చిలిపి మాలతి - అమ్జద్.

Chilipi Malathi

అది చలి రాత్రి. శరీరం లో చలి చొఛ్చుక పోతూండగ వెచ్చదనం కోసం దుప్పట్లో జొరబడ్డాను. శ్రీమతి ఎదమరచి నిద్ర పోతోంది. చదువుతూ నిద్రపోయే అమె అలవాటును గుర్తు చేసుకొంటూ బెడ్ ల్యాంప్ ఆర్పేశాను. పడక గదిలో కొన్నిక్షణాల వరకు చిమ్మ చీకటి, కండ్ల కెదురుగా ఏది కానరాకుండా. ఆ తర్వాత చుట్టు ప్రక్కల దేదీప్యంగా వెలుగుతూన్న స్ట్రీట్ ఫ్లోరోసెంట్ విద్యుత్తు దీపాల వెలుగు ప్రాకుకొంటూ అద్దల కిటికిల్లోంచి దూరిపోతాయి. అవి కిటికి తెరలను తొలగించుకొంటూ కాంతిపుంజాలు మా గది లోని నాలుగు గోడల మధ్యకు వచ్చి బంధించబడ్డాయి. ఫలితంగా గదిలో ఉన్న ఒక్కొక్క వస్తువును తేలికగా చూడగలుగుతున్నాను. శ్రీమతి గాఢ నిద్రలో ఉంది తన అందమైన మొహంతో.అమె మొహం పై చిందర వందరగా పడి ఉన్న ఉంగరాల ముంగరులు. నుదురు పై పెట్టుకొన్న నక్షత్రం ఆకారం లో ఉన్న స్టిక్కరు. అది వెలుగుతూంది తెలుగు వెలుగులా!

ఎద సంపద పిచ్చెక్కించేది గానే ఉంటుంది. పెండ్లై సంవత్సరం కావస్తూన్న మొదటి రాత్రి లాగే ఉంటుంది. మాలతి తన శరీర ఆరోగ్యం గురించి బాగా శ్రద్ద తీసుకొంటుంది. నడుం పిడికెడే! తీసుకునే భోజనం లో క్రొవ్వు పదార్ధాల శాతం బాగా స్టడీ చేసి కాని మరీ గొంతులోకి దింపుకోదు!

ఆ మధ్య 'నీ బొడ్డు చూస్తే పట్ట పగలు కూడా నాకు పిచ్చెక్కుతుంది!?' అని అంటే ఆ రోజు నుంచే నాకు బొడ్డు కనిపించకుండా చీర పైట తో కప్పేసుకొని, ఆది వారాలతో సహా పండుగ రోజులలో ఇంట్లో ఉంటే నా నుంచి తప్పుకొంటు తిరిగేది! ఒంటరిగా దొరికేది కాదు. పొద్దస్తమానం అమ్మ దగ్గరే ఉంటుండేది. ఆమేకు లేని పోని సేవలు చేసుకొంటూ. నా శ్రీమతి మా అమ్మ తలలో నాలికైంది. నేనేమో నా నాలికలోంచి శృంగార రసాన్ని జార విడుచుకొంటు కాలు కాలిన పిల్లిలా...నేను తగిన సమయం కోసం ఇంట్లో తిరుగుతూంటే తనేమో నన్ను తన దారిలొ అడ్డు వచ్చిన నల్ల పిల్లి లాగా చూసేది! అమ్మ ఓ కంట మా ఇద్దరి వ్యవహారాన్ని కనిపెట్టిన చిరు నవ్వులతో తన మొహాన్ని కొంగులో దాచుకునేది.

తెల్లారితే పండుగ కదా పండుగ అడ్వాన్స్ గా కనీసం ఓ గట్టి ముద్దు కుడా పెట్టు కోనివ్వ లేదు. 'రాత్ ఖతం...బాత్ ఖతం' కానీ నన్ను చూపులతో, వయ్యారాలు వలక బోస్తూ, కులుకుతూ నడుస్తూ వెనుకకు తిరిగి విశాలమైన తన కండ్ల తో బాపు బొమ్మలా తన కంటి కొనుకుల్లోచి నన్ను కవ్విస్తూ, గల గల నవ్వుతూ ఈ గదిలో నుంచి హాలు లోకి, అక్కణుంచి పెరట్లోకి మళ్లీ పక్కింటి బామ్మతో తన కోకిల లాంటి కంఠ స్వరం తో ఆమే బాగోగులను అడిగి నా చెవుల్లో తన మధుర కంఠవాణి నా గూబకు మాత్రం

ముద్దుల వర్షం కురిపించేది. నేను మాత్రం అప్పుడే అర విచ్చుకున్న ఆమె లేత గులాబి పెదవుల రేకులను చుంబించాలని తహ తహ లాడి …చివరికి...సొమ్మసిల్లి , ఆమే అమ్మగారు ఏదో సందర్భం లో ఇచ్చిన వెండి చెంబు లోనుంచి పచ్చి నీళ్లే తాగాను!

"మనకు పెండ్లి అయిందిగా. మూడు ముళ్ళేసాను. మంగళ సూత్రం కట్టాను. శోభనం కూడా అయింది. మరింకెందుకీ దూరం? వచ్చి నా గుండేలకు హత్తుకో రాదు. మంచి సమయముంది, సరైన సందర్భం కూడ ఉంది. పైగా సంక్రాంతి పండుగ కూడా ఉంది." అని అన్నాను ఆమెకు దగ్గరగా వెళ్లుతూ.

"మీరు చెప్పినదంతా కరక్టే! మీరు నా గుండేలోనే ఉన్నారుగా. దూరంగా ఏక్కడ ఉన్నారు?" లాగి ఓ లాజిక్ బాణం వదిలింది నా పై.

చిన్నప్పట్నుంచి మాలతిని నేను చూస్తున్నాను. ఆమె నన్ను చూస్తున్నది. అలా ఒకరినొకరం చూసుకొంటూనే పెండ్లి ఈడు కొచ్చేసాం. ముసి ముసి నవ్వులతో పాటు దొంగ చూపులో ఓర చూపులో మరింకేలాంటో చూపులతోనో ప్రేమలో ప డ్డట్లై పోయాం!

“లంగా జాకెట్ లో బాపు గారి బొమ్మవి, సిల్క్ చీరె లో రవి వర్మ గారి మాట్లాడే వర్ణ చిత్రానివి. శల్వార్-కమీజ్ లో హూస్సెన్ గారి చిలిపి కులిచెవి!" రెండు చేతులు జోడించి, ‘మరేమి చెప్పకండి ఇలాగే బాగున్నాను’ అని అంది మాలతి సైగలతో.

"ఏం సిగ్గుపడుతున్నావా?"

"కాదు...గర్వ పడుతున్నాను. ఇంకే విధంగానైన పొగుడుతారేమోనని....?" ఆగి పోయింది సందేహం పడుతూ మాలతి.

"అసలు విషయానికి ఇంకా రానిదే...అల వంకలు తిరిగి పోతావెందుకు? “ నాలో చిలిపి కృష్ణుడు పిల్లనగ్రోవి ఊదాడు.

“మీ మాటల మర్మం నాకు తెలియనిది కాదు షో గ్గాడా!" అంటు కిల కిల నవ్వింది ముత్యాల పండ్ల వరుసల వెనుక తమలపాకు కాడలాంటి నాలుకను కనిపించి కనపడకుండా ఆడిస్తూ.

నేనేమి చెప్పబోతున్నానో అప్పుడే పసి గట్టి పర్షియన్ లాంటి తన ముక్కును ఎగురేస్తూ , "మీకిష్టమైన మల్లె మొగ్గల మాల తురుంకోవడానికి వేళా అయింది!" అని అంది నాటక ఫక్కిలో మాలతి.

“ ‘నీకు' అని అనలేవ!"

"అది మన పెండ్లి తోనే చెల్లై పోయింది." అంటు నేను చెప్పబోయే విషయాన్ని వినకుండానే తుర్రున ఇంట్లోకి పారిపోయింది, నవ్వుకొంటు.

‘అంతంత మాత్రం బట్టలేసుకుంటే అజంతా శిల్పం లా ఉంటావని, అచ్చాదన లేకుండా ఉంటే ఖజరాహు బొమ్మ లాగుంటావని చెప్పే చాన్స్ ఇవ్వకుండానే, అర్ధమై పొయినట్లు!

***

అమ్మ పూజ గదిలోనుంచి వంట గదిలో కొచ్చేవరకు మాలతిని వెంటాడొచ్చు!? సిం హం లేడి పై లఘాహించినట్లు.

రాత్రి శృంగారం సరే. అదే ఉదయం ఎందుకు కాకూడదు?

దేవుడు నా ప్లాన్ ను నేరవేర్చాడు. వంటగదిని ఆనుకునే ఉన్న గది మా బెడ్ రూం.

మంచి నీళ్ల కోసమని వంటగదిలో ఉన్న ఫ్రీజ్ తెరచి గాజు సీసా లోనుంచి గ్గ్లాసులో నీళ్లు పోసుకొంటున్న తరుణంలో, వెనుక నుంచి కాళ్ల సవ్వడి లేకుండా అమాంతంగా మాలతిని కరచి పట్టుకున్నాను. అమె 'అమ్మా..'అని నోరు తెరవక ముందే ఓ చేత్తో ఆమె నోరు మూసి, 'నా దప్పిక తీర్చందే నీ దప్పిక నెలా తీర్చుకోనిస్తాను?' అంటూ రెండు చేతుల్లో బంధించి గప్ చిప్ గా మా బెడ్ రూం లోకి ఎత్తుకొని పోయాను మాలతిని.

"ఎంతకైనా తెగినోళ్ళు మీరూ!" అంటూ చిరునవ్వుల మధ్య మెలికలు తిరగ సాగింది మాలతి.

*****

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి