మిస్డ్ కాల్ - sarada devi

missed call

గడియారం లో ఏడు గంటలు టంగున కొట్టింది . ఆదివారం కావటం మూలాన కోటేశ్వర రావు గారి ఇంట్లో రోజు ఉండే హడావిడి ఆరోజు లేదు. భార్య ఇందుమతి వంటింట్లో కాఫీ కలుపుతోంది. కోటేశ్వర రావు గారు పేపర్ చదువుతూ విశ్రాంతి గ ఉన్నారు. పుత్రరత్నం కిశోర్ కి ఇంకా తెల్లవారలేదు. కూతురు మాలతీ బాల్కనీ లోని పుల మొక్కలకి నీళ్లు పెడుతోంది. ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ మాలతీ సెల్ మోగ సాగింది. మొక్కలకి నీళ్లు పోస్తున్న ధ్యాసలో మాలతీ పట్టించుకోలేదు. కిషోర్ విసుక్కుంటూ లేచి వచ్చి అక్కా! నీ కెన్నిసార్లు చెప్పాలి సెల్ సైలెంట్ లో పెట్టుకో అని , మంచి నిద్ర చెడగొట్టావు ఫో అని సెల్ చేతిలో పెట్టి వెళ్ళాడు. మాలతి నవ్వుకుంటూ కుతూహలంగా ఫోన్ వైపు చూసింది ఫోన్ చేసింది ఎవరా అని. ప్చ్ అన్నోన్ నెంబర్ అనుకుంటూ మొక్కల ని బాగు చేయ సాగింది. ఇంతలో మాలతి కాఫీ తీసుకోమ్మా! అంటూ అమ్మ పిలవడంతో సెల్ అక్కడే మర్చిపోయి ఇంటి లోపలి కి వెళ్ళిపోయింది.

కోటేశ్వర రావు గారు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, హైదరాబాద్ లో మేనేజర్ గ పని చేస్తున్నారు. భార్య ఇందుమతి బాగా చదువుకుంది. ఇంటి భాద్యతలు చూసుకుంటూ హౌస్ వైఫ్ గ ఉండిపోయింది. కూతురు మాలతి ఉస్మానియా యూనివర్సిటీ లో ఎం.స్సీ (బయో టెక్) ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆమెకు మొక్కలు అంటే ప్రాణం. ప్రకృతి ని ఆరాధిస్తుంది. ఎప్పుడు కొత్త పూల మొక్కలతో బాల్కనీ ని అందంగా అలంకరిస్తూ ఉంటుంది.రోజు ఉదయాన్నే ఆలా బాల్కనీ లో పూలని, మొక్కలని, అక్కడికి వచ్చే పక్షులని చూసుకుంటూ కొంతసేపు గడపటం ఆమె దినచర్యలో ఒక భాగం. కొడుకు కిశోర్ బి.టెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. చీకు చింత లేని కుటుంబం....

ఇందుమతి వంట పని లో నిమగంమై ఉండగా , పనిమనిషి సుబ్బులు అటుగ వెళ్తూ ,ఎంటమ్మగారు మాకు పప్పన్నం ఎప్పుడు పెడతారు!!! అని సరదాగా అడుగుతుంటే ఆ మాటలకు చిన్నగా నవ్వుకుంటూ పెడతాము లేవే అని సమాధానం చెప్తూ ప్రశ్నార్ధకం గ కోటేశ్వర రావు గారి వైపు చూసింది ఇందుమతి. అయన కూడా పెళ్లి మాట వినగానే ఆలోచనలో కి వెళ్లిపోయారు. బాల్కనీ శుభ్రం చేద్దామని అటుగా వెళ్లిన సుబ్బులు కి ఫోన్ చప్పుడు వినిపించింది. అమ్మాయిగారు ఎప్పుడు ఇంతే ఫోన్ మర్చి పోతూ ఉంటారు అనుకుంటూ, అమ్మాయిగారు , అమ్మాయిగారు అంటూ కేక వేసింది. పనిమనిషి సుబ్బులు అరుపు విని ఉలిక్కిపడింది మాలతి. ఎంటమ్మాయిగారు! ఎప్పుడు ఫోన్ ఎక్కడో దగ్గర పెట్టి మర్చిపోతూవుంటారు! ఎవరో ఫోన్ చేసారు చూడండి! అని ఫోన్ మాలతి చేతిలో పెట్టి అంతే వేగంగా వెళ్ళిపోయింది సుబ్బులు. తన మతిమరుపుకి చిన్నగా నవ్వుకుంటూ ఫోన్ వైపు చూసింది. అన్నోన్ నెంబర్ నుంచే మళ్ళీ ఫోన్ వచ్చింది. సాధారణంగా మాలతి అన్నోన్ నెంబర్ కి కాల్ బ్యాక్ చెయ్యదు. అవసరమైతే వాళ్లే చేస్తారులే అనుకుంటుంది. ఇప్పుడేమో నాలు ఐదు మిస్డ్ కాల్స్ ఉన్నాయి మరి, ఎవరైనా ముఖ్యమైన వాళ్లేమో అనుకుంటూ కాల్ బ్యాక్ చేసింది.

అవతలివైపు నుంచి మగ గొంతు తో చాల నార్మల్ గ హలో సదానంద్ అంకుల్! నేను గౌరవ్ ని మాట్లాడుతున్నాను అని వినిపించింది. మాలతి కొంచెం చిన్నగా సారీ అండి, రాంగ్ నెంబర్ ఇది సదానంద్ గారి నెంబర్ కాదు అన్నది. వెంటనే గౌరవ్ తత్తరపాటు స్వరంతో ఓహ్ అంకుల్ నెంబర్ కాదా? ఐ ఆమ్ ఎక్సట్రీమిలీ సారీ !!! ఉదయం నుంచి అంకుల్ నెంబర్ అనుకొని చాల సార్లు ఫోన్ చేశాను , ఒన్స్ అగైన్ సారీ అన్నాడు. ఆ స్వరంలో తత్తరపాటు తో పాటు ఎంతో నమ్రతగా కూడా ఉంది. నిజమే అనిపించింది మాలతికి . ఇట్స్ ఓకే అండి అంటూ ఫోన్ కట్ చేసింది. కొంతసేపటి తరువాత ఆ విషయం గురించి మర్చిపోయింది మాలతి. రెండు రోజుల తరువాత తన ఫోన్ లో ఒక మెసేజ్ చూసి ఆశ్చర్యపోయింది!!!

" గుడ్ మార్నింగ్, నా పేరు గౌరవ్ . నేను ఎం బి బి స్ ఫైనల్ ఇయర్ పూర్తి చేసి ఎం డి ఎంట్రన్సు కోసము ప్రిపేర్ అవుతున్నాను. తప్పుగా అనుకోకండి. మీ పేరు ఏంటో తెలుసుకోవచ్చా " అని ఉంది మెసేజ్. ఇలాంటివి షరా మాములే ఒక ఆడపిల్ల గొంతు వింటే ఇలాంటి మెసేజెస్ పెడ్తు ఉంటారు తుంటరి వెధవలు అనుకుంటూ డిలీట్ చేసింది మెసేజ్ ని. ఆ రోజు ఫోన్ లో గొంతు విని మంచి వాడు అనుకున్నాను . గొంతు విని ఏ నిర్ణయాలు తీసికోకూడదు సుమా! అనుకుంటూ వేరే పని లో నిమగ్నమైంది. మరల రెండు రోజుల తరువాత " మీ పేరు చెప్పండి ప్లీజ్" అంటూ మెసేజ్ వచ్చింది. మాలతి కోపం తో నెంబర్ ని బ్లాక్ చేసి ఆ విషయాన్ని మరచిపోయింది. ఒక నెల తరువాత కోటేశ్వర రావు గారు ఇందుమతి తో మాలతి పెళ్లి సంబంధాల గురించి చర్చించసాగారు. కొన్ని సంబంధాలని ని ఫైనల్ చేసి మాలతి నిర్ణయం ఏంటో తెలుసుకుందామని రాత్రి భజనం సమయం లో పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు కోటేశ్వర రావు గారు . మాలతి తో అయన చూడమ్మా మాలతి నేను మీ అమ్మ కొన్ని సంబంధాలు చూసాము, నీకు ఇష్టం అయితే ఇవి ఒకసారి పరిశీలించు అని ఒక డైరీ ని మాలతి ముందుకు నెట్టారు. అందులో ఒక సంబంధం గౌరవ్ , ఎం బి బి ఎస్, అని కూడా ఉంది. మాలతి కి పెళ్లి చేసుకోవాలని లేదు అలాగని చేసుకోకూడదు అని లేదు. కానీ గౌరవ్ అనే పేరు వినగానే కొంత కుతూహలం చోటు చేసుకుంది మాలతి మనసులో. అప్పుడు ఫోన్ చేసిన వ్యక్తే నా , లేక వేరే నా అని ఆలోచనలో పడిపోయింది మాలతి. కోటేశ్వర రావు గారు ఆలోచనలో పడిపోయిన మాలతి ని చూసి ఎమ్మా నీకు ఏమైనా అభ్యంతరమా ? విషయం ఏదయినా ఉంటె చెప్పు అన్నారు. ఆబ్బె అలాంటిది ఏమి లేదు నాన్నగారు మీ ఇష్టం అన్నది మాలతి. అన్నదే కానీ మనసులో ఎదో మూల ఆ మిస్డ్ కాల్ గురించి ఆలోచిస్తూ ఉంది. తన గది లోకి వచ్చాక నిద్ర పట్టలేదు మాలతి కి , గౌరవ్ ఆ రోజు మిస్డ్ కాల్ చేసిన వ్యక్తేనా , తన అడ్రస్ ఎలా తెలుసుకున్నాడు అని విపరీతంగా ఆలోచించింది. ఒకసారి మళ్ళీ ఫోన్ చేద్దామా వద్దా? ఒకవేళ అతను వేరే గౌరవ్ అయితే , అనవసరంగా పెద్ద విషయం అవుతుందేమో అని పలురకాలుగా ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకుంది. మరుసటి రోజు కాలేజీ లో తన ఫ్రెండ్ సుధ తో ఈ విషయం గురించి చర్చించింది. మళ్ళిఫోన్ రాలేదు కదా విషయం ఎందుకు పెద్దది చేయటం అన్నది సుధ. అది నిజమే అనుకుని వస్తున్నా ఫైనల్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది మాలతి.

పరీక్షలు అయిపోయి చాల రిలాక్స్డ్ గ ఉంది మాలతి. ఏదయినా కంపెనీ లో ఇంటర్న్షిప్ కోసం ఇంటర్నెట్ లో తీరిగ్గా వెతుకుతూ ఉంది. ఇంతలో ఒక మెసెజ్ వచ్చింది అది కూడా ఎదో అన్నోన్ నెంబర్. "ఏంటండీ నాకు పేరు కూడా చెప్పకుండా మీరు పెళ్లి చేసుకుంటున్నారా!!!" అని, మాలతి నొసలు ముడిపడ్డాయి. ఇదేంటి నా సొంత విషయాలు ఇతనికి ఎలా తెలుస్తున్నాయి ? అని ఆలోచిస్తూ కొంత మనసులో భయపడ్డది.నాన్నగారితో మాట్లాడుదామా అనుకుంది. ఇలా పలురకాలుగా ఆలోచిస్తూ ఉంటె కిశోరె అక్క అంటూ వచ్చాడు. అక్కా! మా కాలేజీ వాళ్ళు నార్త్ ఇండియా టూర్ వెళ్తున్నారు, నాన్నగారు ఒప్పుకోవటం లేదు నేను వెళ్తానంటే , నీవే ఎలాగైనా ఒప్పించాలి ! ప్లీజ్ అక్కా అంటూ. అలాగే లేరా అంటూ, మనసులో కిషోర్ తో ఈ విషయం డిస్కస్ చేద్దామా అనుకోని ఎందుకు ఇంత చిన్న విషయాన్ని గురించి ఇలా ఆలోచిస్తున్నాను అనుకుంది.ఇంతలో కోటేశ్వర రావు గారు ఇందుమతి తో ఇందు రేపు మనం అనుకున్న పెళ్ళివారు మాలతి ని చూసుకోవటానికి వస్తున్నారు! అమ్మాయితో విషయం చెప్పు అంటూ హడావిడిగా ఆ రోజు బ్యాంకు ట్రాన్సాక్షన్ ఫైల్ గురించి ఎవరో స్టాఫ్ తో ఫోన్ లో మాట్లడుకుంటూ వెళ్లిపోయారు. ఇందుమతి ఒక చిన్న నిట్టూర్పు విడిచి ఈయన ఎప్పుడు ఇంతే , ఇంట్లో కూడా ఆఫీస్ పనులే అనుకుంటూ ! మాలతి గది వైపు విషయం చెప్పటానికి వెళ్ళింది. అక్కడ అక్కా తమ్ముడు ఇద్దరినీ చూసి , ఓహ్ ఇద్దరు ఇక్కడే ఉన్నారా.. అంటూ మాలతి నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అమ్మ! అన్నది ఇందుమతి. అంతలో కిషోర్ అయితే నేనేందుకు మధ్యలో అంటూ వెళ్ళబోయాడు. మాలతి కిషోర్ నెత్తిమీద ఒక మొట్టికాయ మొట్టి ...అంత ఓవర్ ఆక్షన్ ఎందుకు ర కూర్చో అన్నది నవ్వుకుంటూ..

మరునాడు ఇందుమతి ఇంట్లో పెళ్లిచూపులు హడావిడి జరుగుతూ ఉంది. అబ్బాయి అమ్మాయి ఓరకంట ఒకర్నొకరు చూసుకున్నారు. చూపులు కలిసాయి, పెద్దవారు మాట్లాడుకున్నారు. సంబంధం కుదిరిపోయింది . అబ్బాయి పేరు గౌరవ్. మెడిసిన్ చేసాడు. సొంత హాస్పిటల్ పెట్టుకొని , ఏం డి చేయటానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. మంచివాడు ,అందగాడు,చదువుకున్నవాడు అందుకనే కోటేశ్వర రావు గారికి బాగా నచ్చాడు. వాళ్ళ కుటుంబం లో అమ్మాయి ఉద్యోగం చేయకుడు ఇలాంటి ఆంక్షలు కూడా ఏమి లేవు. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకు కట్న కానుకల మీద ఏమాత్రం ఆసక్తి లేదు.ఇది మాలతి కి బాగా నచ్చింది. మంచి ముహూర్తం కోసం బ్రాహ్మణులని పిలిచి మాలతి ఇంట్లో నే గౌరవ్ వాళ్ళ పేరెంట్స్ , మాలతి పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏవేవో జోక్స్ వేసుకుంటూ నవ్వులతో మారు మ్రోగి పోతోంది మాలతి వాళ్ళ ఇల్లు. వియ్యంకులు లాగా లేరు వాళ్ళు ఎంతో కాలం నుంచి కలసి ఉన్న మంచి స్నేహితుల్లా వున్నారు వాళ్ళు. మాలతి కి ఆ దృశ్యం బాగా నచ్చింది. గౌరవ్ పేరెంట్స్ ఇంత బాగా ఉంటె గౌరవ్ ఏంటి ఒక్క సరి కూడా మాట్లాడలేదు అనుకుంది మనసులో. కనీసం ఫోన్ నెంబర్ కూడా అడగలేదు. నేను చొరవ తీసికొని అడిగితే ఏం బాగుంటుంది అనుకుంది....ఆరోజు రాత్రి తన గదిలో మాలతి మంచి మెహందీ డిజైన్స్ చూస్తూ ఉంది మొబైల్ లో. ఇంతలో హాయ్ ! హౌ ర్ యూ అని మెసెజ్ వచ్చింది. అంతలో నే ఐ అం సారీ ఇట్స్ గౌరవ్ అని వచ్చింది. మాలతి మనసులో పరవాలేదే చదువు తప్ప ఇంకేమి తెలియని బుద్దు అనుకున్న ! కాదన్నమాట అనుకుంది మనసులో. ఇంతలో నో రిప్లై ఎనీ ప్రాబ్లెమ్ అని మళ్ళి వచ్చింది మెసెజ్. మాలతి కంగారుగా నో నో నథింగ్ అంటూ రిప్లై ఇచ్చింది గౌరవ్ కి. మరి మెసెజ్ చేయటానికి ఇంతసేపు పట్టింది? అంటూ క్వస్చన్ మార్క్ తో మళ్ళి మెసెజ్ . మాలతి మనసులో నవ్వుకుంటూ ఉంటె కాల్ వచ్చింది గౌరవ్ దగ్గరి నుంచి. చాల సేపు మాట్లాడుకున్నారు. హాబీస్ గురించి , ఫామిలీ గురించి , వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఒకటేమిటి ఎన్నో విషయాలు .. వాళ్ళకే ఆశర్యం వేసింది టైం తెలీకుండా ఎలా గడచి పోయిందా అని.

అలా ఒక పది రోజులు గడిచిపోయింది. రోజు గౌరవ్ మాలతి ఫోన్ చేసుకోవటం దినచర్య లో ఒక భాగంగా మారింది. లేకపోతె ఇద్దరికీ ఎదో వెలితిగా ఉండేది. ఇంతలో మాలతి కి అన్నోన్ నెంబర్ నెంబర్ నుంచి మళ్ళి మిస్డ్ కాల్. అంతలోనే ఒక మెసెజ్, " పెళ్లి కూడా కుదిరింది కదా ఇప్పుడైనా పేరు చెప్పరా అని"! . మాలతికి ఇరిటేషన్ వచ్చింది . నెంబర్ బ్లాక్ చేసింది. .. మీరు ఎన్ని నంబర్స్ బ్లాక్ చేసిన ఏం లాభం లేదు .. ఈ మెసెజ్ లు ఆగవు అని మళ్ళి ఒక మెసెజ్ వచ్చింది. ఇంతలో గౌరవ్ ఫోన్ వచ్చింది. కొంత పరధ్యానం గ మాట్లాడింది మాలతి. గౌరవ్ ఏమైనా అట పట్టిస్తున్నాడా అనుకుంది మనసులో. కానీ అలా గౌరవ్ మాటల్లో అనిపించలేదు. ఛి! ఛి! ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకుంది. ఇంతలో గౌరవ్ మాలతి ఆర్ యూ ఓ.కే , హెల్త్ బాలేదా అన్నాడు. ఆబ్బె అదేం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది అంటూ ఫోన్ కట్ చేసింది, మాలతి మనసులో ఎవరై ఉంటారు. ఇలా నాకెందుకు మెసేజ్స్ పెడుతున్నారు అని తీవ్రంగా ఆలోచించసాగింది. తన క్లాస్మేట్స్ అందరిని గుర్తు చేసుకోసాగింది మాలతి. కానీ ఎవరి మీద సందేహం కలుగలేదు. గౌరవ్ తో డిస్కస్ చేద్దామా అనుకోని , చిన్న విషయం అంటాడేమో , లేక పిరికి అమ్మాయి అనుకుంటాడేమో అని ఆ ఆలోచనను విరమించుకుంది.

ఒక రెండు రోజుల తరువాత కిషోర్ తో ఈ విషయం డిస్కస్ చేసింది. కిషోర్ ఆలోచించసాగాడు, అక్కతో ఎవరు బాగా క్లోజ్ గ ఉంటారు అని ! రోజులు ఆలా సాగిపోతున్నాయి…… ఇంతలో గౌరవ్ తన ఫ్రెండ్స్ తో పార్టీ కి పిలిచాడు మాలతి ని, కిషోర్ ని . కోటేశ్వరరావు గారు కిషోర్ కూడా వెళ్తున్నాడని అన్యమనస్కంగా అనుమతి ఇచ్చారు పార్టీ కి వెళ్ళటానికి. మాలతి మనస్సులో సంతోషంగా ఉన్న కొంత భయం గ కూడా ఉంది. పార్టీ బాగా జరిగింది. గౌరవ్ ఫ్రెండ్స్ అందరు చాల మర్యాదగా ఉన్నారు . చాల ఉత్సాహంగా కబుర్లు చెప్పుకున్నారు అందరు. గౌరవ్ మాలతి మనస్సులు గాలిలో తేలిపోతున్నాయి ఓరకంట ఒకర్ని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. పార్టీ అయిపోయాక ఇంటికి వచ్చేసారు మాలతి, కిషోర్. రాత్రి మల్లి మెసెజ్ వచ్చింది " పార్టీ లో ఎంజాయ్ చేసావా అని" !!! భయం వేసింది మాలతి కి. కిషోర్ ని పిలిచింది. విషయం చెప్పింది. అక్క ఒక్కసారి బావగారికి చెప్పి చూడు ఎమన్నా క్లూ దొరుకుతుందేమో అన్నాడు. మాలతి కి కూడా నిజమే అనిపించింది. మాలతి గౌరవ్ కి ఫోన్ చేసింది. చాల ఉత్సాహంగా గౌరవ్ ఫోన్ లిఫ్ట్ చేసి చిలిపిగా చెప్పండి దేవి గారు అన్నాడు. మాలతి చిన్నగా గౌరవ్ నీతో ఒక విషయం మాట్లాడాలి అంది. గొంతులో కొద్దిగా ఆందోళన కనిపించింది. ఏమైంది మాలతి లాలనగా అన్నాడు. చిన్న విషయమే కానీ చాల రోజుల నుంచి నాకు ఉంనౌన్ నంబర్స్ నుంచి మెసెజ్ స్ వస్తున్నాయి, ఎక్కడనుంచో అర్ధం కావట్లేదు. పర్సనల్ విషాలు అన్ని తెలిసిపోతున్నాయి అన్నది. గౌరవ్ ఓకే నాకు ఫార్వర్డ్ చెయ్యి మెసెజ్ ఒకసారి అని చెప్పి చాల లేట్ అయింది మాలతి పడుకో ఐ విల్ టేక్ కేర్ అఫ్ ఇట్ అని గుడ్ నైట్ చెప్పాడు. మాలతి కి కొంచెం రిలాక్స్డ్ గ అనిపించింది. మరుసటి రోజు గౌరవ్ క్లినిక్ కి వెళ్ళాడు మాలతి విషయం గురించి ఆలోచించసాగాడు. ఇంతలో గుడ్ మార్నింగ్ అంకుల్ అంటూ చింటూ పలకరించాడు. వెరీ గుడ్ మార్నింగ్ అని ఎలా వున్నావు చింటూ అన్నాడు. చింటూ కి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. క్లినిక్ లో అడ్మిట్ అయ్యి ఆబ్సెర్వేషన్ లో వున్నాడు. గౌరవ్ ఫోన్ లో రోజు గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఆ రోజు కూడా అంకుల్ ఫోన్ ప్లీజ్ అన్నాడు. ఓన్లీ వన్ అవర్ అంటూ చేతిలో పెట్టి రౌండ్స్ కి వెళ్ళిపోయాడు. మాలతి మిస్డ్ కాల్ విషయం మర్చిపోయాడు. అంతలో చింటు మల్లి వచ్చి అంకుల్ ఫోన్ ప్లీజ్ అన్నాడు. గౌరవ్ నో చింటు నీ వన్ అవర్ కోట అయిపొయింది కదా అన్నాడు. చింటు బుంగమూతి పెట్టి నర్స్ అంకుల్ ఆడుకున్నాడు కదా ఇప్పటిదాకా అన్నాడు. గౌరవ్ నొసలు ముడిపడ్డాయి . నర్స్ అంకుల్ ఎవరు అన్నాడు. రోజు వచ్చి జ్వరం చూస్తారు కదా ఆ అంకుల్ అన్నాడు. గౌరవ్ నవ్వి ఓకే ఆడుకో కానీ ఓన్లీ 15 మినిట్స్ అంతే ..నేను ఒక పేషంట్ ని చూసి వస్తాను అని అక్కడనుంచి వెళ్లి నట్లు నటించి చింటు ని గమనించసాగాడు. ఇంతలో కంపౌండర్ వచ్చి హాయ్ చింటు అని చింటూ జ్వరం చూస్తూ ఇదిగో లేటెస్ట్ ఫోన్ చూడు నీకోసం తెచ్చాను అంటూ చింటూ ముందు పెట్టాడు. చింటు గౌరవ్ ఫోన్ ఫోన్ పక్కన పెట్టి కంపౌండర్ ఫోన్ అటు ఇటు తిప్పి చూడ సాగాడు. కంపౌండర్ అంతలో గౌరవ్ ఫోన్ ను చూడసాగాడు. గౌరవ్ ఇంతలో గబగబా కంపౌండర్ దగ్గరకు వచ్చి నారాయణ నా ఫోన్ తో నీకేం పని ఎం చూస్తున్నావు అని గద్దించి అడిగేసరికి నారాయణ అది అది ఏమి లేదు సర్ అని తత్తరపాటుతో వెళ్ళిపోయాడు. గౌరవ్ ఎంక్వయిరీ చేస్తే మాలతీ ఇంట్లో పనిచేసే సుబ్బులు భర్త నారాయణ. మొదట్లో గౌరవ్ పేరుతో మేసేజెస్ పంపింది నారాయణ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్. ఎందుంకంటే ఎంక్వయిరీ చేస్తే గౌరవ్అ పేరు బయటకి వస్తుంది అనుకున్నాడు. అనుకోకుండా అదే గౌరవ్ తో పెళ్లి సెటిల్ అయింది మాలతి కి. చింటూ దగ్గర ఫోన్ లో మేసేజెస్ మరియు ఇంట్లో సుబ్బులు చెప్పే విషయాలతో మాలతికి మేసేజెస్ పంపిస్తూ సైకో ల ఆనందిస్తూ ఉండేవాడు. ఆఖరికి చింటూ వల్ల అసలు విషయం బయట పడింది. సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేస్తామనే సరికి నారాయణ మాలతీ కాళ్ళ మీద పడ్డాడు. మాలతీ ఆశ్చర్యంగా చూస్తుంటే గౌరవ్ విషయం అంత వివరంగా చెప్పేసరికి నోట్లో మాట రాలేదు మాలతికి. చివరికి పెద్దవిషయం కాకుండా ఇద్దరు నారాయణను మందలించి వదిలేసారు. పెళ్లి దగ్గరపడింది అందరు హవిడిలో ఉన్నారు. ఇంతలో కోటేశ్వర రావు గారు మాలతీ దగ్గరకు వచ్చి మాలతీ ఎవరిదో మిస్సెద్ కాల్ ఉంది చూడమ్మా అనగానే మాలతీ కంగారుగా ఫోన్ తీసికొని చూస్తుంటే గౌరవ్ మెసెజ్ " భయపడ్డావా !! హ్యాపీ వాలెంటైన్స్ డే మాలతి!! విత్ లాట్స్ అఫ్ లవ్ -ఆల్వేస్ యువర్స్ గౌరవ్ " అని ఉంది. మాలతి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంది.

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల