అరటి అనుబంధం - Bhaskar Kantekar

Banana supplement

"నాన్న నీకు అరటి పళ్లంటే ఎందుకంత ఇష్టం" అనడిగాడు నిఖిల్, తన చేతిలోనే అరటి పండును నాన్నకు అందిస్తూ .

ఆనంద్ పండు తన చేతిలోకి తీసుకుంటూ " ఎందుకంటే అవి రుచిగా ,తియ్యగా ఉంటాయి కాబట్టి " అన్నాడు .

అంత కంటే ఎక్కువ చెప్పిన అర్థం కానీ వయసు నిఖిల్ ది.

ఇంతలో వంటింట్లో కోసిన ఆపిల్ ముక్కల్ని ప్లేట్లో తీసుకొని వచ్చి , "నాన్న గారికి షుగర్ కదా , నో టు బనానా" అంటూ ఆనంద్ చేతిలోని అరటిపండును లాగేసుకున్నట్లుగా తీసుకుని తన చేతిలోని ఆపిల్ ప్లేట్ ని పెట్టింది వనజ.

ఒకప్పుడు అరటి పల్లే అతని భోజనం.

డజను పళ్ళు కూడా ఒకేదాటి లో తినేసే వాడు.

అరటి పళ్ళు చూస్తే అతని మనసంతా జివ్వున లాగుతుంది, కానీ మాయదారి చక్కెర రోగం అతని నాలుకకి అడ్డుకట్ట వేస్తుంది.

ఆరటి పళ్లతో ఆనందరావుకి చాలా దగ్గరి అనుబంధం.

పిల్లలు అరటి పళ్ళు తింటున్నప్పడల్లా, తన మనసు డిగ్రీ చదుకునే రోజుల్లోకి వెళుతుంది.

##### ######## ######

మధ్యహ్నం ఒంటి గంట..

ఆనంద్ బస్ స్టాప్ లో నిలబడ్డాడు, కళ్ళు తిరగి ఎప్పుడు పడి పోతాడో తెలియని పరిస్థితి. అన్ని బస్సులు వస్తున్నాయి కానీ అఫ్జల్ గంజ్ వెళ్లే బస్ మాత్రం రావట్లేదు.

చివరకు ఓ బస్ విచ్చింది.కానీ దాంట్లో కాలు పెట్టే సందు లేదు. కాలేజి విద్యార్థులతో క్రిక్కిరిసి ఉంది. అతని ఒంట్లో సత్తువ లేదు, పైగా ఈ బీడులో బస్సెక్కాలి అంటే అతనితో అయ్యేటట్టు అనిపించలేదు.

మరొక బస్ వొచ్చింది. దాని పరిస్థితి అంతే.బస్ డోర్ దగ్గర , జనాలు తాటి కాయల్లా వేలాడుతున్నారు.పడతామన్నా భయం కూడా లేదు.

అలా అర గంట గడిచిపోయింది. ఈ సారి వచ్చిన బస్ లో జనాలు కొంత తక్కువే! గబగబ ఎక్కేసాడు , కూర్చోడానికి సీటయితే లేదు కానీ పక్కనే ఉన్న సపోర్ట్ రాడ్ దొరికింది .దానికి ఆనుకొని నిలబడ్డాడు.
బస్ మెల్లిగా కదులుతుంది. డ్రైవర్ ప్రాబ్లమో లేక బస్సుదో తెలియదు కాని , బస్ చాలా మెల్లిగా వెళుతుంది. అప్పుడర్థమయ్యింది ఆనంద్ కు, బస్స్ కాళీ గా ఎందుకు ఉందో!

కండక్టర్ వొచ్చి టికెట్ అన్నాడు.

పాస్ అన్నాదు ఆనంద్ తన అరచేతిని చూపిస్తూ.
.
కండక్టర్ పాస్ చుపించామన్నట్లు సైగ చేస్తే , చొక్కా జేబులోంచి తీసి చూపించాడు ఆనంద్.

వ్యాలి డిటి చెక్ చేసి ,ఒకే రైట్ రైట్ అంటు ముందుకు వెళ్ళిపోయాడు కండక్టర్.

ఆ కాలంలో బస్ పాస్ విద్యార్థుల పాలిట వరం. ఇరవై ఐదు రూపాయలకే నెలంతా తిరగొచ్చు.సీటీ మరియు సబర్బన్ రెంటిలోను చెల్లేది..
నెలకి ఏదో విదంగా ఇరవై ఐదు రూపాయలు కడితే , నెలంతా ఏ పచ్చ బస్సెక్కినా చెల్లిపోయేది.

మొత్తం మీద ఒకటిన్నరకు అంబర్ పేట దగ్గర బస్ ఎక్కితే, రెండున్నర గంటలకు అఫ్జల్ గంజ్ చేరుకుంది. బస్ దిగి ముందు చుట్టూరా చూసాడు.
రెండు మూడు అరటి పళ్ళ తోపుడు బండ్లు కనిపించాయి. పరుగు లాటి నడకతో వాటి దగ్గరికి చేరి , బస్ పాస్ మధ్యలో పెట్టిన రెండు రూపాయలు బయటకు తీసి అరటి పళ్ళతనికి ఇచ్చాడు ఆనంద్.

నాలుగు అరటి పళ్ళు ఆనంద్ చేతికిచ్చాడు ఆ పళ్ళత ను. అతని పేరు మస్తాన్ . ఆడపా దడపా వస్తుండడం వలన ఆనంద్ ను గుర్తుపట్టేవాడు.

అక్కడే నిలబడి ఆ పళ్లను గబా గబా తినేసాడు ఆనంద్.

తను తినే పద్ధతి చూసి ' ఆకలితో ఉన్నది గ్రహించిన ' మస్తాన్ ఇంకో అరటి పండును అధనంగా ఇచ్చాడు. అది కుడా తినేసి బ్రేవ్ మన్నాడు ఆనంద్'.

అదే అంబరుపేట లో రెండు రూపాయలకు ఇన్ని అరటి పళ్ళు దొరికెవి కావు .దొరికినా ఇంత నాణ్యన్గా ఉండేవి కావు.మా అంటే ఓ రెండిచ్చి సరిపోనిచ్చేవారు. ఎగస్ట్రా పల్లకి పళ్ళు మరియు తన చదువు రెండు పనులు జరిగి పోయేవి.

ఇక్కడ టేలాపై పండ్లు అమ్మేవాళ్లు హోల్ సెల్లర్ కాబట్టి, అది కాక పెద్ద సెంటర్ కూడాను, అందు వలన కొంచెం చౌక.

ఆనంద్ ఇంత దూరం రావడానికి ఈ ఒక్క కారణమే కాదు , ఇంకో కారణం కూడా వుంది. అది పక్కనే ఉన్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీ.

అరటి పళ్లతో కడుపు నింపుకున్నాక, లైబ్రరి లోకి అడుగు పెట్టాడు. అది స్టేట్ సెంట్రల్ లైబ్రరీ.ఎన్నో బుక్స్ -ఎన్నో సెక్షన్స్. అకాడమిక్ బుక్స్ దగ్గర నుండి నవలలు , కథలు ఒకటేంటి చాలా రకాలు ఉంటాయి. అంతే కాదు అక్కడ వార్తా పత్రికలను రోజు వారీగా తేదీ అనుసారంగా అమరుస్తారు. కొన్ని ఏళ్ళ కిందటి న్యూస్ పేపర్స్ కూడా అక్కడ లభ్యమౌతాయి.

ఆనంద్ కు రోజు పేపర్ కొనే స్తొమత లేదు. అతడు ఉండే హాస్టల్ లో పేపరు వచ్చినా ,దానిని పేపరులా ఉంచే వారు కాదు. అందుకై ఒక వారం రోజుల పేపర్స్ అన్ని ముందు వేసుకొనే కూర్చునేవాడు ఆనంద్. ఒక్కోసారి పేపర్స్ అలాగే చదువుతూ నిద్రలోకి కూడ జారుకొనేవాడు. రెసెర్చ్ చేసేవారికి,డిటెక్టివ్స్ కి, పాత్రికేయులకు ఈ గ్రంధాలయం బాగా ఉపయోగకారి.

గ్రాడ్యుయేషన్ రోజుల్లో హాస్టల్ వుండే రోజులవి.

హోస్టెలో ఒక పూట భోజనం మానేస్తే ,పదిహేను నుండి ఇరవై రూపాయల లెక్క కట్టి నగదు నెలాఖరులో ఇచ్చేవారు.
ప్రభుత్వం నుండి మెస్ చార్జీల నిమిత్తం నెలకు రూ.2000 ఉపకారావేతం వచ్చేది. .ఇలా నెలకి ఓ ఐదు రోజులు ఒక పూట మానేస్తే ,ఓ వంద మరియు నాలుగు సండేలు , ఇంకా హాలిడేస్ కలిపి మొత్తం రెండు మూడు వందలు పాకెట్ మని సంపాదించడం కోసం ఇలా చేయవలసి వచ్చేది ఆనంద్ కు.

ఆ డబ్బులతో సబ్బులు, తలకు కావాల్సిన నూనె, బస్సు పాస్ రెన్యూవల్స్ లాంటివి సమార్చుకొనేవాడు.

ఆ విదంగా అరటి పల్లతో బంధం ఏర్పడింది ఆనంద్ కు. అటు పళ్ళు , ఇటు బుక్స్ , న్యూస్ పేపర్స్ , టైం పాస్ అన్ని కలసి వచ్చేవి.

ఇంతే కాదు తన జీవితం లో చెప్పుకోదగ్గ మలుపు కూడా ఇక్కడే జరిగింది.

లైబ్రరీ ముందు ఒక వటవృక్షముంది.దానికి చుటీచరా చిన్న అరుగు కట్టి ఉంటుంది , అది పాఠకులకు చదువుకునేందుకు వీలుగా ఉంటుంది.
దాని పైన కూర్చుని నోట్స్ రాసుకునే వాడు ఆనంద్.రోజు వచ్చి బుద్ధిగా రాసుకోవడం ,ఒక పెద్ద మనిషి దృష్టిని ఆకర్షించింది.
అదే ఆనంద్ కి టర్నిన్గ్ పాయింట్.

@@@@@@@@@


వయసు పైబడటం వలన మధుమేహం బారిన పడ్డాడు ఆనంద్.

అది ఒక ఆది వారం .

ఈ రోజు ఎలాగైనా స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాలనుకున్నాడు. కారు తీద్దామంటే ఇంట్లో వనజకు ,పిల్లలకు సంజాయిషీ ఇచ్చుకోవాలి.

అందుకోసం ఎవ్వరికీ చెప్పకుండా , క్యాబ్ బుక్ చేసుకుని సెంట్రల్ లైబ్రరీ చేరుకున్నాడు.

లైబ్రరీ భవనం లో పెద్ద మార్పు ఏమి కనిపించే లేదు. అవ్వే మెట్లు. అలాగే సెక్షన్స్, అదే సైలెన్స్ బోర్డు.

తాను ఎప్పుడు కూర్చునే ఆ టేబుల్ , ఆ కుర్చీ లు మాత్రం లేవు.వాటి స్థానంలో కొత్త ఫర్నిచర్. ఆ చెట్లు , అక్కడి మొక్కలు, ఆ వాతావరణం మనసును ఎక్కడికో తీసుకెళ్తున్నాయి.

ఆ జీవితం ఎంత మదురం.

ఇక్కడికి తన జీవితంలో ఎన్ని సార్లు వచ్చాడొ. లైబ్రరీ ముందున్న ఆ పెద్ద చెట్టు ఇంకా అలాగే ఉంది. అది ఆనంద్ కాలేజి రోజుల్లో ఉన్నదే.

ఏదో పుస్తకం పట్టుకొని అక్కడ కూర్చుని చదువుతూ ఉంటే సాక్షాత్తు సరస్వతియే అతని మస్తిష్కంలోకి వెళుతున్న అనుభూతి పొందేవాడు ఆనంద్.ఆ చెట్టును ఎలా మరవగలడు.దాని క్రింద కొద్దీ సేపు కూర్చుని అలనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు.

చదువు పై ఆసక్తి మరియు శ్రద్ధ ఉందన్న నిజాన్ని తన గురువుకు పరిచయం చేసిన స్థలం అది .ఆనంద్ కు తన గురువు గారితో పరిచయం ఏర్పడింది ఈ చెట్టు క్రిందే. రోజు ఇక్కడకు రావటం చూసి,తనకు ఒక దారి చూపాడు. ఒక సారి ఆనంద్ తన ఆర్థిక సమస్యలు అతనికి వివరిస్తూ కన్నీటి పర్యంతం అయ్యాడు.

ఇదే అరుగు పై అతను తన గురువు గారు కూర్చొని ఏమేమో చర్చించేవాళ్లు. డిగ్రీ అయిన తరువాత ఆయన ఇచ్చిన సూచనలు , చేసిన ఆర్థిక సాయం మరవ లేనివి. తలచుకొంటు కళ్ళు తడి చేసుకున్నాడు ఆనంద్.

ఉద్యోగ రీత్యా హైద్రాబాద్ వదిలి వేరే రాష్ట్రానికి వెళ్లడం, తరువాత జీవితంలో ,ఆర్థిక పరిస్థితులలో ఎన్నో మార్పులు రావడం , కాలక్రమేణా ఈ ప్రదేశ్హానికి రావడం కుదరక పోవడం, అన్ని అలాగ కలగమనంలో వెనక్కి వెళ్లాయి.

అక్కడి ప్రదేశాలను చెట్లను పుట్టలను చూసిన తరువాత , అక్కడ స్టాఫ్ తో తనకున్న అనుబంధం తాజా చేసుకోవడానికి లోనికి వెళ్ళాడు.చాలా మంది కొత్త స్టాఫ్. ఎవరు తనని గుర్తించే స్థితిలో లేరు.

అక్కడి పుస్తకాలను, పుస్తకాలను మోస్తున్న ఆరలను తనకు ఎప్పటినుంచో పరిచయమున్న మిత్రులను కలిసినట్లు కలిసాడు, చుట్టూ ఆప్యాయతో ఆ ప్రదేశాన్నంత కలియ చుసాడు.

తరువాత బయటకు వచ్చి అరటి పండ్ల బండి కోసం అటు ఇటుచూసాడు తన కళ్ళద్దాలు సర్దుకొంటు.

లైబ్రరు లోంచి బయటకు వొచ్చి , రోడ్డు క్రాస్ చేసి, ఆ అరటి బండి దగ్గరకు వచ్చి, యాబై రూపాయలు అతని చేతులో పెట్టాడు.

అతను ఓ డజను పళ్ళను అందిస్తూ ఆనంద్ ముఖం చూసి ,"అరె సార్ మీరు , అబ్బో ఎన్ని రోజులకు దర్శన మిచ్చారు" అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు.

తాను అంత తొందరగా గుర్తుపట్టలేదు.తరువాత మస్తాన్ భాయ్ అంటూ ఇద్దరు కొగిలించుకున్నంత పని చేసారు. మస్తాన్ తన పక్కన ఉన్న చైర్ వేసి ఆనంద్ ని కూర్చుండ బెట్టి , పక్కన టీ షాపతనికి చాయ్ తీసుకురమ్మని కేకేసాడు.
మస్తాన్ కళ్ళలో మెరుపు.ఆనంద్ కళ్ళలో సంతోషం. రెండు వెలగట్టలేనివి.

కుశల ప్రశ్నలు వేసుకున్న తరువాత, అక్కడే నిలబడి, ఓ అరటి పండు వొలిచి తిని తొక్కను క్రింద ఉన్న బుట్టలో వేసాడు.

అక్కడ నిలబడి చూస్తే, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కనిపిస్తుంది .

లైబ్రరీ అక్కడ నుంచి ఎంతో అందంగా కనిపించ సాగిందీ. ఆ సంతోష భావనలో అదొక తాజ్ మహల్.

తాను తన జీవితంలో ఎన్నో గ్రంథాలయాయేలు చూసాడు, ఖరీదైన యూనివర్సిటీ గ్రంథాలయాలు , ప్రైవేట్ గ్రంథాలయాలు, విదేశీ గ్రంథాలయాలు. ఒక్కో గ్రంథాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నప్పటికీ,ఈ గ్రంథాలయం ఆనంద్ కి ఒక ప్రత్యేకత.అతని జీవితం లో ఒక పార్స్వం ఈ ప్రదేశం, ఈ ప్రదేశంలోని లైబ్రరి ముడి పడి ఉన్నాయి.

తన ముందు తాజా పండ్లు ఎన్నో రకరకాలవి ఉన్నపటికీ ,అతని మనసు అరటి పళ్ళ వైపే మొగ్గుచూపినట్లు,...

మరిన్ని కథలు

Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు