని ఆశ్చర్యంగా అడిగాడు పరంధామయ్య. "ఆయనకి ఒక్కడే కొడుకండి చాలా గారబంగా పెంచుతున్నారండి, ఆయనకి ఓకారు కూడా కొనిచ్చారండి, ఆయన సుభ్రంగా మందు కొట్టెసి కారు నడుపుతాడుటండి, అదెలానడుత్తిదో తెల్దండి, పాపం ఆమధ్య మన గురవయ్యగారు సైకిలు మీద పొలం యెడతనారంటండి అక్కడికీ ఆయన పాపం రోడ్డు పక్కమ్మటే యల్తన్నారంటండి అంతె లా జమిందారు గారి అబ్బాయిగారు కారెట్టి గుద్దించేసారండి కారు సెక్రం మన గురవయ్యగారి కాలుమీదనించి పొయిందండి పాపం కాలు నరాలన్నీ నుజ్జయిపోయాటండి అందుకని కాలు మోకాలు దాకా తీసేసినారండి అదండి సంగతి" అన్నాడు అరవరాజు. "అది నాకెందుకు చెపుత్తున్నావు" అడిగాడుపరంధామయ్య అంటే మీరు ఓ టైము పాడు లేకుండా ఎండకొండ కాకుండా రోడ్డుకడ్డంగా పడి నడిచి పోతుంంటారు కదండి, మీటైం బాగోక అదె సమయానికె లా ఆయన కారుమీద కాని బైటకి వచ్చారనుకొండి అంతె మీఅదృట్టం బాగుండే కాలు మీంచె పోతదండి కారు ఒకెల మధ్యన పడ్డారనుకోండి అంతె పరలోకమే" అనేసి బైటకి వచ్చేసాడు అరవరాజు, "అలా యందుకు జరుగుద్ది" అని సాగతీసాడు పరంధామయ్య. "ఏం యందుకు జరగదు, అలా చాలామందికి అయింది ఇద్దరుముగ్గురు అతను చెప్పినట్లు అవుటైపోయిరు" అని అన్నాడు.ఆయన కొడుకు. "ఇప్పడెలా ఆటైంకి వెళ్ళకపోతె వడ్డీలు కట్టెవాళ్ళు దోరకరు" అన్నాడు పరంధామయ్య. "సరే నీఇష్టం నీజాతకం ప్రకారం కాలు కాని ప్రాణం కాని పోయే పరిస్దితి ఉంది అనుకొంటా" అన్నాడు ఆయన కొడుకు. ఓఅడుగు ముందకెడద్దామనేలోపల గుమ్మంలో అరవరాజు కనిపించాడు.ఏంటి పరంధామయ్యగారు భైటకెల్తన్నారా" అడిగాడు అరవరాజు. " అవును" అన్నాడు ఆయన."అంటే జమిందారుగారబ్బాయి కారు బైటకు తీసారంట మా బావ పరిగెత్తుకొచ్చి చెప్పాడు" అన్నాడు. "ఐతె నాకెం భయం నేవెడతా" మరో అడుగు ముందకి వేసాడు. వెంటనే వెన్నులో దడపుట్టింది గురవయ్య గారు గుర్తోచ్చారు, గబగబా లోపలకి పరిగెత్తి గదిలోదూరి తలుపేసుకొన్నాడు. ఆదిచూసి అరవరాజు పరంధామయ్యగారబ్బాయి నవ్వుకొన్నారు. "మీనాయన భయపడతనాడు, ఇదే అకాసం మెత్తగ ఉన్నప్పుడే వంగతీయల" అన్నాడు అరవరాజు. పరంధామయ్యకి ఆకలేసింది "అరె బాబ ఆకలేత్తందిరా" అని అరచాడు, జవాబురాలేదు, నెమ్మదిగా తలుపు తీసుకొని బైటకొచ్చాడు, హాల్లో ఎవరులేరు, ఎలాగ ఏదో తినకపోతే ప్రాణం పోయేలాఉంది అనుకొంటు బైటకి వచ్చాడు, అంతవరకు పక్కన నుంచున్న కొడుకు " బైటకి వచ్చాడు ఎందుకు" అని అడిగాడు. "అదేరా బాబ ఆకలి ఏత్తందిరా" అన్నడు ఆయన. "ఇప్పుడూలా ఎటుకాని యాల పోని ఏదైన చెసుకొంటావా" అని అడిగాడు అతను."లేదురా ఏంచెసుకోలేను నీరసంగా ఉంది" అన్నాడు ఆయన. "మరేం బాధ పడకండి అయ్యా నేను మాఇంటి నించి కేరెజి తెచ్చాను తినండి" అన్నాడు అప్పుడె వచ్చిన అరవాలరాజు. పరంధామయ్య గబగబావచ్చి ఆవురావురు మంటు అంతా లాగించేసాడు. "అయ్య అదేంటీ అబ్బాయికి లేకుండా తినేసారు" అని అడిగాడు అరవాలరాజు. "బలేరుచిగా ఉందయ్య అందకే లాగించేసాను ఎప్పుడో మా ఆవిడ ఉన్నరోజుల్లో తిన్నానయ్య ఇలాంటి తిండి" అన్నాడు పరంధామయ్య. "ఇదంతా నీభార్యే చేసిందా" అడిగాడు ఆయన. "అవునండి" అన్నాడు అరవాలరాజు. బలే రుచిగా ఉందయ్య" అన్నాడు,"అందుకె బాబుకి పెళ్ళి సేయమని సెపుతంట, కోడలు కళకళలాడుతు తిరగుతుంటే ఎంత బాగుంటదండి, అయనా మీకా వయసు పెరిగిపోతంది, బాగా ఆలోసించుకోండి" అనేసి వెళ్ళి పోయాడు అరవాలరాజు. ఆరాత్రంత మధ్యాహ్నం చేసిన భోజనమే గుర్తు వస్తోంది.రాత్రంతా కోడలు ఇంట్లో తిరుగుతున్నట్లు భోజనం వండి పిలుస్తన్నట్లు కలలు రావడంతో "అమ్మాయి వంట చాలా బాగుందంమ్మ చాలా రుచిగా ఉంది" అని పలవరించడం మొదలెట్టాడు. అక్కడేఉన్న ఆయన కొడుకు, కలగచెసుకొని "నాయనా అతిగ కలవరించకు నాకింకా పెళ్ళికాలేదు నీకు కోడలేడనించివచ్చింది" అని అరిచాడు. ఇంతలో అరవాలరాజు వచ్చాడు."ఏంటి బాబు గట్టిగా అరత్తన్నావు" అని అడిగాడు. "అదా మీరు రెండ్రోజులు కేరేజీ తెచ్చి తినిపించారు, అది బాగా రుచి మరిగాడు, అదీకాక కోడలు పిల్లుంటే ఇలాగే తినచ్చని ఉరించారు, దాంతో ఈయనకి కోడలపిచ్చట్టుకొంది" అన్నాడు అతను. "అయతే నాప్లాను పనిచేసింది ఇంక మీనాయన నీపెళ్ళి యివలో పడిపోతాడు" అన్నాడు అరవాలరాజు. పరంధామయ్యకి ఆత్రుత ఎక్కువై పోయింది. "ఏవయ్య అరవాలరాజు మావాడి పెళ్ళి ప్రయత్నాలు చేస్తన్నావా" అడిగాడు. "అయ్య మీరలా కంగారు పడితే ఎలాగ ముందు మీరు ఇల్లు బాగు చేయించాల, సున్నాలెయ్యాల", అన్నాడు అరవాలరాజు. "అలాగంటావా, సరే ఐతే ఆపనేదో నువ్వే చూడు, నేపిలిస్తే ఎవడురాడు డబ్బులు ఇవ్వనేమోనని" అన్నాడు ఆయన. ఆమరునాడే అరవాలరాజు పని చెయించడం మొదలు పెట్టాడు వారంలో పరంధామయ్యగారిల్లు స్వరూపం మారిపోయింది. పరంధామయ్య వేషం మారిపోయింది మంచి బట్టలు కట్టుకొని హాల్లో కొత్త కుర్చిలో కూర్చున్నాడు. మళ్ళా వారం తిరిగెనాటికి కొత్తకొడలు వచ్చెసింది, పరంధామయ్యగారిలో మార్పొచ్చింది, బాకిదారులందర్ని పిలిచి పత్రాలన్ని ఇచ్చేసాడు. ఇప్పటికీ జమిందారిఅబ్బాయి, కారు లేదన్నసంగతి, సోమరాజు కాలు తీయలేదన్న సంగతి పరంధామయ్యకి తెలియదు, ఎందుకంటె ఆయన భైటకి వెళ్ళడం లేదు జమిందారిగారబ్బాయి కారుకి భయపడి. ****

