బొమ్మలు చెప్పిన కమ్మనికథలు - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

chitrangi Fairy tales told by dolls

ఓక శుభ ముహూర్తాన పండితులు వేద మంత్రాలు పఠిస్తుండగాతన పరివారంతో బోజ రాజు రాజ సభలో ప్రవేసించి విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి మెట్లుఎక్కుతూ ఇరవై ఓకటో మెట్టుపైన కాలు మోప బోయా డు. ఆ మెట్టు పై ఉన్న బంగారు సాల భంజికం 'కనక రంజిత వళ్ళి 'ఆగు భోజరాజా అడుగు ముందుకు వేసే సాహసం చేయకు. పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షణ, ఊర్ధ్వ,అధః,ఆగ్నేయ,నైఋతి, ఈశాన్య, వాయువ్య, దశ దిశలా పేరు పోందిన విక్రమార్కుడు పరిపాలించిన సింహాసనం అది.అతని దాన వీర పరాక్రమాలు తెలిపే కథ చెపుతాను విను.. ఉజ్జయిని రాజ సభలో విక్రమార్కుడు సామంత రాజులు, నగర ప్రముఖుల తో సభ తీరి ఉండగా , ఓక యువతితో ప్రవేసించిన యువకుడు 'జయము జయము మహారాజా నా పేరు 'చిత్రసేనుడు' ఈమె నా భార్య 'చిత్రాంగి' మేము గంధర్వులం. శాప వశాత్తూ భో లోకంలో మేము కొంత కాలం నివసించ వలసి వచ్చింది. నేటితో మాకు శాప విమోచన తీరింది కాని మహా రాజా, మరి కొద్ది సేపట్లో దేవతలకు, రాక్షసులకు ఆకాశ మార్గాన యుధ్ధం జరగబోతుంది. ఆ యుధ్ధలో నేను దేవతల పక్షన పోరాడ బోతున్నాను నేను తిరిగి వచ్చే వరకు నా భార్యకు సురక్షితమైన ప్రదేశంలో ఉంచడానికి వెదుకుతూ తమ ఆశ్రయం కోరి వచ్చాను. మీరు అనుమతిస్తే నా భార్యను తమ రక్షణలో వదలి యుధ్ధానికి వెళతాను' అన్నాడు. 'మిత్రమా చిత్రసేన నీ భార్యను మా యింటి ఆడ పడుచులా చూసుకుంటాను ధైర్యంగా యుధ్ధలో పాల్గోని విజయంతో తిరిగిరా!' అన్నాడు విక్రమార్కుడు. తన భార్యచే కుడి చేతికి వీర కంకణం కట్టించుకుని నుదుట వీర తిలకం దిద్దగా మంగళ హారతి అందుకుని ఎడమ చేతిలో డాలు కుడి చేతిలో కత్తి ధరించి సభకు నమస్కరించి రివ్వున ఆకాశ మార్గానికి వెళ్ళి పోయాడు. చిత్రసేనుడు. మరుక్షణం ఆకాశంలో హహాకారాలు, గాయ పడిన వారి మూలుగులు, కత్తుల శబ్ధాలు యుద్ద భెరీలు ఆకాశం నుండి వినిపించ సాగాయి. కొద్ది క్షణాల అనంతరం చిత్ర సేనుడి కుడి చేయి కత్తితో సహా ఆకాశం నుండి వచ్చి రాజ సభలో పడింది. అతని చేతికి ఉన్న వీర కంకణం చూసి సభికులంతా అది చిత్ర సేనుడిదిగా తెలుసుకున్నారు. చిత్ర సేన విలపించ సాగింది.కొద్ది క్షణాలలో ఆకాశం నుండి చిత్ర సేనుడి తల దొర్లుకుంటూ వచ్చి రాజ సభలో పడింది. అది చూసిన చిత్రసేన 'నా భర్త లేని జీవితం వృధా' అని చిత్ర సేనుడి కత్తిని చెతిలో నికి తీసుకుని గుండెల్లో బలంగా దించుకుని మరణించింది. ఆమెను భటులు తీసుకు వెళ్ళారు. రాజ సభ లోని వారంతా చిత్రాంగి చర్యకు నివ్వేర పోయి చింతించ సాగారు. ఆకశంలో శబ్ధాలు ఆగి పోయాయి. కొద్ది సేపటికి రక్త సిక్తమైన శరీరంతో చిత్ర సేనుడు ఆకాశం నుండి రాజ సభలో ప్రవేసించి 'మహా రాజా యుధ్ధంలో రాక్షసులు పలు మాయలు సృష్టించినా తుదకు దేవతలనే విజయం వరించింది. నా భార్వను పిలిపించండి' అన్నాడు. తమ కళ్ళ ముందు జరుగుతుంది కలో నిజమో తెలియని సభికులంతా అయోమయానికి లోనయ్యారు. నవ్వుతూ సభ లోని వారందరికి నమస్కరిస్తూ ప్రవేసించింది చిత్రాంగి. 'మహా రాజా నా ఇంద్రజాల విద్య మిమ్ములను ఇబ్బంది పెడితే మన్నించండి' అన్నాడు చిత్ర సేనుడు. సభ లోని వారితో పాటు ఆ ఇంద్ర జాల విద్యకు సంతసించి, చిత్ర సేనుడి దంపతులు మోయ గలిగినంత బంగారాన్ని బహుమతిగా ఇచ్చి వారిని గౌరవించాడు. భోజ మహారాజా నీ జీవిత కాలంలో అటువంటి ఇంద్రజాల ప్రదర్శన చూసావా? నీవు ఎప్పుడైనా అంతటి బంగారాన్ని దానం చేసావా? అలా అయితే ఈ సింహాసనం అధిష్టించు లేదా వెను తిరుగు' అన్నది సాలభంజికం. అప్పటికే ముహూర్త సమయం మించి పోవడంతో తన పరివారంతో వెను తిరిగాడు భోజ రాజు.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు