ఆకర్షణ - రమేష్ మాచాభక్తుని

Aakarshana

రెండు మనసులు మధ్య ప్రేమ పుడుతుంది..ఇద్దరు వ్యక్తులు మధ్య ఆకర్షణ పుడుతుంది....ఇంగ్లీష్ కవి. అవును...ఇద్దరు మనుషుల మధ్య ఆకర్షణ ఏర్పడి ...అది కొనసాగి... కాలక్రమేణా రూపాంతరం చెంది ...ప్రేమ అనే భావన గా మారుతుంది..అప్పుడు మనసు మాట్లాడుతుందేమో ప్రేమ ఊసులు... ఏది ఏమైనా...అభిమానం,ఆకర్షణ,ఆరాధన,ప్రేమ...ఇవన్ని బహుశా...పర్యాయ పదాలేమో..స్థాయిలలో,వయసులో తేడా ఉంటుందేమో.. **** స్థలం :- 8వ తరగతి క్లాసురూమ్ ప్రదేశం :- ప్రకాశం జిల్లాలోని ఓ హైస్కూల్ విషయం :- 1987 విద్యా సంవత్సరంలో ఇంటర్ స్కూల్స్ వార్షికోత్సవం సందర్భంగా నుండి...నాటిక ల పోటీల లో పాల్గొనలనే...నిర్ణయం బాధ్యత :- రామమూర్తి మాస్టర్ కు అప్పగింత.. తోడ్పాటు :- సింగయ్య మాస్టారు..కొత్తగా విధులలో చేరిన బాలరాజు మాస్టర్ కు అప్పగింత.. " రామమూర్తి మాస్టారు...ఈ సంవత్సరం మన పాఠశాల నుండి మంచి నాటిక 8వ తరగతి విద్యార్థులు చేత ప్రదర్శిoపచేయాలని ప్రధానోపాధ్యాయులు చెప్పారు.." అన్నారు సింగయ్య మాస్టారు. "అలాగే మాస్టర్.."అన్నారు రామమూర్తి గారు. "నాటిక గొప్పగా ఉండాలి.మన పాఠశాల కు పేరు తెచ్చే విధంగా ఉండాలి "...శింగయ్య గారు. "మీకు సహకారం అందించానికి మన పాఠశాల కు కొత్తగా వచ్చిన బాలరాజు మాస్టారు కూడా సిద్ధంగా ఉన్నారు.." "ఏమిటి...మాస్టారు ..."అని కొత్తగా చేరిన మాస్టర్ ను ఉద్దేశించి అడిగారు. "అలాగే..." అన్నారు బాలరాజు గారు రామమూర్తి గారు మాట్లాడుతూ.."నిన్న రెండు మూడు నాటికలు పరిశీలించాను.వాటిలో ...పోలయ్య కాపురం అనే నాటిక నాకు నచ్చింది..చక్కని కుటుంబ వాతావరణం,సామాజిక స్పృహ నిండిన కధ అది " అన్నారు. "అయితే మనకు హర్మోనియం అవసరమవుతుంది.మన నాటిక ప్రాక్టీసు సమయంలో కూడా కావలసి ఉంటుంది..." అన్నారు రామమూర్తి మాస్టారు మిగిలిన వారిని ఉద్దేశించి... వెంటనే..."మాస్టారూ...మీరు హర్మోనియం విషయంలో మీరు ఎలాంటి ఆలోచన చేయనవసరం లేదు.నాకు హర్మోనియం వచ్చు.నా దగ్గర హర్మోనియం ఉంది.ఆ విషయంలో పూర్తి బాధ్యత నాది..." అని కొత్తగా చేరిన బాలరాజు మాస్టర్. సత్కార్యానికి అని సౌకర్యాలు వెంటనే సమకూరతాయనే...విషయం నిజమైంది... శింగయ్య మాస్టరు..."మనకు తక్కువ సమయం ఉంది.వీలైన తొందరగా నటీనటుల ఎంపిక జరగాలి...అలాగే వారికి పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇవ్వాలి.... హెచ్.యం.గారికి కూడా తెలియపరచాలి..."అన్నారు అనుకున్నదే తడవుగా...నటీనటుల ఎంపిక, తల్లిదండ్రుల అంగీకారం తీసుకోవటం,ప్రతి ఆదివారం స్కూల్ లో ప్రాక్టీస్...అన్ని చకచకా సాగిపోతున్నాయి. కానీ ...రామమూర్తి మాస్టారు గారికి మొదటి అంకం లో వచ్చే పోలయ్య నలుగురు పిల్లల్లో...3 వ అబ్బాయి పాత్ర పోషించే బి.శ్రీను అనే విద్యార్థి వాచకం సరిగా లేదనే గ్రహించారు. అదే విషయాన్ని ...శింగయ్య గారితో ప్రస్తావించారు... "బి.శ్రీను అనే అబ్బాయి కి డైలాగులు సరిగా పలకడం రావటం లేదు.కొంచెం ఇబ్బందిగా ఉంది వాడితో..." అన్నారు. "అదీకాక...మొదటి అంకంలో వచ్చే పోలయ్య పిల్లల పాత్రలు ఎంతో కీలకం.అందుకే వాడిని మార్చి, వేరే అబ్బాయి ని తీసుకుందాం మాస్టారు.."అన్నారు రామమూర్తి గారు "ఐతే...మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా..? ఆ పాత్ర కోసం..."అన్నారు శింగయ్య మాస్టారు "మన ఊరి వెటర్నరీ అసిస్టెంట్ శివరామయ్య గారి అబ్బాయి..8 వ తరగతి లొనే ఉన్నాడు.వాడిని తీసుకుందాం..వాడు చదువులో చురుకుగా ఉంటాడు.." అన్నారు రామమూర్తి గారు నా వైపు చూపిస్తూ... "ఏరా..నాటిక వేస్తావా.." అని అడిగారు శింగయ్య మాస్టర్ నన్ను.. ఆ గొంతు లో ధ్వనించిన ఆజ్ఞ కు నోట మాట రాలేదు. సరే... నన్నట్టు తలాడించాను. సాయంత్రం ప్రేయర్ బెల్ కొట్టడం తో, అందరు గ్రౌండ్ కు బయలుదేరాము. *** వారం రోజులు గడిచాయి.ఆ రోజు ఆదివారం..మధ్యాహ్నం పిచ్చయ్య హోటల్ పక్క సందులో జోరు గా గోలీలాట లో మునిగి పోయాము. ఇంతలో నాటిక లో ఉండే శ్రీను గాడు వచ్చాడు...మా దగ్గరకు ఆపసోపాలు పాడుతూ... 'ఓరేయ్...రమేష్...నిన్ను శింగయ్య మాస్టర్ స్కూల్ దగ్గరకు తీసుకు రమ్మన్నారు.బయలుదేరు.." అన్నాడు.. నా పై ప్రాణాలు పైనే పోయాయి. మాస్టారు కు నేను గోలీలాట ఆడే సంగతి తెలిసినట్లుంది...ఇక నా పని భజగోవిందమే...అనుకున్నా నా లాగు (ఇప్పుడు షార్ట్ లు..) జోబు నిండా గోళిలు. ఇవి చూసారో...నా వీపు విమానం మోతే...అనుకుంటూ క్లాస్ లో అడుగుపెట్టాను. లోపలికి వెళ్ళగానే ...శింగయ్య , రామమూర్తి మాష్టారులు... నోట మాట రావడం లేదు నాకు.ఈ రోజు నా పని అయిపోయినట్లే..అనుకున్నా... " ఏరా...నాటిక వేస్తానన్నావు..."అడిగారు శింగయ్య మాష్టారు. నాకైతే నన్ను పిలిచిన విషయం అర్ధమైంది.అమ్మయ్య...బతుకు జీవుడా...అనుకున్నాను. వెంటనే రామమూర్తి మాస్టరు డైలాగ్ ఇవ్వటం, చక చకా అభినయం తో చెప్పటం...ఆ పాత్ర కు నన్ను ఎంపిక చేయడం...కలలో లాగా జరిగి పోయాయి. ఇంటికి రాగానే ...జరిగిన విషయాన్ని అమ్మ,నాన్నకి చెప్పాను.అలా మొదటి నాటకం వేసే అవకాశం వచ్చింది. **** ఏప్రిల్ నెల,1987 సం. ఉదయం 10 గం.లకు మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పోలయ్య కాపురం లో ఉన్న నటీనటులు లగేజీ లతో సహా చేరాము. సుమారు 10 పాఠశాలలు నుండి పోటీల్లో పాల్గొటానికి వచ్చారు స్టూడెంట్స్.అంతా కోలాహలం గా ఉంది వాతావరణం. రామమూర్తి మాస్టర్,బాలరాజు మాస్టర్ తో కలసి వచ్చాము. మధ్యాహ్నం బోజనాలను పూర్తి చేసుకొని, మరొక్క సారి డైలాగ్స్ అన్నీ ఎవరికి వారివి ప్రాక్టీసు చేసుకొని, మొత్తం నాటిక చివరగా...ప్రాక్టీసు చేసాము. "అద్బుతంగా ఉంది.."అని మమ్మల్ని చప్పట్ల తో అభినందించారు మాస్టర్లు ఇద్దరూ.. సాయంత్రం స్నానాలు ముగించి, చెట్టు కింద నిలబడి రోడ్డు పై వచ్చే పోయే వారిని చూస్తూ నిలబడ్డాను... ఇంతలో... రెండు లేత గులాబీ రంగులో చేతులు నా రెండు కను రెప్పలను మూసివేశాయి. ఆ సంఘటన తో నిర్ఘాంత పోవడo...నా వంతైంది. పింక్ కలర్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి అక్కడ నిలబడి నవ్వుతోంది సముద్రపు అలల వలె... గాలికి అలవోకగా కదులుతున్నాయి ఆ ముoగురులు... నవ్వుతున్న ఆ కళ్ళు ఏంతో అందాన్ని అద్దాయి ఆ మోము కు... "ఎక్కడి నుంచి వచ్చింది తను? మా తరగతి కాదే.ఇక్కడికి ఏందుకు వచ్చింది..."అని నా మనసు పరి పరి విధములా ప్రశ్నిస్తుంది. ఇంతలో.."అందరూ కాలేజీకి వెళ్ళాలి.త్వరగా బయలుదేరండి.." అనే పిలుపు వినిపించింది. ఆ పిలుపు తో ఈ లోకంలో వచ్చాను. ఈ లోగా చుట్టూ చూడగానే...తను కనిపించలేదు. ఆ రోజు రాత్రి ....మొదటి సారిగా ముఖానికి రంగు వేసుకోవడం,స్టేజి ఎక్కడం, పోలయ్య గారి కుమారుని పాత్ర లో డైలాగ్స్ చెప్పడం... పోలయ్య కాపురం నాటికను...అందరి ప్రేక్షకుల హర్షద్వానాల మధ్య విజయవంతం గా పూర్తి చేసాము. తెల్లవారుజామున ఇంటికి చేరాము. సాయంత్రం బజారు లో శ్రీను కనిపించాడు.. నిన్న కాలేజిలో జరిగిన విషయం చెప్పాను వివరంగా...ఏవరని అడిగాను... "ఏమో ...రా...నాకు తెలియదు..ఏవరో... "అన్నాడు వాడు. ఎవరు ఆ అమ్మాయి...ఏందుకు అక్కడకు వచ్చింది.... ఏందుకు మళ్ళీ మళ్ళీ ...గుర్తుకొస్తుంది... అభిమానమా...ఆప్యాయత...ఆకర్షణ.. లేదా ఏమిటి..? అనే ప్రశ్న మనసును ఆక్రమించింది. ఎవరితో ఆ విషయాన్ని పంచుకోలేక...సతమవుతూ.. ఎవరికైనా చెబితే...కోప్పడతా ...రేమోనని...భయం.. ఈ వయసులో ఏమిటి ఆలోచనలు అంటారేమో... చదువుకొనే వయసులో...తప్పుకదా...అని మoదలిస్తారేమో... ఎవరికి చెప్పలేక...చెప్పుకోక.. మరల ఆ అద్భుతాన్ని...ఎక్కడన్నా తారసపడక పోతానా.....అని ఎదురు చూస్తూ...

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం