ధర్మ మార్గం - బోగా పురుషోత్తం

right way

గంగయ్య, గోపయ్య ఇద్దరూ స్నేహితులు . ఇద్దరిది ఒకే ఊరు. గంగయ్య, గోపయ్య మధ్య సఖ్యత వున్నా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది.

గంగయ్యకు వందల ఎకరాలు పొలాలు వున్నాయి. దీంతో పాటు ఇరవై గేదెలు, పది ఆవులు వున్నాయి. వాటి నుంచి వచ్చే పాలను స్వయంగా ఊరూరు తిరిగి అమ్మే వాడు.

గోపయ్యకు వంద ఎకరాల పొలం వుంది. దీనితో పాటు వంద గేదెలున్నాయి. వాటినుంచి వచ్చే వెయ్యి లీటర్ల పాలను పాల డెయిరీకి అమ్మే వాడు.

గంగయ్య మొదట్లో నాణ్యమైన పాలను నిజాయతీగా అమ్మేవాడు. క్రమక్రమంగా ఆ ఊర్లో గంగయ్య పాలకు గిరాకి పెరిగింది. ఇది గోపయ్యకు మింగుడు పడలేదు. తన పాలు బాగున్నా ఊర్లో కొనకపోవడంతో ఇరవై కిలో మీటర్ల దూరంలోని పాల డెయిరీకి సరఫరా చేసేవాడు. రవాణా ఖర్చులు, గేదెల దాణాకు అయ్యే ఖర్చు తడిసి మోపెడై భారంగా మారింది. వచ్చే లాభం తగ్గడంతో సలహా కోసం గంగయ్యను కలిశాడు.

" అయ్యా నమ్మకమే ప్రధానం .. పాలు ఎంత నాణ్యతగా వుంటే మనకు అంతే డిమాండు పెరుగుతుంది. మరి విశ్వాసం కోల్పోకూడదు.. "అని హితవు పలికాడు గంగయ్య .

గంగయ్య సలహా నచ్చలేదు గోపయ్యకు. " నువ్వు పాతకాలం మనిషివి.. ఇంకా ఈ రోజుల్లో నిజాయతీ, గిజాయతీ అంటున్నావు.. అలా ఉంటే బతకలేము.. బయట మార్కెట్లో చూడు.. అంతా కల్తీయే.. వారంతా బాగా బతుకుతున్నారు.. మనం ఇలా వుంటే ఎక్కడ వున్న వాళ్లం అక్కడే వుంటాం.. నేను చూడు.. పాలలో పాల పొడి కలిపి నీళ్లు ఎక్కువ పోసినా పాలు చిక్కగా వున్నాయి.. డెయిరీ వాళ్లు కొనుక్కోవట్లే దా ?... నువ్వూ నన్ను అనుసరించు .. కాస్తయినా వృద్ధిలోకి వస్తావు.. "అంటూ కపట ప్రేమ ఒలకబోశాడు.

గంగయ్య తల అడ్డం తిప్పాడు. " ఆలా చెయ్యకూడదు.. మోసం ఎప్పుడైనా మనిషిని పతనం చేస్తుంది. ధర్మ మార్గమే మనల్ని ఉన్నతుల్ని చేస్తుంది. " అని తన మనసులోని మాటను కల్మషం లేకుండా చెప్పాడు గంగయ్య .

గంగయ్యకు ఎలా చెప్పినా తన మాట వినిపించుకోడ ని తెలిసింది గోపయ్యకు. ఇక చేసేదేమీలేక అతని పతనానికి మరో మార్గం వెతికాడు.

చూస్తుండగానే గోపయ్య నిజాయతీని అతడిని ఉన్నతుడిని చేసింది. ఆ ఊరిలోనే కాకుండా పక్క ఊళ్ళ నుంచి కూడా జనం పాలను కొనుగోలు చేసి తీసుకెళ్లసాగారు. దీంతో గోపయ్య పాల వ్యాపారం కోట్ల రూపాయలకు చేరింది. కళ్ల ముందే తన కంటే ధనవంతుడు కావడం గోపయ్యకు మింగుడుపడలేదు.

రోజూ గోపయ్య పాలు లారీలో పాల డెయిరీకి వెళుతున్న సమయంలో లారీ డ్రెయివరు తో ఒప్పందం కుదుర్చుకుని గంగయ్య పాలలో నీళ్లు కలిపే ఏర్పాటు చేశాడు . డెయిరీ వాళ్లు గంగయ్య పాలలో నీటి శాతం ఎక్కువవుందని డెయిరీ వాళ్లు తిరస్కరించారు. మరుసటి రోజూ అదే పరిస్థితి ఎదురయింది.

గంగయ్య షాక్ కు గురయ్యాడు. తాను నాణ్యమైన పాలనే సరఫరా చేస్తున్నా ఇలా జరగడానికి కారణం ఎవరో తెలియక జుట్టు పీక్కున్నాడు. తిరిగివచ్చిన పాలను తానే స్వయంగా ఊరూరు తిరిగి అమ్మి సొమ్ముచేసుకున్నాడు. ఆ తరువాత డెయిరీకి పాలను పంపడం ఆపివేసి తనే కష్ట పడి ఊరూరు తిరిగి విక్రయించసాగాడు. నిజాయతీగా అమ్మడంతో అధిక సంఖ్యలో ప్రజలు గంగయ్య పాలను కొనుగోలు చేయసాగారు.

రోజురోజుకు గంగయ్య వ్యాపారంగా వృద్ధి చెందసాగింది. దీంతో గోపయ్య గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకుంటే మరింత వేగంగా అభివృద్ధిలో దూసుకు పోవడం జీర్ణించు కోలేకపోయాడు. తన వ్యూహం బెడిసికొట్టినందుకు దీర్ఘ ఆలోచనలో పడ్డాడు.

ఓ నెల రోజులు గడిచాయి . మళ్లీ గంగయ్యను చావు దెబ్బ తీయాలనుకున్నాడు . తన పాల వ్యాపారానికి అడ్డు రాకుండా శాశ్వతంగా తొలగించాలనుకుని పథకం వేశాడు గోపయ్య. మరుసటి రోజే నలుగురు కిరాయి రౌడీలను పంపాడు. గంగయ్య పాలను అమ్మేందుకు బయటి ఊరుకు వెళుతున్న సమయంలో వారు చెట్ల చాటున మాటువేసి హత మార్చి వెళ్లిపోయారు.

ఆ తరువాత గోపయ్య ఇక తన వ్యాపారానికి ఎదురే లేదని సంబర పడ్డాడు. రెండునెలలు గడిచాయి. ఓ రోజు నలుగురు పోలీసులు వచ్చి గోపయ్యను పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు. అరెస్టుచేసి కోర్టుకు తరలించారు. కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. గోపయ్య జైలుకు పరిమితమయ్యాడు. అతని వద్ద పనిచేస్తున్న కూలీలు ఒక్కొక్కరూ తప్పుకున్నారు. ఇక అతని కొడుకు సహకారం అందించే వారులేక నిరుత్సాహంతో మవునంగా వుండిపోయాడు.

గంగయ్య వద్ద వున్న కూలీలే అతని వ్యాపార లావాదేవీలు నిర్వహించడంతో అతని కొడుకు నెమ్మదిగా వ్యాపార లావాదేవీలు నేర్చుకుని లాభాల బాట పట్టాడు. తన తండ్రి నడిచిన ధర్మ మార్గాన్ని అనుసరించడంతో అచిర కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు.

గోపయ్య అనుసరించిన అధర్మ మార్గంతో నే తన జీవనం పతనమయిందని గ్రహించాడు గోపయ్య కొడుకు . నెమ్మదిగా గంగయ్య కొడుకు పట్టిన ధర్మమార్గాన్ని అనుసరించి అందరి తో సఖ్యతగా మెలగుతూ ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నతస్థితికి చేరి తన తండ్రి తెచ్చిన అపకీర్తిని తొలగించుకున్నాడు గోపయ్య కొడుకు గోపి..

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి