ప్రక్షాళనం - రాము కోలా.దెందుకూరు

Prakshalanam

కౌశిక్ చెప్పిన మాటలకు మోహన్ సిగ్గుతో తల వంచుకున్నాడు.. కారణం...? "రమా!" "రమా! "బయట శ్రీవారి గొంతు గర్జిస్తుంటే వంట గదిలో నుండి తొంగి చూస్తూనే.. "ఏమండి ఇక్కడే..." "వంట గదిలో ఉన్నా!ఏమైనా కావాలా!" అడిగింది రమా. "ఒక్కసారి ఇలారా...! "ఇంటి ఖర్చులు తగ్గించుకోవాలని మెన్ననే కదా అనుకున్నాం." "పద్దతి మార్చుకోకపోతే ఎలా?" "కాస్త కఠినంగా పలుకుతుంది మోహన్ స్వరం." ఎప్పుడూ కనీసం విసుగు కూడా కనిపించనివ్వని మోహన్ అలా పిలుస్తున్నాడు అంటేనే ఏదో సమస్య వచ్చే ఉంటుందని, అనుకుంటూనే వంటగదిలో నుండి చల్లని మంచినీళ్లు తీసుకుని వచ్చింది. మోహన్ చేతికి అందించింది రమా. మంచినీళ్లు త్రాగేసి బిల్లు రమా చేతికిచ్చి కాస్త రిలాక్స్ గా కూర్చున్నాడు మోహన్. బిల్లు చూసి రమా ఆశ్చర్యంగా.. "ఏమిటిది మోహన్ ..ఇలా వొచ్చింది" "ఏదో పోరాపాటు జరిగే ఉంటుంది " లేకుంటే బిల్లు ఇలా రావడమేమిటి" "ఒక్కసారి ఎకౌంట్ సెక్షన్లో అడగవలసింది" కాస్త సున్నితంగా మోహన్ కు వినిపించేలా అనేసి ,అతని రియాక్షన్ కోసం ఎదురుచూస్తుంది రమా. "అది కూడా అయ్యింది!" "ఎలా జరిగింది ఇలా.." "లాక్ డౌన్ కారణంగా రోజులో నాలుగున్నర గంటల డ్యూటి మాత్రమే చేస్తూ, జీతం చాలా తక్కువ అందుకుంటున్నా." "సమస్య నీకు వివరించి ఖర్చులు తగ్గించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం కదా . ఇంతలోనే ఇలా..." "నిజమే మోహన్..." "ఇద్దరం ఉదయమే ఆఫీసుకు వెళ్ళిపోతాం ఇక ఎవ్వరికి అంత అవసరం ఉంటుంది." "అంతగా నాకు అవసరమైతే నిన్ను అడుగుతాను కదా! నీకు తెలియనిది ఏముంది." చెప్పవలసింది చెప్పి చేతులు తూడ్చుకుంటూ పవిట చెంగు నడుములో దోపేసి తిరిగి బిల్లు మోహన్ కు అందించింది రమా. "నువ్వు చెప్పింది కొంతవరకు వాస్తవమేనని నాకూ తెలుసు ." "ఇద్దరం అలాసర్దుకు పోవడం మనకు అలవాటేనని తెలుసు ." "ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరికీ కంపెనీ ప్రాజెక్టు వర్కుతో సరిపోతుంది." "మరి ఇది ఎలా జరిగింది." "ఊహకు అందనంతగా ఈనెల బిల్లు రావడం నన్ను అసహనంకు గురిచేసింది రమా! సారీ ఏమనుకోకు.." రమాకు సంజాయిషీ ఇవ్వాలని లేకున్నా తన పోరపాటు లేదని తెలిసి ఓదార్పుగా అలా అనక తప్పలేదు మోహన్ కు. "ఎవ్వరైనా మనకు తెలియకుండానే వాడుకునే అవకాశం ఉందేమో!" అనుమానం వ్యక్తం చేసింది రమా "అలా లేదు రమా!" "కానీ !మన ఇంటిలోనే వాడకం పెరిగింది." "ఎలా అన్నది అర్థం కావడం లేదు." "ఒక్క నెలలోనే ఆరువందలు పెరిగిందంటే వింతగా ఉంది." "ఇంట్లో ఉన్నది ,నువ్వు నేను , కౌశిక్ అంతేకదా! వాడికి అంతగా అవసరం ఏముంటుంది." వాడు కూడాను మనతోనే ఉండి హోమ్ వర్కు చేసుకుంటాడు." "బుద్దిగా వెళ్ళి తన రూమ్ లో పడుకుంటాడు." "కానీ..ఈ నెల బిల్లు మాత్రం విపరీతంగా పెరిగిపోయింది" "కారణం అంతు చిక్కని బేతాళ ప్రశ్నగా మిగిలింది" "సరేలే రేపు మరోసారి కాల్ లిస్ట్ తెప్పిస్తే సరిపోతుంది." "ఆఫీసుకు టైం అవుతుంది కాఫీ పెట్టు, ఈలోగా స్నానం చేసివస్తా!" "నువ్వుకూడా త్వరగా డ్రెస్ మార్చుకుని రెఢీ అయితే నిన్ను బస్టాప్ దగ్గర దింపేసి నేను వెళ్ళిపోతా" అనుకుంటూ మోహన్ స్నానంకు వెళ్లి పోయాడు. రమా తన గదిలోనికి వెళ్ళిపోయింది. ***** మోహన్ అందించిన కాల్ లిస్టు వంక చూస్తూ రమా ఆశ్చర్యంగా చూసింది. రాత్రి పది తరువాత ,ఉదయం ఐదు తరువాత గంటల గంటల కాల్స్.. తమ ల్యాండ్ లైన్ నుండి. తనకు ఉదయం ,రాత్రి ఆసమయంలో అసలు తీరిక ఉండదు. పోనీ మోహన్ చేస్తాడు అనుకుంటే ఉదయం జాగింగ్.రాత్రి త్వరగా పడుకుంటాడు. మరెవరు చేస్తున్నట్లు.అర్దం కాలేదు రమాకు అదే అడిగింది రమా.. ఇది ఇది ఎలా సాధ్యం.మనకు అసలు తీరిక ఉండని సమయంలో.. ప్రశ్నార్థకంగా చూసింది రమా.. "పోనీ!ఈ నెంబర్ ఎవ్వరిదో కనుకున్నారా! "కనుకున్నాను ...అది..అది " అంటూ అసలు విషయం చెప్పాడు మోహన్.. సిగ్గుతో తల వంచుకున్నాడు... ***** అది కాదురా కౌశిక్ !నీకు ..నీకు ఈ నెంబర్ ఎక్కడిదని. దగ్గరకు తీసుకుంటూ అడిగింది రమా.. "మరేమో. "మరేమో...మరేమో...మొన్న నాన్నగారి పర్సు నుండి జారిపడింది." " చిట్టీ తీసి చూస్తే నాన్నమ్మ పేరు వ్రాసి ఉంది. అంటే నాన్నమ్మ వృద్దుల ఆశ్రమంలో ఉందని తెలిసిందిలే." "అందుకే తనతో మాట్లాడుతున్నా. మీరు మీ ఆఫీసు పనితో నాతోనే మాట్లాడేందుకు తీరిక లేదు .ఇక నాన్నమ్మతో ఎలాగు మాట్లాడలేరని,నేనే మాట్లాడుతున్నా..." "నాతో నాన్నమ్మ..నాన్నమ్మతో నేను. ఎన్ని విషయాలు చెపుతుందో తెలుసా..! "తనకు తెలియని విషయం లేదనిపిస్తుంది తెలుసా.." అబ్బురంగా కౌశిక్ అంటున్న మాటలకు మోహన్ చెంపలు పైనుండి కన్నీరు జారుతుంది . ఎదలోని వేదనను తీర్చాలని.తన తప్పును ప్రక్షాళన చేసుకోమంటూ..

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం